Friday, April 24, 2026

 (603) (15.04.2026)

ఓ శ్రీమతి నీ కదలికలలో ఏదో మార్పు కనపడుతోంది 
చూడబోతే త్వరలో శుభవార్త వినిపిస్తావని అనిపిస్తోంది
ఆ రోజు కోసమే మీ-మా ఇంటిల్లిపాది ఎదురు చూస్తోంది
ఆ శుభవార్త నీ నోటి నుంచి వినాలని ఆ దేవుని వేడుకునేది //

నను పక్కకు పిలిచి మామిడికాయలు కావాలని అంటావు
మధ్యమధ్యలో చింతకాయలు తినాలని పిస్తోంది అంటావు
రాతిరి పూట సరిగా నిదుర పట్టడం లేదని అంటావు
ఆ శుభవార్త మటుకు చెప్పనంటావు //

నీవు ఎంత దాచినా వేవిళ్ళు చెబుతున్నాయి
నీవు వేసే అడుగులు చెబుతున్నాయి
నీ కనురెప్పలు చెబుతున్నాయి
చివరకు నీ శరీరంలో వచ్చే మార్పులు చెబుతున్నాయి //

పెళ్ళైన ఎన్నో ఏళ్ళకు అమ్మ అవుతున్నానని బాధపడుతున్నావా
ఇంత ఆలస్యంగానా పిల్లలను కనడం అంటారని ఆలోచిస్తున్నావా
ఆ దేవుడు మన నుదుట రాత ఆలస్యంగా రాసినాడు
రాసిన రాతను ఇన్నాళ్ళకు ఆ దేవుడు నిజం చేసినాడు //

ఇపుడే నీవు ఆనందంగా ఉండాలి
నీవు ఆనందంగా ఉంటూ మమ్మలను ఆనందంగా ఉంచాలి
ఈ సమయంలో మా అందరికి నీవు ముఖ్యము
మేమంతా కోరుకునేది నీ ఆరోగ్యము //

ఒక్క నాలుగు నెలలు ఓపిక పడితే పండంటి బిడ్డను కంటావు
ఆ బిడ్డను చూచిన ఆనందంలో ఇన్నాళ్ళు పడ్డ బాధలు మరుస్తావు
బిడ్డను చూడగానే నిను అన్నవాళ్ళ నోళ్ళు మూతలు పడతాయి
ఇన్నాళ్ళు నిను దూరం పెట్టిన వాళ్ళు అక్కున చేర్చుకుంటారోయి //

నీవు ఇన్నాళ్ళు ఎదురు చూచిన రోజు రానే వచ్చింది
పండంటి పాప మన ఇంట అడుగు పెట్టింది
నాడు నిను అన్నవాళ్ళే నేడు నిను చూడ వచ్చినారు
వాళ్ళ తప్పు తెలుసుకుని నిను క్షమాపణ కోరనున్నారు //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment