🔸♦️🔹🔸♦️🔹🔸♦️
*మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు*
ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు .
వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసారు.అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు .
రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు .
అతడి *చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు* రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలు పెట్టాడు
ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిదుర పోతాడు అని చెప్పాడు .
అతనికి దగ్గరలో *ఒక కట్టె కనిపించింది రాజుకి.*
అదేందుకు అని అడిగాడు రాజు
బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది పక్షులేవైనా వస్తే ఈ కట్టె కు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్లిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి .
*ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు* అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి
ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు
*ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి వాళ్ళు ఎవరు అని అడిగారు??
పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చేయట్లేదు అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు .
*రాజు మళ్ళీ సందేహంగా ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా అని అడిగారు* అందుకు ఆ వ్యక్తి
నేర్చుకుంటున్నది నోటితోనే... కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి! పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు .
*రాజుకి చాల ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని !!*
అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో ఓ పది పదాలు రాసిపెట్టి వెళ్తుంది. అన్ని అయ్యాక అవి నేర్చుకుంటుంటాను అని బదులిచ్చాడు .
*రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని.*
సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావటానికి.
మన చుట్టుపక్కల చూస్తే ఇలా అనేక పనులు ఏకకాలంలో చేసే ఎంతో మంది కనపడతారు ....
అలా కనపడకపోతే ...ఒక్కసారి పిల్లల స్కూళ్లకు .. భర్త ఆఫీసుకు ...తన ఆఫీసుకు అన్ని సిద్ధంచేస్తున్న ఒక సగటు అమ్మని చూడండి....
🍁🍁🍁 🍁🍁🍁
*లోకా సమస్త సుఖినోభవంతు*
🌱🌱🌱🌱🌱🌱
M.Ananta MarriSwamy
Impact Certified Trainer
Motivational Speaker & Author,
Students Counsellor,
PH:8099614389
No comments:
Post a Comment