Friday, August 15, 2025

How India fooled America & won Nuclear Power? #operationshakthi #facts #independenceday #india

 How India fooled America & won Nuclear Power? #operationshakthi #facts #independenceday #india



ఇది 1998వ సంవత్సరంలో మన ఇండియాలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. ఆ సమయంలో ప్రపంచంంతా ఒకవైపు ఉంది కానీ ఇండియా మాత్రం ఇంకొక వైపు ఉంది. అమెరికా ఇండియాను ఆపడానికి తన సాయశక్తుల ప్రయత్నించింది. కానీ ఇండియా మాత్రం అస్సలు ఆగలేదు. మనం ఎప్పుడు దొరుకుతామా అని అమెరికా స్పైస్ సాటిలైట్స్ తో మన ఇండియా మీద ఎప్పుడూ నిగా పెట్టి ఉంచింది. ఏ కదలిక జరిగినా వెంటనే పసిగట్టగలదు. అలాంటి సిచువేషన్ లో కూడా ప్రపంచం నిషేధించిన న్యూక్లియర్ ఆయుధాలను టెస్ట్ చేయాలి అనుకుంటే దానికి చాలా గట్స్ కావాలి. అదే మన భారత్ చేసి చూపించింది. 1970వ సంవత్సరంలో ప్రపంచంంతా ఒకటయ్యి ఇకనుంచి మిగతా ఏ దేశాలు కూడా న్యూక్లియర్ ఆయుధాలు చేయకూడదు అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఇండియా మాత్రం ఈ ఒప్పందానికి అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ ఒప్పందం మనకి చాలా అన్యాయం అనిపించింది. తమ దేశ ప్రజలకి రక్షణ కావాలి అంటే న్యూక్లియర్ ఆయుధాలు తప్పనిసరిగా కావాలి అని ఇండియా డిసైడ్ అయింది. అందుకని 1974 లో ఒక న్యూక్లియర్ టెస్ట్ ని కండక్ట్ చేసింది. ఆ ఆపరేషన్ పేరు స్మైలింగ్ బుద్ధ. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలిసాక మన మీద చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. మన దేశం మీద ఎన్నో శంక్షన్స్ విధించారు. అమెరికా మనకు వచ్చే రా మెటీరియల్స్ ని టెక్నాలజీస్ ని బ్యాన్ చేసింది. లోన్స్ రాకుండా అడ్డుకుంది. కెనడా, జపాన్ మరియు కొన్ని యూరోపియన్ కంట్రీస్ అయితే మనకు వచ్చే సహాయాలన్నీ ఆపేశారు. ఇంత జరిగినా ఇంత చేసినా సరే ఏది ఏమైనా న్యూక్లియర్ ఆయుధాలు మాత్రం కావాల్సిందే అని ఇండియా చాలా బలంగా డిసైడ్ అయింది. అందుకని రెండవసారి అసలు ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసింది. తయారు చేయడం వరకు ఓకే. కానీ మరి ప్రపంచానికి తెలియకుండా ఇప్పుడు వీటిని ఎలా టెస్ట్ చేయాలి? అసలు అది అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని కూడా సాధ్యమని ఇండియా చేసి చూపించింది. భారతదేశం అంతా పడుకున్న టైం లో కొందరు మహా గొప్ప వ్యక్తులు మాత్రం పడుకోకుండా నిర్వహించిన మిషనే ఈ ఆపరేషన్ శక్తి. ఈ ఆపరేషన్ శక్తి సంఘటన ముందు హాలీవుడ్ మూవీ కూడా సరిపోదు. అసలు ఈ ఆపరేషన్ శక్తిలో ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ సైంటిస్ట్లు కలిసి ఏం చేశారు టెస్ట్లు ఎలా నిర్వహించారు అనేది 3D అనిమేషన్ లో చూపిస్తాను. సో లెట్స్ బిగిన్. పాకిస్తాన్ తన న్యూక్లియర్ టెస్ట్స్ ని గ్రానైట్ మౌంటెన్స్ లో నిర్వహించింది. కానీ మన ఇండియా అలా చేయలేదు. న్యూక్లియర్ టెస్ట్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్న కాంప్లికేటెడ్ ప్లేస్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న తార్ ఎడారి ఎందుకంటే ఇక్కడ తక్కువ మంది జనాలు ఉంటారు. వాటర్ సప్లై కి లింక్ ఉండదు. అందువల్ల జనాలకి హాని కలగకుండా నీళ్లు కలిషితం కాకుండా ఉంటుంది అని ఇండియా తార్ ఎడారిని సెలెక్ట్ చేసుకుంది. కానీ ఇక్కడే అతి పెద్ద ప్రాబ్లం ఉంది. అది మొత్తం ఎడారి చుట్టూ ఇసుక తప్ప ఏమీ ఉండదు. దీనివల్ల అమెరికా తన సాాటిలైట్స్ తో పైనుంచి చూస్తే మనం కచ్చితంగా దొరికిపోతాం. ఇన్ కేస్ అప్పుడు మనం దొరికి ఉంటే ఇప్పుడు మన దేశానికి న్యూక్లియర్ ఆయుధాలు వచ్చేవి కాదు. ఒక న్యూక్లియర్ దేశంగా ప్రపంచంలో నిలబడాలి అంటే ఏది ఏమైనా ఈ టెస్ట్లు నిర్వహించాల్సిందే. ఇక రిస్క్ తీసుకుని ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ సైంటిస్టులు కలిసి ప్రపంచం మొత్తం స్టన్ అయిపోయే మిషన్ ని స్టార్ట్ చేశారు. అదే ఆపరేషన్ శక్తి అది 1998వ సంవత్సరం ఏప్రిల్ నెల మొదట్లో రాజస్థాన్ లోని తార్ ఎడారి పోక్రాన్ అనే ప్లేస్ ఎడారి పైన చాలా నిశశబ్దంగా ఉంటుంది. కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం చరిత్ర సృష్టించడానికి అండర్ గ్రౌండ్ లో ఆపరేషన్ శక్తిని ప్రారంభించారు. ఈ మిషన్ గోల్ ఏంటి అంటే అసలు ఈ ప్రపంచానికి తెలియకుండా ముఖ్యంగా అమెరికాకి తెలియకుండా న్యూక్లియర్ టెస్ట్ ని నిర్వహించాలి. ఎందుకంటే అమెరికా తన స్పైస్ సాటిలైట్స్ తో మన ఇండియాని ప్రతిరోజు అబ్సర్వ్ చేస్తుంది. ఆ సాాటిలైట్స్ లో రియల్ టైం కెమెరా ఉంటుంది. ఆ కెమెరాస్ ద్వారా లైవ్ లో మనం తారి ఎడారిలో ఏం చేస్తున్నామోసిఐఏ మరియు నాసా చూడగలరు. ఒక వస్తువు ప్లేస్ మారిన ఆఖరికి వెహికల్ టైర్ గుర్తులు కూడా గమనించగలరు. మరి ఇప్పుడు అమెరికా సాటిలైట్స్ ని కళ్ళు కప్పి మనం న్యూక్లియర్ టెస్ట్లు ఎలా నిర్వహించాలి అనేది ఇండియన్ సైంటిస్ట్ల ముందున్న అతి పెద్ద టాస్క్ వెంటనే మన ఇండియన్ సైంటిస్టులు ఒక ఐడియాతో ముందుకు కొనసాగారు. అదే ఓన్లీ నైట్ కన్స్ట్రక్షన్ సపోజ్ ఒక వస్తువు ఈ రోజున సూర్యాస్తమయం టైం కి ఒక స్పాట్ లో ఉంది అనుకుంటే తెల్లారేసరికి దాని ప్లేస్ మారినట్టు అమెరికా సాాటిలైట్ గుర్తించగలదు. అది గుర్తిస్తే అక్కడ సీక్రెట్ గా ఏదో చేస్తున్నారు అని కనిపెట్టేస్తారు. అందుకని మన సైంటిస్టులు ఈ అద్భుతమైన ప్లాన్ ని అమలు చేశారు. ఈ నాసా సాటిలైట్ కి తెలియకుండా కనిపించకుండా కేవలం రాత్రిపూట మాత్రమే పని జరిగిపోవాలి. కానీ తెల్లారేసరికల్లా ఎక్కడ తీసిన వస్తువు అక్కడికే వెళ్ళిపోవాలి. దాని ప్లేస్ అసలు మారకూడదు. ఇలా చేస్తూ మనం న్యూక్లియర్ టెస్ట్ కోసం అండర్ గ్రౌండ్ గుంటలు తవ్వాలి. షాఫ్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఇది ఎంత కష్టమో ఎంత రిస్కో చాలా గుండె ధైర్యంతో మన వాళ్ళు ఈ సీక్రెట్ పనిని మొదలు పెట్టారు. మన ఇండియన్ ఆర్మీకి చెందిన 58 ఇంజనీర్ రెజిమెంట్ రంగంలోకి దిగింది. ఈ ఆర్మీ యూనిట్ టెస్ట్ ప్లేస్ కు దగ్గరలో ఉంటూ రాత్రిపూట వాళ్ళ వెహికల్స్ లో టెస్ట్ ప్లేస్ కి వెళ్ళేవారు. వెహికల్స్ లో కావలసిన పరికరాలు పనిముట్లు తీసుకొని వెళ్ళేవారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇండియన్ సైంటిస్ట్లకి ఇండియన్ ఆర్మీకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వీళ్ళ టాస్క్ ఏంటి అంటే అమెరికన్ సాాటిలైట్ కి దొరకకుండా అండర్ గ్రౌండ్ లో షాఫ్ట్స్ ని నిర్మించాలి. అది కూడా కేవలం 40 రోజుల్లో పని పూర్తఅయిపోవాలి. కేవలం రాత్రిపూట మాత్రమే పని జరగాలి. కానీ ఆ పని జరిగినట్టు ఎవ్వరికీ కూడా తెలియకూడదు. అంతేకాదు చాలా చాలా తక్కువ లైట్స్ తో ఈ పని చేయాలి. ఎందుకంటే ఆ హీట్ ఆన వల్లను కూడా ఆ అమెరికన్ స్పైస్ సాటిలైట్ గుర్తించగలదు. అసలు ఈ అండర్ గ్రౌండ్ షాప్స్ అంటే ఏంటి ఎందుకు నిర్మిస్తున్నారు అంటే మనం ఐదు న్యూక్లియర్ డివైసెస్ ని టెస్ట్ చేయాలి. వాటిని టెస్ట్ చేయాలి అంటే సుమారు 400మీటర్ల లోతు 50మీటర్ల వెడల్పు వరకు గుంటలు తవ్వాలి. ఆ గుంట తవ్వాక అవసరమైన చోట కాంక్రీట్ మరియు స్టీల్ తో కేసింగ్ వేయాలి. ఆ గుంట తవ్విన ప్లేస్ లో అంటే 400మీటర్ల లోపల మన దగ్గర ఉన్న న్యూక్లియర్ డివైసెస్ ని అమర్చాలి. ఈ డివైస్ కి పైన ఒక ప్లగ్ ని ఫిక్స్ చేస్తారు. దీనితోనే ఆ డివైస్ ని పేలుస్తారు. ఆ ప్లగ్ కు పైన ఒక మానిటరింగ్ డివైస్ ని పెడతారు. మన సైంటిస్ట్లు ఈ ప్లేస్ నుంచి దూరంగా ఉన్న ఒక కంట్రోల్ బంకర్ లో ఉంటారు. అక్కడ నుంచి ఒక రిమోట్ తో ఈ డివైస్ ని ట్రిగ్గర్ చేస్తే అది పేలుతుంది. అప్పుడు దాని పైన పెట్టిన మానిటరింగ్ డివైస్ తో ఆ బాంబు ఎంత ఎనర్జీని విడుదల చేసింది ఎలా పని చేసింది? సక్సెస్ ఫుల్ గా పేలిందా లేదా అనే విషయాలు తెలుసుకుంటారు. ఆ డేటా మొత్తాన్ని రికార్డ్ చేస్తారు. సో ఇదన్నమాట మన ప్లాన్ కానీ ఇలా ఒక్క డివైస్ కాదు ఐదు డివైసెస్ ని టెస్ట్ చేయాలి. ఇక ఇండియన్ ఆర్మీ వాళ్ళ పనిని ప్రారంభించారు. అండర్ గ్రౌండ్ లో గుంటలు తవ్వడం మొదలు పెట్టారు. మన దేశంలో అందరూ పడుకున్నాక ఆర్మీ యూనిట్ అంతా కలిసి సీక్రెట్ గా పోకర్రన్ టెస్ట్ ప్లేస్ కి వెళ్ళేవారు. వాళ్ళు వెళ్ళే రూట్స్ ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేవారు. వాళ్ళకి దగ్గరగా ఉన్న గ్రామంలోని ప్రజలకు కూడా తెలియకుండా సౌండ్ రాకుండా సౌండ్ సప్రెస్డ్ ఎక్విప్మెంట్ ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళు పని చేసేటప్పుడు ఈ మిషనరీ సౌండ్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ సీక్రెట్ మిషన్ గురించి మన ఇండియన్ మీడియాకి తెలిసినా సరే అది అమెరికాకి తెలిసిపోతుంది. ఇక మిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకే మన దేశంలోని ప్రజలకు కూడా తెలియకుండా చేశారు. ఆర్మీ ఈ పనిలో కుదిరినంత వరకు చేతి పనిముట్లు ఎక్కువగా వాడారు. ప్రతిరోజు ఎక్విప్మెంట్ ని తీసుకెళ్లడం అంటే అది చాలా కష్టం. అందుకని ఒక వస్తువుని ఎక్కడైనా పెడితే ఆ వస్తువు యొక్క ప్లేస్ ని బాగా గుర్తుపెట్టుకునేవారు. అక్కడ పని చేసేది ఇండియన్ ఆర్మీ. వారి వెనుక ఉన్నది ఇండియన్ సైంటిస్ట్లు ఆ పనిని ఎలా పడితే అలా వాళ్ళు చేయలేదు. చాలా సిస్టమాటిక్ గా చేసుకునేలా డిజైన్ చేసుకున్నారు. మొత్తం ఆర్మీ యూనిట్ ని చిన్న చిన్న యూనిట్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క పనిని అప్పగించారు. పైగా ప్రతి సోల్జర్ కి ఒక స్పెసిఫైడ్ ఎక్విప్మెంట్ ఇచ్చేవారు. ఆ సోల్జర్ తన దగ్గర ఉన్న వస్తువుల ప్లేస్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. తను పని చేశాక మళ్ళీ ఆ వస్తువును అదే ప్లేస్ లో పెట్టాలి. ఎందుకంటే ఆ వస్తువు ప్లేస్ మారితే పైన అమెరికన్ సాటిలైట్ కనిపెట్టేస్తుంది. ఇక మన ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. కరెంట్ వైర్లు లేదా ఎక్విప్మెంట్ కేబుల్స్ కనిపించకుండా వాటి పైన మొక్కలు మరియు గడ్డితో కప్పి కవర్ చేసేవారు. వాళ్ళు వాడే మిషనరీని టూల్స్ ని కంటైనర్స్ ని దగ్గరలో ఉన్న బంకర్ లో దాచి పెట్టుకునేవారు. వాళ్ళు వాళ్ళ పనిని ఆ రోజు రాత్రికి పూర్తి చేసి మళ్ళీ తెల్లారేసరికల్లా ఎక్కడ వస్తవో అక్కడే పెట్టేవారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళ వెహికల్స్ వెళ్తుంటే వెనకాల పడే టైర్స్ గుర్తులని చీపురుతో కొంతమంది సోల్జర్స్ చెరుపుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు ఆ రూట్లో వచ్చిన ఆర్మీ వెహికల్స్ గుర్తులు చెరిగిపోతాయి. అమెరికా స్పైస్ సాటిలైట్స్ గుర్తించలేవు. అలా ఏప్రిల్ నెల మొత్తం మన ఇండియన్ ఆర్మీ ఎవ్వరికీ తెలియకుండా ఐదు అండర్ గ్రౌండ్ షాఫ్ట్స్ ని న్యూక్లియర్ టెస్ట్ల కోసం తయారు చేసింది. అసలు అమెరికాకి కొంచెం కూడా డౌట్ రాలేదు. అంత పకట్బందీగా మన వాళ్ళు తమ పనిని పూర్తి చేశారు. అసలు మన వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా చేశారంటే అమెరికా వాళ్ళక Kహెచ్ సాటిలైట్ కి హై ఇమేజ్ రెజల్యూషన్ ఉంటుంది. అది దాని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ని కంపేర్ చేసుకొని చూసినా సరే మన ఇండియన్ ఆర్మీ ఒక్క రోజు కూడా దొరకలేదు. అంతేకాదు మన వాళ్ళు ఆ సాాటిలైట్ మన పోక్రాన్ ప్లేస్ మీదగా ఎప్పుడు వెళ్తుందో కూడా క్యాలిక్యులేట్ చేసి మరి తెలుసుకున్నారు. డే టైం లో కొంత సమయంలో అది మన పోక్రాన్ ప్లేస్ ని చూడలేదు. దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. ఆ టైంలో కూడా మన వాళ్ళు పని చేసేవారు. ఇదంతా ఆ సాాటిలైట్ యొక్క ఆర్బిట్ ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా సాధ్యమైంది. మొత్తానికి ఇండియన్ ఆర్మీ వాళ్ళు అనుకున్న పనిని సాధించారు. న్యూక్లియర్ టెస్ట్ కోసం అంతా సిద్ధం చేసి ఉంచారు. కానీ మరి ఆ న్యూక్లియర్ బాంబ్స్ ని ఈ ప్లేస్ కి ఎలా తేవాలి అనేది అందరికీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అది మే 1వ తారీకు 1998 ఫైనల్ గా న్యూక్లియర్ బాంబ్స్ ని పోక్రన్ టెస్ట్ ప్లేస్ కి తీసుకురావాలి అని డిసైడ్ అయ్యారు. ఆ రోజు రాత్రి ఇండియాలోని ప్రజలంతా ప్రశాంతంగా పడుకున్నారు. కానీ ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో మాత్రం కొంతమంది ఇండియన్ సైంటిస్ట్లు ఇంకా పడుకోలేదు. చాలా బిజీగా పని చేస్తున్నారు. వాళ్ళు ట్రక్ కంటైనర్స్ లోకి న్యూక్లియర్ డివైసెస్ ని ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ రోజు రాత్రి సరిగ్గామూడు గంటలకి ఆ న్యూక్లియర్ డివైసెస్ ని మిలిటరీ ట్రక్స్ లో లోడ్ చేశారు. మిలిటరీ కాన్వాయ్ బయలుదేరింది. మన ఇండియన్ మీడియాకి కూడా దొరకకుండా వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ ని కూడా మార్చేశారు. అసలు ఎలాంటి చప్పుడు లేకుండా రాత్రికి రాత్రి ఐదు బాంబ్స్ ని ముంబైలో ఉన్న శంటాక్రూస్ ఎయిర్పోర్ట్ లోకి తీసుకొచ్చారు. అక్కడికి రాగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ an 32 ఎయిర్ క్రాఫ్ట్ రెడీగా ఉంది. ట్రక్స్ లో నుంచి ఆ ఏరోప్లేన్ లోకి కేర్ఫుల్ గా ఆ బాంబ్స్ ని లోడ్ చేశారు. అక్కడ నుంచి రాజస్థాన్ లో ఉన్న జైసల్మర్ మిలిటరీ ఎయిర్ బేస్ కి తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఇండియన్ ఆర్మీ ట్రక్స్ లో మూడు ట్రిప్స్ ద్వారా ఆ ఐదు బాంబ్స్ ని పోక్రాన్ టెస్ట్ ప్లేస్ లోకి తీసుకువచ్చి మిలిటరీ ఫెసిలిటీలో పెట్టారు. అది ఉన్న ప్లేస్ కి వాళ్ళు పెట్టుకున్న కోడ్ నేమ్ ప్రేయర్ హాల్. ఆ ప్రేయర్ హాల్ లోనే ఆ బాంబ్స్ అన్నిటికీ ఫైనల్ గా డిటోనేటర్స్ ని అటాచ్ చేశారు. టైమర్స్ ని చెక్ చేశారు. సేఫ్టీ లాక్స్ ని కన్ఫర్మ్ చేశారు. ప్రతి వైర్ ప్రతి ఫ్యూజ్ ప్రతి వోల్టేజ్ ట్రిగ్గర్ ని టెస్ట్ చేసి క్రాస్ చెక్ చేసి ఇక ఫైనల్ టెస్ట్ కి సిద్ధం చేశారు. అది మే 10వ తారీకు 1998 ఆ రోజు మూడు సపరేట్ షాఫ్ట్స్ లో మూడు బాంబ్స్ ని ఇన్స్టాల్ చేశారు. శక్తివన్ ఇది టూ స్టేజ్ థర్మోన్యూక్లియర్ డివైస్. ఇదే మన మెయిన్ న్యూక్లియర్ డివైస్. శక్తి 2 ఇది ప్లూటోనియం ఇంప్లోషన్ ఫిజన్ డివైస్ శక్తి 3 ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ లీనియర్ ఇంప్లోషన్ డివైస్ శక్తివన్ డివైస్ ని వైట్ హౌస్ అనే షాఫ్ట్ లో ఇన్స్టాల్ చేశారు. శక్తి 2 ని తాజ్మహల్ అనే షాఫ్ట్ లో ఇన్స్టాల్ చేశారు. శక్తిత్రీ ని కుంభకరణ్ అనే షాఫ్ట్ లో ఇన్స్టాల్ చేశారు. ఇక అన్నిటిని ఇన్స్టాల్ చేసేసాక కంట్రోల్ రూమ్లో ఇండియన్ సైంటిస్టులు మరియు ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ అందరూ కూడా కౌంట్ డౌన్ కి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జాబ్ ఉంది. వాళ్ళ ఒరిజినల్ పేర్లు వాడకూడదు మొబైల్ ఫోన్స్ వాడకూడదు అసలు వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ట్రేస్ అనేది ఉండకూడదు. ఈ టీం్ లోనే బ్రిలియంట్ మైండ్స్ అయిన ఏపిజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఆర్ చిదాంబరం గారు ఉన్నారు అనిల్ కకోట్కర్ గారు ఉన్నారు. ఇక ఫైనల్లీ టెస్ట్ కోసం అన్నిటిని సిద్ధం చేశారు. కాసేపటికి అమెరికా సాటిలైట్ జస్ట్ అప్పుడే పోక్రాన్ రేంజ్ ని దాటి వెళ్ళిపోయింది. ఇండియన్ సర్వైలెన్స్ టీం స్కై చాలా క్లియర్ గా ఉంది. వెదర్ పర్ఫెక్ట్ గా ఉంది అని కన్ఫర్మ్ చేశారు. సేఫ్టీ క్లియరెన్స్ ఇచ్చారు. ఇక కౌంట్ డౌన్ సిస్టం యాక్టివేట్ అయింది. కంట్రోల్ రూమ్లో అందరూ సేఫ్టీ గాగుల్స్ వేసుకొని చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల కష్టం ఈ ఒక్క రాత్రిలో సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది తేల్చేస్తుంది. అది సరిగ్గా మే 11 ఉదయం 3గ:45 నిమిషాలకు చీకటిగా ఉన్న తారి ఎడారిలో అండర్ గ్రౌండ్ నుంచి ఒక పెద్ద లైట్ వచ్చింది. వెంటనే కంట్రోల్ రూమ్లో ఉన్న అందరూ సైంటిస్ట్ులు సోల్జర్స్ అందరూ ఒకేసారి కళ్ళు మూసుకున్నారు. వెంటనే ఒక షాక్ వేవ్ వచ్చింది. ఒక పెద్ద ప్లాస్ట్ కొన్ని వందల మీటర్ల ఆకాశంలోకి వెళ్ళింది. శక్తి 1టత అన్ని డివైసెస్ డిటోనేట్ అయ్యాయి. భూమి ఒక్కసారిగా షేక్ అయింది. ఆ మొత్తం డేటాని కంట్రోల్ రూమ్ లో రికార్డ్ చేశారు. అంతే కంట్రోల్ రూమ్ లో ఉన్న అందరూ ఒకేసారి ఆనందంలో తేలిపోయారు. మన దేశ చరిత్రలో అది ఒక గొప్ప రోజుగా లికించబడింది. కానీ పొలిటికల్ గా మిగతా ప్రపంచాన్ని కూడా షేక్ చేసింది. పాలిటిక్స్ కి సైన్స్ తోడైతే దేశ ప్రజలు ఎంత సేఫ్ గా ఉండగలరో మన సైంటిస్టులు మరియు ఆర్మీ కలిసి ప్రూవ్ చేశారు. మళ్ళీ మే 13వ తారీకున శక్తిఫోర్ అండ్ఫైవ్ ని కూడా సక్సెస్ ఫుల్ గా టెస్ట్ చేశారు. అంతే మన ఇండియా సిక్స్త్ కంట్రీగా న్యూక్లియర్ క్లబ్ లో జాయిన్ అయిపోయింది. కొన్నిసార్లు శాంతి కావాలి అనుకుంటే వైలెన్స్ కంపల్సరీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోని హైప్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే థాంక్స్ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment