జీవన్ముక్తుడు -2#telugu #jeevanmukthudu#stories #harekrishna #sanatandharma #iskcontelugu #trending
Author Name:Krishna Chaitanyam
Youtube Channel Url:https://www.youtube.com/@LalithaValipe
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WfHSWI8r7ac
Transcript:
(00:00) హెచ్చరికగా కేక పెట్టవలసిన సమయం ఆసన్నమైంది అంతలో కామః క్రోధస్య లోభస్య దేహే తిష్టతి తస్కరః జ్ఞాన రత్నాపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామము క్రోధము లోభము మొదలైన అరిషడ్ వర్గములు మనలోని జ్ఞానమనే విలువైన రత్నములను దొంగిలించడానికి మన దేహంలో దాగి ఉన్న దొంగలు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి అని కేకలు పెడుతూ మూగవాడిగా భావింపబడే అతడు వీధులలో నడవసాగాడు మరుగున ఉండి ఇదంతా గమనిస్తున్న రాజు దిగ్బ్రాంతుడు అయ్యాడు ఈ యువకుడు నిజానికి మూగ కాదు అతడు ఒక జీవన్ముక్తుడు అన్న విషయాన్ని గ్రహించి మహదానందం చెందాడు
(00:45) మొదటి జాము ముగిసింది కొంతసేపటికి రెండవ జాము కూడా వచ్చింది రాజు ఆ జీవన్ముక్తుని గమనిస్తూనే ఉన్నాడు అతను డ్రప్ మోగించి ఈసారి ఇలా పలికాడు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయి మాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ జన్మ వృద్ధాభ్యము భార్య సంసారము ఇవన్నీ దుఃఖ భరితములు తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కావున ఓ మానవులారా సావధానులై ఉండండి అంటూ జీవన్ముక్తుడైన యువకుడు పలకడం రాజు విన్నాడు ఇక మూడవ జాములో యువకుడు డప్పు మోగించి ఇలా అన్నాడు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు
(01:30) సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ధనము ఇల్లు ఇవన్నీ మిద్యయే ఇవేమీ నిజము కాదు కనుక ఓ మానవులారా సావధానులై ఉండండి మూడవ జాములో జీవన్ముక్తుడు డబ్బు మోగించి హెచ్చరిస్తూ పలికిన మాటలకు రాజు తన్మయత్వంతో విన్నాడు తర్వాత యధా ప్రకారం జీవన్ముక్తున్ని రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళసాగాడు ఇంతలో నాలుగవ జాము వచ్చింది వీధిలో డప్పు మ్రోగిస్తూ వెళుతున్న యువకుడు పారా హుషారు చెబుతూ ఇలా పలికాడు ఆశయా బద్యతే జంతుహు కర్మనా బహు చింతయ ఆయుక్షీణం నా జనాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మనుషులు
(02:16) ఎల్లప్పుడూ ఏదో ఆశకు కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతుంటారు ఆయుర్దాయం తరిగిపోతున్న విషయాన్ని గమనించరు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి నాలుగు జాముల్లో ఆ యువకుడు డప్పు మోగించి వెలిబుచ్చిన వేదాంత సత్యాలు రాజు హృదయాన్ని అమితంగా ఆకర్షించాయి రాజు ఆ జీవన్ముక్తున్ని స్తుతించి ప్రణమిల్లాడు ఆ మహాత్ముడు సమ్మతిస్తే ఆయనకు నచ్చిన పనిలో నియుక్తిని చేసి తనకు చేరువలోనే ఉంచుకోవాలని రాజు భావిస్తూ అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం జీవన్ముక్తుడి తండ్రి రాజ దర్శనానికి వచ్చినప్పుడు రాజు అతడితో ఇంతవరకు మూగవాడిలా ఉంటూ వచ్చి నీ
(03:01) కుమారుడు నిజానికి ఒక జీవన్ముక్తుడు అటువంటి మహోన్నతుడు మన రాజ్యంలో జీవిస్తూ ఉండడం మన పూర్వీకులు చేసిన మహా పుణ్యఫలమే ఆయన ఒకసారి మన అంతఃపురం విచ్చేయడానికి సమ్మతిస్తే బాగుంటుంది ఈయన నా మనవిని ఆయనకు తెలపండి అని అన్నాడు అయోమయంలో పడిపోయిన తండ్రి రాజు చెప్పిన ప్రకారమే తన కుమారుని తీసుకువచ్చాడు రాజు ఆనందభరితుడై జీవన్ముక్తునితో అయ్యా అంతఃపురంలో మీకు ఏ పని ఇష్టమో తెలియజేయండి నేను మిమ్మల్ని అందులో నియుక్తిని చేస్తాను అని వేడుకుంటున్న ధోరణతో చెప్పాడు అందుకు జీవన్ముక్తుడు ఇలా స్పందించాడు ఘోరమైన నేరాలు పాల్పడిన వారికి శిరచ్చేదన దండన
(03:40) విధిస్తున్నారు కదా అటువంటి నేరస్తులను నా వద్దకు పంపండి వారికి నేనే స్వయంగా శిరచ్చేదన మరణ దండనను అమలు చేస్తాను ఈ నా వేడుకలను ఆమోదించండి అని విన్నవించుకుంటున్నాడు అటువంటి విచిత్రమైన విధి నిర్వహణకు ఎందుకు అడుగుతున్నాడనే మర్మం రాజుకు అర్థం కాకపోయినా ఎదురు చెప్పండి చెప్పలేదు జీవన్ముక్తున్ని వేడుకలను వెంటనే నెరవేర్చమని ఆదేశించాడు వద్య స్థలానికి దగ్గరే జీవన్ముక్తుడు బస చేయడానికి అనువుగా ఒక కుటీరాన్ని నిర్మించారు అధికారులు ఆ కుటీరానికి పక్కనే నేరస్తులు ఉండడానికి ఒకచోటిని కేటాయించారు మూగగా పరిగణించబడుతూ వచ్చిన యువకుడు నేరస్తులకు శిరచ్చేదన
(04:22) చేస్తూ మరణ దండనను అమలు పరిచే పనిని సక్రమంగా నిర్వర్తించసాగాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు యమధర్మరాజు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుని వద్దకు విచారవదనుడై వెళ్ళాడు అప్పుడు బ్రహ్మ దేవుడు విషయం అడగగా అందుకు యమధర్మరాజు దేవా భూలోకంలో ఘోర నేరాలు చేసిన వారిని నేను నరకానికి ఈడ్చుకు వచ్చి నరకయాతనలకు గురి చేయడం నా ధర్మము నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ధర్మం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను ఇప్పుడు పరిస్థితి మారింది గత కొన్ని నెలలుగా నాకు పని తగ్గింది నరకానికి వచ్చేవారు కరువయ్యారు ఒక ప్రాంతంలోని పాపులు ఏమైపోతున్నారో ఎక్కడికి పోతున్నారు
(05:00) అంతుపట్టడం లేదు అని అన్నాడు కారణం తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు దృష్టి సారించి చూడగా రాజ్యసభలో జరుగుతున్న తతంగము ఘోరమైన నేరాలు చేసిన వారికి రాజు మరణ దండన విధించడము బటులు నేరస్తులను వద్య స్థలానికి ఈడ్చుకుపోవడం గమనించాడు అక్కడ ఒక యువకుడు నేరస్తుల శిరచ్చేదన చేయడం కూడా బ్రహ్మదేవుడు చూశాడు కానీ వద్యస్థలంలో మరణ దండనను ఒక విచిత్రమైన పద్ధతిలో అమరుపరుస్తున్నాడు ఆ యువకుడు
No comments:
Post a Comment