Friday, August 15, 2025

 మేలుకో శ్రీరామ దూత.. మేలుకో మా మారుతీ..అందుకో మా హారతీ…

🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹

*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*

*_🌴ప్రతివాడూ తనకు ఎప్పుడూ సుఖాలు కావాలని, దు:ఖాలు అస్సలు రాకూడదని అనుకుంటాడు. కాని దానికి కావలసిన సాధన మాత్రం చెయ్యడు. ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలంటే చేయాల్సింది ఒక్కటే. మనస్సును ప్రాపంచిక విషయాలనుండి మరల్చి పరమాత్మవైపు మళ్లించాలి. అటువంటి వారి మీద భగవంతుని అనుగ్రహం దానంతట అదే కలుగుతుంది. అటువంటివారికి దుఃఖమే ఉండదు. వీరికి కష్టం లేదా ఆపద కలిగినపుడు పరమాత్మ ఏదో ఒక రూపంలో వచ్చి ఆ కష్టం నుండి బయట పడవేస్తాడు. వాడు ఎవరో కూడా మనకు తెలిసి ఉండదు. అటువంటి వాడు వచ్చి మనకు సాయం చేస్తాడు. ఇది మనం ఊహించని రీతిగా ఒక అద్భుతంగా జరుగుతుంది. దేవుడు పరమ దయామయుడు. తనపై ఏ కొంచం ఆసక్తి కనబరిచినా కొండంత అనుగ్రహం చూపిస్తాడు. ఇంకా నిత్యమూ ఆయనపైనే ఆసక్తి ఉన్నవాళ్ళ గురించి చెప్పవలసిన అవసరమే లేదు. దృఢంగా ప్రయతించి చూడండి.. అనుభవంలోకి వస్తుంది.🌴_*

No comments:

Post a Comment