"ధనమే సర్వస్వం" అని నమ్ముతున్నారా? | Do You Believe Money is Everything? | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=taSvpVzke5A
Transcript:
(00:00) డబ్బు లేకుండా బ్రతకలేమ అంటే ఏంటి అర్థం ఓ డబ్బు ఉంటేనే తిండి కొనగలం డబ్బు ఉంటేనే సౌకర్యాలు కొనగలం డబ్బు అనేది మనం సృష్టించుకున్న ఒక సాధనం కానీ ఇప్పుడు దాన్నే పూజించడం మొదలు పెట్టారు. అదే దేవుడు అనుకుంటున్నారు. నిన్న సాయంత్రం ఎవరో ఫోన్ చేసి సద్గురు అంతా పోయింది అంతా పోయింది అని ఏడుస్తున్నారు ఏం పోయిందమ్మా అంతా అని అడిగాను.
(00:24) లేదండి నేను స్నానానికి వెళ్ళేటప్పుడు నగలన్నీ తీసి అక్కడ పెట్టాను ఎవరో తీసుకెళ్ళిపోయారు సద్గురు అంతా పోయింది అన్నారు అంతా ఏం పోలేదు అనవసరమైనవి తీసేసారు అవే పోయాయి. ప్రాణం ఉంది భర్త ఉన్నాడు బిడ్డ ఉంది ఇల్లు ఉంది తిండి ఉంది శ్వాస ఆడుతుంది ప్రపంచం నడుస్తుంది. అంతా పోయింది అంతా పోయింది అంటే ఏంటి అర్థం అంటే మన ఆలోచన ధోరణిలోనే ఒక తప్పుడు వైఖరి ఉంది.
(00:50) డబ్బు అనేది ఒక చిన్న సాధనం మన అవసరాలు తీర్చుకోవడానికి అది అవసరమే. కానీ అదే అంతా అనుకుంటే మన జీవితం జీవితం లాగా నడవదు. జీవితమే ఒక వ్యాపారం అయిపోతుంది.
No comments:
Post a Comment