🌹🙏🌹
"సత్సంగం" కంచె లాంటిది.
సద్గురువు చేత
వెలిగించబడిన
ప్రేమ అనే జ్వాలను
"సత్సంగం" సంరక్షించి
పోషిస్తుంది.
మనలో చాలామంది
మనస్సులు చాలా
బలహీనంగా ఉండి,
చుట్టుప్రక్కల గల
పరిస్థితుల వలన
సులభంగా
ప్రభావితం
అవుతుంటాయి.
కాబట్టి మనకు
ఏదో ఒక రకమైన
రక్షణ అవసరం.
మనలో ప్రేమ, అనుగ్రహం
అనే చిన్న మొక్క
ఇప్పుడే నాటబడింది.
అది పెద్ద చెట్టుగా
మారేదాకా దాని చుట్టూ
కంచె కట్టి కాపాడుకోవాలి.
ప్రేమ అనే మొక్క
గాలికి రెపరెపలాడే
చిన్న దీపంలా ఉన్నప్పుడు,
గాలి దానికి చాలా
ప్రమాదకారిగా ఉంటుంది.
దానికి చిమ్నీగానీ,
గ్లాసుగానీ రక్షణగా
అవసరం.
అదే పెద్దమంట అనుకోండి,
అది పరిసరాలలో ఉన్న
వాటినన్నింటినీ
దహించివేస్తుంది.
మన అన్వేషణ,
మనలోని ప్రేమోద్వేగం
చాలా శక్తివంతంగా
మారినపుడు మనం
మన పరిసరాలను
ప్రభావితం చెయ్యగలం,
అప్పుడు మనమెక్కడికి
వెళ్ళినా అక్కడ
"సత్సంగం" దానంతటదే
ఏర్పడుతుంది.
కానీ పరిసరాల వలన మనం ప్రభావితం అవుతున్నంతవరకూ,
మనకు సత్సంగం(చిమ్నీ)
అవసరం.
మహాత్ముల యొక్క
సాంగత్యంలో ఉండటం,
వారి సన్నిధిలో ఉండటం,
"సత్సంగం".
🌹🙏🏻🌹🙏🏻🌹
No comments:
Post a Comment