A fwd from vasireddy amarnath: intinti ramayanas: ఆడ పెత్తనం - మగ పెత్తనం !
ముప్పై ఏళ్ళనాడు మేము చూసిన రెండు కుటుంబాలు .
ఒకటో కుటుంబం ..
అప్పటికి భార్యా భర్తలు.. 40 లో ఉండేవారు . ఇద్దరు పిలల్లు . ఆయన మంచి ఉద్యోగం చేసేవారు . పొదుపు .. తెలివయిన పెట్టుబడి . ఒక మాదిరి ఆస్తులు సంపాదించారు . అమ్మాయి మంచి బడిలో .. అబ్బాయి కాలేజీ లో . పండంటి కాపురం అంటే ఇదే కదా అనుకొన్నాను .
సీన్ కట్ :
ఇప్పుడా కుటుంబం .
పెద్దాయన కరోనా లాక్ డౌన్ సమయంలో చనిపోయారు . ఎంతో బతుకు బతికిన ఆయన చివరి పయనం అనాథలా .
కొడుకు వయస్సు యాభై కి దగ్గర్లో .
ఉద్యోగం లేదు .
వీడి ప్రవర్తన భరించలేక భార్య తన కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది .
ఇప్పుడు వీడు ఒంటిగా ఒక ఫ్లాట్ లో. అయిన కాడికి అప్పులు చేసి పొద్దు నుంచి రాత్రి దాక తాగడం .. ఇంట్లో టీవీ కుర్చీలు కూడా లేవు . కారణం అప్పులు ఇచ్చిన వారు తన్ని అవన్నీ ఎత్తుకొని వెళ్లిపోయారు .
కూతురు .. రెండు సార్లు పెళ్లి .. విడాకులు . ఇప్పుడు ఏదో జాబ్ చేస్తోంది . ఒంటరి జీవితం .
పెద్దాయన భార్య ఇప్పుడు కొత్త ఇల్లు తీసుకొని అజ్ఞాతం లో గడుపుతోంది .
కారణం కొడుకు కు అప్పులు ఇచ్చిన వారు ఇంటికొచ్చి బూతులు తిడుతున్నారు .
కొత్త ఇంట్లోకి వచ్చినా ... ఎలా కనిపెట్టారో తెలియదు .. అక్కడికి కూడా వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు . కొడుక్కి నాకు సంభంధం లేదు అని చెబుతోంది .పండంటి కుటుంబం సర్వ నాశనం .
రెండో కుటుంబం కథ .
ముప్పై ఏళ్ళనాడు భార్య భర్త 30 లో ఉండేవారు .
కూతురు కొడుకు ..
చిన్న పిల్లలిద్దరూ ఇద్దరు చక్కగా చదివే వారు.
సీన్ కట్ .
ఇప్పుడు ఆ కుటుంభం :
భార్య కొన్నేళ్ల క్రితం ఉరి వేసుకొని చనిపోయింది .... లేదు భర్త చంపి ఉరి వేసుకున్నట్టు డ్రామా ఆడాడు అని టాక్ . నిజానిజాలు తెలియదు .
భార్య పోయాక వాడు రెండో పెళ్లి చేసుకొన్నాడు .
కొన్నేళ్లకు కొడుకు .. కాలేజీ వయస్సులో ఉరి వేసుకొని చనిపోయాడు . కారణం సరిగ్గా తెలియదు .
సవతి తల్లి వేధింపులా ? తండ్రి సాధింపా ? తల్లి నుంచి వచ్చిన ఉరి ప్రేరణా ?
తెలియదు .
కారణం... వారు ఎన్నో ఏళ్ళ క్రితమే హైదరాబాద్ వదిలి చెన్నై కి వెళ్లి పోయారు .
ఇటీవలే భర్త కాన్సర్ తో పోయాడు .
కూతురు ఒక్కటి మిగిలింది . ఆమె బాగా చదువుకొని సెటిల్ అయ్యింది పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేస్తోంది .
ఒకటో కుటుంబం లో అందరూ నాశనం ..
కూతురు మాత్రం ఒంటరి జీవితం గడుపుతోంది .
రెండో కుటుంబం లో కూతురు హ్యాపీ . డాక్టర్ అయ్యింది . చక్కటి ఫామిలీ . మిగతా ముగ్గురు మట్టిలో కలిసిపోయారు .
ఏమయ్యింది ?
ఒకటో కుటుంబం
ఆడ పెత్తనం .
పెద్దాయన మంచోడు .
భార్యంటే అమితమయిన ప్రేమ .
ఆమెకేమో పుట్టింటి పై ఎన లేని ప్రేమ .
తన తండ్రి చేసిన అప్పులు భర్త ద్వారా తీర్చింది .
తమ్ముడిని ఇంట్లోకి తెచ్చుకొని పెంచింది . వాడు దారి తప్పాడు . పెళ్లి చేస్తే మారుతాడని సొంత కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది . నెలల్లో విడాకులు .
సాధింపు ..
తాను ఏమి చెప్పినా భర్త వినాలి .
లేకపోతే రాద్ధాంతం .
ఇంటి పోరు ఇంతింత కాదయ్యా .. చెప్పు లోన రాయి .. చెవిలోని జోరీగ .. పెద్దాయన భరించాడు.
ఇంటి గుట్టు ఎవరికీ తెలియకుండా పరువు కాపాడుకున్నాడు .
రిటైర్మెంట్ ..
ఆఫీస్ కు పొతే అదో ఉత్సాహం . తాను ఉన్నతాధికారి . నిజాయతీ పరుడు . రిటైర్ అయ్యాక 24 గంటల కొలిమి . ఇప్పుడు భార్య తనను కొట్టడం కూడా మొదలు పెట్టింది .
తాను కష్టపడి పైకొచ్చాడు .
ఉద్యోగం .. ఇల్లు .. సిటీ కి దగ్గర్లో పొలాలు .
అన్నీ హ్యాపీ . కానీ కొడుకు బతుకు నాశనం .
కూతురు మాత్రం ?
ఏదో బతుకుతోంది అన్న మాటే గానీ రెండు సార్లు విడాకులు . ఒంటరి జీవితం .
ఇంట్లో భార్య పోరు ..
నా బతుకిట్ల ఎందుకు తగలపడి పొయ్యింది అనుకొన్నాడు .
ఏడ్చాడు . ...
చివరకు డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడు .
చివరి రోజులు నరకం .
కరోనా వచ్చి పుణ్యం కట్టుకొని ఆయన్ని తీసుకొని వెళ్లి పోయింది .
తల్లి పెంపకం సరిగ్గా లేక పొతే కుటుంభం ఎలా తయారవుతుందో చూడు .. అని ఇప్పుడు వీరి గురించి నలుగురూ అనుకొంటున్నారు .
రెండో కుటుంబం .
మగ దౌష్టీకం
ఆడో శాడిస్ట్ .
పురుషాహంకారానికి ప్రతీక .
భార్య తాను "సిట్" అంటే సిట్ "స్టాండ్" అంటే స్టాండ్ .
తాను ఇంట్లో ఉంటే ఆమె సోఫా లో కూడా కూర్చో కూడదు .
పెళ్ళాం అంటే బానిస .. వంట చేయడం .. పిల్లల్ని కనడం పెంచడం .. అంత వరకే .
వాడి పోరు పడలేక ఉరి వేసుకొందో లేక వాడే ఉరేసి చంపాడో .. రెండో దానికి ఛాన్స్ ఎక్కువ . డబ్బుతో పోలీస్ లను మానేజ్ చెయ్యడం వాడికి ఈజీ .
తల్లి దారిలోనే కొడుకూ పొయ్యాడు . డిప్రెషన్ కారణం అన్నారు .
ఇప్పుడు శాడిస్ట్ గాడూ కాన్సర్ తో పోయాడు .
ఇవి కథలు కావు .. నిజ జీవిత వ్యధలు .
వీటి గురించి శ్రీమతి ఉష విశ్లేషణ .
ఆంటీ { మొదటి కుటుంబం లో పెద్దామె } చేసిన పాపాలు ఆ కుటుంబానికి శాపం అయ్యింది . పుట్టింటి పై ప్రేమ సహజం . కానీ అంత నా ? తమ్ముడు వెధవ అని తెలిసి కూడా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది . అంకుల్ సంపాదించిన ఆస్తి మొత్తం పుట్టింటికి దారపోసింది . అంకుల్ చాలా మంచోడు .
కానీ వెన్నెముక లేనోడు . పెళ్ళాం ఏమి చెప్పినా కాదనక చివరకు అనాథలా పోయాడు .
ఆంటీ పెంపకం .. పిల్లలిద్దరూ దారి తప్పారు .
రెండో కుటుంబం గురించి ..
వాడు పెద్ద వెధవ . వాడు చేసిన పాపాలకు మొత్తం కుటుంభం నాశనం .
దేవుడు వాడికి చివరకు కాన్సర్ చావు ఇచ్చాడు .
వంశంలో ఎవరో చేసిన పుణ్యమో ఆ అమ్మాయిని కాపాడింది
శ్రీమతి ఉష గారి విశ్లేషణలు ఎప్పుడూ సెంటిమెంటల్ గా ఉంటాయి .
నా ఫేస్బుక్ ఫాల్లోవెర్స్ గా మీరేమంటారు ?
రెండు కుటుంబాల నాశనానికి కారణం ఏంటి ?
పాపలా ?
శాపాలు ?
అడ పెత్తనమా ?
మగ పెత్తనమా ?
కాలక్షేపం కాదు ..
ఈ రెండు కుటుంబాల ట్రాజిక్ స్టోరీ నుంచి మనం ఏమి గ్రహించాలి ?
ఒకటో కథలో పెద్దామె... ఉన్న ఆస్తిని అమ్మి కొడుకు చేసిన అప్పులు కట్టేస్తే వాడు బాగుపడుతాడా ?
ఇరవై - ముప్పై ఏళ్లలో మాకు తెలిసిన... డజను కుటుంబాలు ఇలా తగలడబడి పోయాయి .
మొన్న మేడపై అద్దాల గదిలో డిన్నర్ చేస్తూ నాకు శ్రీమతి ఉష కు మధ్య చర్చ .
ఎందుకు? ఎందుకు ? అని .
అమేమో అన్నిటిని ... దేవుడికి ... ఖర్మకు ముడి పెట్టేస్తుంది .
యత్నం ప్రయత్నం దైవ అన్నారు కదా . గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎలా ?
సామజిక తెలివితేటలు .. ఎమోషనల్ ఇంటలిజెన్స్ .. సంపూర్ణత... అంటూ నా ఆలోచనలు .
పోస్ట్ లో చివరిగా ఒక్క మాట .సమాజానికి మించిన గ్రంధం లేదు . సమాజన్ని చదివిన వాడు విజేత .
శుభోదయం !
No comments:
Post a Comment