Friday, August 15, 2025

 చంద్రుడు ఒక ప్రాణి కాదు కాబట్టి ఎలా అయినా అన్వయించుకోవచ్చు.

చంద్రమానము :

సౌరమానానికి సంవత్సరం పునాది అయితే చాంద్రమానానికి నెల ఆధారం. చాంద్రమానం ప్రకారం నెల అంటే ఒక పౌర్ణమి నుంచి మరో పౌర్ణమి వరకు ఉన్న కాలం. దీన్ని కొంత మంది ఒక అమావాస్య నుంచి అమావాస్య వరకు కూడా లెక్కిస్తారు. తెలుగు వారు అమావాస్య నుంచి అమావాస్య వరకు లెక్కిస్తారు.  చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కాలం (సౌరమానం ప్రకారం 27.32 రోజులు) నెల లేదా మాసంగా లెక్కిస్తారు. ఇందులో 30 తిధులు ఉంటాయి. అంటే చాంద్రమానంలోని తిథి సౌరమానంలోని రోజుకన్నా తక్కువ నిడివి కలది. 30 తిధులను రెండు పక్షాలుగా విభజిస్తారు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణ పక్షం.తెలుగువారు పండగలన్నీ చాంద్రమానం ప్రకారమే జరుపుకుంటారు.

తెలుగు నెల అమావాస్య తదుపరి పాడ్యమి నుండే శుక్ల పక్షం గా లెక్కించబడుతున్నది. 

హిజ్రీ కేలండర్‌ను తప్పించి మిగతావి చాంద్ర-సూర్యమాన కేలండర్ లే. అనగా నెలలు చాంద్రమాన విధముగానే వుంచి చంద్రగమన చక్రాలను లెక్కిస్తారు, తరువాత అంతర్-నెలలను కొలిచి, సూర్యమాన సంవత్సరంతో మమేకం చేస్తారు.

అమావాస్య తదుపరి వచ్చే శుక్ల పక్ష ప్రతిపద నుండే నూతన మాసం ప్రారంభం గా లెక్కింపు మన ఆనవాయితీ. 

పొడుపు - విడుపు :

సన్నికల్లు లేకపోతే పెండ్లి ఆగదు - సంధ్య వార్చకపోతే సంధ్య ఆగదు.

No comments:

Post a Comment