🚨 Japan చేసిన భయంకరమైన Human Experiments! | Japan's Most Horrific Secret | Unit 731
Author Name:Sudheer Vlogger
Youtube Channel Url:https://www.youtube.com/@Sudheer_vlogger
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jr4hMwEkufU
Transcript:
(00:00) ఒక యుద్ధంలో శత్రువులను చంపడం చాలా సాధారణం కానీ యుద్ధంలో బందీలుగా పట్టుకున్న వాళ్ళని అమాయకపు ప్రజల్ని చిన్న చిన్న పిల్లల్ని ప్రయోగాల కోసం ఉపయోగిస్తే అందరిని ఒక ల్యాబ్ లో పడేసి ప్రపంచానికి తెలియకుండా వాళ్ళకి అతి భయంకరమైన ప్లేగ్ యాంత్రాక్స్ కలరా లాంటి డిసీజెస్ తో ఇన్ఫెక్ట్ చేసి వాళ్ళ మీద ప్రయోగాలు చేసి వేల మందిని పొట్టన పెట్టుకున్న సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ ఇది.
(00:22) [సంగీతం] వాళ్ళను మనుషులని కాకుండా లాక్స్ అని పిలిచేవాళ్ళు. ఒక దేశాన్ని కాపాడాల్సిన ఆర్మీ జాలి దయ లేకుండా దాదాపు 6రు లక్షల మంది అమాయకపు ప్రజల్ని చంపి ఎంత దారుణాన్ని కొడికట్టిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేస్ మీరు గనుక వీక్ హార్టెడ్ అయితే జాగ్రత్త చాలా డిస్టర్బింగ్ అండ్ రియల్ ఫాక్ట్స్ ని మీ ముందు ఉంచబోతున్నాను.
(00:43) ఇది సినిమా కాదు ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన నిజం. ఇది జపాన్ యొక్క సీక్రెట్ హెల్. [సంగీతం] వెల్కమ్ టు యూనిట్ 731. ముందుగా ఈ టాపిక్ మీద వీడియో చేయమనిఇ లో నాకు మెసేజ్ చేసిన దేవ్ రోషన్ కాకాకి థాంక్యూ సో మచ్. ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా కూడా ఇలా ఏమన్నా ఐడియాస్ ఉంటే సుధీర్ వ్లాగర్ అని నాఇ పేజ్ లో నాకు మెసేజ్ చేయొచ్చు.
(01:04) ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 1930 లో జపాన్ అప్పుడే ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదుగుతుంది. అప్పుడు ఒక వ్యక్తి షీరో ఇషి అనే డాక్టర్ ఒక డేంజరస్ ఐడియాతో వచ్చాడు. అదేంటంటే ఫ్యూచర్ లో యుద్ధాలు గన్స్ తో కాదు జర్మ్స్ తో జరుగుతాయని. సో మనం వాటికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలని చెప్పాడు. అతని ఐడియా ఏంటంటే యుద్ధంలో భయంకరమైన రోగాల్ని ఆయుధాలుగా ఉపయోగిస్తే లక్షల మందిని ఒకేసారి కూల్చేయొచ్చు.
(01:28) అతను ఆ ఐడియాని యాజ ఇట్ ఈస్ గా జపాన్ ఆర్మీకి చెప్పాడు. అన్ఫార్చునేట్లీ ఈ ఐడియా జపాన్ ఆర్మీకి కూడా నచ్చింది. ఇక అతన్ని జపాన్ ఆర్మీ రెండు సంవత్సరాల ప్రపంచ యాత్రకు పంపించింది. ఎందుకంటే యusఎస్ఏ రష్యా లాంటి వరల్డ్స్ లో బయోలాజికల్ వెపన్స్ డేటా రీసెర్చ్ కోసం రెండు సంవత్సరాల ప్రపంచ యాత్ర తర్వాత ఇషీ జపాన్ కి తిరిగి వచ్చాడు.
(01:48) అప్పటికే జపాన్ సర్కమస్టాన్సెస్ చాలా చేంజ్ అయిపోయాయి. పొలిటికల్ గా అండ్ ఎకనామికల్ గా కంట్రీ చాలా బ్యాడ్ షేప్ లోకి వెళ్ళిపోయింది. ఇక వెంటనే అతను జపాన్ వార్ మినిస్ట్రీ కి ప్రపంచంలో చాలా కంట్రీస్ లో సీక్రెట్ గా బయోలాజికల్ వెపన్స్ ని తయారు చేస్తున్నారని నేను రెండు సంవత్సరాల్లో ఇవన్నీ చూశానని తన రీసెర్చ్ పేపర్స్ మొత్తం వాళ్ళ ముందుంచి తన ఐడియా గురించి కూడా వాళ్ళకి చెప్పాడు.
(02:07) వార్ మినిస్ట్రీ తన రీసెర్చ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూయించింది. చైనాలో ఉండే పప్పెట్ స్టేట్ అయిన మంచూరియాలో ఫస్ట్ ల్ాబ్ ని సెట్ప్ చేశారు. బయటకి చూస్తే ఇది ఒక వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ ఎపిడమిక్ ప్రివెన్షన్ సెంటర్ కానీ లోపల ఇది ఒక బయోలాజికల్ అండ్ కెమికల్ వార్ఫేర్ ల్యాబ్ దీని లోపల ప్రిజన్ సెల్స్ అండ్ లాబరేటరీ కలిసి ఉండే ప్లేస్.
(02:26) చాలా మంది యుద్ధంలో దొరికిన వాళ్ళని బందీలుగా పట్టుకొని వాళ్ళ మీద ప్రయోగాలు చేసేవాళ్ళు. అక్కడ ప్రయోగాలు చేస్తున్న టైం లో ఒకసారి 16 మంది చైనీస్ ప్రిజనర్స్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. దాంతో ఇక ఆ ప్లేస్ ఏమాత్రం సెక్యూర్ కాదని దాని గురించి బయటకి తెలిసే ఛాన్స్ ఉందని భయపడి ఇషీ ఆ ప్లేస్ మొత్తాన్ని ఆనవాలు లేకుండా నాశనం చేయించాడు.
(02:45) ఆ తర్వాత ఫుల్ సెక్యూరిటీతో ఎవ్వరూ తప్పించుకోవడానికి వీలు లేని ప్లేస్ కావాలని జపాన్ వార్ మినిస్ట్రీని ఈషి రిక్వెస్ట్ చేశాడు. ఇక 1936 లో చైనాలోని పెంగ్ఫాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హార్బిన్ దగ్గర 6 స్క్వేర్ కిలోమీటర్స్ అంత పెద్ద మసివ్ ఏరియాలో 150 కి పైగా స్పెషలైజ్డ్ బిల్డింగ్స్ తో ఆ ఏరియా మొత్తం హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ వాల్స్ తో 3000 మంది ఆర్మీయ అండ్ సైంటిస్టులతో కలిసి ఎవ్వరూ కనీ విని ఎరగని రేంజ్లో ఒక పెద్ద సీక్రెట్ ఫెసిలిటీని నిర్మించారు. దాని పేరే యూనిట్ 731.
(03:16) ఒక రకంగా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నరక కోపం అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిఉండొచ్చు జపాన్ వాళ్ళు ఈ ఫెసిలిటీని చైనాలో ఎలా పెట్టారు చైనా అసలు ఎలా ఒప్పుకుంది అని దీనికి కూడా యాక్చువల్ గా ఒక స్టోరీ ఉంది. ఆ టైంలో చైనా యూనిఫైడ్ గా ఉండేది కాదు. ఇంటర్నల్ గా పవర్ కోసం నేషనలిస్ట్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు.
(03:35) అండ్ చైనా ఆర్మీ కూడా చాలా వీక్ గా ఉండేది. ఇక జపాన్ వాళ్ళు ఇదే మంచి ఛాన్స్ అని జపాన్ కి చైనాకి బోర్డర్ దగ్గర మంచూరియా అనే ఏరియాకి దగ్గరలో జపాన్ వాళ్ళ ఓన్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక చిన్న ఎక్స్ప్లోజన్ చేసుకొని అది చైనా వాళ్ళు చేశారని వాళ్ళని బ్లేమ్ చేసి చైనాలో ఉన్న మంచూరియా స్టేట్ ని ఆక్రమించుకున్నారు. చైనా వాళ్ళు అప్పటి లీగ్ ఆఫ్ నేషన్స్ కి కంప్లైంట్ చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఎవ్వరూ పట్టించుకోలేదు.
(03:59) అలా దాన్ని ఒక పపెట్ స్టేట్ లాగా జపాన్ వాడుకొని చైనాలోకి చొరబడాలని చూసింది. అండ్ జపాన్ లో కాకుండా ఇక్కడ పెట్టడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే బయలాజికల్ వెపన్స్ కి ఫ్రెండ్స్ ఎవరో ఎనిమీస్ ఎవరో తెలియదు. సో అది ఒక ప్లేస్ లో వేస్తే అక్కడ ఎవ్వరు ఉన్నా గాని దారుణమైన చావు చస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ ని ఇన్ కేస్ జపాన్ లో చేస్తే జపాన్ లో ఉన్న సివిలియన్స్ కూడా చనిపోతారు.
(04:20) [సంగీతం] సో అందుకే వాళ్ళు ఆక్రమించుకున్న ఈ పపెట్ స్టేట్ లో అయితే హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ ని కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడఉన్న జనాలు కూడా వాళ్ళ కంట్రీ వాళ్ళు కాదు అండ్ ఎవరు అడిగే వాళ్ళు కూడా ఉండరు. సో ఇంక వీళ్ళకి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. ఇక మెయిన్ మేటర్ లోకి వస్తే ఈ ఫెసిలిటీని ఎంత పవర్ఫుల్ గా నిర్మించారంటే ఒక హైలీ సెక్యూర్డ్ మిలిటరీ జోన్ లాగా నిర్మించారు.
(04:40) అండ్ ఆ ఏరియా పైన నో ఫ్లై జోన్ ని కూడా అమలు చేశారు. అండ్ ఆ ఏరియా మొత్తం చుట్టుపక్కల పదుల సంఖ్యలో వాచ్ టవర్స్ ని కూడా పెట్టారు. అండ్ ఈ ల్యాబ్ లోకి ఎక్స్పెరిమెంట్స్ కోసం తీసుకొచ్చిన మనుషుల యవరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో తెలుసా జస్ట్ వన్ మంత్ అక్కడికి ఎక్స్పెరిమెంట్స్ కోసం తీసుకెళ్ళబడిన వాళ్ళు ఎవరంటే చైనా సివిలియన్స్ రష్యన్స్ అండ్ కొరియన్స్ వీళ్ళందరూ బందీలుగా వాళ్ళకి చెక్కిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అండ్ మహిళలు ఆ ల్యాబ్ లోకి వెళ్ళిన ఒక్కళ్ళ కూడా బ్రతికి ప్రాణాలతో తిరిగి బయటికి రాలేదు.
(05:07) యవరేజ్ గా 30 రోజుల పాటు వాళ్ళ మీద ఎన్ని కుదిరితే అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చంపేసేవాళ్ళు. వాళ్ళను మరుట అని పిలిచేవాళ్ళు. అంటే లాగ్స్ అని దాని మీనింగ్. అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు మనుషులు కాదు ప్రయోగాలు చేసుకునే వస్తువులు అండ్ వీళ్ళని తీసుకురావడానికి కూడా ఒక సీక్రెట్ రైల్వే లైన్ కూడా వేశారు.
(05:24) ప్రపంచానికి తెలియకుండా అక్కడ జరిగిన భయంకరమైన ఎక్స్పెరిమెంట్స్ లో మొదటిది డిసీజ్ టెస్టింగ్ ఇందులో భాగంగా ప్రిజనర్స్ ని ప్లేగ్, యాంత్రాక్స్, టైఫాయిడ్ లాంటి జబ్బులతో ఇన్ఫెక్ట్ చేసేవాళ్ళు. ఈ ఇన్ఫెక్షన్స్ ని వాళ్ళకి ఎలా ఎక్కించేవాళ్ళుంటే పేషెంట్స్ ని బెడ్ మీద కట్టేసి స్కాల్పల్ తో వాళ్ళ చెస్ట్ ని ఓపెన్ చేసి ఆ లోపల ఆ డిసీజ్ ని ఇంజెక్ట్ చేసేవాళ్ళు అది కూడా అనస్తీషియా ఇవ్వకుండా ఎందుకంటే అనస్తీషియా ఇస్తే టెస్ట్ రిజల్ట్స్ మళ్ళీ చేంజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో అవి ఎలా పనిచేస్తాయో చూడటానికి వాళ్ళ శరీరాన్ని పరిశీలించేవాళ్ళు.
(05:53) ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఏ మనిషి అయినా సరే ఎప్పుడూ కూడా హెల్దీగా బాగుండాలి ఎలాంటి జబ్బులు వారిని పడకూడదు అని కోరుకుంటాడు. అలాంటిది చనిపోతారు అని తెలిసి కూడా డైరెక్ట్ గా అలాంటి డిసీజెస్ ని వాళ్ళ బాడీలోకి పంపిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. వీళ్ళు చేసిన దారుణమైన ఎక్స్పెరిమెంట్స్ లో సెకండ్ ది ఫాస్ట్ బైట్ స్టడీ.
(06:13) గడ్డకట్టుకుపోయే టెంపరేచర్ లో మనుషుల్ని కాళ్ళకు చెప్పులు గాని ఒంటి మీద బట్టలు గాని లేకుండా నిల్చోబెట్టి వాళ్ళ బాడీని అండ్ చేతుల్ని చల్లటి నీళ్ళల్లో కంప్లీట్ గా ఫ్రీజ్ అయ్యేలాగా చేసి అక్కడ టిష్యూ డెత్ గురించి స్టడీ చేయడం అండ్ ఫాస్ట్ గా ఎలా మళ్ళీ బాడీని గాని లేదంటే బాడీ పార్ట్స్ ని గాని తాజేయాలో స్టడీ చేయడం. ఈ స్టడీ ఎందుకు చేసేవాళ్ళు అంటే ఎప్పుడైనా వాళ్ళ సోల్జర్స్ కి ఫాస్ట్ బైట్ జరిగితే దాని నుండి ఎలా సర్వైవ్ అవ్వాలో టెక్నిక్స్ ని కనిపెట్టడానికి ఈ టెస్ట్ లో ప్రిజనర్స్ బాడీ పార్ట్స్ ప్రాపర్ గా ఫ్రీజ్ అయ్యాయా లేదా తెలుసుకోవడానికి వాళ్ళని కర్రలతో
(06:46) కొట్టేవాళ్ళు అలా కొట్టినప్పుడు ఆ పార్ట్ కనుక ఓన్లీ ఆ కర్ర సౌండ్ మాత్రమే వస్తాయి అప్పుడు ఆ పార్ట్ పూర్తిగా ఫ్రీజ్ అయిందని గుర్తు అలానే ఆ ఫ్రీజ్ అయిన బాడీని లేదంటే బాడీ పార్ట్స్ ని త్వరగా ఎలా మళ్ళీ నార్మల్ స్టేట్ కి తీసుకురావాలో చూడటానికి వాళ్ళ మీద డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ లో వేడి నీళ్లు పోసి చెక్ చేసేవాళ్ళు.
(07:06) ఇంకొంతమంది ప్రిజనర్స్ ని అయితే ఇలాంటి టెక్నిక్స్ కాకుండా పూర్తిగా వాళ్ళని అలానే వదిలేసేవాళ్ళు. అంటే ఫ్రాస్ట్ బైట్ ని తట్టుకొని వాళ్ళు ఎంతసేపు ఉండగలరో చూడటానికి. ఫ్రాస్ట్ బైట్ జరిగితే కలిగే నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఆ ఫ్రాస్ట్ బైట్ జరిగిన పార్ట్ మొత్తం ఇక పనికి రాకుండా పోయినట్లే.
(07:25) వీళ్ళు చేసిన ఇంకొక దారుణమైన టెస్ట్ ప్రిజనర్స్ ని హై ప్రెజర్ చాంబర్స్ లో పెట్టి ఒక మనిషి ఎంతవరకు ప్రెజర్ ని తట్టుకోగలడో చెక్ చేసేవాళ్ళు. లేడీస్ అయితే ఎంత ప్రజని తట్టుకుంటున్నారు జెంట్స్ అయితే ఎంత ప్రెజర్ తట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఈ హై ప్రెజర్ చాంబర్స్ లో ఆ ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది ప్రిజనర్స్ కళ్ళలో నుంచి గుడ్లు పగిలి బయటికి వచ్చేసేవి.
(07:45) నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి సెఫిలిస్ లాంటి డిసీజెస్ ని ఇంజెక్ట్ చేసి అది మదర్ నుండి బేబీకి ఇన్ఫెక్ట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసేవాళ్ళు. సిఫిలిస్ అనేది ఒక తీవ్రమైన సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. దీనివల్ల హ్యూమన్ ప్రైవేట్ పార్ట్స్ లో అండ్ నోటి మీద నెప్పి లేనటువంటి పుండ్లు లాగా ఏర్పడతాయి.
(08:04) తర్వాత దానికి గనక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బ్రెయిన్ నరాలు అండ్ హార్ట్ కి చాలా నష్టం కలుగుతుంది. కొంతమంది మదర్స్ అయితే ఆ డిసీజ్ ని తట్టుకొని పిల్లల్ని కూడా కన్నారు. కానీ ఆ బేబీస్ కొన్ని రోజులకి చనిపోయేవాళ్ళు అలా ఒక్క బేబీ కూడా ప్రాణాలతో ఆ ల్యాబ్ నుంచి బయటకు రాలేదు. నెక్స్ట్ అన్నిటికంటే మోస్ట్ డెడ్లీ అండ్ డేంజరస్ ఎక్స్పెరిమెంట్ బయోలాజికల్ వెపన్స్ టెస్టింగ్ జపాన్ సోల్జర్స్ మంచూరియాలో ఉండే జనాలు తాగే నీళ్లల్లో రకరకాల జెమ్స్ ని కలిపి ఏ రకమైన జెమ్స్ కి ఎలా ఎవరు రియాక్ట్ అవుతున్నారో టెస్ట్ చేశారు.
(08:34) అండ్ కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ కి ప్లేగ్ డిసీజ్ ని ఇన్ఫెక్ట్ చేసి వాటిని బాంబ్ లోపల పెట్టి ఆ బాంబ్స్ ని ఆ జనాల మీద వేసి టెస్ట్ చేశారు. [సంగీతం] డామేజ్ ఎంతవరకు జరుగుతుంది ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని. మంచూరియా స్టేట్ లో ఉన్న కొన్ని కొన్ని చైనీస్ విలేజెస్ లో ఊర్లు ఊర్లని కిడ్నాప్ చేసి వాళ్ళు తినే ఫుడ్ లో వాళ్ళు తాగే నీళ్లల్లో వాళ్ళకు తెలియకుండా ప్లేగ్, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి డిసీజెస్ ని కలిపి జనాలు ఆ రోగాల భారిన పడేలాగా చేశారు.
(09:02) ఇదంతా సోల్జర్స్ అండ్ రీసెర్చర్స్ దూరం నుంచి చూసేవాళ్ళు. ఫస్ట్ ఎవరు ఇన్ఫెక్ట్ అవుతున్నారు? ఎంత త్వరగా ఏ డిసీజ్ వ్యాపిస్తుంది? ఎంతమంది చనిపోతున్నారు అని. యూనిట్ 731 లో ఉన్న డివిజన్ఫోర్ చాంబర్ లో హిస్టోరియన్స్ ప్రకారం ఒక్క నెలకువన్ టన్ కలరా బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. 500 kgల యాంత్రాక్స్ 700 kిలోల టైఫస్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు.
(09:23) ఒకానొక టైం కి ఈ ప్రొడక్షన్ ఎంతవరకు పెరిగిందంటే ప్రపంచ జనాభా మొత్తాన్ని చంపేసిన తర్వాత కూడా ఇంకా కొంత మిగులుతుంది. ఈ వీడియోలో కనపడుతున్న అతని పేరు షిమజు అతనికి ఇప్పుడు 94 సంవత్సరాలు అండ్ అతను ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం యూనిట్ 731 గురించి ఒక అమెరికన్ రిపోర్టర్ తో మొత్తం క్లియర్ గా చెప్పాడు. ఇతను 1945 లో 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జపాన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు.
(09:49) తనని యూనిట్ 731 ల్యాబ్ లో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీగా నియమించారు. తను ఫస్ట్ వాళ్ళకి హెల్త్ బాగలేకపోతే వాళ్ళ మీద మెడికల్ టెస్ట్లు చేస్తున్నారు అనుకున్నాడు. కొత్త రోగాలకి మెడిసిన్స్ కనిపెడుతున్నారని అనుకున్నాడు. కానీ కొన్ని రోజులకి అతను అనుకున్న దానికి పూర్తిగా అక్కడ ఆపోజిట్ గా జరుగుతుందని అతనికి అర్థమయింది.
(10:05) అండ్ ఇతనఒక్కడే కాదు ఇతని లాగే 11 సంవత్సరాల క్రితం మీడియా ముందుకి చాలా మంది వచ్చి అక్కడ జరిగిన దారుణాల గురించి చెప్పారు. హిస్టోరియన్స్ చెప్పే రికార్డ్స్ ప్రకారం ఈ టెస్ట్ల వల్ల దాదాపుగా 5,85వ000 మంది చనిపోయారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే జాలి దయ లేని అసలు కలలో కూడా మనం ఊహించలేని దారుణమైన ఒక ఇన్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ ఈ టెస్ట్ల వల్ల ల్యాబ్ లోనే వేల మంది నరకయాతన అనుభవించి చనిపోయారు.
(10:31) అండ్ బయలాజికల్ అటాక్స్ లో 5,85,000 మంది చనిపోయారు. ఆగస్ట్ 6th అండ్ ఆగస్ట్ 9th, 1945 న అమెరికా హిరోషిమా నాగసాఖి మీద అనుబాంబులు వేయడంతో జపాన్ సరెండర్ అయిపోయింది. ఇక వెంటనే యూనిట్ 731 లో పానిక్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళు చేస్తుంది కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ వాళ్ళ రీసెర్చ్ ఏది కూడా సోవియట్ యూనియన్ కి అస్సలు తెలియకూడదు అనుకున్నారు.
(10:54) అందుకని ఆ ప్లేస్ ని నాశనం చేసేసి ఒక్క ట్రేస్ కూడా లేకుండా చేయాలనుకున్నారు. అందుకే అక్కడ మిగిలిన ప్రిజనర్స్ అందరినీ అక్కడికక్కడే షూట్ చేసి చంపేశారు. ఆ షూటింగ్ లో తప్పించుకున్న మిగతా వాళ్ళ మీద గ్యాస్ ని రిలీజ్ చేసి ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలకుండా ల్యాబ్ లో ఉన్న ప్రిజనర్స్ అందరి ని చంపేశారు. ఆ తర్వాత వాళ్ళ బాడీస్ ని కూడా దగ్గరలో ఉన్న రివర్ లో పడేశారు.
(11:13) ఆగస్ట్ 10, 1945 ఎగజాక్ట్ గా జపాన్ సరెండర్ అవ్వడానికి ఐదు రోజుల ముందు అప్పటికే అందరికీ తెలుసు జపాన్ పని అయపోయిందని అందుకే బిల్డింగ్స్ మొత్తాన్ని బాంబులతో బేల్చేశారు. అండ్ వాళ్ళు ఆ లాబ్స్ లో టెస్ట్ చేసిన అనిమల్స్ అన్నిటిని బయటకి వదిలేశారు. దాంతో 30వేల మంది చైనా ప్రజలు చనిపోయారు. ఎందుకంటే ఆ అనిమల్స్ కి ఎక్కించిన వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల.
(11:35) అండ్ ఆ తర్వాత ఆ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేసేసి ఇషి అండ్ అతనితో కొంతమంది మేజర్ సైంటిస్ట్లు పింగ్ ఫ్యాంగ్ ని వదిలేసి జపాన్ కి వెళ్ళిపోయారు. రిమైనింగ్ అక్కడ వర్క్ చేసే సోల్జర్స్ అందరూ దాదాపు 15 ట్రైన్స్ లో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. మంచూరియాలో దాదాపు 25 లక్షల బయోలాజికల్ వెపన్స్ ని వదిలేశారు. ఆ తర్వాత ఇషీ తను చేసిన వార్ క్రైమ్స్ కి భయపడి తనని ఎలాగైనా పట్టుకొని చంపేస్తారని అతనే తన హోమ్ టౌన్ లో తను చనిపోయినట్లుగా నమ్మించడానికి ఫేక్ ఫ్యూనరల్స్ ని కూడా కండక్ట్ చేయిచ్చాడు.
(12:04) కానీ ఫైనల్ గా ఫిబ్రవరి 1946 లో యుఎస్ ఆర్మీ అతన్ని పట్టుకుంది. యుఎస్a కి ఆల్రెడీ తెలుసు జపాన్ లో బయోలాజికల్ వెపన్స్ ని క్రియేట్ చేస్తున్నారని. ఎందుకంటే అప్పటికే యusఎస్ఐ కూడా ఆ రీసెర్చ్ ని కండక్ట్ చేస్తూంది. సో ఇది తెలిసిన డాక్టర్ ఇషీ అమెరికా వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే మీరు గనుక నన్ను నా కొలీగ్స్ ని అండ్ నా సబఆర్డినేట్స్ ని వదిలేస్తే నేను 20 సంవత్సరాలుగా కష్టపడి చేసిన బయలాజికల్ వెపన్స్ రీసెర్చ్ డేటా మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను అని అండ్ మీకు రష్యా మీద యుద్ధం చేయడానికి హెల్ప్ అవుతుందని కూడా చెప్పాడు. అమెరికా కూడా ఆ ఆఫర్ ని
(12:36) యాక్సెప్ట్ చేసి వాళ్ళందరినీ వదిలేసింది. కానీ దీని గురించి అమెరికా బయటకి ఫేక్ అని చెప్పినా కూడా ప్రపంచం మొత్తానికి నిజం ఏంటో తెలుసు. ఎందుకంటే ఆ డాక్టర్ ఇషీని గాని లేదంటే ఆ టీం లో ఒక్క పర్సన్ ని కూడా యుఎస్ఏం చేయకుండా పూర్తిగా వదిలిపెట్టేసి వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చింది. ఒక్కళ్ళ కూడా ట్రైల్ చేయలేదు.
(12:54) పైగా వాళ్ళందరూ ఆ తర్వాత ఆ దేశంలో పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్లి లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేశారు. వాళ్ళలో ఒకరు టోక్యో గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. ఇంకొకళ్ళు జపాన్ లోనే అతి పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీకి చైర్మన్ అయ్యాడు. ఇంకొకతను జపాన్ మెడికల్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత సోవియత్ యూనియన్ కి యూనిట్ 731 లో వర్క్ చేసిన 12 మంది సోల్జర్స్ దొరికారు.
(13:15) వాళ్ళని ఇంటరగేట్ చేసినప్పుడు వాళ్ళు మేము ప్లేన్స్ లో ప్లేగ్ బాంబ్స్ ని వేసామని ఒప్పుకున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే సోవియట్ యూనియన్ కూడా సేమ్ అమెరికా లాగానే వీళ్ళ దగ్గర దొరికినంత వరకు డేటా రీసెర్చ్ మొత్తాన్ని తీసుకొని వాళ్ళని కూడా వదిలేసింది. ఇంత దారుణం చేసిన వాళ్ళందరూ బానే ఉన్నారు అండ్ ప్రపంచంలో మేము గొప్ప అని చెప్పుకు తిరిగే కంట్రీస్ కూడా వాళ్ళకు కావాల్సిన డేటా తీసుకొని దొంగల్ని వదిలేసి బానే ఉన్నాయి.
(13:38) ఫైనల్ గా ఇక్కడ నరకం అనుభవించి ప్రాణాలు పోగొట్టుకుంది మాత్రం అమాయకమైన ప్రజలు. ఈ దారుణాలన్నిటికీ సృష్టికర్త అయిన ఇషీ కూడా 1959 లో త్రోట్ క్యాన్సర్ తో చనిపోయాడు. అప్పటికే అతనికి 67 సంవత్సరాలు. చెప్పాలంటే అతను అతని లైఫ్ మొత్తాన్ని మంచిగానే అనుభవించబోయాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిఉండొచ్చు అదేంటి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన డేటా తీసుకొని వదిలేస్తే హ్యూమన్ రైట్స్ గానీ లేదంటే ప్రపంచ దేశాలు గాని ఏం మాట్లాడలేదా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోలేదా అని మీరు అనుకోవచ్చు.
(14:04) కానీ టోటల్ స్టోరీలో అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ భయంకరమైన నిజాన్ని డెకేడ్స్ వరకు బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్ గా ఉంచారు. అది జరిగిన కొన్ని ఇయర్స్ తర్వాత ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు చైనీస్ అండ్ సోవియట్ ఫోర్సెస్ కి మంచూరియాలో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ గురించి కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి.
(14:23) ఆ ఎక్స్పెరిమెంట్స్ లో బ్రతికి బయటపడ్డ వాళ్ళ టెస్టిమోనీస్ తీసుకున్నారు. కానీ జపాన్ దాన్ని బయటకి రానివ్వలేదు. ఆ తర్వాత 1970ల టైంలో జర్నలిస్టులు అండ్ హిస్టోరియన్స్ డాక్యుమెంట్స్ ని అండ్ ఆ ఎక్స్పెరిమెంట్స్ భార్యన పడి బ్రతికిన వాళ్ళ ఇంటర్వ్యూస్ తో బుక్స్ అండ్ న్యూస్ లో రాయడం స్టార్ట్ చేశారు. అప్పటికే చాలా ఇయర్స్ గడిచిపోయాయి అండ్ అప్పట్లో సోషల్ మీడియాలు ఇలాంటివి లేకపోవడంతో ఈ న్యూస్ అనేది అంతగా స్ప్రెడ్ అవ్వలేదు.
(14:45) ఆ తర్వాత 1980 లో కొన్ని మేజర్ పబ్లికేషన్స్ దీని గురించి రాసి పబ్లిష్ [సంగీతం] చేశయి. 1990 లో పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే అప్పటి జపాన్ గవర్నమెంట్ అఫీషియల్ గా యూనిట్ 731 ఎగ్జస్టెన్స్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ లో ఎక్నాలెడ్జ్ చేసింది. అప్పుడు గ్లోబల్ వైడ్ గా ఫుల్ స్కేల్ లో జరిగిన అట్రాసిటీస్ గురించి తెలిసింది.
(15:04) చెప్పాలంటే వరల్డ్ వార్ 2 తర్వాత నియర్లీ 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారు. ఈవెన్ జపాన్ సిటిజన్స్ కి కూడా 1980 లో అండ్ 1990 లోనే దీని గురించి తెలిసింది. ఎందుకంటే అప్పటికే నాజీస్ కి వీటికంటే దారుణమైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని నేమ్ ఉంది. దాని గురించి నేను యాక్చువల్ గా ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ లో కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు కొంచెం సేపు బ్రెయిన్ వర్క్ చేయడం ఆగిపోయింది.
(15:29) అంత దారుణమైన వాళ్ళు ఉన్నారు నాజీస్ లో వాళ్ళు జ్యూస్ మీద అతి క్రూరంగా ఎన్ని అరాచకాలు చేశారో ఇంకొక వీడియోలో చెప్తాను. నాజీస్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచానికి తెలిసి దాని వల్ల గ్లోబల్ అవట్రేజ్ వచ్చి ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళ మీద 1945 నుంచి 1946 లో ట్రైల్స్ కూడా జరిగాయి. కానీ జపాన్ వాళ్ళు చేసిన ఈ యూనిట్ 731 ఎక్స్పెరిమెంట్స్ కి మాత్రం అమెరికా ట్రైల్స్ చేయకుండా ఆ డేటా కోసం వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చి వదిలిపెట్టింది.
(15:56) చైనా నుండి ఇంకొన్ని కంట్రీస్ ట్రైల్స్ చేయాలని పట్టుపెట్టిన కూడా అవి అవ్వలేదు. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ కి ఫైనల్ గా 1972 లో అన్ని కంట్రీస్ కలిచి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనే ఇంటర్నేషనల్ ట్రీటీ మీద సైన్ చేశయి. దీని ప్రకారం ఎవ్వరు కూడా ఇలాంటి బయోలాజికల్ వెపన్స్ ని ఫ్యూచర్ లో తయారు చేయకూడదు.
(16:15) ఎందుకంటే ఇలాంటి ఘోరమైన బయోవార్ దాడుల్ని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. వాళ్ళు వీటి వల్ల ఈ భూమి మీద మనిషి ఎగ్జిస్టెన్స్ఏ లేకుండా పోతుందని 1975 నుంచి ఈ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ మనకు తెలిసిందే కదా ఇది ఏవో పైపైన మాటలే అని చెప్పేసి ఎందుకంటే ఈ ట్రీటీ మీద సైన్ చేసిన తర్వాత కూడా సోవియట్ యూనియన్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసింది.
(16:34) సద్దాం హుసేన్ అయితే ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా యాంత్రాక్స్ స్మాల్ పాక్స్ అండ్ ప్లేగ్ లాంటి వాటి మీద సీక్రెట్ గా రీసెర్చ్లు చేశారు. బట్ ఆయన చేసింది ఏంటంటే అనిమల్స్ మీద అండ్ పంట పొలాల మీద. ఫైనల్ గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను భయ్యా ఇక్కడ యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య పోరాటం కాదు కొన్నిసార్లు మనిషి మనిషిగా ఉండడానికి కోల్పోయే పరిస్థితి.
(16:55) ఈ యూనిట్ 731 మనకొక విషయం నేర్పిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే స్వర్గం. ఒకవేళ దాన్ని చెడుకు ఉపయోగిస్తే మాత్రం నరకాన్ని సృష్టిస్తాయి. ఇలాంటి దారుణమైన సంఘటనలు మళ్ళీ ఎప్పుడూ రిపీట్ కాకూడదని కోరుకుంటున్నాను. మరుగున పడిపోయిన ఇలాంటి దారుణాల గురించి ఇప్పటి జనరేషన్ తెలుసుకోవాలనేదే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్.
(17:14) ఇది కేవలం చరిత్ర కాదు మనిషి ఎంతకు దిగజారగలడో చూపించే ఒక నిజం. ఇలాంటి డార్క్ రియాలిటీస్ గురించి ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు తెలిసిన ఏదైనా కొత్త విషయాలు ఉంటే Instagram పేజ్ సుధీర్ వ్లాగర్ అని ఉంటుంది అక్కడ మెసేజ్ చేయండి. ఇప్పుడు మనం సంతోషంగా జీవిస్తున్నాం. కానీ సొసైటీ కోసం మనకు తెలియని ఎంతో మంది చేసిన బలిదానాలని ఒకసారి స్మరించుకుంటూ మీ సుధీర్ వ్లాగర్ జై హింద్.
No comments:
Post a Comment