కాఫీ కబుర్లు సంఖ్య 1157 (ఏప్రిల్ 10 - 2026) అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం.. -- ఒక పరిపూర్ణ కుటుంబం అంటే తల్లిదండ్రులు తోబుట్టువులు. మన ఎదుగుదలకు, మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించటానికి అన్న అక్క ఉండాలి. అలాగే అనురాగం పంచడానికి మనకో చెల్లి తమ్ముడు ఉంటే వాళ్ళకి మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఓ మంచి మార్గంలో పెట్టగలం. తోబుట్టువులుతో.. బాల్యంలో ఆటలు పాటలు అల్లర్లు తో సరదాగా గడిచిపోతుంది. పెద్దయ్యాక కుటుంబ బాధ్యతలను పంచుకుంటూ ఒకరికొకరం తోడుగా ఉంటాం. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో ఇంచుమించు అందరికి నలుగురికి తక్కువ కాకుండా సంతానం ఉండటంతో తోబుట్టువుల కొరత ఆరోజుల్లో ఉండేది కాదు. కానీ ఒకరిద్దర్ని కనడానికే గగనమైపోతున్న ఈరోజుల్లో తోబుట్టువులు లేని కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడెలాగోలా గడిచిపోతుంది. మన పిల్లలకి వాళ్ళ పిల్లలకు 60-65 వచ్చేసరికి తనకంటూ తన కుటుంబానికి సంబంధించిన తోడబుట్టిన వారెవ్వరూ లేకపోవడంతో (భర్త/భార్య ఒక సంతానం ఉన్నా) ఒంటరితనం ఆవరిస్తుంది. ఖర్మకాలి భర్తో భార్యో కొంచెం ముందే పోతే ఈ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం అనేది భగవంతుడు ఏర్పరిచిన సహజ సృష్టి ప్రక్రియ. ఈ బంధాల నుంచి ఎవ్వరూ తప్పించుకో లేరు. ప్రకృతి కి విరుద్ధంగా వెళ్ళకూడదు. మనకంటూ పరితపించే తోబుట్టువులు మనకుంటే మనం గొప్ప అదృష్టవంతులం. భవిష్యత్తుపై భరోసా ఉంటుంది. పరస్పర ప్రేమాభిమానాలు అందరికీ అవసరమే. తోబుట్టువులు ప్రాధాన్యం పెంచడానికి యు ఎస్ ఎ, కెనడా లలో ఏటా ఏప్రిల్ 10న (ఈరోజే) ఇంటర్నేషనల్ సిబ్లింగ్ డే గా (అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం) 1998 నుంచి నిర్వహించటం ప్రారంభించారు. క్రమంగా చాలా దేశాలకు పాకింది. ఐరోపాలో మాత్రం మే 31 బ్రదర్స్ & సిస్టర్స్ డే గా ఓ పండుగలా జరుపుకుంటారు. ఆరోజు సెలవ దినంగా ప్రకటిస్తారు ఐరోపాలో. సిబ్లింగ్స్ డే ఫౌండేషన్ సంస్థ అమెరికాలో ఉంది. తోబుట్టువులు ప్రాధాన్యత గల సినిమాలు చాలానే వచ్చాయి. పండంటి కాపురం, తోబుట్టువులు, కుల గౌరవం, సిరిసంపదలు, అన్నదమ్ముల అనుబంధం, ఆదర్శ కుటుంబం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల పేర్లు వస్తాయి. తోబుట్టువులకి సంబంధించిన పాటలు మన సినిమాల్లో కోకొల్లలు. రాఖీ పండుగ సంబరంగా జరుపుకోవాలంటే తోబుట్టువులు ఉండాలి. ముఖ్యంగా తోడబుట్టిన అక్కాచెల్లెళ్ళు లేకపోతే ఆ మనిషి జీవితంలో కళాకాంతులు తగ్గుతాయని. నా స్థిర అభిప్రాయం.. అక్కాచెల్లెళ్ళ అనురాగానికి నోచుకోని దురదృష్ట వంతులు, తోడబుట్టిన తోబుట్టువులు లేనివారు కూడా కొందరుంటారు. సోదర సోదరీ సమానులైన తోబుట్టువులు అందరికీ సిబ్లింగ్స్ డే గ్రీటింగ్స్ & శుభాకాంక్షలు.. ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....
No comments:
Post a Comment