Friday, August 15, 2025

 *అవతార్ మెహర్ బాబా - 49*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


*మస్తు కార్యక్రమం*

బైరమంగళలో బాబా ప్రారంభించి వదిలి వేసిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర పునరుద్ధరణ 1983లో కె.కె. రామకృష్ణన్ గారికి బాబా కలుగజేసిన ప్రేరణ వల్ల చేపట్టబడింది. అసంపూర్తిగా మిగిలిన గదులు, కేంద్ర స్థానంలో వలయాకారంలో ఒక హాలు శిఖరం (డోమ్) నిర్మించబడ్డాయి. పరాధీనంలో ఉన్న స్థలాన్ని కొని నిర్మాణాలు గావించబడ్డాయి. 1939లో బాబా వద్ద బెంగుళూరులో వాచ్ మెన్ గా చేరి సేవ చేసిన వెంకోబారావు ఆయన కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో శ్రద్ధ వహించి ఈ కేంద్రాభివృద్ధికి పాటుబడుతు న్నారు. 

కేంద్రస్థానంలో నిర్మించిన కట్టడము యొక్క ప్లాను ఆర్కిటెక్ట్ తన స్వంత ఊహతో తయారు చేశారు. ఆ ప్లాను 1939లో బాబా తయారు చేయించిన ప్లానుకు ('గ్లో' పత్రిక సంపాదకుని ద్వారా లభ్యమైనది) సరిపోయేదిగా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించి బాబా ప్రేరణ వల్లనే పునరుద్ధరణ జరిగిందనే విశ్వాసాన్ని కలుగజేసింది.
📖


*మెహెరాజాద్*

బాబా 1923వ సంవత్సరంలో మెహెరాబాద్ ను కేంద్ర స్థానంగా ఎన్ను కున్న తర్వాత ప్రపంచ పర్యటనలు, మస్తుల కొరకు చేసిన పర్యటనల కాలంలో కూడా 26 సంవత్సరాల కాలం బాబా విశ్వ కార్యక్రమానికి కేంద్రంగా ఉన్నది మెహెరాబాద్.

1944వ సంవత్సరంలో బాబా మకాము మెహెరాబాదు నుండి మెహెరాబాదు (పింపల గావ్)కు మార్చారు. అది అంతకు ముందు ఒక గుఱ్ఱపుశాల. ఎడారిలో ఒయాసిస్సు లాగా అందమైన తోటతో నిరాడంబరమైన చిన్న గృహాలతో అనంతుని నివాసానికి అనువైన స్థలంగా ఎన్నుకోబడిన మెహెరాబాద్ నేటికీ బాబా ప్రేమిక లోకానికి అమరధామం. బాబా దర్బారు నిర్వహించే మండలి హాలు, బాబా నివాసగృహం నేటికీ ప్రేమికులకు బాబా నిర్వహించిన కార్యక్రమాల గత స్మృతులను గుర్తు చేస్తాయి.
📖

*నవజీవనం*

బాటసారుల వలె భిక్షాటన చేస్తూ రేపటి గురించిన ఆలోచన లేకుండా ఏదీ ఆశించక ఏ సహాయాన్నర్థించకుండా ఎక్కడికి వెళ్తాము, ఎప్పుడు తిరిగి వస్తాము అనే ఆలోచన లేకుండా గడిపే 'నవజీవనాన్ని' 16.10.1949 రోజు నుండి ప్రారంభించను న్నట్లు బాబా రెండు మాసాల ముందుగానే తెలియచేసి అందరినీ సమావేశపరిచి ఈ నవజీవనంలో ఆయనతో వెళ్ళదల్చుకున్న వారి అభిమతాన్ని సేకరించారు. అన్ని ఏర్పాట్లు చేయించారు. ఈ నవజీవనాన్ని విశదీకరిస్తూ బాబా క్రింది సందేశాన్ని ఇచ్చారు. బాబా గడిపిన ఈ నవజీవన ఘట్టం రామావతారంలోని 14 ఏళ్ళ అరణ్య వాసాన్ని తలపిస్తుంది.

"ఈ నవజీవనం అనంతమైనది. నా భౌతిక మరణానంతరం కూడా ఈ నవజీవనం ఎవరు భ్రాంతి, అసత్యము, ద్వేషము, క్రోధము, లోభము మరియు కామమును పూర్తిగా త్యజించిన జీవనము గడిపెదరో మరియు అట్టి జీవనము గడుపుటకు ఎవరు కామపూరితమైన పనులు చేయరో. ఎవ్వరికి ఎట్టి హాని కలుగజేయరో, పరోక్ష నిందలు చేయరో, ప్రాపంచిక సంపదలను అధికారాన్ని కాంక్షించరో, ఎవరు ఎట్టి మర్యాదల నంగీకరించరో, సత్కారముల కుప్పొంగి, అవమానముల తిరస్కరించరో, ఎవరికీ దేనికీ భయపడరో, ఎవరు సంపూర్ణముగా భగవంతుని పైన మాత్రమే భారముంచి కేవలము ప్రేమించుట కొరకు మాత్రమే భగవంతుని ప్రేమించి దైవ ప్రేమికులను, వ్యక్తరూపాలను విశ్వసించె దరో మరియు ఎట్టి ప్రాపంచిక, ఆధ్యాత్మిక ప్రతిఫలాన్ని ఆశించరో ఎవరు సత్యము యొక్క ప్రాపు విడనాడరో, ఎవరు ఎట్టి ఆపదలలోనైనను చలించక ధైర్యముతో హృదయపూర్వకంగా అన్ని కష్టములను నూటికి నూరు పాళ్ళు సంతోషంగా ఎదుర్కొందురో మరియు ఎవరు కులగోత్రా లకు మత పరమైన కర్మకాండలకు ప్రాధాన్యమివ్వరో అట్టివారి చేత నిరంతరాయంగా జీవింపబడుచుండును. శాశ్వతమైన ఈ నవజీవనం ఆధ్యాత్మిక జీవితాన్ని సూచించే మార్గాలన్నిటికి మూలము, సారమై సత్యాన్వేషకులైన సాధకులందరికీ ఆచరణయోగ్యమైనది" అని బాబా చెప్పారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఈ నవజీవనంలో పాటించవలసిన నియమాలను బాబా సూచించారు. డబ్బు ముట్టుకోకూడదు. ఆహారాన్ని మాత్రం భిక్ష ద్వారా స్వీకరించవచ్చు. దేనికీ దుఃఖించ కూడదు. అందరూ బాబాని పెద్దన్నయ్యగా భావించాలి. అవతారుడుగా భావించి ఆయన నుండి ఎట్టి సహాయాన్ని ఆశించ గూడదు. ఎవరు తప్పు చేసినా శిక్ష బాబాయే అనుభవించేవారు. బాబా ఆదేశించగానే ఆదేశము పొందినవారు బాబాను మెల్లగా కాకుండా గట్టిగా కొట్టాలి. అలా చేయకపోతే బాబాకు అవిధేయత చూపిన వారవుతారు.

నవజీవనంలో పాల్గొనుటకు బాబా 16 మంది పురుషులను నలుగురు స్త్రీలను వారి అంగీకారాన్ని బట్టి ఎంపిక చేసారు. 16.10.1949 ఉదయం 3 గంటలకే అందరూ సిద్ధమై ప్రయాణమై బైలుదేరారు. సూపా, నారాయణ గావ్, ఘోడ్ నది, పూనా, సతారా, కొల్లాపూర్ల మీదుగా బెల్ గావ్ చేరారు. 22.10.1949 రోజున బెల్గాం లో ఉన్నారు. అప్పటికి పూర్తిగా నవజీవన నియమాలింకా కఠినంగా అమలుపరచ లేదు. వర్షాలు ఇతర కారణాల వల్ల కాలి నడకతో బాటు బస్సు, రైలు ప్రయాణాలు అనుమతించబడ్డాయి.

నవజీవనంలో బెల్గాంలో ఉన్న కాలం మొదటి శిక్షణా శిబిరంగా జరిగింది. నవజీవనంలో నిరాశా నిస్పృహలతో గడిపే జీవనం కాకుండా బాబాకు పరిపూర్ణమైన విధేయతతో శిష్యులు మెలగాలి. ఆ తర్వాత మకాము కాశీ (బెనారస్) లో శిక్షణ ఇంకా కఠినంగా ఉంటుదన్నారు బాబా. బాబా ఆదేశం చెప్పిన వెంటనే అమలుపర్చాలి. బాబా ఆదేశం గురించి వాదించకూడదు. బాబా కోపగిస్తే వారు తప్పు చేసినా చేయకపోయినా బాధపడ కూడదు. ఉత్సాహంగా ఉండాలి.

బాబా సహచరులతో నవంబర్ 12వ తేదీన రైలులో కాశీకి వెళ్ళారు. పూనా, బొంబాయి, మొగల్ సరాయిల మీదుగా ప్రయాణం చేసి నవంబర్ 15వ తేదీ ఉదయం 5.30 గం.లకు కాశీకి చేరారు. కాశీలో బాబాకు ఆయన సహచరులకు డా. నాధ్, కంటి వైద్యుడు, డా. ఖరే ఇద్దరు కలిసి వసతి, భోజన సదుపాయాలు బాబా ఆదేశానుసారంగా ఏర్పాటు చేశారు. బాబా వారికి రూ.600 మాత్రము ఇచ్చారు. వారెవ్వరూ బాబా దర్శనానికి రాకూడదని బాబాదాస్, ఈరుచ్, ఆదీ - ఈ ముగ్గురితో తప్ప ఎవరితో మాట్లాడకూడదని ముందే చెప్పారు. వారికి ఇష్టం లేకున్నా వారు చేసిన సదుపాయాలకు భోజనాలకు బాబా ఇచ్చిన రూ.600 పుచ్చుకున్నారు. ఇద్దరు డాక్టర్లు కలిసి బాబా, వారి సహచరులు ఉండటానికి ఇమీ అనే చోట నిచిబాగ్ బంగళాలు ఏర్పాటు చేశారు. అవి పాత బంగళాలైనా, ఉండటానికి చాలా అనువుగా ఉండేవి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కాశీకి చేరే ముందు మొగల్ సరాయి స్టేషన్ లో సామాన్లు దింపిన తర్వాత, ఆ సామాన్ల ను వేరే రైల్లో ఎక్కించడంలో పొరపాటు వల్ల సామాన్లు దింపిన చోట బాబాతో ఎవ్వరూ లేకుండాపోయారు. బాబా వద్ద ఎప్పుడూ ఒకరైనా ఉండాలి. ఈ విషయం లో బాబా వారిని కోప్పడ్డారు. నవజీవనం లో ఎవరూ కోపగించుకోరాదు. బాబా కూడా నవజీవనంలో అందరికీ అన్నయ్య గా అందరితో సమానంగా నడుచుకునే వారు. వారిని కోపగించుకున్నందులకు వెంటనే తన చెవులు గిల్లి లెంపకాయ కొట్టమన్నారు. ఈ విషయంలో కూడా శిష్యులు సందేహించినా, లెంపకాయ నెమ్మదిగా కొట్టినా అవిధేయులుగా లెక్కించబడతారు కాబట్టి సహచరులు బాబా ఆదేశించగానే ఆయన చెవులు మెలివేసి లెంపకాయ కొట్టారు. ఈ ఆదేశం ఎవరికి ఇచ్చినా వారు వెంటనే ఆ పని చెయ్యాలి.

కాశీ నుండి బయలుదేరి నవజీవనాన్ని కఠిన నియమాలతో ఆచరించాలని బాబా నిర్ణయించారు. దానికి ప్రారంభంగా కాశీ లోనే బాబా ఆ నవజీవనానికి శిక్షణ ఇచ్చారు. ఆహారం భిక్ష అడిగి పొందడం ఎలాగో కాశీలోనే నేర్పించబడింది. బాబా స్వయంగా డా. నాథ్ ఇంటి వద్ద నవంబర్ 24వ తేదీన భిక్ష అడిగి పుచ్చుకున్నారు. డా. ఖరే ఇంట్లో నవంబర్ 25వ తేదీన బాబా భిక్ష అడిగి పుచ్చుకున్నారు. అలాగే 
సహచరులను ఇద్దరిద్దరిని కలిపి భిక్షకై పంపించారు బాబా. భిక్షాటనకు కూడా బాబా నియమాలేర్పరచారు.

కాళ్ళ జోళ్ళు లేకుండా ఉట్టి పాదాలతో వెళ్ళాలి. చేతిలో ఇత్తడి అక్షయ పాత్ర ధరించాలి. కాషాయరంగు గుడ్డతో చేసిన ఒక జోలె భుజానికి తగిలించుకోవాలి. ఈ జోలెలో వండిన ఆహారానికి, గోధుమ పిండి కి, బియ్యానికి వేర్వేరు సంచీలుండాలి. భిక్షలో డబ్బులు తీసుకోరాదు. ఎవరైనా పొరపాటున భిక్షాపాత్రలో డబ్బులు వేస్తే వారే తిరిగి తీసుకోవాలి. సహచరులు వారి చేతితో డబ్బు తాకరాదు. భిక్ష ఆడవారి నుండి, మగవారి నుండి కూడా పొంద వచ్చును. కాని ఆడవారిని తాకరాదు. మగవారిని 'భాయీ! ప్రేమ్సే భిక్షా దీజియే!' అని, ఆడవాళ్ళనైతే 'మాయీ! ప్రేమ్సే భిక్షా దీజియే!' అని అడగాలి. ఒక ఇంట్లోనే భిక్ష అడగాలి. ఆ ఇంటిలో భిక్ష దొరకకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళాలి. భిక్షలో తీసుకున్న ఆహారం ఎంత ఉన్నది. ఎలా ఉన్నదీ పరీక్షించకుండా భిక్ష దొరకగానే జోలెలో వేసుకొని తెచ్చి బాబా ముందుపెట్టాలి. సహచరులందరూ భిక్షగా తెచ్చిన ఆహారాన్ని బాబా కలిపి అందరికి ఒక ముద్ద ఇచ్చేవారు. అదే వారికి ఆ రోజుకు ఆహారము.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment