*మనం ప్రతి క్షణం మెరుగుపడే దిశగా ప్రయత్నించడానికి మనల్ని మనం ఎలా పరీక్షించుకోవాలి?*
*స్వీయ* *పరీక్ష.....కథ*
దాదాపు 18 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక కుర్రవాడు మందుల దుకాణానికి వెళ్లి ఒక ఫోన్ చేసుకోవడానికి అనుమతి అడిగాడు. దుకాణదారుడు కాల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. తర్వాత ఆ అబ్బాయి ఓ నంబర్ కు డయల్ చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు.
వారి సంభాషణ ఇలా కొనసాగింది:
కుర్రవాడు : "హలో మేడమ్, మీ పచ్చికబయలును(లాన్) కత్తిరించే పని నాకు ఇవ్వగలరా?"
మహిళ (ఫోన్ లో అవతలి వైపు నుండి) : "క్షమించండి, ఈ పని చేయడానికి ఇప్పటికే నా వద్ద ఇంకొకరు ఉన్నారు."
కుర్రవాడు : "మేడమ్, దయచేసి ఒకసారి నా పనితనం చూడండి, మీకు బాగా నచ్చుతుంది."
మహిళ : " నాకు అవసరం లేదు, నాయనా!"
కుర్రవాడు : "మేడమ్, ఈ పనికి మీరు ప్రస్తుతం ఎంత జీతం ఇస్తున్నారో అందులో సగం ఇవ్వండి చాలు, నేను మీకు ఆ పని చేసి పెడతాను."
మహిళ : "లేదు, ప్రస్తుతం నా తోటను చూసుకుంటున్న వ్యక్తి యొక్క పనితనంతో నేను సంతృప్తిగానే ఉన్నాను."
కుర్రవాడు : "మేడమ్, దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి. నేను మీ కాలిబాటను కూడా ఊడుస్తాను. పామ్ బీచ్ లో కెల్లా మీదే చాలా అందమైన పచ్చికబయలు (లాన్) ఉండేలా చేస్తాను."
మహిళ : " అవసరం లేదు, ధన్యవాదాలు."
ఆ కుర్రాడు చిరునవ్వుతో ఫోన్ పెట్టేసాడు. ఇదంతా వింటున్న మందుల దుకాణం యజమాని ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి, “ నాయనా! పని పట్ల నీ వైఖరి, సానుకూలస్ఫూర్తి నాకు నచ్చాయి, నీకు ఉద్యోగం చాలా అవసరం లా ఉంది... కావాలంటే నా దగ్గర నీకు ఉద్యోగం ఇస్తాను."
దానికి ఆ కుర్రాడు "వద్దు సార్, ధన్యవాదాలు" అని బదులిచ్చాడు.
యజమానికి ఏమీ అర్థంకాక, అయోమయంగా, "మరి ఇప్పుడే నువ్వు ఫోన్లో ఉద్యోగం కావాలని బ్రతిమాలుతున్నావు కదా", అని అడిగాడు.
బాలుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు, "లేదు సార్, నాకు ఉద్యోగం అవసరం లేదు. నేను ప్రస్తుతం చేసున్న ఉద్యోగంలో నా పనితనాన్ని అంచనా వేకుంటున్నాను. నేను నిజంగా ఎక్కడ పని చేస్తున్నానో ఆ మహిళతోనే మాట్లాడుతున్నాను", అని చెప్పి ఆ బాలుడు చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్లిపోయాడు, దుకాణదారుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.
*మన గురించి మనకంటే బాగా ఎవ్వరూ తెలుసుకోలేరు. ప్రతి క్షణం మన కళ్ళు మనపైనే ఉంటే, మన లోటుపాట్లు మన నుండి దాగవు. ప్రతి క్షణం మరింత మెరుగైన వ్యక్తిగా మారకుండా మనలని ఎవరూ ఆపలేరు.*
*ఏ రంగంలోనైనా విజయం సాధించే బాధ్యత మీపైనే ఉంది. అప్రమత్తంగా ఉండండి, మీ పట్ల మీ బాధ్యతల గురించి తెలుసుకోండి. *దాజీ*
*💥హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం💥*
No comments:
Post a Comment