😂లుంగీ..🤣 లుంగోపాఖ్యానం 🤣
🤣నోరు తుడుచుకోడానికి కాగితం అక్కర్లేదు,
చెయ్యి తుడుచుకోడానికి రుమాలక్ఖర్లేదు,
ఒళ్ళు తుడుచుకోడానికి తువ్వాళఖ్ఖర్లేదు.
గుడి లేని గుడ్డ లుంగీ.
🤣ఎండాకాలం గాలికి,
చలికాలం విప్పేసి కప్పుకోడానికి,
వానాకాలం వెనకనుంచి నెత్తిమీద కప్పుకోడానికి ,
ఋతువు లేని ఋజువు లుంగీది.
🤣నిక్కరు కనిపించేలా కడితే బస్తా ఎత్తడానికి,
మోకాళ్ళ వరకు కడితే వంట చెయ్యడానికి,
చీల మండ వరకు వదిలేస్తే పెద్దరికం చెయ్యడానికి,
ఉద్యోగాలని మించిన ఉనికి లుంగీది.
🤣మలయాళీలు ఎగ్గట్టి మారథాన్ పరిగెట్టేస్తారు,
తమిళులు మడిచి కత్తి దూస్తారు,
తెలుగోళ్లు కాలితో ఎత్తి అంచు పట్టుకుని వెనక సుమోలు లేపేస్తారు,
దక్షిణ భారత దమ్ము లుంగీది.
🤣బస్తా ఎత్తిన తలపై తలపాగాలా,
భారమైన బిందె కింద సుమ్మలా,
పదునైన పేక కింద పరుపులా,
చేదోడు వాదోడు లుంగీది.
🤣బకెట్టులో మిగిలిన సబ్బునీళ్లలోనే స్నానం చేసి,
బీరువాలో కదలని భారమైన చీరల అడుగున ఇస్త్రీ అయ్యి,
తను చుట్టే నడుము ఎన్ని ఇంచీలని ఎంచని,
త్యాగాల తనువు లుంగీది.
🤣ఒకసారి చిరిగితే కుట్టించి వాడొచ్చు,
ఇంకొన్ని సార్లు చిరిగితే ద్వారం దగ్గర పడెయ్యొచ్చు,
ఇంకా చిరిగితే మసిగుడ్డ గా మార్చెయ్యొచ్చు ,
పునర్వినియోగ పద్ధతికి ముందు పుట్టిన చరిత్ర లుంగీది.
*లుంగీని, దాన్ని కట్టిన వాళ్ళని చిన్న చూపు చూసిన వాళ్ళని,
ఆ కాళోజి,
"లుంగీకట్టుట రాదంచు సకిలించు తెలుగోడా చావెందుకురా", అని
ఆ గురజాడ,
"లుంగీ కట్టని వాడు దున్నపోతై పుట్టున్", అని శపించేవారు.
సంకలనాలు దాటిన సాహిత్యం లుంగీది.........
No comments:
Post a Comment