వృద్ధాప్యంలో భర్త చనిపోతూ.. తన భార్యకు చెప్పిన 20 అద్భుతమైన జీవిత సత్యాలు | #motivationalvideo
Author Name:The Puranic Path
Youtube Channel Url:https://www.youtube.com/@The_puranic_path_AS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QoRyrUpofC8
Transcript:
(00:00) వృద్ధాప్యంలో భర్త చనిపోతూ తన భార్యకు చెప్పిన 20 అద్భుతమైన జీవిత సత్యాలు అందరికీ నమస్కారం ది పురాణిక్ పాత్ వీక్షకులకు స్వాగతం వయసు పైబడిన తర్వాత భార్యా భర్తలకు ఒకరికొకరు తోడుగా ఉండటమే అతి పెద్ద బలం కానీ ఆ తోడు దేహాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిన సమయం వస్తే ఆ తర్వాత మిగిలిన వారి జీవితం ఎలా సాగుతుంది తన కళ్ళెదుటే తన భార్య భార్య కన్నీరు పెడుతుంటే తన తర్వాత తను ఒంటరిగా ఎలా బతుకుతుందో అని ఏ భర్తకైనా బెంగ ఉండటం సహజం.
(00:39) సరిగ్గా అలాంటి సమయంలోనే తుది శ్వాస విడిచే ముందు ఒక వృద్ధుడు తన భార్యను దగ్గరకు తీసుకొని ఆమె శేష జీవితానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చే కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు. ఆ మాటలు ఏంటి? భర్త పోయిన తర్వాత ఒక ఆడబిడ్డ సమాజంలో ఎలా జీవించాలని ఆయన కోరుకున్నాడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కళ్ళ ముందు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న భార్య ఇంకొద్ది క్షణాల్లో ప్రాణాలు వదిలేస్తున్న భర్త.
(01:13) తను లేకపోతే ఆమె ఒంటరిదది అయిపోతుందన్న బాధతో కుమిలి పోతున్న తన ఇల్లాలిని ఓదారుస్తూ ఆమె చేతులు పట్టుకుని ఓ వృద్ధులు చెప్తున్న ఆఖరి మాటలు ఇవి. ఇలా దగ్గరికి రా ముందు ఆ ఏడుపు ఆపు ఇన్నాళ్ళు కలిసి బతికాం నాకంటూ ఒక సమయం వచ్చాక వెళ్ళక తప్పదు కదా దీనికి ఇలా పసిపిల్లలా ఏడిస్తే ఎలా వయసు మీద పడింది దేహం సహకరించడం లేదు నా టైం అయిపోయిందని నాకు తెలుస్తూనే ఉంది.
(01:44) నేను వెళ్ళిపోతున్నానని నువ్వు భయపడొద్దు. నువ్వు ఒంటరి దానివి అయపోయావని బెంగ పెట్టుకోకు పిల్లలు ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు నేను కూడా నిన్ను వదిలేసి వెళ్తున్నానని దిగులు పడకు బతికినన్నాళ్ళు నా చేతిలో చెయేసి నడిచావు. ఇకపై ఒంటరిగా నడవాల్సిన ధైర్యాన్ని ఇప్పుడు నీకు ఇస్తాను నేను నీకు కొన్ని మాటలు చెప్పాలి ఇవి శ్రద్ధగా విను నమస్కారం మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహి దేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి.
(02:24) దేవీ ఆరాధకులు మహాదేవస్వామి గారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు అది భార్యా భర్తల గొడవలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదా కోర్టు సమస్యలు కావచ్చు ఏదైనా సరే పరిష్కారం కోసం వెంటనే 9 0ఒ 4మూడు 3 93 8 నెంబర్ కు కాల్ చేయండి.
(03:00) రేపు పొద్దున నేను లేకపోయినా ఇవి నీకు తోడుగా ఉంటాయి. ముందుగా నా ఫోటో ముందు పెట్టుకుని గతాన్ని తలుచుకుంటూ రోజు ఏడవడం మానేయ్ మన ఇంట్లో శుభకార్యాలు జరిగాయి కష్టాలు వచ్చాయి అన్నీ కలిసి దాటం. ఇన్నాళ్ళు నేను ఉన్నాను ఇక ముందు నువ్వు ఒంటరిగా అడుగు వేయాలి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పాత ముచ్చట్లు చెప్పుకుని బాధపడకు వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ బాధను మోయాల్సింది నువ్వే అందుకే జరిగిపోయిన దాని గురించి పదే పదే తలుచుకొని నీ మనసును పాడు చేసుకోకు ఎప్పటిలాగే పొద్దున్నే లేచి నీ పనులు నువ్వు చేసుకో నేను లేననే లోటు ఉంటుంది కానీ అది నీ బతుకును ఆపేయకూడదు.
(03:46) ధైర్యంగా ఉండటం నేర్చుకో ఇక మన పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి పెళ్లిళ్లు చేశం వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పటి కాలం పిల్లల ఆలోచనలు వేరు వాళ్ళ బతుకు దెరువు వేరు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటున్నా లేదా వాళ్లే నీ దగ్గర ఉంటున్నా వాళ్ళ పనుల్లో అతిగా జోక్యం చేసుకోకు కోడలు వంట ఎలా చేస్తుంది? పిల్లల్ని ఎలా పెంచుతుంది? కొడుకు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నాడు ఇలాంటి విషయాల్లో నువ్వు తలదూర్చొద్దు.
(04:18) వాళ్ళు అడిగితే నీ అనుభవం కొద్ది ఓ మాట చెప్పు వింటే సంతోషం వినకపోతే ఊరుకో నేను చెప్పిందే వినాలి అని పట్టుపట్టకు కాలం మారింది వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళని బతకనివ్వు నీకేమైనా అనిపిస్తే మనసులోనే ఉంచుకో నాలుక దాటి బయటికి రానివ్వకు ఇంట్లో ఏ గొడవ లేకుండా నీ మానాన్న నువ్వు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు మనవళ్ళు మనవరాలతో ఆడుకో కానీ వాళ్ళ చదువులు పెంపకం విషయంలో మన అబ్బాయితో గాని కోడలతో గాని వాదనకు దిగకు వాళ్ళ ఇష్టానికే వదిలేయ్ నువ్వు ఇంట్లో ఒక పెద్ద దిక్కులా ఉండు కానీ పెత్తనం చలాయించాలని చూడకు అది నీకే కాదు ఇంట్లో వాళ్ళందరికీ మనశశాంతిని
(05:05) ఇస్తుంది. అన్ని చూస్తూ ఏమీ పట్టనట్లు ఉండటం వృద్ధాప్యంలో చాలా అవసరం. నీ ఆరోగ్యం గురించి నాకు చాలా భయంగా ఉంది. ఇన్నాళ్ళు నా మందులు నా భోజనం అంటూ నా చుట్టూనే తిరిగావు నీ గురించి నువ్వు పట్టించుకోలేదు కానీ ఇక ముందు అలా కుదరదు. నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. ఏ పూట వేసుకోవాల్సిన మందులు ఆ పూట సమయానికి వేసుకో ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు.
(05:36) కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు వయసుతో పాటు వచ్చేవే వాటిని చూసి భయపడకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే దాచి పెట్టకుండా పిల్లలకు చెప్పి ఆసుపత్రికి వెళ్ళు ఈ వయసులో ఆసుపత్రులు ఎందుకులే అని అశ్రద్ధ చేయకు రాత్రి మిగిలిపోయిన అన్నం కూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం మానేయ్ నీకంటూ ఓ 10 నిమిషాలు కేటాయించుకుని వేడిగా వండుకొని తిను అరగట్లేదు కదా అని తినడం మానేయద్దు కడుపుకు సరి సరిపడా పౌష్టికాహారం తీసుకో సాయంత్రం వేళ ఆరు బయట లేదా డాబా మీద కాసేపు నడువు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఎవరి మీద ఆధారపడకుండా నీ పనులు నువ్వు చేసుకోగలవు. ఏ రోజైతే మనం
(06:21) పక్క వాళ్ళ సాయం కోసం ఎదురు చూస్తామో ఆ రోజే మన ఆత్మగౌరవం సగం చచ్చిపోతుంది. అందుకే వీలైనంత వరకు నీ శరీరాన్ని చురుకుగా ఉంచుకో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. మన దగ్గర ఉన్న ఆ కాస్త పొదుపు డబ్బు లేదా వచ్చే పెన్షన్ పూర్తిగా పిల్లల చేతిలో పెట్టేయకు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే సాయం చేయి. కానీ నీకంటూ ఒక బ్యాంకు ఖాతాలో కొంత డబ్బు ఎప్పుడూ ఉంచుకో ఎందుకంటే రేపు నీకు ఓ చీర కొనుక్కోవాలన్నా గుడిలో హుండీలో వేయాలన్నా మనవడికి ఏదైనా కొనివ్వాలన్నా కొడుకు ముందు చెయ్యి చాపాల్సిన పరిస్థితి రాకూడదు.
(07:03) డబ్బు ఉంటే ముసలితనంలో ఒక తెలియని ధైర్యం ఉంటుంది. మన అవసరాలకు ఎవరిని అడగక్కర్లేదు అన్న ధైర్యమే నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే నీ ఖర్చుల కోసం వెనకాడకు నీకు నచ్చిన పండ్లు కొనుక్కొని తిను కావాల్సిన మందులు కొనుక్కో పిల్లల కోసం అన్నీ త్యాగం చేశం. ఇక ఈ చివరి రోజుల్లో నీకంటూ కొంచెం స్వార్థంగా బతకడం నేర్చుకో అందులో ఎలాంటి తప్పు లేదు.
(07:32) బంధువులు చుట్టాల విషయానికి వస్తే అందరితో కలుపుగోలుగా ఉండు కానీ వాళ్ళ ఇళ్లల్లో జరిగే పంచాయితీలు మనకు వద్దు ఎవరింట్లో ఏం జరిగినా నువ్వు వెళ్లి తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లీళ్ళు పేరెంటాలకు వెళ్ళు కాసేపు ఉండి భోజనం చేసిరా అంతే తప్ప అక్కడ ఎవరేమనుకుంటున్నారు ఎవరు ఎవరిని ఏమన్నారు లాంటి విషయాలను బుర్రలో పెట్టుకొని ఇంటికి తీసుకురాకు సమాజం చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.
(08:05) భర్త పోయిన కొన్నాలకే టీవీ చూస్తోంది. మంచి చీర కట్టుకుంది గుళ్ళకు వెళ్తోంది అని నోటికి వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలకు అస్సలు భయపడకు వాళ్ళు నీకు అన్నం పెట్టడం లేదు నీ కష్టంలో పాలు పంచుకోవడం లేదు. నీకు ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుందో అలా ఉండు. సమాజం కోసం బతకడం మానేసి నీకోసం నువ్వు బతకడం మొదలు పెట్టు సమయం గడవడం లేదని ఇంట్లో ఒక మూల కూర్చోకు ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలన్నీ వస్తాయి.
(08:38) పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకో దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళు అక్కడ నీ వయసు వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో కాసేపు మాట్లాడు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి అవి విన్నప్పుడు మన కష్టం చాలా చిన్నది అనిపిస్తుంది. మధ్యాహ్నం పూట నీకు ఇష్టమైన టీవీ సీరియల్స్ చూడు లేదా ప్రవచనాలు విను ఎవరైనా పాత స్నేహితులు ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడు ఏదో ఒక పనిలో నిమజ్నం అవ్వు.
(09:10) మనసును ఒకే చోట నిలవనివ్వకు ఎవరైనా ఏదైనా మాట అన్నా లేదా నీకు కోపం వచ్చినా వెంటనే బదులు చెప్పకు కోపం మన ఆరోగ్యాన్నే పాడుచేస్తుంది. వాదించడం వల్ల ఈ వయసులో మనకు వచ్చే లాభం ఏమీ లేదు. కోడలు ఏదైనా అన్నా కొడుకు కోపపడ్డా మౌనంగా ఊరుకో నీ మౌనమే వాళ్ళకు రేపు తప్పు తెలుసుకునేలా చేస్తుంది. అన్నిటికీ స్పందించడం మానేయ్ ఇతరులను క్షమించడం నేర్చుకో మనసులో పగ కోపం పెట్టుకుంటే రాత్రులు నిద్రపట్టదు ప్రశాంతంగా పడుకోవాలంటే అందరినీ క్షమించేయాలి.
(09:47) నేను లేననే భయాన్ని మనసులోంచి తీసేయ్ నా కాలం తీరింది నేను వెళ్తున్నాను. నీకు ఇంకా ఆయుష్యు ఉంది దాన్ని సంతోషంగా ఆరోగ్యంగా గడుపు ప్రతిరోజు దేవుడు మనక ఇచ్చిన ఒక బహుమతి అనుకో నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే పైన ఉన్న నాకు అంత సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నా ప్రాణం కూడా క్షోభిస్తుంది. నన్ను సంతోషంగా పంపించు ఇన్నాళ్ళు నాకు ఎంతో సేవ చేశావు.
(10:15) ఏ లోటు రానివ్వలేదు. నాకంటూ ఇంకే కోరికలు లేవు నువ్వు బాగుండటం తప్ప నా గురించి బాధపడడం ఆపి నీ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు దేవుడి మీద భారం వేసి ధైర్యంగా అడుగు ముందుకు వేయి నేను ఎప్పుడూ ఏదో ఒక రూపంలో నీకు తోడుగానే ఉంటాను నీకు అండగానే ఉంటాను. జాగ్రత్తే పిచ్చిదానా ఆరోగ్యం జాగ్రత్త విన్నారు కదా ఒక భర్త తన భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో ఆమె బాగుండాలని చెప్పిన ఈ మంచి మాటలు నిజంగా ప్రతి ఒక్కరి గుండెను హత్తుకునేలా ఉన్నాయని అనుకుంటున్నాము.
(10:54) ఈ వీడియో మీకు నచ్చినట్లైతే దయచేసి లైక్ చేయండి. మీ ఆత్మీయులకు మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా మీకో చిన్న ప్రశ్న. మీరైతే మీ భార్యకు ఇలాంటి పరిస్థితిలో ఏమని చెప్పాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పంచుకోండి. ధన్యవాదాలు.
No comments:
Post a Comment