Monday, April 13, 2026

1884. ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోవాలి ???

1884. ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోవాలి ???

Author Name:divine planet - Designing lives with divinity.

Youtube Channel Url:https://www.youtube.com/@divineplanet-designinglive1681

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gheKOqlr2yY



Transcript:
(00:01) శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది ఆ ప్రశ్న అసలు మంచిగానే ఎందుకు బ్రతకాలి మీరు అన్యశీర్షికలలో మంచిగా బ్రతకడమే ఆధ్యాత్మిక సాధన అని చెబుతున్నారు మంచిగానే ఎందుకు బ్రతకాలి అసలు ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకోకుండా మామూలుగా జీవిస్తే ఏమవుతుంది వివరించగలరు ప్రశ్నని మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వీరు అడుగుతుంది అసలు ఆధ్యాత్మికము అనేటువంటి విషయాలను ఎందుకు
(00:47) తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏమవుతుంది మామూలుగా జీవించేయొచ్చు కదా అలాగే మంచిగానే ఎందుకు బతకాలి మనకు నచ్చినట్టు బ్రతికేయొచ్చు కదా మంచిగా బ్రతకపోతే ఏమవుతుంది మంచిగా బ్రతకమని ఎందుకు చెబుతున్నారు మంచిగా బ్రతకడమే ఆధ్యాత్మిక జీవితం అని ఎందుకు చెబుతున్నారు ఇదండి వీరి ప్రశ్న ఇక్కడ ప్రశ్న వేసిన వారి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు ప్రశ్న ఇలాగే వేశారు ఒకవేళ సదుద్దేశంతో అంటే అసలు మంచిగా బతకపోతే ఏం పోతుంది ఎలా పెడితే ఎలా బ్రతకొచ్చు కదా అనేది ఒకవేళ ప్రశ్న వేసిన వారి జీవన విధానం అయితే మనం చేయగలిగింది
(01:35) ఏమ లేదు. ఎందుకంటే చాలామంది ఎలా పెడితే అలాగే బ్రతుకుతున్నారు. ప్రపంచంలో చాలామంది ఎలా పెడితే అలాగే బ్రతుకుతున్నారు. బహుశా ఇది చెప్పుకుంటున్న మనం కూడా అలాగే బ్రతుకుతా ఉండి ఉండవచ్చు కొంత ప్రయత్నించుకుంటున్నాం మనని మనం మార్చుకుందాం అని ఎలా పెడితే అలా అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా బ్రతుకుతున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోవాలి? అంటే అసలు ఆధ్యాత్మికత అనేది ఒక ప్రత్యేకమైన విషయం కాదు అది ఒక పేరు పెట్టారు అంతే ఓ మనిషి పుట్టాడు బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ పుట్టాడు అన్నాం లేదా స్త్రీ అయితే
(02:22) ఆడపిల్ల అయితే బిడ్డ పుట్టింది అన్నాం పేరేమ లేదు అక్కడ బిడ్డ అంతే పుట్టినప్పుడు బిడ్డ తర్వాత మనం గుర్తింపుగా పేరు పెట్టుకున్నాం పేరు ఎందుకు పెట్టుకున్నాం అంటే గుర్తు గుర్తింపుకు పెట్టుకున్నాం ఫలానా అని అలాగే గుర్తింపుకి కులాలు మతాలు జాతులు ఈ వ్యవస్థ అంతా ఏర్పడిందంతా గుర్తింపుకే ఎక్కడ ఏ పేరుతో మనం మాట్లాడుకున్న భాషా పదాలు ఏం చెప్పుకుంటున్నాం అవన్నీ కేవలం గుర్తింపుక వచ్చినాయి కానీ అక్కడ ఉన్నవి ఈ పేర్లు కాదు ఇప్పుడు మానవ జాతి పేరు పెట్టుకున్నాం వాళ్ళు మనుషులు మనుషులు అని పేరు పెట్టుకున్నాం చెట్లు చెట్లు అని పేరు పెట్టుకున్నాం
(03:05) వాటిని చెట్లే అనాల అంటే మనం గుర్తింపు కోసం పెట్టుకున్నాం ఆ ఆకృతిలో ఉన్న వాటిని చెట్లు అనుకుందాం అని ఈ ఆకృతుల్లో ఇలా ఉన్నవాళ్ళని మానవులు అనుకుందాం అని ఈ పేర్లు పెట్టుకోకపోతే పేర్లు నిజం కాదు పేర్లు అసత్యమే సత్యం కాదు కానీ అసత్యం అనే ఈ పేర్లు లేకపోతే అక్కడ సత్యం ఎవరు మనిషి బిడ్డ పుట్టడం బిడ్డ ఉండటం మనిషి ఉండటం చెట్టు ఉండటం అలా సృష్టిలో అన్ని ఉండటం ఉన్నన్నిటి కి ఒక మనిషి మధ్య ఇంకొక మనిషికి మనుషుల మధ్య కమ్యూనికేషన్స్ కి భాష అనేది అవసరమైంది భావ వ్యక్తీకరణ అనేది మనిషిలో ఉన్నది అది సృష్టి ఏర్పాటు అంటే ఒక మాట ఉంది మనకి ఈ
(03:50) మాటని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే భాష తయారు చేసుకున్నాడు మనిషి అలా అనేక భాషలు వచ్చినాయి ఇక్కడ భాషలు నిజం కాదు అక్షరాలు నిజం కాదు పేర్లు నిజం కాదు అక్కడ ఉన్న విషయాలు నిజం సృష్టిలో ఉన్నన్ని నిజం ఆ నిజాన్ని చెప్పాలి అంటే దానికి ఒక పేరు పెట్టుకున్నాడు ఆ పేర్లు అవన్నీ దానికి దాన్ని సూచించేవే తప్ప సత్యాలు కాదు ఆ విషయాన్ని సూచించేవి కానీ పేర్లు లేకపోతే భాష లేకపోతే భావ వ్యక్తీకరణ అలా కుదురుతది.
(04:24) అది కమ్యూనికేట్ అంటే మనుషులు కలిసి జీవించడానికి అనువుగా భాష ఉపయోగపడుతది కమ్యూనికేషన్ కన్నా కమ్యూనికేషన్ కోసం భావ వ్యక్తీకరణ కోసం కలిసి బ్రతకడంలో ఒకరి అభిప్రాయాలు ఒకరికి ఒకరి భావాలు ఒకరికి తెలియడం కోసం భాష ఉపయోగపడుతుంది తప్ప భాష సత్యమే కాదు పేర్లు సత్యమే కాదు ఇవన్నీ మనిషి తయారు చేసుకున్నవి అందుకే అనేక భాషలు ఎవరి ఇష్టం వచ్చిన భాషలు తయారు చేసుకున్నారు అనేక భాషలు మాట్లాడుకుంటా ఉంటారు ఎవరి ఇష్టం వచ్చిన భాషలు మాట్లాడుకుంటా ఉంటారు.
(04:59) కానీ భాషా పదాలలో పెట్టుకున్న పేర్లు ఒకే వస్తువుని సూచించేటువంటి పేర్లు అనేకం పెట్టుకున్నారు. అందుకని భాషలు మారేటప్పటికి డిక్షనరీలు తయారు చేసుకున్నారు. ఎందుకని అంటే ఈ భాషలో ఈ చెట్టుని ఇలా పిలుస్తున్నారు ఈ భాషలో ఈ నీళ్ళని ఇలా పిలుస్తున్నారు అప్పుడు మన భాషలో ఎలా పిలవాలి లేదా మన భాషలో ఇలా పిలుస్తున్నాం ఆ భాషలో వాళ్ళు దీన్ని ఏమన్నారు అనటానికి భాషా పదాల డిక్షనరీని తయారు చేసుకున్నారు.
(05:28) అంటే ఈ భాషలో ఆ చెట్టుని ట్రీ అన్నారు ఇంగ్లీష్ భాషలో తెలుగులో చెట్టు అంటున్నాం అప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ డిక్షనరీలు వచ్చినయి అలా అన్ని భాషలకు వచ్చినయి అన్ని విషయాలకు వచ్చినయి బాల వ్యక్తీకరణని అనేక భాషల్లో వ్యక్తీకరిస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ డిక్షనరీలు వచ్చినాయి అదే ప్రాపంచిక చదువుగా కూడా తయారయింది.
(05:50) ప్రాపంచిక చదువులు అలాగే వచ్చినయి అనేక భాషలను చదువుకుంటున్నారు. అనేక భాషలలో భావ వ్యక్తీకరణలు చదువుకుంటున్నారు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలకు అవసరమైన విషయాలు చదువుకుంటున్నారు అన్ని ప్రాపంచిక విషయాలు ఇవన్నీ మొత్తం అసత్యములే నిజములు కాదు కానీ ఇక్కడ జీవించడానికి అది వ్యావహారిక సత్యముగా మనిషి ఏర్పాటు చేసుకున్నాడు.
(06:15) కానీ మూల సత్యం సృష్టిలో ఉన్న మూల వస్తువులు మూల విషయాలు దానికి పేర్లు పెట్టుకున్నాడు ఇప్పుడు పర్వతాలు అన్నాం అనుకోండి అవి అక్కడ ఉన్నాయి వాటిని ఎలాగల సంబోధించాలిగా పర్వతాలు అన్నాం అలాగే నదులు సముద్రాలు ఇవన్నీ పేర్లే పంచభూతాలకే పేర్లు పెట్టుకున్నాం ఆకాశము గాలి తేజస్సు లేదా సూర్యుడు సూర్యరశ్మి అగ్ని నీరు భూమి ఇలా అంటే ఏంటి ఉన్నవి ఉన్నవాటికి పేర్లు పెట్టుకున్నాం అలాగే ఆధ్యాత్మికత అనేది పెట్టుకోబడిన పేరే ఉన్నదానికి కొత్తగా మీరు దేన్ని తెలుసుకోవట్లేదు అసలు ముందు ఆ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికత అనేది ఇక్కడ ఉన్నటువంటి
(07:01) సత్యము పూర్తిగా మనిషికి సంబంధించిన సత్యము అందుకే ఆధ్యాత్మికత మళ్ళీ ఇంకా ఇతర దేనికి సరిపోదు దేనికి సంబంధించింది కాదు అసలు దేనికి తెలియదు ఆధ్యాత్మికత ఒకటి ఉందని మానవ సమూహంలో దాన్ని పాటిస్తున్న వాళ్ళకే తెలుసు అది కూడా ఆ మార్గంలో వెళ్లే వాళ్ళకే తెలుసు మిగిలిన వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు అసలు ఎందుకు తెలుసుకోవాలి మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం మంచిగానే ఎందుకు బతకాలి అని మామూలుగా బతికేస్తున్న వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత అనే పదం కూడా తెలియదు.
(07:36) ఆధ్యాత్మికత అనేది మనిషికి సంబంధించినటువంటి సంపూర్ణతను తెలియజేసేటువంటి ఒక సత్యము అది ఇక్కడ ఉంది సత్యము ఉన్న సత్యాన్నే చెప్పుకుంటున్నాం అయితే మరి దాన్ని ఆధ్యాత్మికత అని ఎందుకు అంటున్నామ అంటే సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా మనిషి జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను మనిషిని మనిషి అంటే ఈ శరీరాన్ని ఈ శరీరం ఇదిగో ఈ తల్లిదండ్రులకు పుట్టింది అక్కడి నుంచి ఇలా పెరిగింది ఇదిగో ఇలా పెరిగాను ఇలా తింటున్నాను తాగుతున్నాను తిరుగుతున్నాను నాకు నచ్చినవి చేసుకుంటున్నాను నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాను నాకు ఇష్టం వచ్చినవి
(08:15) చేస్తున్నాను అన్ని నాకు ఇష్ట ప్రకారం ఎలా పడితే అలా బతుకుతున్నాను మంచి లేదు చెడు లేదు నాకు అప్పుడు ఉన్న అవకాశాన్ని బట్టి చెడైతే చెడు చేస్తున్నాను మంచి అయితే మంచి చేస్తున్నాను ఇలా బ్రతుకుతూ వెళ్ళ చనిపోతున్నాను బతికి బతికి బతికి చనిపోతున్నాను చనిపోవడానికి ముందు ప్రపంచంలో అనేక రకములైనటువంటి దుఃఖములకు బాధలకు అసంతృప్తులకు అశాంతికి లోనవుతున్నాను.
(08:41) ఈ మధ్య మధ్యలో సుఖములు ఆనందములు సంతోషములు కూడా వస్తున్నాయి. నాకు ఎప్పుడూ సుఖములు సంతోషములు ఆనందములు కావాలన్న కోరిక ఉంది కానీ నేను ఎప్పుడు అశాంతికి దుఃఖానికి బాధకి కూడా లోనవుతున్నాను. ఇలా జీవించి చనిపోతున్నారు అసలు ఎందుకు తెలుసుకోవాలి ఆధ్యాత్మికం అంటే తెలుసుకోపోతే ఇలా జీవించి చనిపోతాం. నేను ఎందుకు దుఃఖ పడుతున్నానో నాకే తెలియదు నేను ఎందుకు బాధపడుతున్నానో నాకే తెలియదు.
(09:10) తెలియదు అంటే దీనికి కారణాలన్నీ ఎదుట నాకు ఏమి లభించకపోవడం ప్రపంచంలో నేను కావాలన్నవన్నీ పొందలేకపోవటం నేను పొందటానికి ఎవరో అడ్డుపడిపోవడం లేదా ఎవరు నన్ను బాధలకు గురి చేయడం లేదా ప్రపంచంలో అందరూ అన్ని నాకు అనుకూలముగా లేకపోవటం అని ఎదుటివారి మీద నిందలు చేసుకుంటూ బతికేస్తున్నాం మంచో చెడో చేస్తున్నాం మంచి చేస్తే పర్వాలేదు మంచి ఫలితాలే వస్తాయి కాబట్టి అది ఆనందంగా హాయిగా శాంతిగా గడిచిపోతుంది చెడు చేసినప్పుడు తిరిగి చెడు ఫలితాలు వస్తాయి కానీ తిరిగి చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఎవరు చెప్పట్లేదు తెలియదు అదే ఆధ్యాత్మికత అది చెబుతుంది.
(09:47) అలాంటి చెడుటాలో వచ్చితే గన అది అద్భుతం కాదు ఇప్పుడు ఎవరినైనా తిట్టినప్పుడు మనం ఎవరినైనా తిట్టాం తిరిగాళ్ళ మందిని తిడతారు కానీ మనని పొగిడి మనకి నమస్కారాలు పెట్టి మనకి దండాలు పెట్టి మనల్ని గౌరవంగా చూస్తారా అది సింపుల్ అదే ఆధ్యాత్మికం అండి అంతకుమించి అందులో విషయం ఏమ లేదు ఇంకా అసలు అంతకుమించి సబ్జెక్ట్ లేదు అందులో కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఒక ఉన్న సత్యాన్ని చెబుతుంది అంతే అక్కడ ఉన్న సత్యాన్నే చెబుతుంది నువ్వు అందరితో మంచిగా ఉన్నావ అనుకో నీతో కూడా అందరూ మంచిగా ఉంటారు.
(10:22) నువ్వు అందరితో చెడ్డగా ఉన్నావ అనుకో నీతో కూడా అందరూ చెడ్డగా ఉంటారు నువ్వు ఎప్పుడు మంచిగా ఉంటే అప్పుడు మంచిగా ఉంటారు నువ్వు ఎప్పుడు చెడ్డగా ఉంటే అప్పుడు చెడ్డగా ఉంటారు అది ఏ విషయంలోనా అంతే నువ్వు చెడు చేస్తే నీకు చెడు వస్తది. అనేది మనిషి తన సుఖం కోసం చెడు చేసుకుంటా నేను సుఖాన్ని పొందుతాను మోసం చేసి తీసుకున్న చెడు చేసినా కొట్టిన తిట్టిన బలంతో లాక్కున్నా నేను సుఖాన్ని పొందడం కోసం లాక్కుంటున్నాను అనుకుంటున్నాడు ఓకే అది అప్పటికి తాత్కాలిక సుఖం నీకు కుదిరింది కాబట్టి నీకు ఇప్పుడు దొంగతనం చేయడానికి కుదిరింది కాబట్టి తాత్కాలిక సుఖం పొందేసావు దొంగతనం చేసావు
(10:59) అవి తినేసావు తాగేసావు ఆనందించేసావు ఇప్పుడు నాకు ఇంకేమంది కర్మ ఎక్కడ లేదు అనుకుంటాం కానీ తర్వాత నిన్ను పోలీసులు కొట్టుకున్నారు ఈ విషయాన్ని నువ్వు ఊహించట్లే నీ దొంగతనాన్ని చేదించి పోలీసులు కొట్టుకున్నారు లేదా చుట్టుపక్కల వాళ్ళకి తర్వాత దొరికావు నువ్వు దొరికినప్పుడు శిక్ష వచ్చింది. శిక్ష వచ్చినప్పుడు బాధపెడుతున్నావ్ అది నువ్వు చేసుకున్న దాని వల్లనే వచ్చింది అందుకని చెడు చేయొద్దు అన్నారు తర్వాతయనా వస్తదిని ప్రస్తుతానికి నీకు తాత్కాలికంగా ఆనందం కలగొచ్చు కానీ తర్వాతయనా నీకు ఆ చెడు ఫలితాన్ని అనుభవించవలసినటువంటి కర్మ వస్తుంది కర్మ అంటే నువ్వు చేసిన పని
(11:37) ఫలితం అయితే ముందు తాత్కాలిక సుఖంతో వెళ్ళిపోయేవాళ్ళు ఎవరో ఇది ఆలోచించట్లేదు ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నారు. హాయిగా ఉంది సరదాగా ఉంది తాగుతా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏమ అవ్వట్లేదు ఏమైంది ఇదిగో నేను తాగాను ఏమ అవ్వలేదు అంటున్నాడు ఇది ప్రస్తుతము ప్రస్తుతం ఏమ అవ్వట్లేదు అందుకే తాగుతున్నారు అందరు ఇప్పుడు సిగరెట్ అంటించగానే మనిషికి క్యాన్సర్ వచ్చేసింది అనుకోండి సిగరెట్ అంటించగానే మనిషికి విపరీతమైనటువంటి అనారోగ్యాలు బయటపడి కనపడిపోతున్నాయి అనుకోండి నిండి నొప్పు పట్టుకుంటే కాలినట్టుగా అసలు సిగరెట్ జోలికి వెళ్లరు ఎవరు ఏ వ్యసనమైనా అంటే తాగుడు వ్యభిచారం
(12:12) పేకాట జోదం ఏదైనా ఎటువంటి చెడు వ్యవసనమైనా వెంటనే అప్పుడే అది నుప్పు కాలినట్టుగా చూపిస్తుంటే అసలు దాని జోలికి వెళ్లరుగా నుప్పుని పట్టుకోండి మనం కానీ అది అప్పుడు జరగట్లేదు కాలగమనంలో సిగరెట్లు కాల్చగా కాల్చగా మందు తాగగా తాగగా మాదక ద్రవ్యములు పీల్చగా పీల్చగా వాటికి అలవాటు పడిపోగా వ్యసనములకు అలవాటు పడిపోయి పడిపోయి పడిపోయి కాలగమనంలో దీర్ఘకాలంలో వ్యాధులు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి వ్యసనముల వల్లనే వస్తున్నాయా అని కాదు వ్యసనము అనదానికి అర్థం తెలుసుకోవడం మళ్ళండి ఈ అర్థాలన్నీ కొంచెం విడమర్చి చెప్పేటువంటి దాన్ని ఆధ్యాత్మికం అంటే
(12:55) ఏంటి సత్యము నీకు తెలిసింది కొంతే తాగాను కాబట్టి లివర్ చెడిపోయింది అనేది కొంతవరకే కానీ తాగకుండా కూడా అనారోగ్యాలు వస్తాయి నువ్వు మంచిగా అసలు నీకు ఏ వ్యసనములు లేవు ఏ వ్యసనములు ఏంటి ఏంటి చుట్టా బీడి సిగరెట్ తాగుడు మందు ఇటువంటివి లేవు తప్పులు చేయవు కానీ నిరంతరము నువ్వు ఆశతో అత్యాశతో దురాశతో అవన్నీ లోపల ఉండాయి పైకి మంచిగానే కనపడతావ్ లోపల నాకు అన్నీ కావాలని కోరుకుంటావు తప్పేమని కోరుకోవచ్చు పైకి మంచిగానే కనపడతావ అంటే నటనఏం కాదు పైకి అందరం బాగానే ఉంటాంగా కానీ అయ్యో వాళ్ళ ఒక అన్ని ఉన్నాయి నాకు లేవు వాళ్ళ అన్ని పొందారు
(13:33) నేను పొందలేదు వాళ్ళు సుఖంగా ఉన్నారు నేను లేను నాకు వచ్చిన సుఖం సరిపోవడం లేదని నిరంతర విచారంతో బతుకుతావ్ ఇది కూడా వేసనమే తృప్తి లేకపోవడం వ్యసనమే ఎందుకని అంటే నిరంతరము విచారము వలన నిరంతరము బాధగా విచారంగా నిరాశగా నిస్పృహగా ఉత్సాహం లేకుండా ఏదో తిన్నానులే ఏదో తాగానులే అని ఎప్పటికీ ఒక సంతృప్తి లేకుండా బ్రతకడం వల్ల కూడా విపరీతమైన అనారోగ్యాలు వస్తాయి.
(14:08) అవి లోపలే శరీరం స్థితిలమైపోతుంది భావాలతో అదే ఒత్తిడి ఆందోళన స్ట్రెస్ ఇవన్నీ ఎవరు కల్పించుకున్నారు నువ్వే సరిపోలేదన్న భావన సరిపోవడం లేదన్న భావన సరిపోదేమో అన్న ఆందోళన సరిపెట్టుకోలేనేమో నా వల్ల కాదేమో భవిష్యత్తు ఎలా ఉంటుందన్న భయం ఇక ఎప్పటికీ అన్ని విషయాలలో వీటి నుంచి మళ్ళీ ఇతరులతో ఘర్షణలు ఇవన్నీ నువ్వు నీక చెడు అలవాట్లు నువ్వు సిగరెట్ తాగు మందు తాగు వ్యభిచారం చేయు ఎటువంటి చెడు అలవాట్లు లేవు కానీ నిరంతరం నీ లోపల ఇలా భయపడుతూ ఉంటావ్ బాధపడుతూ ఉంటావ్ దుఃఖ పడుతూ ఉంటావ్ ఆందోళన పడుతూ ఉంటావ అంతా లోపలే ఉంటది బయటకి చక్కగా
(14:54) కనపడతావ్ అందరికి మంచి బట్టలు వేసుకొని చక్కగా స్నానం చేసి చక్కగా నీట్ గా ఉండి చక్కగా క్రాఫ్లు పెట్టుకొని చక్కగా అన్ని లోపల నువ్వు ఇంత ఆందోళన పడుతున్నావ అని ఎవరికీ తెలియదు ఎప్పుడో ఒక రోజు అటాతుగా బీపి వచ్చి వచ్చింది అంటారు షుగర్ వచ్చింది అంటారు గుండుపోటు వచ్చింది అంటారు కిడ్నీలు చెడిపోయినాయి అంటారు. అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటావు ఎందుకని నిరంతర అసంతృప్త జీవితము ఇది కూడా వ్యసనమే ఇది వ్యసనమే అని ఆధ్యాత్మికతే చెప్పింది ఇది సత్యం కానీ ఇది వ్యసనమే నీకు భౌతికంగా తెలి వ్యసనాలు అంటే సిగరెట్లు అనుకుంటావ్ మందు అనుకుంటావ్ తాగుడు అనుకుంటావ్ చెడు
(15:30) అలవాట్లన్నీ బయట కనబడుతున్నాయి అనుకుంటాం ఆ మాక ద్రవ్యాలు నాకు అలవాటు లేదు అనుకుంటాం కానీ కొంతమంది నిరంతరం ఇతరులను క్రిటిసైజ్ చేస్తా ఉంటారు మేము గొప్పవాళ్ళం వాళ్ళు తక్కువ ఏదో ఏదో ఒకటి ఇద్దరిలో బొక్కలు వెతుకుతా ఉంటారు. ఇదిఒక పెద్ద వ్యసనం అది వ్యసనం ఎవరు చెబుతారు నీకు లేదండి తప్పులు ఉన్నాయి వాళ్ళలో అందుకే చెప్పాం అసలు వాళ్ళలో తప్పులు ఉంటే నీకు ఎందుకు అంటుంది ఆధ్యాత్మిక నీ బతుకు నీది ఎలాంటిదో ప్రపంచంలో ఎవరు బతుకోళ్ళు అలాంటిది వాళ్ళలో తప్పులు ఊరంతా చెప్పాలని చెప్పమని ఇప్పుడు నీకు ఎవరు చెప్పారు నీ పని నువ్వు చేసుకోక
(16:04) నీ బతుకు నువ్వు బతకడానికి వచ్చావా ఇతరుల తప్పులన్నీ ప్రపంచం అంతా చెబుతూ తిరగడానికి వచ్చావా లేదా ఇతరుల గొప్పలన్నీ ప్రపంచం అంతా చెప్పడానికి వచ్చావా? చాలామంది తమకు నచ్చిన విషయాలని మొత్తం అందరికీ అంటిస్తా ఉంటారు. అది ఏ విషయమైనా సరే తమకు నచ్చని విషయాలను కూడా తీసుకెళ్లి మొత్తం అందరికీ అంటిస్తూ ఉంటారు అంటే బయటే తిరుగుతా ఉంటారు ఇది కూడా వ్యసనమే విషయాసక్తి అంటారు దీన్ని ఉండాలి తగుమాత్రంగా మనక మనం బ్రతకడానికి ఎంత అవసరమో అంత తెలుసుకొని తృప్తి పడిపోవాలి.
(16:37) ఒక విషయం నాకు నచ్చిందంటే దాన్ని ఊరంతా ప్రచారం చేయడం ఒక నాకు నచ్చలేదంటే మళ్ళ ఊరంతా ప్రచారం చేయడం ఇవన్నీ వ్యసనములు అలాగే కోపం మితిమూరిన కోపం ఒక వ్యసనం తగుమాత్రంగా కోపం ఎవరికైనా వస్తది అదిఒక స్పందన కోపం అనేది కానీ అసలు కోపిష్టులు అనే పేరుతో బతుకుతాడు వాళ్ళకి ఎదురు చెప్పకూడదు అసలు వాళ్ళు చెప్పింది కొట్టాలి అది కూడా వ్యసనమే ఇలా మన మనజ జీవన శైలిలో మన అలవాట్లు కూడా మితిమీరిపోయిన అన్ని వ్యసనాలే నేను ఏదో ఒక టీ తాగుతాను ఒక కాఫీ తాగుతాను పర్వాలేదు బ్రతకడానికి ఏదో తింటాం కాబట్టి అం ఏదో ఒక అలవాటుగా పెట్టుకున్నాం.
(17:21) కానీ నేను ఇప్పుడు టీ తాగకపోతే ఉండలేను పిచ్చ ఎక్కిపోద్ది నాకు టీ తాగకపోతే ఇప్పుడు మోషన్ రాదు కాఫీ తాగకపోతే ఇప్పుడు మోషన్ రాదు. ఉదయం నుంచి అలా కాఫీలు తాగుతూ రెండు మూడు సార్లు టీలు తాగుతూ మోషన్కి ట్రై చేస్తాను. అసలు మోషన్ కి కాఫీకి సంబంధం ఏంటి మోషన్ కి టీ కి సంబంధం ఏంటి మోషన్ కి సిగరెట్ కి సంబంధం ఏంటి ఇంకొంతమంది ఇప్పుడు నీళ్ళు తాగి ట్రై చేయండి అని మోషన్కి వెళ్ళడానికి నీళ్ళు అలవాటు చేస్తున్నారు అది కూడా వ్యసనమే నీళ్ళు తాగడం తప్పు కాదు నీళ్లు తాగితే మోషన్ వచ్చేల శరీరానికి అలవాటు చేసుకుంటున్న తప్పు అది ఎందుకంటే శరీరంలో
(17:57) ఆల్రెడీ ఒక ఫంక్షనింగ్ ఉంది మలమూత్ర విసర్జనలు శరీరం దానందంత చేసుకుంటది దానికి దానికి కావలసినవి నువ్వు సరైన సమయంలో సరైన విధంగా అందిస్తే చాలు ఇలా వ్యసనములు గూర్చి నీకు చెప్పేవాళ్ళు ఎవరు ఎవరు చెప్పేవాళ్ళు లేరుగా ఇలా ఇది సత్యమా కాదా అంటే సత్యం ఎలా వైడ్ గా పెరిగిపోతే వెళ్తుందో చూడండి వైడ్ గా పెరిగిపోతే వెళ్ళిపోతుంది వ్యసనం మన అలవాటులోకి వచ్చేసింది వ్యసనం అంటే బయట ఎక్కడో సిగరెట్లో తాగుల్లో చుట్టా బీడీల్లో వ్యభిచారాల్లో పేకాటట్లో అక్కడ ఉంది వ్యసనం అనుకుందే అది మన అలవాటులోకి వచ్చేసింది మన కోపం కూడా వ్యసనం అయిపోయింది. మన దుఃఖం కూడా వ్యసనం
(18:37) అయిపోయింది మన బాధ కూడా వ్యసనమ కొంతమంది అలా ఎప్పుడు బాధపడతానే ఉంటారు. వాళ్ళ నోట్లోనుంచి బాధాకరమైన మాటలు అసంతృప్తి మాటలు తప్ప సంతృప్తికరమైనవి అసలు రావు వాళ్ళ నోట్లోనుంచి వాళ్ళు ఎప్పుడ అలాగే ఉంటారు. వాళ్ళ పక్కన కూర్చుంటే కాసేపు మనం కూడా అలాగే అయిపోతాం. కొంతమంది నిరంతరం జబ్బులు చెబుతా ఉంటారు నాకుేదో అయిపోతుంది అనుకుంటా ఉంటారు ఏమి అవ్వదు అసలు ఆఖరికి ఏలు దురద పుడితే కూడా ఏలు దురద పడుతుంది ఏంటని ఆలోచిస్తారు.
(19:05) శరీరం అన్నాక ఎక్కడో చోట దొరపడుతుంది శరీరం అన్నాక ఇంత పెద్ద శరీరం నిత్యం శరీర అవయవాలన్నీ పనిచేసుకుంటా ఉంటాయి పెద్ద మిషన్ ఇది ఎన్నో అవయవాలు పార్ట్లు అన్నీ కలిసి పనిచేస్తా ఉండాలి రక్త ప్రసరణ శరీరం మొత్తం జరుగుతానే ఉండాలి మొత్తం నర్వస్ సిస్టం పనిచేస్తానే ఉండాలి ప్రతి అణువు ప్రతి కణము నిరంతరం పనిచేస్తుంటేనే మనం జీవిస్తున్నాం.
(19:28) దానికి అప్పుడప్పుడు ఎక్కడో చిన్న నెప్పి వచ్చినట్టు ఉంటది ఏదో చిన్న ఇబ్బంది వచ్చినట్టు ఉంటది ఆ కదలికలో చిన్న చిన్న వస్తాయి అయి పట్టుకొని నాకుఏదో అయిపోయింది అనుకొని విపరీతమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళపోతారు అది కూడా వ్యసనమే ఓవర్ థింకింగ్ అంటారు ఓవర్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అక్కడ కొంతమంది ఎప్పుడు వ్యతిరేకంగానే ఆలోచిస్తారు అంటే మనక ఎప్పుడు ఏదో ఒకటి జరుగుద్ది ఏం జరుగుద్దో ఎవరిని నమ్మరు ఇవన్నీ వ్యసనములే ఇవన్నీ వ్యసనములే అని చెప్పేది ఎవరో అది నా స్వభావం అనుకొని జీవించేస్తావ్ ఆ నమ్మనోళ్ళు చిచ్చాలు ఎవరు నమ్మలేమండి అంటారు నమ్మకపోతే ఎలా బతుకుతావ్ ఎవరిని
(20:08) నమ్మకపోతే నీ ఇంట్లో ఎట్లా పడుకుంటావ్ నువ్వు నువ్వు పడుకోగానే మీ ఆవిడ చంపేస్తే లే నువ్వు పడుకొని నిద్రపోగానే మీ ఆయనని చంపేస్తే మీ పిల్లలు చంపేస్తే లేదా పిల్లల్ని నువ్వు చంపేస్తే మీ కుటుంబ సభ్యులే నిన్ను చంపేస్తే నమ్మకం అనేది మనిషిని బ్రతికించే చేటువంటి విషయం కదా అది నేను ఎవరినైనా నమ్మన అన్నోడికి ఇలాగే ఉంటది అప్పుడు ఎవరు లేకుండా ఒక్కడే గదిలో తలుపులు బిగించుకు పడుకోవాలి అలాగే రోడ్డు మీదకి వెళ్తే ఏమో వివాహనం వచ్చి గుద్దేస్తే వర్షం వస్తుంటే ఏ పిడుగులో పడిపోతే నా ఇంటి మీద పెడితే అంటే ఇక నీ జీవితం మొత్తం ఆదుర్త ఆందోళన
(20:46) ఎప్పుడు ఏదో ఒకటి జరిగితే జరిగితే జరిగితే అని ఆలోచించుకుంటా ఉంటావ్ జరుగుతుందేమో అని ఆలోచించుకుంటా ఉంటావ్. ఇది కూడా వ్యసనమే అతి ఆలోచన ఓవర్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అతి ఆలోచనలన్నీ వ్యసనములే మరి ఇవన్నీ చెప్పకపోతే మనిషికి తెలియజేయకపోతే ఏ మనిషికి ఆ మనిషి తన ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ పోయి దుఃఖములు పాలవుతున్నాడు బాధలు పాలవుతున్నాడు ఆ తనైతే పర్వాలేదు ఇతరులను కూడా వాటిని గురి చేస్తున్నాడు.
(21:14) ఇప్పుడు భయపడే మనిషి ఊరుకుంటాడా చుట్టూ తన చుట్టూ అందరిని భయపెడతా ఉంటాడు ఇంట్లో కుటుంబ సభ్యులను భయపెడతాడు బయట బంధుమిత్రులని భయపెడతాడు అందరిన ఎక్కడ ఎవర ఉంటే అక్కడ అందరిని భయపెడతా ఉంటాడు ఇవన్నీ చెబుతా ఉంటాడు. అలా అన్ని రకములు వ్యసనములే అవి నీ ద్వారా బయటకి వ్యక్తీకరించబడుతూ ఉంటాయి నువ్వు అనుభవిస్తూ ఉంటావు పని వరకు నువ్వు అనుభవిస్తున్నావులే ప్రపంచంలో ఎవరికే మోయింది అనుకుంటే పర్వాలేదు కానీ కాదే నువ్వు అనుభవించే ప్రతిదీ నీ కుటుంబ సభ్యులతో సహా నీకు పరిచయం ఉన్న అందరికీ వ్యక్తపరుస్తా ఉంటావు అదే సత్యం అని చెబుతా ఉంటావ్ అది దుఃఖమైతే దుఃఖాన్ని
(21:49) సత్యంగా చెబుతావ్ అది సుఖమైతే సుఖాన్ని సత్యంగా చెబుతావ్ అందుకని మనిషికి ఇక్కడ సత్యతను తెలియజేయాలి ఆ సత్యతను మనిషే తెలుసుకోవాలి నా సత్యతను నేనే తెలుసుకోవాలి నా పరిమిత భావాలతో పరుగులుఎత్తేసి నాయన ఎలా పెడితే అలా నా ఇష్టం వచ్చినట్టు జీవించొచ్చు కదా మంచిగానే ఎందుకు జీవించాలి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతను అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే నేను నా భావాలతో నా కోపాలతో నా ఈర్షలతో నా అసూయలతో నా ద్వేషాలతో నా కోరికలతో నా ఆశలతో నా అత్యాశలతో నా దురాశలతో నాలో ఉన్నటువంటి చెడు లక్ష లక్షణములతో సాగిపోతూ ఇవే కరెక్ట్ అనుకుంటూ నేరాలన్నీ ఎదుటి వాళ్ళ మీద ఎదుటి విషయాల
(22:32) మీద ఎదుటి పరిస్థితుల మీద లేదా ఈ నేరాలన్నీ తీసుకెళ్లి గ్రహాల మీద గోళాల మీద నక్షత్రాల మీద జాతకాల మీద వాస్తువుల మీద తాళ్ళ మీద తాయిత్తుల మీద పడేస్తున్నాం అనుకోండి ఎవరో నా జాతి ఇవన్నీ చేయిస్తున్నారుని చాలామంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆధ్యాత్మికత తెలియనోళ్ళు అందరూ అలాగే మాట్లాడతారు. వీళ్ళకి ఆధ్యాత్మికత తెలియదు ఆధ్యాత్మికత అంటే నా సంపూర్ణత అన్ని నేనే నేను చేసేవి అన్ని నా ద్వారా నాకు వచ్చిన ఫలితాలు ఏవి కాదు ఎవరి ద్వారానో నాకు వస్తున్న ఫలితాలు ఈ గ్రహాలు పరిస్థితులు బాగోపోవడం వలన అందుకని గ్రహశాంతులు చేసుకుంటే ఇక్కడ నా
(23:09) పరిస్థితులు మారిపోతాయి వాస్తులు సరిచేసుకుంటే ఇక్కడ నా పరిస్థితులు మారిపోతాయి నా దోషాలు కాదు అసలు నేను నా ఈర్షలు అసూయలు నా ఆశలు అత్యాశలు నేను చేసిన చెడులు కాదు అయంతా వాస్తువులు ఫెల్తాడు వాస్తు సరిగ్గా లేదు నేను నివసించే ఇల్లు కాబట్టి వాస్తులు సరి చేసుకోవాలి నాలో అసలు ఏ దోషం లేదు తాళ్ళు తాయత్తులు రంగరాళ్లు ఉంగరాలు అవన్నీ పెట్టుకోవాలి అవన్నీ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది నాకు అలాగే నా పేరు అక్షరాలు మార్చుకోవాలి ఇలాంటి లక్షలు వచ్చినయి ఒకటి కాదు రెండు కాదు ఇవి కూడా వ్యసనములే నీ మీద నువ్వు ఆధారపడకుండా నువ్వు దేని మీద ఆధారపడిన
(23:48) వ్యసనమే ఈ వ్యసనం ఏంటి అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడిన వ్యసనమే గురువు మీద ఆధారపడి వ్యసనమే మతం మీద ఆధారపడిన వ్యసనమే ఎలా ఆధారపడితే వ్యసనం అంటే ఒక గురువు ఒక మతము ఒక దేవుడు ఒక దేవత ఒక జ్ఞాన గ్రంథం అది ఎక్కడైనా సరే మనిషికి ఆధ్యాత్మికతను చెప్పడానికి వచ్చిందంటే సత్యాన్ని చెప్పడానికి వచ్చింది ఏమని నువ్వు మంచిగా బ్రతకాలి నువ్వు మంచిగా ఆలోచించాలి నువ్వు సంతృప్తిగా ఉండాలి నీ యొక్క సంపూర్ణతని నువ్వు తెలుసుకోవాలి.
(24:22) నువ్వు శరీరం మాత్రమే కాదు ఇప్పుడు శరీరం ఉండగానే ఆ శరీరాన్ని నిలిపించిన ప్రాణ శక్తి ఒకటి నీలో ఉంది మనిషి చనిపోయినప్పుడు ఆ ప్రాణమే పోయింది అంటున్నాం కాబట్టి ప్రాణశక్తి ఉండగా నువ్వు శరీరం అన్న భావన నిజమే దాంతో జీవిస్తూ ప్రాణశక్తి ఉండగానే నువ్వు జీవిస్తున్నప్పుడే నీ ప్రాణశక్తిని కూడా తెలుసుకో నువ్వు ప్రాణశక్తివి కూడా అనేటువంటి విషయాలని ఈ ఆధ్యాత్మికత చెబుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ సత్యమా కదా అన్ని సత్యమే మరి ఈ సత్యాన్ని నీకు ఎవరు చెబుతారు అందుకని దానికి ఆధ్యాత్మికత అని పేరు పెట్టారు.
(25:02) భౌతికంగా మామూలు సహజంగా నా ఇష్టం ఎలా పెడితే అలా జీవిస్తాను ఎలా పెడితే ఎలా ఉంటాను అన్నారు అదే భౌతిక జీవితం దానికి పేరు పెట్టారు భౌతిక జీవితం అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించే జీవితం నువ్వు నమ్మిందే సత్యం అనుకొని సాగే జీవితం నీ ఇష్టం వచ్చినట్టు ఎడా జీవించే జీవితం ఇదంతా భౌతిక జీవితమే అందులో నీ ఆలోచనలు నీకు తెలిసినంతే సత్యం అనుకుంటూ వెళ్తుంటావు నువ్వు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటంటే నీకు తెలిసినటువంటి విషయాలే కాక నీ జీవితంలోనే నీకు ఆలో అంటే నువ్వు ఆలోచించని నువ్వు తెలుసుకోని అంశాలు ఇప్పుడు చెబితే నీకు అవన్నీ కరెక్ట్ అనిపిస్తది. అవునా అవన్నీ
(25:38) నాలోనే ఉన్నాయి అనిపిస్తది నేనే చేస్తున్నాను అనిపిస్తది నా వల్లనే జరిగింది అనిపిస్తది. అలాంటి ఆలోచనా ధోరణి నీలో రేకిత్తించాలి ఏంటిది ఆలోచనా ధోరణి ఆధ్యాత్మిక ఆలోచనా ధోరణి నేను చేసిన తప్పులకి నాకు వచ్చే శిక్షలో గ్రహాల వలనో జాతకాల వలనో జ్యోతిష్యాల వలనో వాస్తుల వలనో ఇతరులు ఎవరో దేని వలనో తాళ్ళు లేకో తాయిత్తులు లేకో రంగురాళ్ళు లేకో ఉంగరాళ్లు లేకో వాటి వల్ల రావట్లేదు ఆ విషయం నీకు తెలియాలి తెలియాలంటే అన్ని నేను చేసిన పనుల ఫలితాలు నేను అనుభి భవిస్తాను అనే కర్మ సిద్ధాంతం నీకు తెలియాలి.
(26:17) ఆ సత్యం ఇక్కడ నడుస్తుంది తెలుసుకోవడానికి అదేమ లేనిది కాదుగా ఉన్నది కానీ నువ్వు తెలుసుకోవట్లేదు. నువ్వు నువ్వు నీ భావనలో సహజ మనిషిగా మనిషికి ఏమనా ఉంటది ఎప్పుడు నేను సుఖంగా ఉండాలి నావాళ్ళు సుఖంగా ఉండాలి మేమంతా హాయిగా బతకాలి నాకు అన్ని సమకూరాలి ఆ ప్రయత్నంలోనే వెళ్ళిపోతున్నారు లంచాలు తీసుకుంటున్నారు అధర్మాలు చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు దుర్మార్గాలు చేస్తున్నారు.
(26:42) లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలలో పట్టిపడిపోయి ఉద్యోగాలు పోయి జైలలో ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు కోర్టు కేసుల్లో తిరుగుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఒకళ్ళఇద్దరు కాదు లక్షల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు లంచాలు తీసుకోవడం వల్ల మాకు ఇదంతా జరిగింది అనుకోవట్లే మా జాతకం బాగోలేదు గ్రహశాంతులు చేయించుకుందాం లేదా ఏ మహాత్ములు మహర్షుల దగ్గరికి వెళ్లి యజ్ఞ యాగాదులు చేయించుకుందాం లేదా వాళ్ళ మతానుసారం ఇంకేముంటాయి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు గురువుల చుట్టూ తిరుగుతున్నారు మహాత్ముల చుట్టూ తిరుగుతున్నారు మతాల చుట్టూ తిరుగుతున్నారు పుణ్యక్షేత్రాల చుట్టూ
(27:16) తిరుగుతున్నారు దేవుళ్ళు దేవతల చుట్టూ తిరుగుతున్నారు అక్కడ చెప్పే కర్మకాండలు అన్నీ పాటిస్తాం అంటున్నారు. జాతకాలు జ్యోతిష్యాలు రంగరాలు ఉంగరాలు ఇలా అన్ని తిరుగుతున్నారు. పేర్లు అక్షరాలు మార్చుకుంటున్నారు. అంతే తప్ప నేను లంచాలు తీసుకోవడం అని పని చేయకుండా ఉండుంటే నాకు అసలు ఇంత జరిగేదే కాదు నా ఉద్యోగం పోయేదే కాదు నేను ఆ తప్పు చేశాను నేను అక్కడ నిజాయితిగా లేను ధర్మంగా లేను అందుకే దొరికాను అని అనుకోవట్లే కానీ సత్యం ఏంటంటే అదే సత్యం నువ్వు తప్పు చేయడం వలన ఎప్పుడు సత్యం ఒకటే నువ్వు చేసిన తప్పుల ఫలితాలు నువ్వు అనుభవించక తప్పదు అది మాట అయినా
(27:55) చేష్ట అయినా అవే ఫలితాలు వస్తాయి నిరంతరం ఇంట్లో ఉన్నారు ఇప్పుడు భార్యా భర్తలు సహజంగా ఇంట్లో ఎవరు ఉంటారు భార్యా భర్తలు పిల్లలు పిల్లలు కళ తల్లిదండ్రులు అనుకోండి అనుకున్నా నిరంతరం ఒక భార్యలో తప్పులు ఎతికేటువంటి భర్త ఆ భార్య నుంచి సంపూర్ణమైనటువంటి సుఖాన్ని శాంతిని పొందలేడు. నిరంతరం భర్తలో తప్పులు ఎతికేటువంటి భార్య వాదోపవాదాలు చేసుకునేటువంటి భార్యా భర్తలు లేదా పిల్లలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరు ఒకరి నుంచి ఒకరు సుఖ సంతోషాలు పొందలేరు కలిసి అలా బ్రతుకుతా ఉంటారు.
(28:32) అది పరిశీలించుకుంటే అర్థమైపోద్ది అని చెబుతుంది ఆధ్యాత్మికత కాదు నా భార్య మంచిది కాదండి అని ఊరంతా చెబుతాడు వీళళ మా నాన్న మంచోడు కాదండి అని ఊరంతా చెబుతాడు మా అమ్మ మంచిది కాదండి అని ఊరంతా చెబుతాడు నా పిల్లలు మంచిోళ్ళు కాదండి అని వీళ్ళు ఊరంతా చెబుతారు అలా ఎదుట వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ ఇప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్న కుటుంబాలు చూడండి మీ కుటుంబం చూడండి మిమ్మల్ని మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు కూడా చూసుకోండి అందుకే అసలు ఈ ఆధ్యాత్మికత అందరూ చూడండి సొంత కుటుంబ సభ్యులు గురించి గురించి నేరారోపణ చెబుతూ వెళ్తా ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పురు ఇప్పుడు నా భార్య ఉంది
(29:05) నేను మా భార్య గురించి రోడ్లు మెచ్చ అవ్వడం ఏంటి అసలు మేము కదా కలిసి బతికేది కాపురం చేసుకునేది అంత అన్యోన్యత ఇంకా ఎక్కడ లేదుగా అసలు ప్రపంచంలో ఏ బంధంతోన లేదుగా మనుషుల నాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి ఘర్షణలు కాదు గయ్యాళ కాదు ఓ కోపిష్టి మొగుడు కాదు ఒక గయ్యాలి భార్య కాదు మనుషుల నాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి అవి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సంపూర్ణ పూర్ణంగా మనకోసం మనని బ్రతికించడానికి నీకు సేవలు చేస్తానని ఏ భార్య రాదు నీకు దాసోహం అని ఏ భార్య రాదు జీవితకాలం మొత్తం నీకు బానిసగా పడి ఉంటానని ఏ భార్య రాదు ఏ భర్త రాడు ఏ పిల్లలు చెప్పరు ఏ సంబంధ
(29:43) బాంధవ్యము చెప్పదు కాకపోతే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు కొంచెం భరిస్తూ సద్దుకుంటూ ఒకరికి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ నీవు నేను ఉన్నాను నాకు నువ్వు ఉన్నావు అనే భావనలు పెంపొందించుకుంటూ సాగేది కుటుంబ జీవితం బంధు మిత్రులు కూడా అంతే మేము ఉన్నాము మాకు మీరు ఉన్నారుని ఎందుకని ఎప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళకి కష్టం వస్తా ఉంటది ఎవరో ఒకళ్ళకి ఇబ్బంది వస్తా ఉంటది సుఖాలలో ఆనందాలలో ఎవరెవరికి తోడు లేకపోయినా కష్టాలలో బాధలలో కొంచెం ఒకరికొకళ్ళ తోడు ఉండాలి అందుకని దీన్ని ఎంతవరకు చెప్పింది ఆధ్యాత్మికత అంటే ఇక్కడ కుటుంబమే కాదు బంధుమిత్రులే కాదు
(30:25) ప్రపంచంలో నీకు ఎక్కడ దీనులు హీనులు ఆర్తులు బాధల్లో ఉన్నవాళ్ళు కనబడిన నువ్వు చేయగలిగిన సహాయం చెయి అని చెప్పింది ఎందుకని వాళ్ళంతా మనుషులే ఏ సహాయం అందకాల ఉన్నారు కుటుంబ సభ్యులు చేయలేదు బంధు మిత్రులు చేయలేదు ఎంతో మంది వృద్ధ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు దంపతులు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. ఎంతో మంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనాధ ఆశ్రమాల్లో ఉన్నారు.
(30:52) ఎంతో మంది భార్యలు భర్తలు విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు విడాకులు తీసుకొని ఒక కొడుకుని తల్లి పెట్టుకొని ఇంకో కూతురుని తండ్రి పెట్టుకొని బిడ్డలు ఎవరో ఒకళళ దగ్గర ఉంటున్నారు. అలా ఎవరో ఒకళళ దగ్గర పెరిగినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి జీవించినటువంటి సంతోషం లేకుండా ఆలనా పాలన లేకుండా అభద్రతతో పెరిగినటువంటి ఆ పిల్లలు మానసికంగా ఎదగలేరు సంపూర్ణంగా మానసిక ధైర్యం ఉండదు అభద్రతగా ఉంటారు.
(31:20) ఇది మనం చేసుకుంటుంది మన అహంకారాలతో ఈ అహంకారాలు కాదు అహంకారాలను తగ్గించుకుంటే మన జీవితాలు బాగుంటాయి మన చుట్టూ ఉన్నవాటి జీవితాలు బాగుంటాయి మన పిల్లల జీవితాలు బాగుంటాయి మొత్తం మనుషుల జీవితాలు బాగుంటాయి మన జీవితం కూడా బాగుంటుంది కొంచెం ఆలోచించు అని చెప్పేది ఆధ్యాత్మికత అది సత్యం కాదా అందుకని ఆధ్యాత్మికత ఉన్నదాన్ని చెబుతుంది సత్యాన్ని చెప్పుది ఆధ్యాత్మికత అంటే సత్యము నీ జీవితంలోనే ఉన్న నువ్వు గ్రహించని నువ్వు గ్రహిం ించాలని అనుకొని నువ్వు తెలుసుకొని నువ్వు అర్థం చేసుకొని నీకు సంబంధించినటువంటి నీ కోణం ఏది నీకు సంబంధించిన నీ విషయం ఏది ఇలా కూడా
(31:59) ఆలోచించొచ్చు నువ్వు కోపంగానే ఎందుకు ఆలోచిస్తున్నావ్ ప్రేమగా ఆలోచించు ఒక విషయం ఇప్పుడు జీవిత కాలంలో బ్రతుకుతూ వివాహం చేసుకున్నాం ఏదో వివాహం చేసుకొని చాలా కాలం గడుస్తా ఉంటది ఒక మాట ఏదో అన్నారని లేదా వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళు పెరుగువచ్చిన వాతావరణం మీద ఉంటది భార్యా భర్తలు ఎక్కడోళ్ళు ఎక్కడ ఎక్కడోళ్ళు ఇక్కడ కలుస్తారు వచ్చి ఒ ఒక స్త్రీ ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది వాళ్ళ అలవాట్లున్నీ వేరు వేరు ఒక పురుషుడు ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు వీళ్ళ అలవాట్లు అన్నీ వేరు వేరు వాటి బట్టి వాళ్ళ అలవాట్లు వాళ్ళ స్వభావాలు వాళ్ళ గుణాలు ఏర్పడిపోయినాయి
(32:36) ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బతుకుతారు. అంటే సర్దుకోవాలి తప్ప వీళ్ళంతా వీళ్ళిద్దరూ ఒకే చోట ఒకే స్థితిలో పెరిగినోళ్ళు కాదు అలా పెరిగినోళ్ళు కూడా అన్నదమ్ములకు పడదు. ఎందుకంటే అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి మనుషులకి ఆ సత్యాన్ని చెబుతుంది ఆధ్యాత్మికత ప్రపంచంలో ప్రతి మనిషి వేరు వేరుగానే ఉంటాడు విరుద్ధంగానే ఉంటాడు అసలు సృష్టి ఎలా చేసింది ఇద్దరు వేలు ముద్రలు ప్రపంచంలో ఎవరివి కలవు ఇప్పుడు 850 కోట్ల మంది భూమి మీద ఉన్నారు అని అనుకుంటే 850 కోట్ల మంది వేలు ముద్రలు వేరువేరుగా ఉంటాయి మరి తీసుకుంటున్నారు వేలు ముద్రలు వేయించుకుంటారు కంటే రెటీనా
(33:19) పొరలో కూడా ఇప్పుడు స్కానింగ్లు చేస్తున్నారు కళ్ళు ఎందుకని అవి కూడా కలవంట అన్ని వేరు వేరుగా ఉంటాయి అలా రూపురేఖలు వేరు వేరుగా ఉంటాయి అప్పుడు గుణాలు స్వభావాలు ప్రవృత్తులు ఇష్టాలు అయిష్టాలు అన్ని వేరు వేరుగా ఉంటాయి. రెండు వేరు వేరులు కలిసి బ్రతకడమే జీవితం అదే కుటుంబ వ్యవస్థ మొత్తం ప్రపంచం కూడా అంతే మొత్తం మానవ జాతి అంతా వేరు వేరుగానే ఉంటది కానీ కలిసి బ్రతకాలి.
(33:44) వేరు వేరుగా ఉండటం అనేది సృష్టి యొక్క లక్షణము విభిన్నత దాని లక్షణం దాన్ని మనం జ్ఞానంతో గమనించుకుంటూ కలిసి బ్రతకడం నేర్చుకోవాలి అంటే ఒకళళఒకళ్ళ కొంచెం సద్దుకోవాలి ఒకళళఒకళ్ళ కొంచెం భరించాలి ఒకసారి ఒకళ్ళు తగ్గాలి ఒకసారి ఒకళ్ళు తగ్గాలి అది అవసరాలను బట్టి చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోమని చెప్తుంది ఆధ్యాత్మికత ఇలా అర్థం చేసుకోవడం సత్యం కదా అర్థం చేసుకునే పాసిబిలిటీస్ లేవు అక్కడ అలా అర్థం చేసుకొని శాంతిగా ఆనందంగా బతికే అవకాశం లేదు అక్కడ ఉంది ఉందని చెప్పేది ఆధ్యాత్మికత అలా దాన్ని నువ్వు వాడట్లేదు ఉపయోగించట్లేదు నువ్వు అన్ని చెడు గుణాలు
(34:22) ఉపయోగిస్తున్నావ్ కోపం ఉపయోగిస్తున్నావ్ ఈర్ష ఉపయోగిస్తున్నావ్ అసూయ ఉపయోగిస్తున్నావ్ ద్వేషం ఉపయోగిస్తున్నావ్ కామం ఉపయోగిస్తున్నావ్ ఇలా నువ్వు అన్ని చెడు గుణాలు ఉయ ఉపయోగిస్తున్నాం మంచి ఉపయోగించట్లేదు. మంచిని కూడా ఉపయోగించొచ్చు నువ్వు చెడునే ఉపయోగించ చెడుని ఎందుకు ఉపయోగిస్తున్నావ అంటే నా ఇష్టం వచ్చినట్టు జీవించినప్పుడు నా ఇష్టం అసలు ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోవాలి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అన్నప్పుడు నా ఇష్టం అంటే ఏంటి నిరంతరం నాకు అనుకూలం అందుకని చెడుగానే ఆలోచిస్తాను నాకు అనుకూలత పోతే కోపం వచ్చేస్తది నాకంటే
(34:55) ఎక్కువ ఉన్న చూస్తే ఈర్షులు వచ్చేస్తాయి. ఇంకా నాకు ఎలానా ఇవన్నీ కొట్టేసి నేను అనుభవించాలని చెడు లక్షణాలు వచ్చేస్తాయి. ఆ చెడు లక్షణాలకు దొంగతనాలు చేస్తాను దోపిడీలు చేస్తానో మోసాలు చేస్తాను అబద్ధాలు చెబుతానో అన్యాయాలు చెబుతాను చేస్తానో లంచాలు తీసుకుంటాను ఏం చేస్తానో తెలియదు ఎందుకంటే నా ఇష్టం కదా కానీ ఆధ్యాత్మికత అలా చెప్పదు నీ ఇష్టం కాదు సృష్టి అంతా ఒక క్రమ పద్ధతిలో ఉంది ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉంది ఒకవేళ నా ఇష్టం వచ్చినట్టు అని నువ్వు బతికితే దానికి మళ్ళీ నువ్వు శిక్షలు అనుభవించాలి ఎందుకు ఇదంతా నీకు అనవసరం కదా అని ఆ కర్మ
(35:28) సిద్ధాంతాన్ని ప్రూవ్ చేసి చూపిస్తది ఇదిగో ఇలా జరుగుతుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళని చూసుకొని ఇందాక మాట్లాడుకున్నాం కుటుంబ సభ్యుల గురించి అందరూ బయట చెప్పుకుంటా ఉంటారని ఏంటి తమ సొంతవాళ్ళు భార్య గురించి భర్త గురించి తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి ఒక కుటుంబంలో బతికేవాళ్ళు ఎంత దారుణమైంది ఒకసారి మీ లోపల ఆలోచించుకోండి అది కూడా లోపల ఉంచుకోలేకపోతున్నారా అంత భరించలేకపోతున్నారా నేనే గొప్పని బయట చెప్పుకోవాలి నా బాధను ఇప్పుడు బయట కక్కేయాలి కక్కేసి ఇప్పుడు నా భార్య మంచిది కాదు నా భర్త మంచోడు కాదు నా పిల్లలు మంచోడు కాదు నా తల్లిదండ్రులు
(36:02) మంచిోళ్ళు కాదని కక్కేసి మళ్ళీ వెళ్లి అక్కడేక బతుకుతున్నావ్ అంటే ఇప్పుడు ఏంటి నీ కుటుంబాన్ని నువ్వే ఎలరపాలు చేసుకుంటున్నావ్. ఇదే కర్మ అంటే ఆగలేక అదేముంది కొంచెం అర్థం చేసుకో పెద్ద విషయం ఏముంది మనుషులు అన్నాక అనేక రకాలుగా ఉంటారు కదా అనేక రకాల్లో మనని ఇబ్బంది పెట్టేది కూడా ఉండొచ్చు కానీ మన పిల్లలే కదా మనం కలిసి బతుకుతాం కదా కుటుంబం అంతా కలిసి బతుకుతాం కదా బంధుమిత్రులం కదా మనుషులనా ఒకరికొకరు సాయంగా లేకపోతే ఎలా కుదురుతది అని కొంచెం ఓర్చుకోవచ్చు కదా అలా కూడా ఆలోచించొచ్చు కదా ఎల్లు రోడ్డు మీద ఎందుకు వేసుకుంటున్నావ్ అలా వేసుకోవడం
(36:36) వల్ల నీకు ఉపయోగం ఏంటి నువ్వే కదా నష్టపోతావ్ మళ్ళీ అదే కొడుకుతో బతుకుతావ్ అదే భార్యతో బతుకుతావ్ అదే భర్తతో బతుకుతావ్ అదే కూతురుతో బతుకుతావ్ అదే తల్లిదండ్రులు నీకు ఉన్నళ్ళు ఈ జన్మ కాళ్లే వాళ్ళని చులకన చేసి నిన్ను చులకన చేసుకోవడం వలన మీరు చులకన అయిపోయారు పలచన అయిపోయారు మీరు చెడ్డవాళ్ళు అయిపోయారు మీది నష్టమే కదా ఇక్కడ జీవించడం అప్పుడు మీతో చుట్టూ ఉండేవాళ్ళు సరిగ్గా ఉండరు కదా మీకు శాంతి ఉండదు కదా ఆ ఆపుకోలేని తనం కాదది అది వ్యసనము నా సొంత కుటుంబ సభ్యుల పట్ల నేను బయట చెవటము వ్యసనము ఏంటి ఆ వ్యసనము నేను మంచిదాన్ని నేను
(37:15) మంచోడిని అని అనిపించుకోవాలనేటువంటి గుర్తింపు కాంక్ష కీర్తికాంక్ష అంటారు దాన్ని కీర్తికాంక్ష అంటే పెద్ద హైయెస్ట్ ది కాదు ఎంత చిన్నవాళ్ళైనా ఎంత మామూలుైనా నేను మంచి అని అనిపించుకోవడానికి తన వాళ్ళని అవసరమైతే తన వాళ్ళ మీద నిందలేసి తన వాళ్ళతో పడుతున్న ఇబ్బందుల్ని బయటకి చెప్పి తన వాళ్ళని బ్లేమ్ చేసి బతికే వాళ్ళందరూ వెళ్లి వ్యసనమే ఎందుకని నీలోన కొన్ని అవలక్షణాలు ఉంటాయి నాలోన కొన్ని అవలక్షణాలు ఉంటాయి అవి అవలక్షణాలు కాదు అవి అభిప్రాయ భేదాలు నేను పుట్టు పెరిగిన వాతావరణంలో నాకు అలా ఏర్పడినయి నా గుణాలు నా స్వభావం నా మనసు
(37:54) నా మాట నా పద్ధతే నా తిండి నా బట్ట నేను అలా పుట్టు పెరిగాను. మనఇద్దరం పాతిక సంవత్సరాల తర్వాత భార్యా భర్తలుగా కలిసాం. అలా ఎవరైనా కావచ్చు తల్లి పిల్లలు కావచ్చు తండ్రి పిల్లలు కావచ్చు ఎందుకంటే బయట సమాజం వీళ్ళకి తండ్రికి పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఒక 30 ఏళ్ల గ్యాప్ ఉంటది. 30 ఏళ్లలో ప్రపంచం ఎన్నో మార్పులకు లోనైపోద్ది.
(38:21) మామూలు మార్పులు కాదు అప్పుడు తల్లిదండ్రులు తాము తమకు తెలిసిన విషయాలు సత్యాలని ఇప్పుడు పిల్లల మీద దండయాత్రలు చేస్తుంటారు. పిల్లలేమో ఇప్పుడు తెలుసుకున్న విషయాలు సత్యాలు అనుకుంటా ఉంటారు ప్రపంచంలో చుట్టూ కనబడుతుంటే అది అర్థం చేసుకోవాల్సిన విషయం తప్ప ఘర్షణ పడాల్సిన విషయం కాదు అసలు నా పిల్లలతో నేను ఘర్షణ పడటం ఏంటి అనేటువంటి వివేకము లేని తల్లిదండ్రులు వ్యసనపూర్లే కదా ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులతో ఘర్షణ పడితే పడొచ్చు ఎందుకంటే వయోబేదం లేదు చిన్న పిల్లలు కాబట్టి వయసు పెరగలేదు కాబట్టి మెచూరిటీ రాలేదు కాబట్టి మాకు కావలసినవన్ని తల్లిదండ్రులే సమకూర్చాలి
(38:56) కాబట్టి ఆ తల్లిదండ్రులు మాకు అన్నీ సరిగ్గా సమకూర్చడం లేదు కాబట్టి తెలియనటువంటి చిన్నతనంలో మెచూరిటీ లేనటువంటి మెదడులో వాళ్ళు ఘర్షణ పడొచ్చు. ఎందుకని నిజంగా సమకూరుస్తుంది మనమే కాబట్టి కానీ మెచూరిటీ వాళ్ళకంటే 30 ఏళ్ళ పైన ఈ ప్రపంచంలో బతికామే ఈ ప్రపంచ పరిస్థితులు తెలిసే మనుషులు తెలిసే అన్ని తెలిసే మనక అటువంటి మనం మళ్ళీ పిల్లలతో దాడి చేసి పిల్లల మీద పెత్తనాలు చేసి పిల్లల్ని కొట్టి తిట్టి పిల్లల మీద అనేక అజిమాయిషీలు చేసి విరోధాలు తెచ్చుకోవడం ఏంటి మనం అర్థం చేసుకోవాలిగా అలానే అర్థం చేసుకోవాలని పిల్లల్ని నేను కోపగించుకోవద్దు అంట చెడు చేస్తే అది
(39:36) కోపంగానే చెప్పాలి కానీ అది ప్రేమతో కూడిన కోపం ద్వేషం కాదు అక్కడ పిల్లల మీద ఈర్షులు అసూయలు ద్వేషాలు కోపతాపాలు రావడం అంతా వ్యసనమే అటువంటి తల్లిదండ్రులను మించిన దుర్మార్గులు అసలు ఈ ప్రపంచంలోనే లేరు రాక్షసుల కంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళు పైకి అలా కనపడకపోవచ్చు ఎందుకంటే అందరూ మనుషులు కనపడతారు కానీ హృదయం రాక్షసి హృదయం నువ్వు కన్న నీ పిల్లల మీద అసలు ఎలా వస్తుంది అంటే నువ్వు ఎంత స్వార్ధపరుడివి నువ్వు ఎంత స్వార్ధపరురాలివి చూడు అయితే అయితే అది ప్రేమతో కూడి వాళ్ళని సరిదిద్దడానికి నువ్వు మాట్లాడిన కోపతాప మాటలు అయితే అందులో ఏ తప్పు లేదు.
(40:12) నువ్వు కోపంగా నువ్వు కేకలేయచ్చు కానీ నీకు బాధ కలగొచ్చు అయ్యో బిడ్డని అలా అన్నాను ఏంటని లేదా తాత్కాలికంగా నువ్వు మనిషివే కాబట్టి పొరపాటు పడి కూడా కేకలేయచ్చు కానీ పశ్చాత్తాపం తర్వాత నీకు కలుగుతుంటే నువ్వు మంచి తండ్రివే మంచి తల్లివే కాదు అని కసిగా కక్షగా నావాళ్ళు నా మాట వినాలి నా మాట ఎందుకు వినరు నేను చెప్పినట్టే బ్రతకాలి అని వాళ్ళ మీద పెత్తనాలు చేసేవాళ్ళు ఎంతైనా ఎంత పెద్దయినా ఎంత వాళ్ళ కుటుంబాలు వచ్చినా వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛను హరించేలా వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతుంటే చూడలేనటువంటి తల్లిదండ్రులు మా కిందే ఉండాలి హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్న పిల్లలను చూసి
(40:49) భరించలేక మా తత్నం సాగట్లేదని మా మాట వినటం లేదని అలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్న తల్లిదండ్రులు రాక్షసుల కంటే డేంజర్ అంటే రాక్షసుల కంటే ప్రమాదకారులు ఇంకే పదం వాడాలో తెలియట్లేదు అలాంటి మనస్తత్వం మీరు చిన్నప్పటి నుంచి పిల్లలు మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్న పెద్దయనాకు మీరు తల్లిదండ్రులు కాదు రాక్షసులు బ్రహ్మ రాక్షసులు అంటే అంతకంటే ఘోరమైన పదం ఏం తెలియట్లేదు నాకు ఎందుకని అసలు ఈ ప్రపంచంలోకి ఒక ఉనికిగా మనుషులని తీసుకొచ్చింది తల్లిదండ్రులు ఇవన్నీ ఎవరు చెబుతారు ఆధ్యాత్మిక చెప్పుద్ది అది సత్యం కాదా నువ్వు నీ పిల్లలు తప్పులు చేస్తే
(41:30) సరిదిద్దుకోవడానికి కోపగించు తప్పులేదు కానీ నీకు తర్వాత నువ్వు అది ప్రేమతో కూడిన కోపం ప్రేమతో కూడినటువంటి క్రోధాన్ని చూపించావు అది ఎప్పుడు మంచిదే లేదు పొరపాటు పడి పశ్చాత్తాప పడ్డావు అది కూడా ఎప్పుడు మంచిదే దాని వల్ల అదే మన మానవ సమాజం కాదు ఇవన్నీ కొంతమందిలో లక్షణాలు ఉంటాయి ఇలా పిల్లల్ని బానిసలు అనుకుంటారు బానిసల్లానే చూస్తారు.
(41:58) వీళ్ళ మరి బ్రహ్మ రాక్షసులు అనాలా రాక్షసులు అనాలా తెలియదు ఇప్పుడు ఈ సత్యాలు ఎవరు చెబుతారు మనుషులకి లేకపోతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనుకోండి మృగ ప్రపంచం అయిపోద్ది జంతు ప్రపంచం జంతు ప్రపంచంకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు వృక్ష ప్రపంచం ఉంది దానికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు అడవిల్లో చూడండి ఒక ముక్క పక్కన మొక్క మొక్క పక్కన మొక్క పెరిగేసి చెప్పండి ఇప్పుడు మనం పొలాలు పంటలు వేసామ అనుకోండి ఒక మొక్క పెరగడానికి ఎంత స్వేచ్ఛ అయినటువంటి వాతావరణం కావాలి ఎంతంత ఎంత దూరం ఉండాలి అవన్నీ చూసి పెంచుతాం ఎందుకని వివేకం ఉంది వ్యవసాయం అంటే అలాగే జరుగుద్ది చూడండి రైతులు అలాగే
(42:35) పంటలు పండిస్తారు మొక్కకి మొక్కకి మధ్య అసలు ఎంత గ్యాప్ ఉండాలి దానికి గాలి రావాలి గాలాడాలి అది చక్కగా ఎదగాలి అలా ఎదగడానికి అంత ప్లేస్ కావాలి దానికి అవసరమైన నీరు ఇవన్నీ కావాలి మీరు అడవిల్లోకి వెళ్లి చూడండి అడవిలో అసలు అలా ఉండదు ఆక్రమణే ఏ చెట్టుకి బలం ఉంటే ఆ చెట్టు బలంగా పెరిగిపోద్ది పక్క చెట్లు పోవడమే బలహీనం అయిపోతుంటాయి అందుకని వృక్షాలకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ ఆధ్యాత్మికత లేదు అలాగే జంతువులు ఏ జంతువు తనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తది ఏ జంతువుకి ఎప్పుడేమ అనిపిస్తే అప్పుడు వచ్చేస్తది ఏ పులిక ఆకలి వేస్తే ఇంకో దాన్ని చంపి
(43:16) తినేస్తది. నేను రోడ్ల మీద వెళ్తా ఉంటే ఈ ఆవుల్ని గేదల్ని అనేక రకాల జంతువులని తోలుక వెళ్తా ఉంటారు దున్నపోతులు ఇటువంటి వాటిని రైతులు తోలుక వెళ్తా ఉంటారు అడ్డం పడతా ఉంటాయి మనక అప్పుడప్పుడు రోడ్ల మీద అవి ఊరికి అలా వెళ్తూ వెళ్తూ పక్కదాన్ని పొడుస్తా ఉంటాయి పక్కదాన్ని పొడిసేటప్పటికి అది ఎగరవచ్చి పక్కనన్న బండి మీద పడింది ఒకసారి పక్కనన్న కార్ల మీద పడతాయి సరే పడిందని కాదు అసలు అది వెళ్తా వెళ్తా ఎందుకు పొడిసిందో అర్థం కాదు అది జంతు లక్షణం దానికి అప్పుడు అనిపించింది చేసింది అలాగే ఆ జంతు లక్షలాలు ఉన్న మనుషులు ఏమనిపిస్తే అది మాట్లాడుతారు ఏమనిపిస్తే అది చేస్తారు
(43:55) ఏది అనిపిస్తే అలా ఉంటారు అప్పుడు వాళ్ళు సంబంధ బాంధవ్యాల మధ్య కుటుంబాలలో ఉంటే మొత్తం కుటుంబాలు చుట్టూ అస్తవ్యస్తమే జీవితం వాళ్ళక ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టే ఉండాలింత అలా వాళ్ళు ఎక్కడ ఎవరితో ఉంటే అంతే ఇది ఎవరు చెబుతారు నువ్వు ఇంకో మనిషిని బాధ పెట్టొద్దు అలా ఒక జంతువు అలా వెళ్తూ వెళ్తూ పక్కదాన్ని పొడి చేసినట్టు పడవకూడదు ఎవరు బతుకాలి బతకాలి వీలైతే సహకారంగా బతకాలి ఎందుకని అంటే మానవ సమూహం మొత్తం ఇక్కడ బతకడానికే ఉంది.
(44:27) నువ్వు మోసం చేసి బతికితే వాళ్ళు ఎలా బతుకుతారు అప్పుడు నిన్ను ఇంకోళ్ళు మోసం చేస్తారు లేదా తిరిగి వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. ఫలితం వస్తది కర్మ సిద్ధాంతం ఉంది అందుకని సహకారంగా సహకరించుకుంటూ ఒకళళకొకళ్ళ బతికితేనే ఇక్కడ అందరూ ఆనందంగా ఉంటారు అనేది సత్యం కాదు ఆ సత్యం నీకు ఎవరు చెబుతారు ఆ విశాలత్వం నీకు ఎవరు చెబుతారు అది ఉందిగా ఇక్కడ అది నిజమేగా ఆ సత్యమేగా అది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత చెప్పుద్ది అలా చెప్పేవాళ్ళు లేనప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటారు మీరు అడవిలో చెట్లుక వెళ్తే బలమైన చెట్లు అట ఇష్టం వచ్చినట్టు పెరుగుతాయి బలహీనమైన చెట్లు
(45:02) పెరగలేక అక్కడ నానా బాధలు పడతా ఉండి ఇరుక్కుపోయి ఉంటాయి చెట్ల మధ్యలో చెట్లు చూడండి అ బలవంతుడిది రాజ్యం అయిపోద్ది ప్రకృతి కూడా అలాగే ఉంటుంది అలా జంతువులైన అంతే బలవంతుడిదే రాజ్యం జంతువుల్లో కూడా అక్కడ సముద్ర జలాల్లో అడుగున ఎన్నో రకాల జీవులు ఉంటాయి చేపలు అనుకోండి అక్కడ కూడా బలమైందే పెద్ద చేప చిన్న చేపను తినే అసలు ఎందుకని చెప్పేవాళ్ళు లేరు అది అలాగే జీవించాలని సృష్టి నిర్ణయం కానీ మనిషికి జ్ఞానం ఉంది మనిషికి చెప్పొచ్చు చెబితే అర్థం చేసుకోవచ్చు కానీ చెప్పేవాళ్ళు కావాలిగా ఆ జ్ఞానయుతమైన వాళ్ళు తనను తాను పరిశీలించుకున్న వాళ్ళు
(45:42) ఇది ఎలా చెప్పగలుగుతున్నారుఅంటే ఎదుటోళ్ళు పరిశీలించి కాదు తనను తాను పరిశీలించుకున్నారు నా కోపాన్ని నేను అదుపు చేసుకోవచ్చు నాలో ఉన్న ఈశు ద్వేషాలను అదుపు చేసుకోవచ్చు నాలో ఉన్న చెడు లక్షణాలు అన్నింటిని అదుపు చేసుకోవచ్చు ఆ పవర్ నాలో ఉంది అదేం పెద్ద విషయం కాదు నేను కావాలని ఎడాపెడా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతో పోతున్నా అలా అదుపు చేసుకోవచ్చని అదుపు చేసుకొని మంచిగా బ్రతికారు బ్రతికి చూపించారు వాళ్ళు ఆధ్యాత్మికతని చెప్పారు ఇదిగో మేమఇలా మమ్మల్ని మేము అదుపు చేసుకొని మమ్మల్ని మేము ఇలా అన్ని అర్థం చేసుకొని చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండి చెడు
(46:18) లక్షణాలు బయటకి వ్యక్తీకరించకుండా తొలగించుకొని చెడుని మంచితో బతికి సఖ్యతతో బతికి అందరితో సహోదర భావంతో బతికి కుటుంబ సభ్యులందరితో కలిసి మెలిసి బతికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఇబ్బంది పడకుండా హాయిగా జీవించాము దాని కోసం మేము సంతృప్తిని పొందాము అంటే ప్రతి విషయంలో తృప్తిని అలవాటు చేసుకున్నాము అత్యాశ దురాశలు వదిలేసాము అని వాళ్ళు ఏమేమి చేశారో ఏమేమి చేస్తే అలా ఈ సమాజం చక్కగా బతుకుతుదో ఆ సత్యాలన్నీ చెప్పారు సత్యాలు మనిషి చేయగలిగినవేగవి చెడులన్నీ మనిషి చేస్తున్నవేగా మంచులన్నీ మనిషి చేయగలిగినవేగా అందుకని చేస్తున్న వాటిని చెడుల్ని
(46:59) చెబుతున్నారు చేయగలిగిన మంచులని చెబుతున్నారు ఎలా ఎలా చేయొచ్చో చెబుతున్నారు. మనని మనం ఎలా అదుపులో ఉంచుకోవచ్చో చెబుతున్నారు ఎదుటి వాళ్ళ గురించి కాదు అసలు ఆధ్యాత్మికత మన గురించి వ్యక్తిగతం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వింటున్న ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతం ఒకళ్ళకే ఇప్పుడు మీరు చెబుతున్న ఇదంతా నాకే నా ఒక్కడికే ఇది వర్తిస్తది నాకు నేనే చెప్పుకుంటున్నా వింటున్న అందరికీ ఎవరికి వాళ్ళకే వర్తిస్తది అలా ఆధ్యాత్మికత వ్యక్తిగతం సామూహికం కాదు బోధలు కాదు బోధ అయితే అసలు ఉపయోగం లేదు ఎదుటోడికి చెప్పేదంతా వేస్ట్ ఆచరించేదే కరెక్ట్ అందుకని ఎవరికి వాళ్ళకి ఆచరించుకోవడానికి
(47:37) మేము ఇలా ఆచరించుకున్నాం మీరు కూడా ఇలా ఆచరించుకొని మీ జీవితాలను చక్కగా ఉంచుకోవచ్చు అని ఆచరించుకున్న మహాత్ములు చెప్పిందే వాళ్ళు పెట్టిన పేరు ఆధ్యాత్మికత ఎందుకని భౌతిక జీవితంలో నీకు నీ ఇష్టం వచ్చినట్టు పోతున్నావ్ అక్కడ ఇంకా చెప్పడం లేదు వినటం లేదు నిన్ను నువ్వు గమనించుకోవడం లేదు నిన్ను నువ్వు పరిశీలించుకోవటం లేదు నిన్ను నువ్వు తెలుసుకోవటం లేదు నిన్ను నువ్వు మార్చుకోవటం లేదు నువ్వు అనుకుంటున్న చెడు నీ సత్యం ఎవరు ఎక్కడ ఎలా జీవిస్తుంటే ఆ చెడు చేస్తూ జీవిస్తుంటే అదే సత్యం అనుకొని వెళ్ళిపోతున్నారు అదే భౌతిక జీవితం అందులోన మంచిగా కూడా చేయొచ్చు కొంచెం మంచి
(48:12) చెడులు కలయకతో వెళ్ళిపోతున్నారు. అది భౌతిక జీవితం నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను కాదు చెడు చేయకూడదు ఓన్లీ మంచిగానే ఉండాలి. చెడు వల్ల నీకే కర్మ రజిటాలు వస్తాయి ప్లస్ బయట వాళ్ళు బాధపడతారు. కలిసి మెలిసి బ్రతకడం కుదరదు సమాజం ముక్కలు ముక్కలుగా విడిపోద్ది అలా విడిపోయిన సమాజం ఇప్పుడు కూడా మంది కులాల పేరు మీద విడిపోయాం మతాల పేరు మీద విడిపోయాం జాతుల పేరు మీద విడిపోయాం ఎక్కడ విడిపోలేదు దేవుళ్ళ పేరు మీద విడిపోయాం ఎవరు మతాలు వాళ్ళకి ఎవరు దేవుళ్ళ వాళ్ళకి ఎవరు దేవతలు వాళ్లకి ఎవరు గురువులు వాళ్ళకి ఎవరు సాధనా మార్గాలు వాళ్ళకి మానవజాతిని ఆఖరికి మంచి పేరుతో
(48:52) దేవుడి పేరుతో కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు ఈ మహానుభావులు ఎవరు ఈ ఆధ్యాత్మిక సత్యం అర్థం కానటువంటి ఆధ్యాత్మిక తన పేరుతో ముసుగులో నడుస్తున్నటువంటి మహానుభావులన్న ముసుగేసుకున్న దొంగ మహాత్ములు దొంగ మహానుభావులు దొంగ మహాత్మురాళ్ళు మంచిోళ్ళు అలా ఎందుకు చేస్తారు మానవజాతిని విడదీయరు అసలు మంచివాడికి ఎప్పుడు కూడా మతం ముఖ్యం కాదు మంచివాడికి ఎప్పుడు దేవుడు ముఖ్యం కాదు మంచి వాళ్ళకి ఎప్పుడు దేవత ముఖ్యం కాదు మంచి వాళ్ళకి ఎప్పుడు జ్ఞాన గ్రంథం ముఖ్యం కాదు మంచి వాళ్ళకి ఎప్పుడు తన కులం తన జాతి ముఖ్యం కాదు కాదు మంచివాళ్ళకి
(49:27) ఎప్పుడు మొత్తం మానవ సమాజం కలిసి ఉండటం మానవ లోక కళ్యాణం ముఖ్యం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినోభవంతు ఇప్పుడు కులములు మతములు జాతులు ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్న వ్యావహారిక సత్యములు నిజాలు కానే కాదు అసలు అలాగే దేవుళ్ళు దేవతలు మతాలు విధానాలు కూడా మనుషులు ఏర్పరచుకున్న వ్యావహారిక సత్యాలు మంచిగా బతకడానికి ప్రయత్నించడానికి ఏర్పా చేయబడిన వ్యవస్థలు వ్యవహారిక సత్యాలు వ్యావహారిక సత్యాల్లోనుంచి నిజ సత్యంలోకి ప్రయాణించడానికి అవి తయారు చేశారంట కానీ మనం విడిపోతానే ఉన్నాం ఇంకా విడగొడతానే ఉన్నారు మళ్ళీ కొత్త గురువులు వస్తున్నారు
(50:10) కొత్త విధానాలు పెడుతున్నారు కొత్త దేవుణ్ణ తీసుకొస్తున్నారు కొత్త సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు కొత్త సాధనా విధానాలు ఎందుకని నేను ఎవరైనా ఒక కొత్తది సృష్టిస్తున్నారు అంటే అది నేను నేనును బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అది ఎక్కడైనా అంటే భౌతికంలోన అంటే ఆధ్యాత్మికంలోన ఇదంతా ముక్కలు ముక్కలుగా చేసే ప్రాసెస్ అంతా ఆధ్యాత్మికం కాదు నువ్వు మతం పేరుతో విడగొట్టిన దేవుడి పేరుతో విడగొట్టిన నువ్వు సాధన మార్గాల పేరుతో విడగొట్టిన మనుషులందరూ ఒక్కటే అని సత్యాన్ని వాళ్ళకి చెప్పకుండా ఏ రకంగా వాళ్ళని విడగొట్టినా నువ్వు చేస్తుంది తప్పే ఆధ్యాత్మికత అంటే
(50:49) మానవులందరూ కలిసి మెలిసి ఉండేలా నువ్వు బోధించగలగాలి అప్పుడు ఆ మతం రైటా గురువు రైటా ఆ గ్రంథం రైటా దేవుడు రైటా దేవత రైటా ఎందుకని వాళ్ళు నీ ఆలోచనని విశాలం చేస్తున్నారు సత్యాన్ని అర్థం చేసుకోన్నారు నిజంగా మనుషులందరూ ఒకటేగా కులం మతం జాతి ఇవన్నీ మనం పెట్టుకున్నాయే తప్ప మనిషి శరీరంలో కులం ఎక్కడ కనబడుద్ది మతం ఎక్కడ కనబడుద్ది మనిషి శరీరంలో కనబడుద్ది చెప్పండి మనిషి నుంచి ఉంటే మీరు ఏ మతమో చెప్పగలరా చెబుతారు వాళ్ళ ఆ మతపు చహనాలు ధరించి ఉంటే చెబుతారు వాళ్ళ బట్టలు బొట్లు వాళ్ళ వేషధారణను బట్టి చెబుతారు అలా కాకుండా అందరూ ఒక 10 మంది అందరూ
(51:25) మామూలు బట్టలు వేసుకొని నుంచున్నారు 10 మంది 10 రకాల మతాలు 10 రకాల కులాలు 10 రకాల జాతులు ఎవరో చెప్పగలరు మీరు 10 మందికి ఒకే రకంగా డ్రెస్సులు వేసాం మొత్తం వేష భాషలన్నీ ఒకే రకంగా పెట్టాం మీరు కనిపెట్టగలరు వాళ్ళది ఏ మతమో వాళ్ళు ఏ దేవుణని పూజిస్తారో వాళ్ళది ఏ కులమో ఎందుకని కనిపెట్టలేరు ఎందుకంటే మనిషి ఉంటాడు మనిషి సత్యం సృష్టిలో ఎవరున్నారు మనుషులు ఉన్నారు మానవ జాతి ఉంది వృక్ష జాతి ఉంది జంతు జాతి ఉంది అలా మనుషులు ఉన్నారు.
(51:58) సృష్టిలో కులాలు ఎవరు పెట్టారు మనుషులు పెట్టుకున్నారు. జాతులు ఎవరు పెట్టారు మతాలు తెగలు ఎవరు తయారు చేశారు మనుషులు చేశారు. దేవుళ్ళు దేవతలు ఎవరు తయారు చేశారు మనుషులు చేశారు. సృష్టిలో మనిషి ఉన్నాడు మిగిలినవి ఏమ లేవు వ్యవహారిక సత్యములు మొట్టమొదటలో చెప్పుకున్నాం భావ వ్యక్తీకరణకు భాష అవసరమైందని భాషలు మనుషులు తయారు చేసుకున్నారు భాష వ్యవహారిక సత్యం అక్షరాలు వ్యవహారిక సత్యం పదాలు వ్యవహారిక సత్యం పేర్లు వ్యవహారిక సత్యం మూలం భావ వ్యక్తీకరణ అంటే ఒక మనిషికి ఒక మనిషి చెప్పేది అర్థం అవ్వాలి ఎందుకు కలిసి మెలిసి బ్రతకాలి కలిసి మెలిసి బ్రతకడానికి భావ వ్యక్తీకరణం
(52:39) ఒకళళ ఒకళ్ళ తెలియడానికి భాషలు తయారు చేసుకున్నాం. సేమ్ అలాగే కూడా కులాలు మతాలు జాతులు విధానాలు దేవుళ్ళు దేవతలు ఇది కూడా అంతే కలిసి మెలిసి బ్రతకడానికి మనుషులు విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యాలయాలు అవి మనల్ని విడదీసేటువంటి అజ్ఞానాలయాలు అయితే ఇంకా ఏం చేయాలి ఎలా? అవి వెడగొట్టకూడదు మనుషులని కలపాలి ఎందుకని మనిషిగా మానవ జాతిగా సృష్టి మనల్ని కలిపే ఉంచింది.
(53:11) మనం మానవులం ఇంకోటి వృక్ష జాతి ఉంది ఇంకోటి జంతు జాతి ఉంది. మానవులుగా ఒకటే సృష్టిలో అందరూ ఒకటే మతాలుగా విడిపోతే ఎట్ట మళ్ళీ దేవుళ్ళ పేర్ల మీద విడిపోతే ఎట్ట గురువుల పేర్ల మీద విడిపోతే ఎట్ట సిద్ధాంతాల పేర్ల మీద విడిపోతే ఎట్ట పద్ధతుల పేర్ల మీద విడిపోతే ఎట్ట అసలు అక్కడ సత్యమే కాదుగా సిద్ధాంతం సత్యం కాదు లేదుగా అక్కడ సిద్ధాంతం నువ్వు తయారు చేసిన రాద్దాంతం నీ బురవలో పుట్టిన పురుగు మతాలంతే మార్గాలు అంతే అన్ని అంతే కాదు సృష్టి సత్యానికి తీసుకెళ్ళిపో అదే ఆధ్యాత్మికత ఏంటంటే మానవ జాతి అంతా ఒకటే మానవులందరూ ఒకటి అందరూ కలిసి మెలిసి బతికితేనే మానవ జాతి బాగుంటది. అలా
(53:52) బతుకుతూ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మళ్ళీ వినియోగించుకొని బతకాలి నువ్వు కాబట్టి మొత్తం సృష్టిని నువ్వు నాశనం చేయకుండా బతకాలి ఇక్కడ అంటే దాన్ని కూడా ప్రేమించాలి మానవ జాతిని ఎలా ప్రేమించి ఒకరికొకరు ఉపయోగపడుతూ ఉంటావో అలాగే నువ్వు వృక్ష జాతితో కూడా అలాగే ఉండాలి వృక్షాలు నీకు కావలసినన్ని ఇస్తున్నాయి నువ్వు తిరిగి వృక్షాలను పెంచుతూ ఉండాలి.
(54:14) వాటిని రక్షిస్తూ ఉండాలి అలాగే అనేక జంతు జాతులు మనకు ఉపయోగపడుతున్నాయి తిరుగును మళ్ళీ జంతు జాతులను వినాశనం చేయకుండా వాటిని బ్రతకనివ్వాలి బ్రతికించాలి వాటికి మేలు చేయాలి అలా ప్రకృతికి నువ్వు నిరంతరం ప్రకృతిని ఉపయోగించుకుంటున్నావు గనుక ప్రకృతిని పాడు చేయకుండా మళ్ళీ ప్రకృతి బాగుండేలాది నువ్వు చేయవలసినవి కూడా చేయాలి. అలా అంతా కలిసి మెలిసి బ్రతకాలి.
(54:39) ఆ సత్యాన్ని ఆధ్యాత్మికత ఒకటే చెప్పుద్ది మనుషులు చెప్పరు మనుషులు మతాలతో విడిపోయారు దేవుడితో విడిపోయారు కులాలతో విడిపోయారు జాతులతో విడిపోయారు ఆఖరికి ప్రతి మనిషి ఇంకో మనిషితో అహంకారంతో విడిపోయాడు అహంకారం భార్యా భర్తలే శారీరక సంబంధాన్ని మించిన దగ్గర సంబంధం ఇంకోటి ప్రపంచంలోనే లేదు కానీ అహంకారం శరీరాలు కలవడానికి ఒప్పుకుంటుంది ఎందుకని సుఖం ఉంది కాబట్టి కానీ కలిసి బ్రతకడానికి ఒప్పుకోవట్లే అందుకని రోడ్ల మీదకి వెళ్లి మా ఆవిడ ఎలా మా ఆయన ఎలా అని చెబుతా ఉంటారు. లేదా విడిపోతా ఉంటారు.
(55:14) ఏదో ఒకటి అహంకారం మనుషులని కలవనివ్వట్లే ఆ నాయనా అహంకారం తప్పు తల్లి అహంకారం తప్పు అది చెడు అలా అహంకారంతో బతకకూడదు కలిసి మెలిసి బతకడమే ఇక్కడ సత్యము అని చెప్పేది ఎవరో అలా లేకపోతే మనం ఇబ్బందులు పడతాము. కలిసి మెలిసి బతకపోతే మొత్తం సృష్టి అంతా ఇబ్బందులకు లోనైపోద్ది మానవజాతి మొత్తం ఇబ్బందులకు లోనైపోద్ది నువ్వు నేనే కాదు అలా మనమే ఇబ్బందులు పడతాము కాబట్టి కలిసి మెలిసి బతికే సంస్కృతిని మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పు మన చుట్టూ ఉన్నవాళ్ళకి నేర్పుతూ ఉంటే అది ఆధ్యాత్మికత లేకపోతే ఎడాపెడా ఎవరు ఇష్టం ఇచ్చినట్టు బతుకుతారు అందుకని ఆధ్యాత్మికతని
(55:58) తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసుకున్న తమలో తాము తెలుసుకున్న మహాత్ములు చెప్పారు తెలుసుకునేటప్పుడు కలిసి మెలిసి ఉంటాం మనం బాగుంటాం అందరూ బాగుంటారు ఒక విశాల ఆలోచన ఉంటది అంటే కులాలను దాటేసి మతాలను దాటేసి దాటేయడానికి అక్కడ ఏమ లేవు మనం ఏర్పాటు చేసుకున్న వ్యవహారిక సత్యాలు భ్రమలో కులం అనేది భ్రమ ఒక మనిషిని చూసి ఏ కులమో చెప్పండి మీరు చెప్పరు అడుగుతారు ఏ కులం అని లేదా వాళ్ళ ఇంటి పేర్లు ఆ పేర్లను పెట్టి పేరు అడిగి చెబుతారు ఏ కులం అని కులం మనిషి ముందు కనబడదు మనిషిని చూసి కులం కనపడదు మతం కనపడదు జాతి కనపడదు ఏ దేవుని పూజిస్తాడో కనపడదు ఏ దేవతను
(56:38) పూజిస్తాడో కనపడదు ఏ గురువుని అనుసరిస్తాడో కనపడదు మనిషిని చూస్తే ఏం కనపడదు మనిషి మనిషిగా ఉంటాడు ఎందుకని అవి లేనివి మనిషి నిజం మానవ జాతి నిజం ఆ మూలానికి వెళ్ళిపోయినప్పుడు అందరం కలిసి మెలిసి ఉన్నవి వ్యవహారిక సత్యాలు ఒకవేళ మతం ఉంటే ఉండొచ్చు గుర్తింపు కోసం వ్యవహారిక సత్యం అంతే కులం ఉంటే ఉండొచ్చు గుర్తింపు కోసం అది వ్యవహారిక సత్యం అది ప్రాపంచిక సత్యం అది నిజమైపోకూడదు కులాల కుమ్ములాట్లన్నీ అది నిజమైపోయి కులాలు కొట్టుకుంటున్నారు మతాలతో కొట్టుకుంటున్నారు జాతుల పేరు మీద కొట్టుకుంటున్నారు దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటున్నారు దీన్ని మించిన అజ్ఞానము
(57:14) దీనిని మించినటువంటి అన్యాయం అసలు ప్రపంచంలో ఉంటదా ఇదే భౌతికం భౌతికం అంటే ఏంటి అసలు జ్ఞానమే పని చేయట్లే బుర్ర పోయింది అందరికి బుద్ధి పోయింది అందరికి లేని దాని కోసం కొట్టుకుంటున్నారు. అసలు కులం అక్కడ లేదు మతం అక్కడ లేదు జాతి అక్కడ లేదు దేవుడు అక్కడ లేడు దేవత అక్కడ లేదు నేను అలా ఎవరిని విమర్శించట్లే ఇవి మనం చేసుకున్న ఏర్పాట్లు వాటి పేరు మీద మనం కొట్టుకోవడం ఏంటి విడిపోవడం ఏంటి అవన్నీ మనల్ని కలపడానికి ఉపయోగపడాలి అవి వ్యవహారిక సత్యాలు దేవుళ్ళు దేవతలు మతాలు మార్గాలు గురువులు జ్ఞాన గ్రంథాలు అన్నీ కూడా నిజమైనవన్నీ కూడా మానవ జాతిగా నిన్ను నిజమని
(57:52) చెబుతున్నాయి నీతో విభేదం అనేది లేదు కాతే విభేదంగా ా ఉన్నది వృక్షజాతి మళ్ళీ అది కూడా నీకు ఉపయోగపడేదే నువ్వు బ్రతికేది దాని మీదే నీలాంటి ఆకృతిలో లేదు అది నీకు ఉపయోగపడేల కాయలు పళ్ళు ఫలాలు సృష్టిస్తుంది నువ్వు బ్రతకడానికి నీకు కావలసిన ఆక్సిజన్ సృష్టిస్తుంది నువ్వు బ్రతకడానికి అలా పంచభూతాలు నీకు ఉపయోగపడే ప్రకృతి ఇది పంచభూతాత్మక ప్రకృతి అంతే అలా మూల తత్వానికి తీసుకెళ్తారు నిన్ను ఆధ్యాత్మికతకు విశాలంగా మొత్తం సృష్టి గూర్చి చెప్పుద్ది లేకోతే నువ్వు నా వరకు నేనని భౌతికంలో పరిమిత తత్వంలో ఇరుక్కుపోయి అజ్ఞానంలో ఇరుక్కుపోయి ఒక
(58:28) కులం పేరు మీద గొడవ ఒక దేవుడి పేరు మీద గొడవ ఒక గురువు పేరు మీద గొడవ ఒక జ్ఞాన గ్రంథం పేరు మీద గొడవ ఆఖరికి అహంకారంతో భార్యా భర్తల మధ్య గొడవ తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవ ఇంకా గొడవ లేని బంధం ఎక్కడఉంది మనిషికి మనిషికి పెట్టలే అహంకారం వచ్చేసింది ఆధ్యాత్మికత ఉన్న చోట అహంకారం ఉండదు అహంకారం ఉన్నచోట ఆధ్యాత్మికత ఉండదు.
(58:50) సింపుల్ అందుకనే ఆధ్యాత్మికతను తెలుసుకోవాలి అహంకారం లేని చోట అందరూ కలిసి మెలిసి ఉంటారు. అందరూ ఒకటి అవుతారు. అందరూ ఒకట అయితేనే మానవజాతి హాయిగా వెళ్ళిపోద్ది. కుటుంబం ఒక కుటుంబం అయినా అందరూ ఒకటిగా ఒక మాట మీద ఉంటే హాయిగా వెళ్ళిపోద్ది ఒకరినొకరు ప్రేమించుకుంటే ఒక సమాజం అయినా ఒకటిగా ఉంటే హాయిగా వెళ్ళిపోద్ది అంటే మొత్తం ప్రపంచం మానవ జాతి ఒకటిగా ఉంటే హాయిగా వెళ్ళిపోద్ది.
(59:17) ఇది అహంకారం లేని చోటే కుదురుద్ది. అహంకారం లేని చోటు ఆధ్యాత్మికత ఉండాలి ఆధ్యాత్మికత ఉంటేనే అహంకారం లేకుండా ఉంటది ఆధ్యాత్మికత అర్థమైనోళ్ళు అహంకారాన్ని రూపుమాపుతారు. అహంకారంతో ప్రవర్తించరు అందుకని అహంకారం చోట ఆధ్యాత్మికత ఉండదు ఆధ్యాత్మికత చోట అహంకారం ఉండదు అహంకారం అనేది విడిపోయేది ఆధ్యాత్మికత అనేది కలిపేసేది. కాబట్టి మీరు కలిసి మెలిసి హాయిగా సంతృప్తిగా ఉండాలంటే అది మీ కుటుంబంలో అయినా మొత్తం ప్రపంచంలో అయినా మీకు ఆధ్యాత్మికత తెలియాలి.
(59:49) అలానే అది సత్యమే చెబుతుంది అది కల్పన కాదు మహిమలు మహిమలు అద్భుతాలు అసలు అక్కడ లేవు మీరు ఎక్కడ విడిపోతున్నా అది భౌతికం మీరు ఎవరితో విడిపోతున్నా అది భౌతికం మీరు ఏ పేరు మీద విడిపోతున్నా అది భౌతికం మీరు ఎక్కడ కలుస్తున్నా అది ఆధ్యాత్మికం కలయకలన్నీ ఆధ్యాత్మికాలే అలా మొత్తంగా మానవ సమాజంతో మొత్తం సృష్టితో కలిసిపోతారు మీరు ఆ సృష్టి మొత్తంతో మిమ్మల్ని కలిపేస్తది ఆఖర్ల ఆధ్యాత్మికం ఎంత కలిపేస్తది అంటే అసలు అసలు ఈ సృష్టి శక్తిని నేనే అని తెలుస్తుది నాకు అది కూడా సత్యమే అదే ఆత్మానుభవం ఆత్మ సాక్షాత్కారం ఈ సృష్టి శక్తి విశ్వ శక్తి అదంతా ఏక
(1:00:28) శక్తే అది నేనే అహం బ్రహ్మస్మియం ఆత్మ బ్రహ్మ అని తెలుసు అంత తెలియజేస్తది ఆధ్యాత్మికత ప్రాపంచికంగా హాయిగా బతకడానికి సహకరిస్తది ప్రాపంచికంగా మంచిగా బతకడానికి ప్రోత్సహిస్తది అలా ప్రోత్సహిస్తూ చక్కగా బతికినన్నాళ్ళు ఆనందంగా హాయిగా సంతృ తృప్తిగా దుఃఖం లేని జీవితం జీవించడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తది.
(1:00:56) అలా అందిస్తూ మొత్తం సృష్టి అంతా ఒకటే ఉన్న శక్తి అంతా ఒకటే దాంట్లో భిన్నత్వమే లేదు అది నువ్వే నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పుద్ది మనలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మ శక్తి అని చెప్పి ఆ ఆత్మ శక్తి ఎరుకను కలిగించి మొత్తం సృష్టికి ఏకత్వ భావం తెప్పిస్తది. అదంతా నిజమేది మనలోనే ఉన్నదే ప్రాణశక్తి జస్ట్ జ్ఞానం తెలుసుకుంటే చాలు ఆ జ్ఞానాన్ని అందించేది ఆధ్యాత్మికత తెలుసుకోపోతే ఏంటంటే ఇంకా విడిపోతూ బతుకుతాం అహంకారాలతో బతుకుతాం అహంకారం ఎక్కడఉందో అక్కడ అన్ని రకాలు విడిపోవడం అహంకారం అంటే అసలు ఏ మనిషితోన కలవలేం భార్య భర్త తల్లి తండ్రి ఇంట్లోన కలవలేం బయటా కలవలేం
(1:01:33) అహంకారం భౌతికం అహంకారమే భౌతికం భౌతిక జీవితం అంతా అహంకార ఆలంబ గా సాగుద్ది అహంకారాన్ని పెంచుకుంటూ సాగుద్ది. ఆధ్యాత్మికం అహంకారాన్ని అంతం చేస్తది అహంకారం విడదీస్తది ఆధ్యాత్మికత కలుపుతది అందుకని తెలుసుకోవాలి అందులో ఒక భాగం మంచిగా బతకడం మంచిగా బతకపోతే ఏమవుతుంది మంచి ఆధ్యాత్మిక సాధన అన్నారు ఏంటి అంటే మంచి ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి మంచిగా బతకాలంటే నన్ను నేను కంట్రోల్ లో ఉంచుకోవాలి.
(1:02:09) నా మనసుని నా ఆలోచనల్ని నా బుద్ధిని నా కోరికల్ని నాలో ఉన్నటువంటి ఆ సమస్తాన్ని అదుపులో ఉంచుకొని నేను ఎవరికీ చెడు చేయకుండా జీవించగలుగుతున్నాను అంటే చాలా కంట్రోల్ పవర్ వచ్చింది నాకు అది ఆధ్యాత్మికతలో నుంచి వస్తది. అలా మంచిగా బతికినప్పుడు అది ఆధ్యాత్మిక జీవితం అలా మంచిగా ఎవరు బతకగలరుంటే ఆధ్యాత్మిక తెలుసుకున్నవాళ్ళు అందుకని మంచిగా బతకడమే ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక జీవితం మీరు ఆధ్యాత్మిక సాధనలు నేనేదో చేస్తాను ముక్కు మూసుకు కూర్చుంటాను లేకోతే ధ్యానాలు తపస్సులకు ఆధ్యాత్మిక సాధనలు పేర్లు పెడతాను లేదా రకరకాలుగా చెబుతున్నారు మీరు ఎన్ని సాధనలు ఎటు చెప్పుకున్నా అది
(1:02:45) ఆధ్యాత్మికత కాదు ఆధ్యాత్మికతలోకి మీరు ప్రవేశించడానికి అవి ఉపకరించొచ్చు ఉపకరణాలు ఇప్పుడు ఒక కూర అనే వండాలి మనం కూర ఎక్కడ ఉండాలి ఇప్పుడు మనకు కావల్సింది కూర మనకు కావాల్సింది అన్నం మనకు కావాల్సింది పచ్చడే మనకు కావాల్సింది అపడాలు వడియాలు మనకు కావాల్సింది తినటానికి ఆహార పదార్థాలు ఇవన్నీ వండుకోవాలి తయారు చేసుకోవాలి ఎక్కడ చేయాలి ఇప్పుడు కూర వండుకోవడానికి ఒక పాత్ర కావాలి పాత్రను తినం మనం అసలు ఎప్పుడు పాత్రను వండుకోవడానికి ఉపయోగిస్తాం అంతే మనం తినేది కూరగాయల్ని ఆహార పదార్థాలను వండుకున్నాటిని అన్నిటికి పాత్రలు కావాలి ఆ పాత్రలో సాధనా మార్గాలు ఆ పాత్రలు మతాలు
(1:03:29) ఆ పాత్రలు మార్గాలు ఆ పాత్రలు మిగిలినన్ని అందులో వంటకం జ్ఞానం అది మనం తినాలి పాత్రలను పట్టుకల బాగకుండా అవన్నీ పాత్రలో వంటకం ఇక్కడ మెయిన్ అదే ఆధ్యాత్మికత అదే మంచి అంతే తప్ప ఇవి గొప్పవి కాదు అది ఆధ్యాత్మికం కాదు నువ్వు కళ్ళు మూసుకు కూర్చుంటే ఆధ్యాత్మికం కాదు ఏ పేరు మీద కూర్చో ఏ సాధన చెయ్ ఏ గురువుతో వెళ్ళు ఏ మతంతో వెళ్ళు ఎన్ని రకాల సాధన మార్గాలు చేయ దాన్ని ఆధ్యాత్మికం అనరు అవి పాత్రలో అందులో ఉండిన వంటకం నాకు తినటానికి ఉపయోగపడాలి నేను ఎప్పుడు పాత్రలు తినటానికి ఉపయోగించుకుంటాను మళ్ళీ పాత్రలు శుభ్రం చేసి అక్కడ పెడతాను మళ్ళీ అందులో
(1:04:12) వండుకుంటాను. అలాగే సాధనా మార్గాలు ఏం చెబుతున్నారో మనం ఏవి సాధనలు చేస్తున్నామో అవన్నీ పాత్రలు ఇప్పుడు మనం ఇలా చెప్పుకోవడం వాడు పాత్రే ఈ శీర్షికలు చెప్పుకోవడం కూడా పాత్ర కానీ దీని ద్వారా మంచిని మీరు ఆచరించుకోగలిగితే మీరు ఆహారం తిన్నట్టు జ్ఞానాహారం తిన్నట్టు అందుకని జ్ఞానాహారం తినటం అనేది ఆధ్యాత్మికతలో జరుగుద్ది ఆధ్యాత్మికత అంటే ఏంటి మంచిని ఆచరించడం నా జీవితంలో సాధనలు ఆధ్యాత్మికత కాదు దేవుడు ఆధ్యాత్మికత కాదు మతం ఆధ్యాత్మికత కాదు గురువు ఆధ్యాత్మికత కాదు జ్ఞాన గ్రంథం ఆధ్యాత్మికత కాదు మనం వేసుకునే వేష భాషలు ఆధ్యాత్మికత కాదు
(1:04:51) అవన్నీ పాత్రలో ఆహార పదార్థాలు వండడానికి అనేక పాత్రలు ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కున్నారు ఎవరికి నచ్చిన ఆహార పదార్థాలు వంటకాల చేసుకున్నారు ఇంతకే వండిన వంటకాల తింటారు పాత్రలు ఎవరో తినరు పాత్రలు అసలు ఉపయోగమే లేదు మళ్ళీ కడిగేసి పాత్రలు పక్కన పెట్టేస్తాం మళ్ళీ రేపు వంట వండుకోవాలిఅనుకున్నప్పుడే పాత పాత్రతో పని ఉంది అలాగే ఈ సాధనా మార్గాలు ఈ మతాలు గురువులు దేవుళ్ళు జ్ఞాన గ్రంథాలు ఈ బోధలు మొత్తం ఎన్ని ఉంటాయని ప్రపంచంలో ఇవన్నీ కూడా పాత్రలు ఆ పాత్రల్లో ఉండబడిన జ్ఞానాహారం నీదాకా వచ్చి నువ్వు తిని నువ్వు మంచిగా బతికినప్పుడు
(1:05:32) మంచిగా బ్రతుకుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళకి మేలు చేస్తున్నప్పుడు అది ఆధ్యాత్మిక జీవితం అంటే సాధనల ఫలం ఆధ్యాత్మిక జీవితం అంతే తప్ప సాధనలు ఆధ్యాత్మికం కాదు నువ్వేదో నీకు చూసిన ప్రార్థనాలయానికి రోజు వెళ్లి రావడం ఆధ్యాత్మికం కాదు ఆ బట్టలు కట్టుకోవడం ఆ డ్రెస్సులు వేసుకోవడం ఆ వేష భాషలు తగిలించుకొని తిరగటం ఆ బొట్లు పెట్టుకోవడం లేదా బొట్లు తీసేయడం గుళ్ళు కొట్టుకోవడం లేదా జుట్లు పెంచేయడం ఇదంతా ఆధ్యాత్మికం కాదు కాదు కాదు ఆయన్ని ఆచరించడం మంచి ఆధ్యాత్మికం ఎందుకని ఆచరించేవాళ్ళందరూ ఆచరణలోకి వచ్చేటప్పటికి
(1:06:12) ఏమ అవ్వాలి మంచి అవ్వాలి ఎవరితో ఘర్షణలు ఎవరితో గొడవలు లేవు ఇతరులకి అవసరమైతే మేలే చేస్తాం అందరితో కలిసి మెలిసి ఉండం ఎవరిని బాధ పెట్టం మనం బాధపడం అప్పుడు మంచే కాది మంచిగలోనే కాదు కుదిరేది దాన్నే మంచి అంటారు. అసలు ఎవ్వరికీ చెడు చేయని జీవితం మాట ద్వారా చేత ద్వారా దేని ద్వారా అవ వీలైతే మంచి కూడా చేస్తాం మనం చేయగలిగిన మంచి ఎప్పుడు చేస్తాం దాన్ని ఆధ్యాత్మిక జీవితం అంటారు అందుకని మంచే ఆధ్యాత్మిక సాధన మంచి మంచిగా జీవించడం నిజమైన ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మికత ఎందుకు తెలుసుకోవాలంటే మంచిగా జీవించాలంటే ఆధ్యాత్మికత తెలుసుకోవాలి లేకపోతే సత్యం తెలియదు నా
(1:06:54) సంపూర్ణ సత్యవేసలు నాకు తెలియదు నేను శాంతిగా బ్రతకడమే కుదరదు అందుకనే ఆధ్యాత్మిక తెలుసుకోవాలి. ఆలోచించి చూడండి అర్థం కాకపోతే అంటే ఆలోచించి బాగుంది అనుకొని కొంత అర్థంఅవుతుంది మేము మమ్మల్ని మంచిగా మలుచుకుంటున్నాము అని అనుకొని అలా సాగుతున్న వాళ్ళకి అలా సాగేటువంటి మార్గాలలో ఏదైనా సందేహం వస్తే మళ్ళీ అడగండి విశ్లేషించుకుందాం.
(1:07:22) ఈ విశ్లేషణ కేవలం మనని మనం మంచిగా ఉంచుకోవటానికి మాత్రమే మన సంపూర్ణతను మనం తెలుసుకోవడానికి మాత్రమే ఆధ్యాత్మికత వ్యక్తిగతం సామూహికంగా అసలు కాదు ఎవరికి వాళ్ళకి చెప్పేవాడికి నాకు వ్యక్తిగతమే వినేటువంటి మీకు వ్యక్తిగతమే ఎవరినాళ్ళు చూసుకోవడమే లోపలికి మనం సరి చేసుకోవడం మనలో చెడు పోగొట్టుకోవడం మంచిని పెంచుకోవడం దానికి మీరు ఏ సాధనలు చేసుకున్నా పర్వాలేదు సాధనలన్నీ పాత్రలు వండుకుని తినాలి మనం ఆ వండుకున్నది తినటమే మంచిని ఆచరించడం అదే జ్ఞానాహారం ఆ జ్ఞానాహారాన్ని అందించేది ఆధ్యాత్మికత ఇలా ఏదైనా సందేహం ఉంటే అడగండి ఇలా మంచిని
(1:08:06) విశ్లేషించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం ఇది నచ్చని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు సరిగ్గా చెప్పలేదనే భావన ఉన్నవాళ్ళు కొంతమందికి ఊరికనే వ్యతిరేకత ఉంటది అంతే ఏమ ఉండదు వ్యతిరేకత ంటే నేను పట్టుకున్న కుందీలకి మూడో కాళ్ళు ప్రపంచంఅంతా నన్నే అనుసరించాలి నేను చెప్పేది రైట్ నేను చెప్పేది కరెక్ట్ అని ఉంటది.
(1:08:30) అటువంటి వాళ్ళు పాపం ఎవరికన్నా తారస పెడితే ఇప్పుడు వాళ్ళ లోపల బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు కష్టపడిపోతారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా అయ్యా నేను సామాన్యుడిని అమ్మ నేను సామాన్యురాలిని నేను ఎవరికో ఏదో నేర్పేద్దామనో లేదా ఏదో చెప్పేద్దామనో ఎవరికో పోటీగానో లేదా నాకు తెలుసఅని అహంకారంతోనో అసలు నేనుేమి చెవడం లేదు ఎంతో మంది మహాత్ముల దగ్గర నేను తెలుసుకున్న నేను చదువుకున్న నేను గ్రహించిన విషయాలను నన్ను నేను మంచిగా ఉంచుకోవడానికి మననం చేసే ప్రక్రియలో ఇది నాకు మననంగా ఉపయోగపడుతుంది సజ్జన సాంగత్యంగా ఉపయోగపడుతుంది కాసేపు సత్కాలక్షేపంగా ఉపయోగపడుతుంది కాసేపు
(1:09:09) సాధనగా ఉపయోగపడుతుంది ఆ భావాల్లో ఉండగలుగుతున్నాను. కనుక నాకోసం నేను నాకు చెప్పుకుంటూ కొందరు సోదరీమణలు సోదర సోదరీమణలు అడుగుతున్నారు నాలాంటిోళ్ళు కొందరు కాబట్టి వాళ్ళు కూడా వింటారు అని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో YouTube ద్వారా దీన్ని మళ్ళీ బయటకి కూడా వదులుతున్నాను ఇందులో మెయిన్ మేలు నాకే ఆ ఉద్దేశంతోనే నాకు నేను ఎటువంటి గుర్తింపు ఇచ్చుకోవట్లే అందుకని నేను ఎవరు చెవట్లే నా బొమ్మ పెట్టట్లే నాకు తెలుసని నేను చెప్పడంలే ఎందుకంటే నాకు తెలిసింది కాదు ఎంతో మంది మహాత్ములు ఎప్పుడో చెప్పేసారు ఈ సత్యం ఆధ్యాత్మికతను కొత్తగా కనుక్కునేవాడు ఎవడో లేడు ఆల్రెడీ
(1:09:52) ఎప్పుడో కనుక్కొని చెప్పేసారు దీన్ని అదే ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువు ఎప్పుడో మహాత్ములు చెప్పారు ఇప్పుడు మళ్ళీ మనం మన స్థితిని పొందుతాం మన సంపూర్ణతను అంతే అందుకని చక్కగా నన్ను క్షమించి వదిలేసి ఆడు సామాన్యులే అని మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి సు శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరు గాక మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం

No comments:

Post a Comment