Friday, April 24, 2026

 *పాపాన్ని పుణ్యం చేత  తగ్గించడం సాధ్యం కాదా?*

ఇది చాలామందికి ఒక పెద్ద సందేహం,
అలా సాధ్యం కాదు, ముళ్ళ మొక్కల బీజాలనూ, పళ్ల మొక్కల బీజాలనూ కలిపి ఎంత బాగా గిలక రించి విత్తి నప్పటికీ, ముళ్ళ విత్తనం ముళ్ళమొక్కగానే, పళ్ల విత్తనం పళ్ల మొక్క గానే పెరుగుతుంది.

*అట్లయితే మరి దీనికి పరిహారము లేదా?*

వుంటుంది, అది ఎలా అంటే, మీ ఆదాయంలో దానధర్మాలకు ఖర్చు పెడితే, అంతమేరకు ఇన్కంటేక్స్ వారు  పన్ను తక్కువ చేస్తారు, అట్లే, ఇక్కడ మనస్సు పెట్టి నామస్మరణ చేస్తే ఇంత, నామ జపం చేస్తే మరికొంత, లిఖిత జపం చేస్తే ఇంకా కొంత, ధ్యానం చేస్తే ఇంత అని తగ్గిస్తారు. 

అయితే పూర్తిగా తక్కువ అవదు, మిగిలిన ది అనుభవించాలి,
 భక్తుడు  :అట్లయితే మీ దర్శనం వలన మాకు కలిగే ప్రయోజనం  ఏమిటి? 

ఉరిశిక్ష పడిన ఖైదీ కి క్షమాభిక్ష రాష్ట్ర పతి ప్రసాదిఁచవచ్చు. 
జీవిత ఖైదీగా మార్చవచ్చు. అవతార మూర్తి యొక్క అనుగ్రహం, దుష్కార్యముల ఫలాల తీవ్రతను తగ్గిస్తుంది.

No comments:

Post a Comment