Aura 🌀 5 Powerful Signs Your Aura is Strong | మీ ఆరా బలంగా ప్రకాశిస్తోందా? #parampara #sanatandharma
Author Name:Jagamantha Kutumbam Naadi
Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zB-cLuxpLRg
Transcript:
(00:02) చాలా మందికి ఒక విషయం తెలీదు మనందరికీ కనిపించే ఓ శరీరం ఉంటుందని తెలుసు కానీ కనిపించని ఒక శరీరం కూడా మనతో పాటే తిరుగుతుందని తెలుసా దీన్నే మనం ఆరా అంటాం. ఓరా ఇదొక శక్తి వలయం కాంతి కవచం మన ఆత్మ వెలువరించే ఒక వెలుగు ఓరా. దేవుళ్ళందరికీ ఫోటోలో సినిమాల్లో తలకాయ చుట్టూ ఒక గుండటి వెలుగు చూపిస్తుంటారే అదే ఆరా.
(00:26) ఆ ఓరా మనుషులకు కూడా ఉంటుంది అని సైన్స్ చెప్తోంది. అది ప్రాచీన కాలంలో మనుషులందరికీ కంటికి కనిపించేది ఇప్పుడు కనిపించకున్నా మనతోటే ఉంది అని సనాతన ధర్మం చెప్తోంది. ఈ ఆరా అండి బలహీనంగా ఉన్నప్పుడు మనం అలసటగా, భయంతో నిరాశతో ఉంటాం. కానీ ఇది బలంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ప్రపంచం మనకు ఒక వేరే రీతిలో స్పందిస్తూ ఉంటుంది.
(00:47) మీ ఆరా బలంగా, ప్రకాశవంతంగా ఉంది అని చెప్పే ఐదు సంకేతాలు ఇప్పుడు చెప్తాను. నమస్కారం మిత్రమా నా పేరు వంశీ. జగమంత కుటుంబం నాది ఛానల్ లో బైరాగి లైఫ్ లెసన్స్ మీకు చెప్తూ ఉంటారు. ఆయన మైక్రో లెసన్స్ నా ద్వారా మీరు వింటారు ఇక్కడ. సరేనా ఇప్పుడు వినండి ఐదు సంకేతాలు. ఒకటి సహజ ఆకర్షణ. మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీరు మాట్లాడక ముందే మనుషులు మీ వైపు లాగబడతారు.
(01:09) మీ ఆరా ప్రజ్వరిల్లుతూ అద్భుతంగా ఉంటే. ఇది కేవలం బయటికి అందంగా కనపడడం వల్ల కాదు. మీ లోపలి శక్తి కాంతి రూపంలో బయటకు వెలువడుతుండడం వల్లే ఈ కాంతిని అందరూ కళ్ళతో చూడలేకపోయినా సబ్కాన్షియస్ గా పసిగట్టగలుగుతారు అని సైన్స్ చెప్తుంది. ఉదాహరణకు మీరు ఒక సమావేశంలో ఉన్నారనుకోండి ఎందుకో గాని పదే పదే అందరూ మీ వైపు అలా చూసి కళ్ళు తిప్పేసుకుంటూ ఉంటారు.
(01:30) వారి కళ్ళు మీ మీద మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటాయి ఎందుకో వారికి కూడా అర్థం కాదు. అదేనండి మాగ్నెటిక్ ఆరో ప్రభావం. ఇది మీ ఆత్మ స్థితి సమతుల్యంగా ఉందని మీ శక్తి ఇతరులను సహజంగానే ఆకర్షిస్తోంది అని సంకేతం. రెండు అంతర్ ప్రశాంతత మీ ఓరా ఆరోగ్యంగా వెలుగుతుంటే బయట పరిస్థితి తుఫానులా ఉన్నా లోపల మీరు సముద్రం లోతుల ప్రశాంతంగా ఉంటారండి.
(01:53) ఎవరైనా కఠినమైన మాటలు అన్నా పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నా మీ మనసు సులభంగా తడబడదు. ఇలాంటి స్థిరత్వం ఉంది అంటే మీ ఓరా రక్షణ వలయంలో పని చేస్తోంది అని అర్థం. ధ్యానం చేసే వారికి నేను ఏం చెప్తున్నానో సరిగ్గా అర్థంవుతుంది. మూడోది ఇతరులపై పాజిటివ్ ఇంపాక్ట్ చక్కటి ఓరా ఉంటే మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన వ్యక్తి తేలికగా ప్రశాంతంగా ఫీల్ అవుతుంటాడు.
(02:15) అక్కడ మీరు ఏం చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు మీ శక్తి వారిని తాకుతోంది అని మీరు అర్థం చేసుకోవాలి. మీతో ఎదుటివారు కలిసినప్పుడు వారు ఒకే మాట అంటారు. ఎంతో నిశశబ్దంగా తేలికగా ఉండే ఫీలింగ్ అని. ఇదంతా మీ ఆరా వెలువరుస్తున్న కాంతి వలన మీరొక నడిచే దీపంలా ఇతరులను స్పృషిస్తుంటారు. బలమైన ఆరా ఉంటే మీకు మీరే మంచి చేసుకుంటున్నారు ఎలాగో అంతేకాక ఒక హీలింగ్ ఫ్రీక్వెన్సీలా మీరు ప్రపంచానికి కూడా పని చేస్తున్నారు.
(02:38) ఇక మన నాలుగవ సంకేతం ఆత్మవిశ్వాసం. ఓరా బలహీనంగా ఉన్నప్పుడు మనం గంధరగోళంలో పడతాం. చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడతామండి. కానీ ఆరా బలంగా ఉన్నప్పుడు మన అంతరంగంలో ఒక స్పష్టత దివ్యమైన ధైర్యం లాంటిది ఉంటుంది. ఏ దారి ఎంచుకోవాలో ఏది సత్యమో చిత్రంగా మనకి బాగా తెలిసిపోతుంటుంది. ఈ నిశ్చయాత్మకతే అండి నాలుగో సంకేతం ఇది మనలోని శక్తి మార్గాన్ని చూపుతోంది అని నిర్ధారణ. ఐదవ సంకేతం ప్రకాశమయ శరీరం.
(03:04) చాలాసార్లు ఇతరులు మిమ్మల్ని చూసి అంటుంటారు మీ ముఖం ఎందుకు ఇంత వెలుగుతోంది మీ కళ్ళల్లో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది అని అనడం మొదలు పెడతారు. ఇది మీ లోపల నుంచి మీరు ఉన్న తీరు బాహ్య అందం వల్ల కాదు మీ ఆంతరంగిక కాంతి బయటకు పొంగి వస్తోంది అని సంకేతం ప్రకాశవంతమైన ఆరా ఉన్నప్పుడు మీ శరీర భాష అంటే బాడీ లాంగ్వేజ్ మీ చూపు మీ కదలికలలో ఒక పవిత్రమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది.
(03:29) ఇప్పటివరకు మనం ఓరా బలంగా ఉందని తెలిపే సంకేతాలు చూసాం అవునా ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఓరా బలంగా కావాలంటే మీరు ఏం చేయాలి మీ ఆరాని శుద్ధి చేసి ప్రకాశవంతం చేసే ఐదు ట్రిక్స్ బైరాగి నాకు చెప్పారు అవి మీకు చెప్తున్నాను. ఒకటి ధ్యానం ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 నిమిషాలు కళ్ళు మూసుకొని అలా కూర్చోండి. శ్వాసపై దృష్టి పెట్టండి.
(03:51) మీ మనసులో ఆలోచనలు మెల్లిగా నెమ్మదించడం మొదలు పెడతాయి. దానివల్ల ఆటోమేటిక్ గా మీ ఓరాలో పేరుకుపోయిన మలినాలు తొలగించబడతాయి. మళ్ళీ స్వచ్ఛంగా మారుస్తాయి. రెండు మంత్ర జపం గాయత్రీ మంత్రం అనుకోండి మహామృత్యుంజయ మంత్రం లేదా శివ పంచాక్షర అయినా మీ మనసుకి ఏది మంచి ఫీలింగ్ ఇస్తుందో ఆ మంత్రాన్ని పట్టుకోండి జపించండి. మీరు చేస్తున్న జపం లోపలి నుంచి శబ్ద తరంగాల్లా మీ ఓరాని తగులుతూ ప్యూరిఫై చేస్తూ ప్రకాశవంతం చేస్తాయి.
(04:16) మంత్ర జపానికి ఓరా మీద ఉన్న పవర్ అండి అది. మూడు శుద్ధమైన ఆహారం. మనం తినే ఆహారం మన శక్తి వలయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని తెలుసా? మంచి సాత్వికమైన శుద్ధమైన ఆహారం పళ్ళు కూరగాయలు తేలికైన భోజనం ఇవి ఓరాని శుభ్రంగా ఉంచుతాయి. బరువైన ఆహారం ప్రాసెస్డ్ ఫుడ్ నిలువ ఉండడం కోసం ఏవేవో కలపబడిన ఆహారం మీ ఓరాను మందగిస్తాయని గుర్తుంచుకోండి.
(04:40) నాలుగు సత్సంగం మీకు తెలుసా మీరు ఎవరికి దగ్గరలోకి వస్తారో వారి ఓరా ప్రభావం మీ ఓరా పై పడుతుందండి. ఇది నిజం కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఓరాను ఫోటోలు తీసే ఒక సాంకేతికత ఉంది. అలా ఫోటోలు తీసి నేను చెప్పింది నిరూపించారు. మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి ఆ గురువు పవర్ఫుల్ ఓరాతో మీ శరీరం యొక్క కాంతి వలయం ఇంటరాక్ట్ అవుతుంది. అందులోని మలినాలు కడిగేసినట్టు ఒక చక్కటి రంగులోకి మారుతుంది మీ ఓరా.
(05:04) అలాగే ప్రతికూల భావాలు నెగిటివిటీ ఉన్న వారి దగ్గరికి వెళ్ళారనుకోండి వారి ఓరా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. లేదా మీరు మహా స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి మీ ఓరా వారిని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే సత్సంగత్యం మంచి ఫ్రెండ్స్ మంచి బంధాలు ఉండాలని సనాతన ధర్మం మొదటి నుంచి చెప్తూ ఉంది. ఐదు ప్రకృతితో కనెక్ట్ లో ఉండడం ఇది మీ ఓరాను అద్భుతంగా మార్చడానికి ఒక బెస్ట్ ట్రిక్ అండి.
(05:25) చెప్పులు లేకుండా ఒక అరగంట సేపు మీరు గడ్డి మీద నడిస్తే మీ ఓరా పూర్తిగా మారిపోతుంది. సూర్యకాంతిలో నిలబడడం గాలి, వర్షం ఇలా నేచర్ లో ఎక్కడైనా వెళ్లి కూర్చోవడం లేదా సింపుల్ గా ఒక చెట్టును వెళ్లి కాసేపు వాటేసుకోండి కౌగిలించుకోండి ఇవన్నీ మీ ఆరాను రీఛార్జ్ చేస్తాయి. కేవలం చిన్న చిరునవ్వుతో కళ్ళు మూసుకొని పక్షులు కిచ కిచ కిచ అంటుండడం వినండి.
(05:44) ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ కూడా మీ ఆరాని మార్చేస్తుంది. ఇప్పుడు చెప్పిన ఐదు ట్రిక్స్ మీ రోజువారి జీవితంలో ఒక భాగం అయిపోతే మీ ఆరా కేవలం బలంగా అవ్వడం కాదు దివ్యకాంతితో ప్రకాశిస్తుందండి. ప్రపంచం మిమ్మల్ని చూసే కళ్ళే మారిపోతాయి చూడండి. ప్రపంచానికి కనిపించకుండా మీరు ఎవరో చెప్పే సంకేతం ఆరా. గుర్తుంచుకోండి మీ ఓరా బలంగా ఉన్నప్పుడు మీరు ప్రపంచాన్ని మార్చగలరు.
(06:08) సనాతన ధర్మంలో నిగూఢమైన రహస్యాల కోసం జగమంత కుటుంబం నాది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీతో చెప్పండి బైరాగి స్టైల్ లో జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవదత్త [సంగీతం]
No comments:
Post a Comment