Friday, August 15, 2025

 


🙏🏻 *రమణోదయం* 🙏🏻

*ఆత్మస్వరూపాన్ని మరచే ప్రమాదం చేత కలిగే మనఃక్లేశాలన్నీ నశించగా కలిగే శాంతి యొక్కటే ఈశ్వరానుగ్రహం పొందామనటానికి నిదర్శనమని తెలుసుకో. అదొక్కటే తప్ప, సన్మార్గంలో కలిగిన అనేక ఐశ్వర్యాలను మాత్రం పొందటాన్ని నీవు ఈశ్వరానుగ్రహం పొందావని భావించకు.*

వివరణ: *సకల ఐశ్వర్యాలు తమకు కల్గినాయి. కాబట్టి తనకి భగవదనుగ్రహం లభించిందని పామరులు అనుకొంటారు. కాని అనుగ్రహానికి నిదర్శనం అదికాదు. ఆత్మనిష్ఠలో నుండి, శాంతి పొంది మనఃక్లేశాలు లేనివాడే నిజంగా భగవదనుగ్రహం పొందినవాడు.*

జీవితాన్ని మార్చేవాడు
నీ ముందు అద్దంలో తప్ప
లోకంలో ఎక్కడా కనిపించడు.

ఏడు వారాల నగల్లాగా
ఏడు వారాల దేవుళ్లను
వాడు కోవాలని చూడకు
ఒకే దేవుణ్ణి పట్టుకో...తరిస్తావు.

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.753)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*

🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment