Friday, August 15, 2025

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️భక్తుడు : భగవాన్ ! దైనందిన కార్యకమాలు చేసుకుంటూ భగవంతుని యందు ఆరాధనా పరంగా ఉండడం ఎలా !?_*
*_🦚 మహర్షి బదులీయలేదు. అట్లా కొంత సమయం గడిచింది. ఇంతలో కొందరు బాలికలు సన్నిధికి వచ్చి నృత్యం చేస్తూ పాడసాగారు.. "అందరూ పాలు చిలుకుతూనే ఉంటారు.. కాని శ్రీకృష్ణుని తలపోయడం క్షణమైనా మానము."!!_*
*_🦚 మహర్షి : మీ ప్రశ్నకు సమాధానం ఆ పాటలోనిదే. ఆ స్థితినే భక్తి, యోగ, కర్మము అంటారు._*

*_🧘🏼‍♂️ ఒక చదువుకున్న యువకుడు ఇలా అడిగాడు..._*
*_భగవాన్ ! మహర్షి ఉపదేశం ఏదైనా నాకు సహాయం అవుతుందా !_*
*_🦚 మహర్షి : నీవంటివారు కాక, పుస్తకాలతో కుస్తీ పట్టనివానిని, 'రామ, రామ' అని జపించమంటాము అని అనుకో ! వారు దానిని చేస్తారు; మరి వదలరు. నీవలె చదువుల చదివీ, విషయాల లోతుపాతులు తీస్తున్న వారికి నేను ఏమైనా చెప్పాను అనుకో, వారు చాలారోజులు_* 
*_చేయనే చేయరు. పైగా 'నేను ఎందుకు ఈ జపం చేయవలెను ? ఈ జపం చేస్తూ కూర్చోడానికి 'నే' నెవరు ? ఇకపై జపించకముందు 'నే'నెవరో కనుక్కో?” అని జపాన్ని ఆపి, విచారం సాగిస్తారు._*

*_🧘🏼‍♂️భక్తుడు : భగవాన్ ! ఆధ్యాత్మిక పురోగమనం, శిశుసమంగా ఉంటేనే వీలని అన్నారు కదా !_*
*_🦚 మహర్షి : అవును; శిశువులో అహంకారం పెరిగి ఉండదు కనుక._*

*_🧘🏼‍♂️భక్తుడు : నేను అనుకునేది అదే. అహంకారాన్ని పెంచుటకన్నా బిడ్డగా ఉంటేనే బాగుండేది కదా !_*
*_🦚 మహర్షి : శిశువుగా కాదు; శిశుస్థితిలో. ఆత్మసాధన ఎట్లో శిశువువద్ద ఎవ్వరూ నేర్చుకోలేరు. గురుస్థితి శిశుస్థితివలె ఉంటుంది. ఇరువురిలో భేదము ఉంది. శిశువులో అహంకారం ఉంటుంది. అది తర్వాత పెరుగుతుంది. కానీ యోగిలో అది సమూలం నాశనం చేయబడింది !!_* 

                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_*🙏🏻

No comments:

Post a Comment