*@ ఆ పని మీదే..!@ 42
తేది: 13/08/2025
""""""""""'"'''''""""""""""""""""""""""
మేడమ్...
మా పాప ఎంత చెప్పినా వినట్లేదు రాత్రి
పదిన్నర వరకూ టీవీ చూస్తూనే ఉంటోంది కొంచెం భయ
పెట్టండి అంటూ ఎల్ కేజీ చదువుతున్న చిన్నారిని స్కూల్లో
దింపడానికి వచ్చిన నాన్న టీచరుకు ఫిర్యాదు చేశాడు
మేడం...
మా అబ్బాయి హోంవర్క్ సరిగా చేయట్లేదు
ఎంతసేపూ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటం మీదనే ధ్యాస
ఉంటోంది కొంచెం గట్టిగా చెప్పండి అవసరమైతే రెండు
తగిలించండి...
ఇది మూడో తరగతి చదువుతున్న హరి
మీద టీచరుకు వాళ్ల అమ్మ ఇచ్చిన ఫిర్యాదు
ఈ
ఫిర్యాదులు కల్పితాలు కావు ప్రతి బడిలో సర్వసాధారణంగా
వినిపించేవే అయితే ఏంటి? 'తమ పిల్లల బాగు కోసం
తల్లిదండ్రులు టీచర్లను అభ్యర్థిస్తున్నారు అందులో తప్పే
ముంది?' అనుకుంటే పొరపాటే
పిల్లల గురించి మనం చేసే ఆ ఫిర్యాదు ద్వారా... మన
వ్యక్తిత్వం, జీవనశైలి, పిల్లల ఎదుగుదల పట్ల మనం ఎంత
బాధ్యతతో లేదా బాధ్యతారాహిత్యంతో మెలగుతున్నాం...
ఇలా అనేక విషయాలు టీచర్లకు అర్థమవుతాయి ఉదాహరణకి
మా పాప అదేపనిగా టీవీ చూస్తోంది అని ఫిర్యాదు
చేసినప్పుడు దీనికి నేనేం చెయ్యగలను..? ఇంట్లో ఎనిమిదిన్నరకే
టీవీ కట్టేసి లైట్లు ఆర్పేసి అందరూ పడకగదిలోకి
చేరితే సరిపోతుంది కదా? ఇంతోటి దానికి నేను భయపెట్ట
డమేంటి..?అని టీచరు మనసులో అనుకుంటారు అలానే,
ఫోను చూస్తూ హోంవర్క్ మీద శ్రద్ధ పెట్టడం లేదు అని
చెప్పినప్పుడు, ఆ ఫోను పిల్లాడి చేతికిచ్చి అలవాటుచేసింది
మీరే కదా...? మీరు ఫోను అందుబాటులో ఉంచుతున్నప్పుడు
నేను మందలించినా ఏం ఉపయోగం..? అని టీచరు అను
కుంటారు అయితే, ఇవన్నీ వారు అమ్మానాన్నలకు చెప్పరు
వాళ్లు వెళ్లిపోయాక తోటి టీచర్లకు చెప్పుకొని నవ్వుకుంటారు
అమ్మానాన్నలను ఏమీ అనలేక ఇంట్లో పెద్దలు మారరు
కానీ, మనం భయపెట్టాలంట అంటూ విసుక్కుంటారు ఆ
చిరాకు వెంటనే ఆయా పిల్లల మీదికి మళ్లుతుంది తల్లి
దండ్రులకే వీళ్ల మీద శ్రద్ధలేనప్పుడు నేను మాత్రం వీళ్లకోసం
ఎందుకు తాపత్రయపడాలి అని ఆ పిల్లలను నిర్లక్ష్యం
చేస్తారు ఫలితంగా నష్టపోయేది పిల్లలే
పిల్లల పెంపకం అన్నది ఇద్దరి బాధ్యత ఒక చెయ్యి
అమ్మానాన్నా అయితే మరో చెయ్యి ఉపాధ్యాయులు రెండు
చేతులు కలిస్తేనే పిల్లలు రత్నాల్లో వెలుగుతారు ఇంటి
దగ్గర పిల్లల అలవాట్లను సరిచేసుకోవాల్సిన బాధ్యత అమ్మా
నాన్నలదే టీవీ చూస్తున్నారు ఫోన్లో ఆడుతున్నారు
అంటే... అవి లేకుండా సమయాన్ని ఎలా గడపాలో పిల్లలకి
మనం తెలియజేయట్లేదనే అర్థం మరేం చెయ్యాలి? పిల్ల
లతో కలిసి ఆటలు ఆడాలి, వాళ్లకి కథలు చదివి వినిపించాలి ఫోన్లు, టీవీల పాత్రని అమ్మానాన్నలు తమ ప్రేమతో
భర్తీ చెయ్యాలి అంతేకానీ,
ఆ బాధ్యతని కూడా టీచరు
చేతిలో పెడితే...
@అది గౌరవం అనిపించుకోదు@
No comments:
Post a Comment