ఇంద్రజిత్ Vs లక్ష్మణ 💀
Author Name:TonsOfVeerya
Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uMohXBbwgNc
Transcript:
(00:00) ఇంద్రజిత్తు గురించి చేసిన పార్ట్ట వీడియోలో ఇంద్రజిత్తు యొక్క క్రూరత్వం గురించి ఆయన చేసే మాయా యుద్ధం ఎలా ఉంటుందో విన్నాం. కాబట్టి ఇప్పుడు తన మాయతో తయారు చేసిన సీతని తన రథంలోంచి ఈడ్చుకొచ్చి హనుమతో సహా మిగతా వానర యోధులు చూస్తుండగానే ఆ మాయా సీత యొక్క తల నరికేసాడు. ఇదిగో ఈ సీత కోసమే కదా మీరు యుద్ధం చేసేది మా నాన్నకి దక్కని ఈ సీతని మీకు విడిచిపెడతానా ఇంకా ఎవరికోసం యుద్ధం చేస్తారో చేసుకోండి అని ఆ వానర సైన్యాన్ని ఎగతాలి చేసి మాయమైపోయాడు.
(00:38) ఈ కోతులన్నీ ఇంకెందుకు యుద్ధం చేయడం సీతమ్మని చంపేసాడు కదా అని రాముడికి జరిగిన విషయాన్ని చెప్పాయి. అది విన్న రాముడు దుఃఖంతో కుప్పకోలిపోయాడు. అయితే అక్కడికి విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి వచ్చాడు. వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉందంటే కాటుక కుప్పల్లాగా పెద్ద ఏనుగుల్లాగా ఉన్నారంట. రాముడు అన్కాన్షియస్ అయ్యేసరికి శోక సంద్రంలో ఉన్న లక్ష్మణుని చూశారు కన్నీరు పెడుతున్న కోతుల్ని చూశారు ఇక్ష్వాకు వంశానికి ఆనందాన్ని కలిగించే ఆ రాముడు అలా లక్ష్మణుడి తొడ మీద పడి ఉండడం చూశారు.
(01:13) అప్పుడు విభీషణుడు ఏం జరిగింది మీరంతా ఎందుకు బాధపడుతున్నారు అని అడిగాడు. దానికి లక్ష్మణుడు అన్నాడు మహానుభావా విభీషణ ఆ ఇంద్రజిత్తు సీతమ్మని సంహరించాడు అన్న మాట హనుమ చెప్పగానే మా అన్నయ్య తెలివి కోల్పోయాడు. అప్పుడు అన్కాన్షియస్ లో ఉన్న రాముడితో విభీషణుడు అన్నాడు మా అన్నయ్య రావణుడికి సీతమ్మ పై ఉన్న కామం ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఎందుకంటే నేనే చాలాసార్లు చెప్పి చూశాను సీతని వదిలి పెట్టమని ఆయన నా మాట వినలేదు.
(01:46) అలాంటిది ఇంద్రజిత్తు సీతమ్మని చంపడాన్ని రావణుడు ఒక్కనాటికి అంగీకరించడు. నీకు ఏదైతే హనుమ చెప్పాడో అది ఇంద్రజిత్తు ఈ కోతుల్ని మోహపెట్టే ప్రయత్నం అవి నీతో ఇలా చెప్తే నువ్వు ఉత్సాహాన్ని కోల్పోయి మానసికంగా బలహీనుడు అవ్వాలని ఆ ఇంద్రజిత్తు ఇప్పుడు నికుంబిల అనే ప్రదేశానికి వెళ్ళుంటాడు. అక్కడ యజ్ఞగుండంలో రక్తబలిని అర్పిస్తాడు.
(02:10) అలా ఒక్కసారి నైవేద్యాన్ని హోమాగ్నికి అర్పించి తిరిగి వచ్చాడా అప్పుడు ఇంద్రజిత్తుని గెలవడం పక్కన పెట్టు రామ అసలు ఎదుర్కోవడమే చాలా కష్టం ఈవెన్ ఇంద్రుడు కూడా గజగజ వనికిపోతాడు. కాబట్టి రామ ఆ యజ్ఞం పూర్తి కాకముందే మనం ఆ నికుంబిలా దగ్గరికి సైన్యంతో వెళ్ళాలి. నీ దుఃఖాన్ని విడిచిపెట్టు అని విభీషణుడు చెప్పాడు.
(02:36) రాముడు స్పృహలోకి వచ్చాడు కానీ ఆయనలో ఎలాంటి ఉత్సాహం లేదు. కేవలం బాధ సీత నిజంగానే ప్రాణాలతో ఉందా అనే అనుమానం మాత్రమే కనబడుతున్నాయి. ఇది గమనించిన విభీషణుడు రామా నువ్వు ఇక్కడే ఉండు నేను లక్ష్మణుని నాతో తీసుకెళ్తాను. ఈ లక్ష్మణుడి బాణాలు క్రూర పక్షులు రక్తం తాగినట్టు ఇంద్రజిత్తు రక్తాన్ని తాగుతాయి. కాబట్టి రామ లక్ష్మణుని తీసుకెళ్ళడానికి అనుమతినివ్వు లేదంటే ఇంద్రజిత్తు హోమం పూర్తి చేస్తే రాక్షసులు గాని ఇంద్రుడు గాని ఆయన్ని చూడలేరు.
(03:06) ఎవ్వరికీ కనిపించకుండా యుద్ధం చేస్తాడు. అప్పుడు దేవతలు కూడా వాళ్ళ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటారు. ఆ ఇంద్రజిత్తు బ్రహ్మగారికి గొప్ప తపస్సు చేసిన కారణంగా బ్రహ్మశిర అనే అస్త్రాన్ని కేవలం సంకల్పం చేస్తే ప్రత్యక్షమై తన ఇష్ట ప్రకారం నడుచుకునే దివ్యమైన గుర్రాలని బ్రహ్మగారు ఇంద్రజిత్ కి బహుమతిగా ఇచ్చారు. నా మంత్రులు చెప్పిన దాన్ని బట్టి ఇంద్రజిత్తు తన సైన్యంతో నికుంబిలాకి చేరుకున్నాడు.
(03:37) అక్కడ బలిదానాన్ని అర్పించి తిరిగి వచ్చాడా మనం ప్రాణాలతో ఉండడం అసాధ్యం రామా బ్రహ్మగారు ఇంద్రజిత్తుక ఇచ్చిన వరం ఏంటంటే హోమాగ్నికి నైవేద్యాన్ని అర్పించక ముందు ఎవడైతే తనపై దాడి జరుపుతాడో వాడే ఇంద్రజిత్తుకి మృత్యువు కాగలడు కాబట్టి రామ ఇంద్రజిత్తుని చంపమని లక్ష్మణుడికి ఆజ్ఞాపించు అప్పుడు రాముడు విభీషణుడితో అన్నాడు ఆ భయంకరమైన ఇంద్రజిత్తు మాయాజాలం గురించి నాకు బాగా తెలుసు అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలో కూడా ఎంతో నైపుణ్యుడు.
(04:09) ఆ ఇంద్రజిత్ ఎంతటి బలశాల అంటే ఈవెన్ ఇంద్రుని కూడా యుద్ధంలో మూర్చపోయేలా చేయగలడు. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు ఇంద్రజిత్తు యొక్క మాయా యుద్ధం ఎలా ఉంటుందో రాముడు చూశాడు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడికి జాగ్రత్త చెప్తున్నాడు. ఓ లక్ష్మణ సుగ్రీవుడి సైన్యం మొత్తం నీతో పాటు వస్తుంది. దలపతులైన హనుమ జాంబవంతుడు తమ సైన్యంతో నీతో వస్తారు.
(04:34) మహాత్ముడైన విభీషణుడికి ఆ ఇంద్రజిత్ యొక్క మాయల గురించి బాగా తెలుసు. ఆయన తన మంత్రులతో కలిసి నీ వెనక వస్తాడు. కాబట్టి లక్ష్మణుడు అన్నయ్య కాళ్ళకి నమస్కరించి సైన్యంతో కలిసి నికుంబిలాకి బయలుదేరాడు. అలా చాలా దూరం ప్రయాణించగా ఇంద్రజిత్ కాపలాగా పెట్టిన సైన్యం కనిపించింది. వెంటనే విభీషణుడు అన్నాడు తన సైన్యం మరణిస్తుంటే ఇంద్రజిత్ హోమం చేయలేడు.
(04:59) కాబట్టి నువ్వు నీ పదునైన బాణాలతో ఆ రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురులు చెయ్ అప్పుడు ఇంద్రజిత్ మన కంటికి కనిపిస్తాడు. విభీషణుడు ఆ మాట చెప్పగానే లక్ష్మణుడు ఇంద్రజిత్ ఉన్నవైపు బాణ ప్రయోగం చేశాడు. వానరులు అక్కడున్న చెట్లని పర్వతాలని పెకలించి రాక్షసులతో యుద్ధం చేయడం మొదలెట్టారు. హనుమ తన శరీరాన్ని పర్వతం లాగా పెంచి రాక్షసుల్ని మర్ధిస్తుంటే రాక్షస సైన్యం మొత్తం కేకలు పెడుతూ ఓ ఇంద్రజిత్ ఈ హనుమ నుండి కాపాడు కాపాడు అంటూ ఇంద్రజిత్ దగ్గరికి పరుగులు తీశారు.
(05:34) అలా తన సైన్యం అల్లాడిపోతుంటే అజయుడైన ఇంద్రజిత్ హోమం పూర్తి చేయకుండానే పీటల మీద నుండి లేచి ఆ చెట్ల మధ్యలోని చీకట్లో నుంచి బయటకు వచ్చాడు. అలా హనుమ పర్వతాకారంతో తన సైన్యాన్ని మర్ధిస్తుంటే వెంటనే సారధిని రథాన్ని హనుమ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. ఈ హనుమని ఇలాగే విడిచిపెడితే మొత్తం సైన్యాన్నే చంపేస్తాడు అని బలమైన ఈటెలతో పొదునైన కత్తులతో హనుమ యొక్క మొఖం మీద దాడి చేశాడు.
(06:04) ఆ భయంకరమైన ఆయుధాల దెబ్బకి హనుమ విపరీతమైన బాధని పొందాడు. ఇప్పుడు హనుమ అన్నాడు ఇంద్రజిత్ నీలా బాణాలు వేయడం నాకు రాదు నువ్వు నాతో తలపడాలనుకుంటే హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందాం రా ఇంతలో విభీషణుడు లక్ష్మణుడితో అన్నాడు చూస్తుంటే ఆ ఇంద్రజిత్ హనుమని చంపాలనే ఉత్సాహంతో ఉన్నాడు. నువ్వు వెంటనే ఇంద్రజిత్ మీద బాణ ప్రయోగం చేసి సంహరించు అయితే లక్ష్మణుడు ఇంద్రజిత్ ని చూశాడు.
(06:30) ఒక పర్వతం లాంటి శరీరంతో రథంలో కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరికీ సాధ్యం కావట్లేదు. అయితే విభీషణుడు ఇంద్రజిత్ క్షుద్ర పూజలు చేసే ఆ ప్రదేశాన్ని లక్ష్మణుడికి చూపించాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు నీడలో కూర్చుని ఇంద్రజిత్ బలిదానాన్ని అర్పిస్తాడు. అలా నైవేద్యాన్ని అర్పించాక ఆ రాక్షసుడు ఇన్విజిబుల్ అయిపోతాడు.
(06:54) అలా ఆకాశంలోంచి బాణాల వర్షం కురిపించి కొన్ని కోట్ల మందిని చంపగలడు. కాబట్టి లక్ష్మణ ఇంద్రజిత్ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకముందే నీ పదునైన బాణాలతో సంహరించు వెంటనే లక్ష్మణుడు తన వింటినారితో పెద్ద శబ్దం చేసి ఇప్పటివరకు ఎవరి చేత జయింపబడనటువంటి ఆ పౌలస్త్య వంశానికి వారసుడైన ఇంద్రజిత్తుతో అన్నాడు నేను నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను నీ మాయలు పక్కన పెట్టి సరైన పద్ధతిలో నాతో యుద్ధం చేయమని ఇన్వైట్ చేశాడు అసలు వీడెలా ఇక్కడికి వచ్చాడురా అనుకున్నాడు కానీ ని పక్కనే ఉన్న విభీషణని చూశడు పసిగట్టాడు.
(07:33) నువ్వు రాక్షస జాతిలో పుట్టి పెరిగి నీ జాతి వారికే మోసం చేయడానికి నీకు మనసఎలా వచ్చింది. నువ్వు మా నాన్నకి తోడ పుట్టిన తమ్ముడివి నాకు చిన్న తండ్రివి నీ కొడుకు పట్ల శత్రువుగా మారావు. అలాంటి నువ్వు నీ జాతి వారికే వెన్నుపోటు పొడిచిన నువ్వు ఏపాటి ధర్మాత్ముడివి నా రహస్యాల్ని శత్రువులకు చెప్పి నా మీదకి యుద్ధానికి తీసుకొచ్చిన నీకు అసలు ఏం ధర్మం తెలుసు బాబాయ్ ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గు లేదా అన్నాడు.
(08:05) ఆ మాటలు విన్న విభీషణుడు కోపంతో అన్నాడు ఒరేయ్ ఇంద్రజిత్ నోరు మూసుకో పెద్దల పట్ల ఎలా మాట్లాడాలో నేర్చుకో నిన్న కాకమున్న కళ్ళు తెరిచావు నువ్వు నన్ను అధిక్షేపించి మాట్లాడతావా ఏంటన్నావు నువ్వు నేను పుట్టిన జాతికి ద్రోహం చేశానా ఇలా చూడు ఇంద్రజిత్ ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం అన్నది కాదు బుద్ధి గుణం ప్రధానం అవి లేనివాడై మీ నాన్న బ్రతుకుతున్నాడు.
(08:29) నేను కామంతో రగిలిపోతున్నాను అని మీ నాన్న చెప్తే ఎవరో భార్యని ఎత్తుకొచ్చి అనుభవిస్తాను అంటుంటే నువ్వు దాన్ని ఖండించకుండా సరే నాన్నగారు మీకు నచ్చినట్టుగా జీవించండి మేము ఉన్నదఎందుకు మిమ్మల్ని కాపాడడానికేగా అని చెప్పడానికి నీకు సిగ్గు లేదురా ఇలాంటి నడువడిక కలిగిన వారితో కలిసి నేను ఎలా సహజీవనం చేయగలను అయినా నా అంతట నేనుగా రాలేదు మీ నాన్నే నన్ను వెళ్ళిపోయేలా మాట్లాడాడు ఇంద్రజిత్ నీకు చేతనైతే ఈలష లక్ష్మణుడితో యుద్ధం చేసి గెలవమన్నాడు.
(09:00) కాబట్టి ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. రకరకాల ఆయుధాలతో అలంకరింపబడిన రథంలో కూర్చుని ఇంద్రజిత్ చూడడానికి యమధర్మరాజులాగా ఉన్నాడు. మరోవైపు లక్ష్మణుడు తన యొక్క సొంత కాంతితో విశ్వామిత్రుడి ఆశిస్సులతో నేల మీద నుంచుని యుద్ధం చేస్తున్నాడు. అయితే ఇంద్రజిత్ హేలనగా అన్నాడు ఏంటి బాబాయ్? ఈ లక్ష్మణుడు కేవలం ఒక నరుడు నేను ఇంద్రుడినే ఓడించాను.
(09:28) ఏరా మనుషులారా ఆ రోజు యుద్ధంలో ఏం జరిగిందో మర్చిపోయారా నా బానపు దెబ్బలకి మీ అన్నదమ్ములు ఇద్దరు ఎలా మూర్చపోయారో గుర్తులేదా ఏంటి లక్ష్మణ నువ్వు చావును వెతుక్కుంటూ వచ్చావా నీ అన్న అధర్మాత్ముడైన రాముడు పేరుకు మాత్రమే క్షత్రియుడు నువ్వు నా చేతిలో మరణించాక ఏడవడానికి రెడీగా ఉండమను దానికి లక్ష్మణుడు తెలివిగా అన్నాడు ఇంద్రజిత్ నువ్వు ఇంకా హోమం పూర్తి చేయలేదు చేసిఉంటే నువ్వన్న అన్నట్టే కానివ్వచ్చు మరి ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నావు నీ శక్తి ఏంటో చూపించు ఆ మాట విన్న ఇంద్రజిత్ తన పొడవైన ధనస్సు తీసుకొని పదునైన బాణాలని లక్ష్మణుడి మీదకు విడిచిపెట్టాడు. ఆ బాణాల
(10:10) దెబ్బకి లక్ష్మణుడి శరీరం రక్తంతో తడిసిపోయింది. వెంటనే ఇంద్రజిత్ పెద్ద గర్జన చేసి నక్కలు రాబందులు నీ శరీరం మీదకి దిగుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను విడిచిపెట్టే బాణాలు నీ ప్రాణాలు తీస్తాయి. తనని దైవంగా సేవించే తమ్ముడు నా చేతిలో మరణించాడని ఆ దుర్మార్గుడైన రాముడు గుండెలు బాదుకొని ఏడుస్తాడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు ఐదు బాణాలతో ఇంద్రజిత్ కి సమాధానం చెప్పాడు.
(10:39) అవి బుసలు కొడుతున్న పాముల్లాగా ఉన్నాయి. ఇంద్రుడు వజ్రంతో కొట్టినట్టు అవి తన ఇంద్రియాలన్నిటిని ఆక్రమించేసాయి. దెబ్బకి ఇంద్రజిత్ స్తంభించిపోయాడు. కానీ అలా కన్ను మూసి తెరిసేలోపే స్పృహని పొంది లక్ష్మణుడి పరాక్రమం చూసి లక్ష్మణుడికి దగ్గరగా వచ్చి లక్ష్మణుడిని రెచ్చగొడుతూ యుద్ధం చేస్తూ ఆ వానర సైన్యాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ ఏంటి ఈ ఒక్కదానికేనా నేను ఆ రోజు నిన్ను రాముని నీ కోతుల సైన్యంలో పెద్ద పెద్ద వీరుల్ని ఎలా పడగొట్టానో మర్చిపోయావా చూస్తుంటే నీకు గుర్తు చేయాలనుకుంటా అయితే సిద్ధంగా ఉండు ఏడు బాణాలతో లక్ష్మణుని 10 బాణాలతో
(11:20) హనుమని బంధించాడు. మునుపటి కంటే వీరావేశంతో 100 బాణాలు ప్రయోగించి విభీషణుడిని గాయపరిచాడు. అయినా సరే లక్ష్మణుడు వాటిని పట్టించుకోకుండా అసలు యుద్ధంలో గెలవాలనుకునేవాడు ఎవడైనా ఇలా కొరతాడా? నీ బాణాల్లో దమ్ము లేదు అని బాణాల వర్షం కురిపించాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ ధరించిన విశాలమైన బంగారు కవచం ముక్కలైపోయింది.
(11:46) ఇంద్రజిత్ కౌంటర్ అటాక్ చేసి లక్ష్మణుడికి దేవతలు ప్రసాదించిన దివ్యమైన కవచాన్ని ముక్కలు చేశాడు. అలా వాళ్ళు ప్రతీకారంతో యుద్ధం చేస్తుంటే వాళ్ళ శరీరాలు పగిలిపోయి రెండు జలపాతాల నుండి వేడినీళ్లు పొంగుతున్నట్టు వాళ్ళ ఒంట్లో నుంచి వెచ్చని రక్తం బయటక వస్తుంది. మేఘాలు వర్షాలు కురిపించినట్టు ఆ ఇద్దరు వీరులు ఆకాశంంతా బాణాలతో నింపేశారు.
(12:12) ఒక్కరు కూడా వెనుకంజ వేయడం లేదు. వాళ్ళ కవచాలు పగిలిపోయి శరీరాల నుండి రక్తం ఏరులుగా పారుతుంటే ఆ బంగారు బాణాలు రక్తంతో తడిసి భూమిలో దిగబడుతున్నాయి. వాళ్ళిద్దరి శరీరాలు కూడా కింషుక వృక్షాల్లాగా కనబడుతున్నాయి. అయినా లక్ష్మణుడు ఇంద్రజిత్ ని కొడుతున్నాడు ఇంద్రజిత్ తిరిగి ప్రతిదాడి చేస్తున్నాడు. ఇద్దరు వీరులు వాళ్ళ శక్తుల్ని వేగాన్ని ప్రదర్శిస్తున్నారు.
(12:39) అలా బాణాల సమూహం వాళ్ళ శరీరాల్లోకి దిగబడిపోయి రక్తం ఏరులుగా ప్రవహిస్తుంటే రెండు పర్వతాల మీద పచ్చని చిగుళ్లు మొలుస్తున్నట్టు వాళ్ళిద్దరి శరీరాలు కూడా రక్తంతో తడిసి మెరిసిపోతున్నాయట. ఆ యుద్ధాన్ని చూడడానికి మహర్షులు ఇంద్రజిత్ కారణంగా భయంతో వనికి పోతున్న గంధర్వులు దేవేంద్రుడితో సహా ఈవెన్ గరుత్మంతుడు కూడా ఆకాశంలో నిలబడి ఇది లోక కళ్యాణార్థం అని ఆ యుద్ధాన్ని వీక్షిస్తున్నారు.
(13:10) అలా ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు యుద్ధం జరుగుతుంది. లక్ష్మణుడు నరుడు కాబట్టి ఆ ఇంద్రజిత్తుతో పోటాపోటీగా అంతటి వేగంతో బాణాలు ప్రయోగించేసరికి లక్ష్మణుడిలో అలసట మొదలయింది. టైమింగ్ గురించి బాగా తెలిసిన విభీషణుడు లక్ష్మణుడికి అలసట తీర్చడానికి యుద్ధం మధ్యలో కలుగబాటు చేసుకుని తన అద్భుతమైన ధనస్సు తీసుకుని ఇంద్రజిత్ తో యుద్ధం చేస్తూ ఆ వానరులతో అన్నాడు రావణుడి చిట్టచివరి బలాన్ని అంతం చేయడంలో సహాయపడండి.
(13:43) ఇంద్రజిత్ మరణించిన తెల్లారే రావణుడి పతనం కాయం కాబట్టి మీ బలాన్ని చూపించండి అని విభీషణుడు ఆ వానరుల్ని ఉత్సాహ పరిచాడు వెంటనే కొంతమంది వానరులు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే మరికొందరు ఇంద్రజిత్ మీదకి చెట్లను పర్వతాల్ని విసురుతున్నారు. ఆ రాక్షస సైన్యం కూడా ఇంద్రజిత్ ఉన్నాడనే ధైర్యంతో గొప్ప యుద్ధాన్ని చేస్తూ కోతుల్ని మర్ధిస్తున్నారు.
(14:09) ఇక్కడ ఇంద్రజిత్ ఒక పక్క వానరులు విసురుతున్న చెట్లను గాలిలోనే విరగగొడుతూ మరో పక్క విభీషణుడు ప్రయోగించే వజ్రం లాంటి బాణాల్ని నిర్వీర్యం చేస్తూ అలాగే తన సారధిని గుర్రాల్ని కాపాడుకుంటూ యుద్ధం చేస్తుంటే దేవతలు మహర్షులు లక్ష్మణుడికి శక్తినిచ్చుగాక అని ఈ ఇంద్రజిత్ లక్ష్మణుడి చేతిలో మరణించుగాక అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు మునుపటి కంటే గొప్ప ఉత్సాహంతో ఇంద్రజిత్ యొక్క సారధి శిరస్సుని బాణాలతో చేదించాడు.
(14:40) అలా గ్రీవము లేని మొండెంతో రథం గుండ్రంగా తిరుగుతుంది. ఆ సన్నివేశం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉందట. ఆ సన్నివేశం ఇంద్రజిత్ లో ఉత్సాహాన్ని తగ్గించింది. వానరుల్లో దలపతులైన ప్రమతి రబస శరభ గంధమాదన అనే నలుగురు వానరులు వెంటనే ఇంద్రజిత్ రథం మీదకి దూకి తమ భారి శరీరాలతో ఇంద్రజిత్ గుర్రాలను సంహరించారు. ఆ గుర్రాలు వాటి బరువు తట్టుకోలేక నోట్లోంచి రక్తం కక్కుకుంటూ ఆ యుద్ధభూమిలో కింద పడిపోయాయి.
(15:14) ఆ నాలుగు కోతులు ఇంద్రజిత్ రథం మీదకి దూకి ఆ రథాన్ని ముక్కలు చేసి వేగంగా తిరిగి లక్ష్మణుడు వైపుక వచ్చి నిలబడ్డాయి. ఇప్పుడు ఇంద్రజిత్ తన సారధిని గుర్రాల్ని రథాల్ని కోల్పోయి నేల మీద నిలబడ్డాడు. ఇప్పుడు ఇంద్రజిత్ తన సైన్యంతో అన్నాడు చుట్టూ చీగట్లు కమ్ముకునేసరికి ఎదురుగా ఉన్నది మనవాడా శత్రువా అనేది గుర్తు తెలియట్లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా యుద్ధం చేయండి.
(15:44) నేను ఇంకో బలమైన రథాన్ని తీసుకుని తిరిగి వస్తాను. మీరు ఆ కోతులు నా వెనక పడకుండా చూడండి అని మాయమైపోయి లంకా సిటీలోకి వచ్చాడు. మరొక అందమైన రథాన్ని బంగారంతో అలంకరింపబడిన రథాన్ని దానికి ఉత్తమమైన గుర్రాలు కట్టబడి ఉన్నాయి. వాటి ప్రవర్తన బాగా జరిగిన శ్రేష్టమైన సారధిని తీసుకొని ఆ రథంలో రకరకాల ఆయుధాలను పెట్టుకొని గొప్ప ఉత్సాహంతో ఆ లంకా పట్టణం నుండి బయలుదేరి మళ్ళీ లక్ష్మణుడి మీద దాడి చేశాడు.
(16:15) అలా ఇంద్రజిత్ రథంలో కూర్చొని ఉండడం చూసి లక్ష్మణుడు ఆ కోతుల సైన్యం ఆశ్చర్యపోయారు. ఇంతటి యుద్ధ విశారదుడు ఇంత వేగంగా మాయమైపోతాడు ఇన్ని అస్త్రాలు ప్రయోగిస్తాడు అన్ని మాయలు ప్రదర్శిస్తాడు అని ఆ ఇంద్రజిత్ తెలివిని చూసి ఆశ్చర్యపోయారు. తన ధనస్సుని మండలాకారంగా తిప్పుతూ గొప్ప వేగాన్ని ప్రదర్శిస్తూ కొన్ని వేల మంది వానరాలని చంపేశాడు.
(16:42) అయితే లక్ష్మణుడు దేవతలు తనకి ప్రసాదించిన మరో కవచాన్ని ధరించి ఇంద్రజిత్ ధనస్సుని విరగగొట్టాడు. ఇంద్రజిత్ మరో ధనస్సుని తీసుకొని దానికి వింటినారిని రెడీ చేస్తుంటే లక్ష్మణుడు మూడు బాణాలు ప్రయోగించి ఆ రెండో ధనస్సును కూడా విరగగొట్టాడు. అలా విరిగిపోయిన ధనస్సుతో ఉన్న ఇంద్రజిత్ మీద లక్ష్మణుడు ఐదు బాణాలు ప్రయోగించాడు.
(17:07) అవి బుసలు కొడుతూ ఇంద్రజిత్ చాతిలోకి చొచ్చుకుపోయి ఎర్రటి పాముల్లాగా బయటిక వచ్చి నేల మీద పడ్డాయి. ఇంద్రజిత్ నోటిలోంచి రక్తం కక్కుకుంటూ మునుపటి కంటే బలమైన ధనస్సును తీసుకొని దానికి వింటినారిని కట్టి గొప్ప వేగంతో దేవేంద్రుడు వర్షం కురిపించినట్టు ఆ లక్ష్మణుడి మీద బాణాల వర్షం కురిపించాడు. అయితే లక్ష్మణుడు అతి కష్టం మీద ఆ బాణ ప్రవాహం నుండి తప్పించుకొని ఇంద్రజిత్ మీద బాణ శ్రేణి కురిపించాడు.
(17:37) ఇప్పుడు లక్ష్మణుడు బల్ల అనే పేరు గల బాణాన్ని ప్రయోగించి సారధి యొక్క శిరస్సుని ఖండించాడు. సారధి లేకపోయినా సరే ఆ గుర్రాల్లో ఎటువంటి బెదురు లేకుండా గుండ్రంగా తిరుగుతున్నాయి. ఆ సన్నివేశం చూడడానికి చాలా బాగుందని వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. వెంటనే లక్ష్మణుడు ఆ గుర్రాల్ని బెదరగొట్టడానికి వాటిని బాణాలతో కొట్టాడు.
(18:03) అది చూసిన ఇంద్రజిత్ ఓపిక నశించిన వాడై 10 బాణాలతో లక్ష్మణుడి మీద దాడి చేశాడు. ఆ బాణాలు పిడుగుల్లాగా వచ్చి లక్ష్మణుడి బంగారు కవచానికి తగిలి నాశనమైపోయాయి. అది చూసిన ఇంద్రజిత్ ఆ దేవతలు లక్ష్మణుడికి ప్రసాదించిన కవచం అభేద్యమైనదని గ్రహించి మూడు బాణాలతో లక్ష్మణుడి తలపై కొట్టాడు. ఆ దెబ్బకి లక్ష్మణుడు చెల్లించిపోయాడు. ఆ పక్కనే ఉండి సలహాలు ఇస్తున్న విభీషణుడిని మూడు బాణాలతో బంధించి ఆ కోతుల సైన్యంలో పెద్ద పెద్ద వీరుల్ని ఒక్కొక్కరిని ఒక్కో బాణంతో బంధించాడు.
(18:41) ఆగ్రహించినటువంటి విభీషణుడు తన గదతో ఇంద్రజిత్ గుర్రాలని సంహరించాడు. అది చూసిన ఇంద్రజిత్ ఒక భయంకరమైన సూలాన్ని బాబాయి మీదకి విసిరాడు. వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేసి దాన్ని 10 మొక్కలు చేశాడు. అప్పుడు విభీషణుడు ఐదు బాణాలు ఇంద్రజిత్ వక్షస్థలానికి గురిపెట్టేసరికి అవి ఇంద్రజిత్ శరీరం నుండి ఎర్రటి రంగుతో బయటకవచ్చి నేల మీద పడ్డాయి.
(19:08) బాబాయి చేసిన పనికి ఆగ్రహించిన ఇంద్రజిత్ ఒకప్పుడు తనకి యముడు ప్రసాదించిన బాణాన్ని తీశాడు. అది గమనించిన లక్ష్మణుడు తనకి కుబేరుడు నిద్రలో ప్రసాదించిన బాణాన్ని బయటకి తీశడు.వా వాళ్ళిద్దరూ ఆ బాణాల్ని వింటినారికి సంధించి వెనక్కి లాగుతుంటే అవి చూడడానికి పెద్ద స్టీల్ రాడ్స్ లాగా ఉన్నాయంట. ఆ రెండు బాణాలు ఒకదానితో ఒకటి డీ కొట్టేసరికి ఆకాశంలో రెండు గ్రహాలు గుద్దుకున్నట్టు ఉందట.
(19:38) అది ఆకాశంలో పెద్ద మెరుపుని పొగని పుట్టించింది. దానితో వాళ్ళద్దరి ఎక్సైట్మెంట్ మరింతగా పెరిగింది. లక్ష్మణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంద్రజిత్ రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు.ఆ ఆ రౌద్రాస్త్రం వారుణాస్త్రాన్ని నిర్వీర్యం చేసింది. వెంటనే ఇంద్రజిత్ ఆగ్నేయా అస్త్రాన్ని విడిచిపెట్టాడు. దానికి లక్ష్మణుడు సూర్యుడికి సంబంధించిన అస్త్రంతో సమాధానం చెప్పాడు.
(20:04) తన మిసైల్ తిప్పి కొట్టింది అని ఆగ్రహించిన ఇంద్రజిత్ రాక్షసులు వాడే భయంకరమైన బాణాన్ని అభిమంత్రించి లక్ష్మణుడు మీదకి విడిచిపెట్టాడు. అందులోంచి కత్తులు, గదలు, గొడ్డళ్లు, బాణాలు దూసుకొస్తున్నాయి. ఇంతటి భయంకరమైన అస్త్రాన్ని లక్ష్మణుడు మహేశ్వర మిసైల్ ని ప్రయోగించి అడ్డుకున్నాడు. ఆ యుద్ధం చూస్తున్న కోతులకి రాక్షసులకి ఆకాశంలో ఉన్న మహర్షులకి దేవతలకి ఈవెన్ గరుత్మంతుడికి కూడా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
(20:36) వాళ్ళందరూ కూడా లక్ష్మణుడి కాంతి తేజస్సు నశించకుండా వాళ్ళ శక్తులతో పైనుండి కాపాడుతున్నారు. ఇప్పుడు లక్ష్మణుడు మరొక అద్భుతమైన ఐంద్రాస్త్ర సంబంధమైన బాణాన్ని తీశాడు. దాన్ని ఆకుపచ్చని గుర్రములు కలిగిన దేవేంద్రుడు యుద్ధంలో వాడతాడు. అది రాక్షసులా దేవతల అనే భేదం లేకుండా మర్దిస్తుంది. ఆ బాణం మునుపెన్నడు ఓటమి ఎరుగలేదు.
(21:03) అటువంటి బాణాన్ని వింటినారికి సంధించి ధనుర్వేదంతో సంబంధం లేని మంత్రాన్ని జపించి లేదా ప్రార్థన చేశాడు అని చెప్పొచ్చు. ధర్మాత్మ సత్య సందస్య రామో దాసరదిర్యది పౌరుషేచ అప్రదిద్వంద్వ శరైనం జహిరావణిం ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే ధర్మాత్మ రాముడు నిజంగా ధర్మాత్ముడైతే సత్య సందస్య రాముడెన్నడూ అబద్ధంఆడని వాడైతే రామో దాసరదిగది రాముడు నిజంగా దశరధుడికే పుడితే పౌరుషేచ రాముడు పౌరుషం ఉన్నవాడైతే అప్రదిద్వంద్వ నా ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యర్ది శరైనం ఈ బాణము చేత జహి మరణించుగాక రావణిం రావణ కుమారుడైన
(21:49) ఇంద్రజిత్ ఈ శ్లోకం చెప్పి లక్ష్మణుడు ఆ బాణాన్ని ఇంద్రజిత్ మీదకి విడిచిపెట్టగానే కుండలాలతో వెలిగిపోతున్న ఆ ఇంద్రజిత్ శిరస్సు కంఠం నుండి వేరై కింద పడిపోయి ఆ రక్తంలో తడిసి బంగారంలా మెరుస్తుంది. కుండలాలతో మెరిసిపోతున్నటువంటి ఇంద్రజిత్ శిరస్సు శిధిలమైనటువంటి అతడి ధనస్సు కవచం ధరించిన శరీరం వెంటనే నేల మీద పడిపోయాయి.
(22:14) ఇంద్రజిత్ మరణించాడు అని దేవతలు మహర్షులు గంధర్వులు పెద్ద పండగే చేసుకున్నారు. ఇంద్రజిత్ మరణించగానే అక్కడి రాక్షసులందరూ లంక వైపు పరుగులు తీశారు. అయితే ఇంద్రజిత్ మరణించాడు అన్న వార్త ఆ రాక్షసులు రావణాసురుడికి చెప్పారు. ఓ చక్రవర్తి మీ కుమారుడైన ఇంద్రజిత్ ని విభీషణుడి సాయంతో లక్ష్మణుడు చంపేశాడు. మేము కల్లారా చూసాం.
(22:41) ఆ మాటలు విన్న రావణాసురుడు మూర్చపోయాడు స్పృహలోకి రావడానికి 10 నిమిషాలు పట్టింది. ఇదంతా ఆ సీత కారణంగానే సీత ఆ రోజే ఒప్పుకునుంటే ఇప్పుడు నా కొడుకు ప్రాణాలతో ఉండేవాడు అని ఒక పెద్ద కత్తిని తీసుకుని ఆ సీతను చంపేస్తాను అని అశోక వనానికి విపరీతమైన కోపంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్తున్నాడు.
No comments:
Post a Comment