Friday, April 24, 2026

 జనం అంటుంటారు ధరలు పెరిగాయని...కాదు సార్.... ఖర్చులు పెరిగాయని చెప్పరు.. 
అప్పట్లో పిల్లలకు సెలవులిస్తే, అమ్మమ్మ గారి ఇంట్లో గడిపేవారు.. మరి ఇప్పుడు,  తల్లితండ్రులుతో.. గోవాలోనో, మనాలి లోనో  వేలు, లక్షలు ఖర్చుపెట్టి గడుపుతున్నారు..ధరలు పెరగలేదు సార్...ఖర్చులు మాత్రమే పెరిగాయి., కాదు కాదు.....నువ్వు ఖర్చులు పెంచుకున్నావు..గతంలో జనాలు మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళేవారు!
కానీ ఇప్పుడు..... రెండడుగుల దూరం వెళ్లాలంటే క్యాబ్ బుక్ చేస్తున్నారు!! ధరలు పెరగలేదు..నువ్వు  ఖర్చులు పెంచుకుంటున్నావు. అప్పట్లో సెలవులలో సకుటుంబ, సపరివార, సమేతంగా ఇంట్లో కూర్చుని భోజనం చేసేవారు! కానీ ఇప్పుడు..... వారాంతలలో (Weekends లో) కుటుంబమంతా రెస్టారెంట్ల లలో కనిపిస్తున్నారు! లేదా...  స్విగీ లేదా జొమాటో ను ఆశ్రయిస్తున్నారు!!
ధరలు పెరగలేదు..నువ్వు ఖర్చులు పెంచుకున్నావు.
అప్పట్లో ఏటా రెండంటే రెండులేదా మూడు జతల బట్టలు కొనేవాళ్ళం!
మరి ఇప్పుడు..... నెలలో రెండు, మూడు సార్లు ఆన్లైన్ లో షాపింగులు, మాల్స్ లో ఆఫర్ ప్యాకింగులు!!    ధరలు పెరగలేదు సార్.. నువ్వు ఖర్చులు పెంచుకున్నావు.అప్పట్లో ఒక్క T.V..తో వీధి వీదంతా జనం గడుపుతూ ఆనందించే వారు.. ఒక్క DD తో కుటుంబం మొత్తానికి కాలక్షేపంగా వుండేది!మరి ఇప్పుడు..... Netflix, Amazon prime మాయలో పడిపోయింది లోకం. అప్పట్లో 25 పైసల లెటర్ కోసం కుటుంబమంతా ఎదురు చూసేవారు.. ఆ లేఖ తో ఇంట్లో అందరికీ పండగ వాతావరణం వచ్చేది! మరి ఇప్పుడు..... కుటుంబంలోని అందరి చేతుల్లో (పిల్లలతో సహా) సెల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి..అప్పట్లో పిల్లలందరూ కోతికొమ్మచ్చి, బంతాట, కర్రా బిళ్ళ, వంగుల దూకుళ్ళు లాంటి ఆటలాడేవారు పిల్లలందరూ హుషారుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ లోనే గేములు ఆడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు..అప్పట్లో స్కూలు దగ్గరికి వచ్చే ఐదు పైసల పుల్ల ఐసు కోసం ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు కోరినవన్నీ కొని తిన్నా కూడా ఇంకా ఏదో వెలితి కనపడుతోంది. ధరలు పెరగలేదు సార్..నువ్వ ఖర్చులు పెంచుకున్నావు. అంతే...
ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో ......అందుకే మళ్ళీ చెప్తున్నా.....ధరలు పెరగలేదు  సార్. ఖర్చులు పెరిగాయి..అంతే గోత్తెమ్మ కోర్కెలు పెరుగుతున్నాయి.. విందులు, వినోదాలకు అలవాటు పడ్డారు.. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి, అప్పులు పాలవుతున్నారు సార్ 😭..

No comments:

Post a Comment