ఇదేనా Privacy అంటే?
Author Name:Amma Charitable Trust Guntur
Youtube Channel Url:https://www.youtube.com/@AmmaCharitableTrust
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vTkxc-r7TmY
Transcript:
(00:00) నేనేమీ కాదనలేదు కదమ్మా కానీ ప్రైవసీ అనే మాటకు నీకు అర్థం సరిగా అర్థం కాలేదు అంటున్నాను. ఏంటి డాడీ అర్థం కానిది నేనేమైనా చిన్న పిల్లనా ఐ యామ 20 యు నో నిజమే తల్లి కానీ పద్ధతి గల కుటుంబంలో పుట్టి 18 ఏళ్లగా చాలా పద్ధతిగా పెరికి కుటుంబానికి సమాజానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిన నువ్వు కొన్ని దిక్కుమాలిన సినిమాల వలన సీరియల్స్ వలన టీవీ షోస్ వలన చాలా అంటే చాలా తక్కువ సమయంలో నువ్వు పూర్తిగా మారిపోయి దానికి కి ప్రైవసీ అని పేరు పెట్టి చివరకు కన్న తండ్రినే ఎదిరించే స్థాయికి నీ సంస్కారం
(00:46) దిగజారినప్పుడు ఒక తండ్రిగా నాకు బాధ ఉంటుందమ్మా ప్రైవసీ అనేది చాలా విలువైనదని దానికి విలువ ఇచ్చి మన విలువ పెంచుకోవాలని నీలాంటి పిల్లలకు తెలియకపోవడం వలన ఇలా కుటుంబాల పరువు రోడ్డున పడడమే కాకుండా కోట్లమంది కుటుంబ సభ్యులు మానసికంగా చచ్చి బ్రతుకుతున్నారు. ప్రైవసీ అంటే బరితెగించడం కాదమ్మ పవిత్రతను మెరుగుపరుచుకోవడం అది తెలియనప్పుడు ఇంట్లో మనకు వీధిలో కుక్కకు తేడా ఉండదు తల్లి అటుపై నీ కర్మ జై హింద్
No comments:
Post a Comment