Wednesday, February 18, 2026

❌హీరోల కాళ్ళ దగ్గర కుక్కలు | FAN CULTURE | Anukula Vedam || Telugu Podcast

❌హీరోల కాళ్ళ దగ్గర కుక్కలు | FAN CULTURE | Anukula Vedam || Telugu Podcast

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4TnEBul8Yws



Transcript:
(00:04) భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయి అన్నాడు. నాకు తెలిసి ఈ శ్లోకాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నది ఈ హీరోలకు ఫ్యాన్స్ అంటూ తిరిగే ఇప్పటి యువతే ఆ హీరో కోట్లు తీసుకుంటాడు ఆ డైరెక్టర్ కోట్లు తీసుకుంటాడు కానీ మీరు టికెట్ కొని పెట్రోల్ పోయించుకొని చొక్కలు చించుకొని గొంతు పోయేలరిచి వాళ్ళని గెలిపిస్తారు.
(00:25) మరి బదులుగా మీకేం వస్తుంది. ఒక్క రూపాయి రాదు అయినా చేస్తారు ఎందుకంటే మీరు కర్మయోగులు లాభం లేకపోయినా కష్టపడటం మీ రక్తంలోనే ఉంది కదా మరి అసలు మీలాంటి నిస్వార్థ జీవులు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. నిజంగా మీ పాదాలకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మనిషి అన్నాక కాస్త స్వార్థం ఉంటది. నా కెరీర్ ఏంటి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తాడు.
(00:51) కానీ మీరు ఛా ఆ స్వార్థమే లేదు మీలో అసలు మీకోసం మీరు బతకడం ఎప్పుడో మానేసారు మీరు బతికేది ఒక హీరో సినిమా కలెక్షన్ల కోసం మీరు బతికేది ఒక పొలిటికల్ లీడర్ అధికారం కోసం ఒక హీరో సినిమా ఫ్లాప్ అయితే అన్నం మానేసి మరి ఏడుస్తారు చూసారు ఆ ప్రేమ మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల మీద కూడా ఉండదేమో అసలు మీ టైం ని మీ ఎనర్జీని మీ జీవితాన్ని అవతలి వాడి స్టార్డం కోసం ఇలా ధారపోస్తుంటే త్యాగరాజు కూడా మీ ముందు చినబోతాడు.
(01:16) మీ ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు ఒరేయ్ ఆ హీరో కోసం తిరగకుండా ఆ టైం ఏదో ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చు కదా నాలుగు రాళ్ళు వెనక వేసుకోవచ్చు కదా అని కానీ వాళ్ళకేం తెలుసు మీ గొప్పతనం డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు మా అన్న కటౌట్ హైట్ పెంచడం ముఖ్యం అని మీ జోబులో చిల్లి గవ్వ లేకపోయినా పర్లేదు కానీ మీ ఫేవరెట్ హీరో మాత్రం ప్రైవేట్ చెట్లో తిరగాలి.
(01:38) దీన్నే కదా అన్కండిషనల్ లవ్ అంటారు. మీరు గ్రేట్ బాస్ అసలు మీ సొంత ఐడెంటిటీ అనేదాన్ని పూర్తిగా చంపేసుకొని నేను ఫలానా హీరో యొక్క ఫ్యాన్స్ అనే గొర్రెల మందులో ఒకడిని అని ఒక గుంపులో కలిసిపోవడం ఎంత గొప్ప విషయం కదా ఇప్పుడు యాక్చువల్ పాయింట్ లోకి వద్దాం. ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడు చేయకొడతాడో తెలుసా ఎప్పుడైతే నా వల్ల కాదు నేను గెలవలేను నా బతుకు ఇంతే అని డిసైడ్ అయిపోతాడో అప్పుడు తన ఆశల్ని ఆశయల్ని తీసుకెళ్లి ఒక హీరో భుజాల మీద పెడతాడు.
(02:07) దీన్నే విచారియస్ లివింగ్ అంటారు. అంటే అద్ద బతుకు వాడు తింటే నీ కడుపు నిండినట్టు ఫీల్ అవ్వడం వాడు కొడితే నువ్వు గెలిచినట్టు ఫీల్ అవ్వడం మీకు అసలు సిగ్గు అనేది ఏమైనా ఉందా మీకు నిజం చెప్పనా నీకు సినిమా అంటే ఇష్టమో కాదు నీకు ఆ హీరో అంటే ప్రేమ కాదు నీకు కావలసింది పవర్ నీ నిజ జీవితంలో నీకు అసలు పవరే లేదు.
(02:29) ఆఫీస్ లో బాస్ తిడతాడు ఇంట్లో పెల్లం తిడతది నాన్న తిడతాడు సమాజంలో ఎవ్వడు నిన్ను పట్టించుకోడు. యు ఫీల్ పవర్లెస్ నీకు నువ్వు ఒక బలహీనుడిగా ఫీల్ అవుతున్నావ్. ఆ బలహీనతని కవర్ చేసుకోవడానికే థియేటర్ లోకి వెళ్లి వస్తావ్. ఆ అరుపు నీ ఆనందం కాదు అది నీ ఫ్రస్ట్రేషన్ ఆ హీరో 10 మందిని కొడుతుంటే నీ లోపల ఉన్న పిరికివాడు తృప్తి పడతాడు. అబ్బా నేను చేయలేంది మా అన్న చేస్తున్నాడు అని దీన్నే సైకాలజీలో ప్రొజెక్షన్ అంటారు.
(02:52) నీ అసంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఆ హీరో రూపంలో పూర్తి చేసుకోవడానికి ట్రై చేస్తున్నావ్. అంటే ఆ హీరో కేవలం ఒక బొమ్మ కాదు నీ ఫెయిల్యూర్ ని కప్పి పుచ్చుకునే కాస్ట్యూమ్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఆటోలో తిరిగి బస్సులో వేలాడి కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకెళ్లి కోట్లు సంపాదించే వాడి మీద వెదజల్లుతుంటే ప్రపంచంలో ఇంతకంటే పెద్ద జోక్ ఏదైనా ఉందా నువ్వు థియేటర్ దగ్గర పాలాభిషేకం చేస్తున్నావో వాడు ఫార్మ్ హౌస్ లో పాలరతి మేడలో ఎంజాయ్ చేస్తున్నాడు.
(03:18) నువ్వు ర్ాలీలో జెండా మోస్తున్నావో వాడు ఏసీ కార్లో కూర్చొని నీ వైపు చూసి నవ్వుకుంటున్నాడు. వాడికి నువ్వు మనిషివి కాదు నువ్వు కేవలం ఒక ఓటు లేదా ఒక టికెట్ అంతే అంటే వాడికి నువ్వు ఒక వస్తువు మాత్రమే వాడి పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతారు వాడి కోసం చొక్కాచించుకునే నువ్వు మాత్రం ఉద్యోగం రాక రోడ్ల మీద తిరుగుతుంటావు అయినా నీకు బుద్ధి రాదు మా హీరో మా అన్న అని అరుస్తావ్ నిస్వార్థం వేరు మూర్ఖత్వం వేరు ఫలితం ఆశించకుండా పని చేయడం వేరు పక్కోడి లాభం కోసం బానిసలా పని చేయడం వేరు నువ్వు త్యాగం చేయడం లేదు నిన్ను నువ్వు వృధా చేసుకుంటున్నావ్
(03:49) గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు వేస్ట్ చేస్తున్న ప్రతి ప్రతి నిమిషం రేపు నీ దరిద్రానికి పునాది రేపు పొద్దున నీ జాబ్ ఖాళీ అయినప్పుడు ఏ హీరో వచ్చి నీ అకౌంట్ లో డబ్బు లేయడు ఏ పొలిటికల్ లీడర్ వచ్చి నీ హాస్పిటల్ బిల్లు కట్టడం దిక్కు లేని చావ చేస్తావ్ అప్పుడు తెలుస్తది నువ్వు చప్పట్లు కొట్టింది వాళ్ళ విజయానికి కాదు నీ వినాశనానికి అని నీ గురించి నువ్వు ఆలోచించడం స్వార్థం కాదు బాధ్యత నువ్వు బాగుపడితే నీ కుటుంబం బాగుపడుతుంది నువ్వు బాగుపడితే ఈ సమాజం బాగుపడుతుంది.
(04:15) అంతే తప్ప ఎవడికో జయ కొడితే వాడి ఆస్తి పెరుగుతుంది తప్ప నీ జీవితంలో ఏది పెరగదు. ప్రతి సంవత్సరం మనం వార్తల్లో చూస్తుంటాం. హీరో పుట్టిన రోజుకో సినిమా రిలీజ్ కో 50 అడుగులు కటౌట్ కడుతూ పైనుంచి పడి చనిపోయిన కుర్రాళ్ళు ఎంతమంది కరెంట్ షాక్ కొట్టిన చనిపోయిన వాళ్ళు ఎంతమంది నువ్వు చనిపోతే ఏం జరుగుతుంది ఆ హీరో ఒక రెస్ట్ ఇన్ పీస్ అని ట్వీట్ చేస్తాడు.
(04:36) మహా అయితే లక్ష రూపాయలు పంపిస్తాడు. ఆ డబ్బుతో నీ తల్లిదండ్రుల కడుపు పంట చల్లారుతుందా నా కొడుకు తిరిగి వస్తాడా నా తల్లి ఏడుస్తుంటే ఆ హీరో చోదారుస్తాడా రాడు ఎందుకంటే వాడికి షూటింగ్ ఉంది వాడికి ఒక బిజినెస్ ఉంది. వాడికి నీ చావు కేవలం ఒక వార్త కానీ నీ కుటుంబానికి అది తీరని నరకం ఒక పరాయి వాడి కోసం ప్రాణాలు ఇస్తున్నావ అంటే నీ ప్రాణానికి విలువ లేదా లేక నీ ఇంట్లో వాళ్ళ కన్నీళ్లకే విలువ లేదా ఈ వీడియో చూసి నీకు కోపం వస్తే రాని చాలా మంచిది ఆ కోపాన్ని నా మీద కామెంట్స్ రూపంలో చూపించాలనుకుంటే చూపించు బట్ దానికంటే ఆ కోపాన్ని కసిగా మార్చుకొని
(05:10) దమ్ము ఉంటే నీ జీవితాన్ని మార్చుకో

No comments:

Post a Comment