Sunday, April 12, 2026

 కాఫీ కబుర్లు సంఖ్య 1159 (ఏప్రిల్ 12 - 2026) -- బీపిని తగ్గించుకోగలమా..  అనేది ఈరోజుల్లో తలెత్తుతున్న సమస్య.  నేనున్నాను మీలోనే అంటూ 40 ఏళ్ళనుంచే బీపి తన ప్రజెన్స్ చెబుతోంది.  రోజురోజుకీ బీపి బాధితుల సంఖ్య పెరుగుతోంది.  వైద్యులు సూచించిన మెడిసిన్సే రోజూ వేసుకుంటున్నా మాకు బీపి తగ్గడంలేదని అంటుంటారు.  బీపి నియంత్రణ సాధ్యమే కొన్ని జాగ్రత్తలు సరిగా తీసుకుంటే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.  మనకి బీపి పై అవగాహన ఉండి వైద్యుని పర్యవేక్షణలో ఉంటూ సూచించిన మందులు టైం ప్రకారం వేసుకుంటే బీపి మనల్ని ఏమీచేయదు.  రక్త ప్రసరణ, బ్లడ్ ప్రెషర్ మన శరీరంలో నిత్యం జరిగే సాధారణ ప్రక్రియ.  ఈ పని సజావుగా లేకుంటే బీపిలో హెచ్చు తగ్గులు ఏర్పడి ఇబ్బందులు తెచ్చిపెడతాయి.  ఇక్కడ మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బీపి షుగర్ వంటివి మన శరీరం లోపలి పనితీరు వలన ఏర్పడే క్రానిక్ ఎయిల్మెంట్స్.  దగ్గు జలుబు గాయాలు వంటి బయట నుంచి వచ్చేవి కాదు.  గనుక బీపి షుగర్ వంటివి మన శరీర పనితీరు మెరుగుపడేలా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.  మందులే  నయం చేయవు.  మెడిసిన్స్ కేవలం సప్లిమెంట్స్ మాత్రమే.  అంటే నియంత్రణ కి దోహద పడతాయి తప్పిస్తే పూర్తిగా తగ్గించలేవు.  ఇక బీపి లోని హెచ్చుతగ్గులకు కారణాలు తెలుసుకుంటే సరియైన జాగ్రత్తలు తీసుకోగలం.  అసలు బీపీ వ్యాధిగ్రస్తులు పెరగడానికి ఒక ప్రధాన కారణం వేగంగా మారుతున్న ఆధునిక జీవనశైలి.  సరియైన వేళల్లో అవసరమయ్యే ఆహారం తీసుకో(లే)క పోవడం మరో కారణం.  పెరుగుతున్న వయసు, వృత్తి వ్యాపారాలలో ఒత్తిళ్లు, సంసార బాధ్యతల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు, కోపం, వాదోపవాదాలు, నిద్రలేమి, అధిక బరువు, కాఫీ టీ వంటివి వేళాపాళా లేకుండా తీసుకోవడం, ధూమపానం ఆల్కహాల్ వంటి దుర్వ్యసనాలు, అవసరాన్ని మించి ఉప్పు తీసుకోవడం..  ఇవన్నీ కూడా బీపికి బీపిలో హెచ్చుతగ్గులు కి కారణాలు.  వీటిని అదుపులో ఉంచుకుంటూ నిర్ణీత సమయంలో డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వేసుకుంటే బీపిని కంట్రోల్ లో ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు.  వ్యాయామం నడక కూడా అవసరమే.  శారీరక శ్రమ ఉండాలి.  మెదడు చురుగ్గా ఉండాలి.  కోపం రోషం వదిలేయాలి.  మనశ్శాంతి విశ్రాంతి ఉంటుండాలి.  ఆహార నిద్ర నియమాలలో అలసత్వం ఉండకూడదు.  ఆందోళనలు ఆతృతలు ఉండకూడదు.  బీపి రోజురోజుకూ మారుతూ ఉంటుంది.  బీపి మోనిటర్ ఇంట్లో పెట్టుకుని వారానికోసారి బీపి చెక్ చేసుకోవడం అవసరం.  మనకున్న బీపి ని అనుసరించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.  ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నెలా నెలా వైద్యుల పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకుంటుంటే బీపి మనల్నేమీ చేయదు అని నిపుణులు మెడికల్ జర్నల్స్ లో రాస్తుంటారు.  డాక్టర్లు పేషంట్స్ కి చెబుతుంటారు.  ఇక బీపి అంటే భయమెందుకు..  ---+ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment