Friday, April 24, 2026

 మనలో అధిక సంఖ్యాకులు దైవము నుండి విలువలేని వాటిని పొందటానికి ప్రార్థిస్తుంటారు.

*ప్రాపంచిక సుఖ సంతోషాలూ, వ్యాధి నివారణలూ, ఉద్యోగాభివృద్ధులు ఇవన్నీ ఆకర్షణీయంగా కనిపించే కాకిబంగారపు నగలు.

*కానీ దైవము   మనకు మోక్షం అందించుటకు సంకల్పించాడు. అయితే దానిని కోరువారు మనలో 
అతి కొద్దిమంది మాత్రమే!

*దైవమును మనల్ని రక్షించే వస్తువును అడిగి అందుకోవాలి తప్ప మనలను బంధించే విషయాలు కోరుకోకూడదు. 

*ఒక వెయ్యి ప్రాపంచిక విషయాల కోసం దేవుని అడుగుతుంటాము తప్ప తనను కావాలని అడిగేవారు చాలా అరుదు.

*ఇలాంటివారు ఏనాటికీ భక్తులు కాలేరు! భగవంతుని తప్ప ఇంక దేనినీ కోరనివాడే నిజమైన భక్తుడు.

*మేము శివభక్తులమనీ, రామభక్తులమనీ, కృష్ణభక్తులమనీ మనకు మనము చెప్పుకుంటున్నాము కానీ ఆయన కూడా మనల్ని తన భక్తులుగా అంగీకరించాలి కదా!

*మనము భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులమై ఆయన యొక్క ఉపకరణాలుగా అయితే తప్ప మనము తన భక్తులమని చెప్పుకొనే అర్హత మనకు కలుగదు.
.

No comments:

Post a Comment