Monday, April 13, 2026

మీ మనస్సు మీ కోట 🏰 | Stoicism in Telugu | బాధని ఆపే 2000 ఏళ్ల రహస్యం | 8 Powerful Concepts

మీ మనస్సు మీ కోట 🏰 | Stoicism in Telugu | బాధని ఆపే 2000 ఏళ్ల రహస్యం | 8 Powerful Concepts

Author Name:Telugu Mindset Lab

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguMindsetLab

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qaaxNpMSUVY



Transcript:
(00:00) ఏడుస్తున్నావా అవును నువ్వు ఏడుస్తున్నావ్ ఎందుకంటే నిన్ను ఎవరో ఏదో అన్నారు నీ ప్లాన్ ఫెయిల్ అయింది నీ బ్యాంక్ బాలెన్స్ సున్నా అయింది. లోకం నీ మీద యుద్ధం చేస్తుంది. అదంతా నిజమే కానీ ఒక్క నిమిషం ఆగు ఇక్కడ కూర్చున్న ఆయన పేరు ఎపిక్టిటస్ తను పుట్టింది బానిసగా యజమాని ఇప్పుడే తన కాలు విరగగొట్టాడు.
(00:21) ఆ ఎముక విరిగిన శబ్దం అతనికి వినిపిస్తుంది. కానీ అతను ఏడవట్లేదు. ఎందుకు? ఇక్కడ కూర్చున్న ఆయన మార్కస్ ఆరేలియస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు రోమ్ చక్రవర్తి సొంత కొడుకే తన సామ్రాజ్యాన్ని తగలబెడుతున్నాడు. అయినా నిశ్చలంగా ఉన్నాడు. ఎలా ఈయన పేరు సెనక. అతను అత్యంత ధనవంతుడు. చక్రవర్తి అతనికి మరణ శిక్ష వేశాడు. తను చనిపోతూ కూడా పక్కనున్న వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు.
(00:46) ఎందుకు? వీళ్ళ ముగ్గురికి ఒక రహస్యం తెలుసు. 2000 ఏళ్ల క్రితం పుట్టిన ఆ రహస్యం పేరు స్టోయిసిజం. ఇది థియరీ కాదు. లైఫ్ లో దెబ్బలు తింటున్నప్పుడు ఎలా నిలబడాలో చెప్పే ఒక మెంటల్ ఆపరేటింగ్ సిస్టం ఈరోజు నీ రిమోట్ కంట్రోల్ నీ చేతిలోకి తీసుకోబోతున్నాం. సిద్ధమా ముందు స్టాయిసిజం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇది ఎక్కడ పుట్టింది ఎవరు మొదలు పెట్టారు? క్రీస్తుపూర్వం 300 ఏథెన్స్ నగరం గ్రీస్ ఆ కాలంలో ఏథెన్స్ నాలెడ్జ్ కి ఫిలాసఫీకి కేంద్రం సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఇక్కడే బోధించారు.
(01:20) అక్కడ ఓ మార్కెట్ ప్రదేశం ఉండేది. దాని పేరు అఘోరా అక్కడే ఓ వరండా ఉండేది పేరు స్టోవా పోయిక్లే అంటే పెయింటెడ్ వరండా అని ఈ వరండాలో రంగుల చిత్రాలు వేసి ఉండేది చాలా అందంగా ఉండేది. ఈ వరండాలో ఓ వ్యక్తి కూర్చొని మాట్లాడేవాడు పేరు జెనో ఈ జెనో సైప్రస్ ద్వీపంలో పుట్టిన ఒక వ్యాపారి ఒకరోజు అతను వ్యాపారం కోసం తన ఓడలో ప్రయాణిస్తున్నాడు.
(01:45) తుఫాన్ వచ్చి ఓడ మునిగిపోయింది. జెనో దరిద్రుడయ్యాడు. ప్రాణాలతో బయటపడి ఏథెన్స్ చేరుకున్నాడు. ఏథెన్స్ లో ఒక పుస్తకాల షాప్ లో అతనికి ఒక పుస్తకం దొరికింది. అది సోక్రటీస్ గురించి అది చదివాక అతను తత్వశాస్త్రానికి ఆకర్షితుడయ్యాడు. అప్పటికే అతని వయసు 42 ఏళ్ళు జెను స్టోవా పోయిలే వరండాలో కూర్చుని బోధించడం మొదలు పెట్టాడు. అతను బోధించే చోటు పేరు మీదగా అతని శిష్యుల్ని స్టాయిక్స్ అని పిలవడం మొదలు పెట్టారు.
(02:10) అలా పుట్టింది స్టాయిసిజం కానీ స్టాయిసిజన్కి అసలైన శక్తి తీసుకొచ్చింది రోమన్లు ఎపిక్టిటస్ సెనక మార్కస్ అరేలియస్ వీళ్ళు రోమన్ స్ట్రాయిక్స్ వీళ్ళ రచనలే ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో మార్కెట్లో మొదలైన [సంగీతం] ఈ ఆలోచనలు ఈరోజు ప్రపంచంలోని శక్తివంతులందరూ కూడా ఫాలో అవుతున్నారంటే ఇందులో ఏంటి ప్రత్యేకత ఎందుకంటే ఇది థియరీ కాదు ఇది లైఫ్ ని డీల్ చేసుకోవడానికి ఒక ఆపరేటింగ్ సిస్టం ఇది మనిషికి మనిషి సమస్యలకి నేరుగా సంబంధించిందే.
(02:44) ఇప్పుడు మనం ఈ స్టాయిసిజం లోని అతి ముఖ్యమైన ఎనిమిది సూత్రాల్లోకి వెళ్తున్నాం. కానీ ఇవి వినే ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవి కేవలం పుస్తకాల్లోని అందమైన మాటలు కాదు ఇవి ఒక మెంటల్ ఆర్మర్ అంటే ఒక మానసిక కవచం యుద్ధానికి వెళ్ళే సైనికుడు తనని తాను కాపాడుకోవడం కోసం ఒక కవచం ఎలా వేసుకుంటాడో ఈ సొసైటీ అనే యుద్ధభూమిలో మీ మనసు గాయపడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఈ స్టాయిక్ మైండ్సెట్ లేదా ఈ ప్రిన్సిపుల్స్ ఉపయోగపడతాయి.
(03:14) మనం పుట్టినప్పటి నుండి ఒక తప్పుడు విషయం నమ్ముతూ పెరుగుతాం. అదేంటంటే బయట పరిస్థితులు బాగుంటేనే మనం బాగుంటాం అని ఎండ కాస్తే బాగుంటుంది పక్కవాడు పొగిడితే బాగుంటుంది. అనుకున్నది జరిగితే బాగుంటుంది. కానీ స్టాయసిజం దీనికి రివర్స్ లో ఆలోచిస్తుంది. బయట తుఫాను బీబత్సం క్రియేట్ చేస్తున్న లోపల మాత్రం ఒక దీపంలా ప్రశాంతంగా వెలగడమే ఈ విద్యలోని రహస్యం.
(03:36) మీరు గమనిస్తే మన ఆలోచనలు ఒక అడవి గుర్రం లాంటివి. దానికి సరైన సెక్షన్ లేకపోతే అది మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో ఏ గోతులో పడేస్తుందో తెలీదు. కానీ స్టాయిసిజం ఆ గుర్రానికి కళ్ళెం వేస్తుంది. మీ ఎమోషన్స్ కి మీరు బానిస అవ్వాలా లేదా బాస్ అవ్వాలా అని అన్నది ఈ ఎయిట్ ఐడియాస్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు మనం చూడబోయే మొదటి ఐడియా ఈ ఫిలాసఫీ మొత్తానికి కూడా వెన్నెముక్కు లాంటిది.
(04:00) అది అర్థమైతే మీ సగం బాధలు ఈ నిమిషమే మాయమైపోతాయి. అదే డైకాటమీ ఆఫ్ కంట్రోల్. డైకాటమీ ఆఫ్ కంట్రోల్. తెలుగులో చెప్పాలంటే నియంత్రణకి రెండు విధాలు. ఈ కాన్సెప్ట్ ని నేర్పిన గొప్ప గురువు ఎపిక్టిటస్ ఎపిక్టిటస్ క్రీస్తు శకం 55 నేటి టర్కీ ప్రాంతంలో పుట్టాడు. అతను పుట్టింది బానిసగా అతని అసలు పేరు ఎవరికీ తెలియదు. ఎపిక్టిటస్ అంటే గ్రీకులో సంపాదించబడినవాడు అని అర్థం అంటే ఆస్తి బానిసకి పేరు ఉండదు.
(04:29) అతను యజమాని ఆస్తి మాత్రమే అతని యజమాని పేరు ఎపాప్రొడటస్ నీరో చక్రవర్తికి సెక్రెటరీ చాలా క్రూరమైన వ్యక్తి. ఒకరోజు యజమాని ఎపిక్టేటస్ ని టార్చర్ చేస్తున్నాడు. అతని కాలు విరగగొడ్డడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ బానిసైనా ఏడుస్తాడు క్షమాపణ చెప్తాడు బ్రతిమలాడతాడు. కానీ ఎపిక్టస్ అతను చాలా కూల్ గా నిశ్చలంగా తన యజమానితో అన్నాడు నువ్వు ఇప్పుడు దాన్ని విరగగొడతావు అని యజమాని కాలు విరిచేసాడు ఎముక విరిగిన శబ్దం నొప్పి ఎపిక్టస్ ముఖం మారలేదు అతను నవ్వుతూ అన్నాడు.
(05:00) నేను చెప్పలేదా నువ్వు దాన్ని విరగగొడతావని ఎపిక్టిటస్ ఈ సంఘటన నుంచి ఒక గొప్ప తత్వాన్ని నిర్మించుకున్నాడు. అతను తర్వాత విడుదలయ్యాడు. గ్రీస్ లో స్కూల్ పెట్టాడు. రోమ్ చక్రవర్తి హెడ్రియన్ కూడా అతనికి మిత్రుడు అంటే బానిస నుండి చక్రవర్తి మిత్రుడి దాకా ఎదిగాడు. అతను తన పుస్తకం ఎంకరిడియన్ లో ఇలా రాశడు. కొన్ని విషయాలు నీ కంట్రోల్ లో ఉంటాయి.
(05:20) కానీ కొన్ని విషయాలు నీ కంట్రోల్ లో ఉండవు. నీ కంట్రోల్ లో ఉన్నవి ఏంటి? నీ ఆలోచనలు నీ నిర్ణయాలు నీ యాక్షన్స్ నీ కోరికలు నీ వాల్యూస్ నీ అయిష్టత నీ ఒపీనియన్స్ మరి నీ కంట్రోల్ లో లేనివి ఏంటి నీ శరీరం అది అనారోగ్యం పాలవ్వచ్చు నీ ఆస్తి అది ఎప్పుడైనా పోవచ్చు ఇతరుల అభిప్రాయాలు వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు వాతావరణం అది ఎప్పుడైనా మారొచ్చు పాస్ట్ అంటే గతం ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి భవిష్యత్తు ఇంకా రాలేదు.
(05:50) మన కంట్రోల్ లో ఉన్న విషయాలన్నీ బాక్స్ ఏ లో వేద్దాం. మన కంట్రోల్ లో లేని వాటిని బాక్స్ బి లో వేద్దాం. ఎపిక్టస్ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఇది చాలా ముఖ్యమైన మాట గుర్తుంచుకో నీ కంట్రోల్ లో లేని వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే నువ్వు బానిస అవుతావు. నీ కంట్రోల్ లో ఉన్నవాటిని మాత్రమే నువ్వు లక్ష్యంగా పెట్టుకుంటే నిన్ను ఎవ్వరూ బంధించలేరు.
(06:11) ఇది ఎపిక్టస్ జీవితంలోనే మనం చూస్తే అతను బానిస. అతని శరీరం అతని యజమాని చేతిలో ఉంది. అతని కాలు విరగగొట్టబడింది. కానీ అతను చాలా స్వేచ్ఛగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే అతను తన కంట్రోల్ లో ఉన్న వాటి మీద మాత్రమే దృష్టి పెట్టాడు. తన ఆలోచనలు తన అభిప్రాయాలు తన రియాక్షన్లు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీ జీవితంలో ఎలా పని చేస్తుందో చూద్దాం.
(06:33) ఒక సాధారణ పరిస్థితి తీసుకోండి మీరు డ్రైవింగ్ చేస్తున్నారు ఎవరో మీ ముందుకు వచ్చి రాష్ గా కట్ చేశారు. చాలా డేంజరస్ గా ఓవర్టేక్ చేశారు. మీకు ఏమవుతుంది కోపం వస్తుంది బీపి పెరుగుతుంది. మీరు హార్న్ కొడతారు. గాలిలో గుడ్డిగా చేయి కదుపుతారు. ఆ తర్వాత అరగంట వరకు మూడ్ ఆఫ్ ఇంటికి వెళ్లి ఫ్యామిలీ మీద కోపం తీసుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితిని డైకాటమీ ఆఫ్ కంట్రోల్ లో విశ్లేషించండి.
(06:53) ఇప్పుడు మన కంట్రోల్ లో లేనివి ఏంటి? ఎదుటి వ్యక్తి ఎలా డ్రైవ్ చేస్తున్నాడు? రోడ్ల పరిస్థితి ట్రాఫిక్ అదే మన కంట్రోల్ లో ఉన్నది మనం కోపపడుతున్నామా లేదా హారర్న్ కొట్టాలా వద్దా మనం ప్రశాంతంగా ఉండాలా వద్దా ఇవన్నీ మన కంట్రోల్ లో ఉన్నవి. ఎపిక్టస్ చెప్పిన మాట గుర్తుంచుకో నిన్ను బాధ పెట్టేది ఈవెంట్ కాదు ఆ ఈవెంట్ గురించి నీకున్న అభిప్రాయం.
(07:15) ఎదుటి వ్యక్తి రాష్ గా డ్రైవ్ చేసి మనల్ని డిస్టర్బ్ చేయడం అనేది ఒక ఈవెంట్. అది న్యూట్రల్ అది ఆల్రెడీ జరిగిపోయింది. మీరు కోపపడడం అని అనేది ఈ ఈవెంట్ గురించి మీ ఇంటర్ప్రిటేషన్ ఆ ఇంటర్ప్రిటేషన్ మీ చేతిలోనే ఉంది. మీరు ఆ రాష్ట్ గా డ్రైవ్ చేసే పర్సన్ ని కంట్రోల్ చేయలేరు కానీ మీరు దేన్ని కంట్రోల్ చేయగలరు మీ రియాక్షన్ ని కంట్రోల్ చేయగలరు.
(07:35) మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇది తెలుసుకోవడమే స్టాయసిజం లోని మొదటి ఐడియా ఇక నుండి ప్రతిసారి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మనల్ని మనం వేసుకుందాం. ఇది నా చేతిలో ఉందా? చూడడానికి చాలా సింపుల్ గా కనిపించొచ్చు కానీ ఈ ఒక్క క్వశ్చన్ కి మన లైఫ్ ని మార్చే పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు రెండో ఐడియాలోకి వెళ్దాం.
(07:55) ఇది స్ట్రాయసిజం లోనే అత్యంత శక్తివంతమైన కాన్సెప్ట్ అమోర్ పార్టీ లాటిన్ భాషలో అంటే లవ్ ఫర్ వన్స్ ఫేట్ దీని అర్థం తన విధిని ప్రేమించడం మార్కస్ ఆరేలియస్ అతను రోమ్ చక్రవర్తి అత్యంత శక్తివంతుడు. అతని లైఫ్ చూడండి ప్లేగ్ వ్యాధి వల్ల లక్షలాది ప్రజలు చనిపోయారు. అతని జనరల్స్ ద్రోహం చేశారు. అతని కొడుకు కమ్మోడస్ తను ఎంతో ప్రేమగా పెంచిన తన కొడుకు రోమ్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన రోలర్ అతను సామ్రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు. అది మార్కస్ కి తెలుసు.
(08:25) ఇప్పుడు ఆలోచించండి మీరే చక్రవర్తి అయితే మీ కొడుకే మీ సామ్రాజ్యాన్ని నాశనం చేసేస్తుంటే మీరు ఏం చేస్తారు? ఎలా ఫీల్ అవుతారు? మార్కస్ తన డైరీలో ఏం రాసాడో చూడండి. అతను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను చక్రవర్తిని కదా అని రాయలేదు. అతను ఏం రాసాడంటే ఈ అడ్డంకి నిన్ను ఆపదు అది నీకు దారి చూపిస్తుంది అని ఇంకో చోట ఏం రాశడంటే నేను ఎదుర్కుంటున్న ప్రతి అడ్డంకి నాకు ఏదో ఒక పాఠం నేర్పించడానికే వస్తుంది అని ఇదే అమోర్ 40 అనే కాన్సెప్ట్ జరిగిన దాన్ని ద్వేషించకుండా దాన్ని ప్రేమించడం దాన్ని స్వాగతించడం.
(08:57) ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని మన రియల్ లైఫ్ లో ఎలా యూస్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మీరు ఓ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు చాలా నమ్మకం మీరు చాలా బాగా చేశారని కానీ సెలెక్ట్ కాలేదు రిజెక్ట్ అయ్యారు. మామూలుగా అయితే ఏం చేస్తారు డిప్రెస్ అవుతారు. నేను ఫెయిల్ అయిపోయాను అని అనుకుంటారు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడతారు. కొన్ని రోజులు కొన్ని వారాలు ఈ ఆలోచనలోనే గడిపేస్తారు.
(09:18) ఇప్పుడు అమోర్ 40 ప్రాక్టీస్ చేయండి. జరిగిందఏదో జరిగింది. రిజెక్ట్ అయ్యారు దాన్నైతే మార్చలేం. కానీ దాన్ని ద్వేషించొచ్చు లేదా ప్రేమించొచ్చు. అమోర్ 40 అంటే ఈ రిజెక్షన్ నాకు ఏం నేర్పిస్తుంది ఇది నాకు ఏ దారి చూపిస్తుంది బహుశా ఈ రిజెక్షన్ వల్ల మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలని రాయిస్తారేమో లేదా వేరే ఏదైనా ఫీల్డ్ ట్రై చేయమని ఇది ఒక సిగ్నల్ ఏమో లేదా ఇంతకన్నా మంచి ఉద్యోగం మీ కోసం వెయిట్ చేస్తూ ఉంండొచ్చు మార్కస్ మాటలు గుర్తుపెట్టుకోండి అబ్స్టకల్ ఇస్ ద వే అంటే అడ్డంకే వేరే దారి చూపిస్తుంది మనకి దాన్ని ప్రేమించండి.
(09:52) ప్రతిరోజు రోజు చివర్లో ఆ రోజు జరిగిన ఒక చెడు విషయాన్ని తీసుకొని దాంతో ఇలా చెప్పండి ఇది నాది ఇది నేను కోరుకున్నది ఇది నా లెసన్ మొదట చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ గ్రాడ్ువల్ గా అలవాటయపోతుంది. మూడో ఐడియా పేరు మొమెంటో మోరి లాటిన్ భాషలో దీని అర్థం నువ్వు చనిపోతావ్ గుర్తుంచుకో అని రిమెంబర్ దట్ యు విల్ డై సెనక అతను రోమ్లో అత్యంత ధనవంతుడు.
(10:17) నీరో చక్రవర్తికి గురువు నీరో చాలా క్రూరుడు అతను సెనకాని చంపమని ఆదేశించాడు. సెనకా చనిపోతూ తన స్నేహితులని పిలిచాడు. తన భార్యని పిలిచాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. సెనక వాళ్ళని చూసి నవ్వుతూ అన్నాడు. మీరెందుకు ఏడుస్తున్నారు మీరు స్టాక్ సూత్రాలు మర్చిపోయారా మనం చనిపోవడం కాదు మనం చనిపోతున్నామ అనే ఆలోచనే భయాన్ని కలిగిస్తుంది.
(10:37) సెనక ఎందుకు భయపడలేదు ఎందుకంటే అతను ప్రతిరోజు మరణం గురించి ఆలోచించేవాడు. అతను తన బుక్ లో ఇలా రాసుకున్నాడు. నువ్వు బ్రతికే ప్రతి రోజు నువ్వు మరణం నుంచి దొంగలించిందే. రూమ్లో ఓ సాంప్రదాయం ఉండేది. విజయవంతమైన జనరల్ నగరంలోకి పెరేడ్ చేసినప్పుడు అతని వెనకాల ఓ బానిస నిలబడి అతని చెవిలో గుసగుసలాడేవాడు. నువ్వు కేవలం మనిషివి మాత్రమే నువ్వు కూడా చనిపోతావు గర్వపడకు అని ఇది డిప్రెసింగ్ కాదు ఇది ప్రయారిటీ సెట్ చేసుకోవడం.
(11:04) ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక పని మీద ఉన్నారు. చాలా స్ట్రెస్ డెడ్ లైన్, టెన్షన్ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రాత్రి 12 గంటల వరకు మీరు చేస్తూనే ఉన్నారు తినడం మర్చిపోయారు కుటుంబంతో మాట్లాడడం మానేశారు. ఇప్పుడు ఒకసారి మొమెంటో మోరీ ప్రాక్టీస్ చేయండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఈ ప్రశ్న వేసుకోండి నేను రేపు చనిపోతే ఈరోజు నేను ఏం చేస్తాను ఈ టెన్షన్ ఈ స్ట్రెస్ ఈ డెడ్ లైన్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ చనిపోయే ముందు నేను ఆ డెడ్ లైన్ మీట్ చేయలేదు అని ఎవరైనా అనుకుంటారా లేదు చనిపోయే ముందు మనకు గుర్తొచ్చేది ఏంటి మనం ప్రేమించిన వాళ్ళు మనం పంచుకున్న
(11:37) క్షణాలు మనం నవ్విన సందర్భాలు అంతే మార్కస్ అరలీస్ ఇలా రాస్తున్నాడు నువ్వు 1000 సంవత్సరాలు బతకబోతున్నట్టు నటించుకో మరణం నీ తల పై వేలాడుతుంది. నువ్వు బతికున్నంత కాలం మంచిగా ఉండు. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మనకి ఇంకొక రోజు వచ్చిందని గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ ఇదే మన లాస్ట్ డే అయితే మనం ఎలా బ్రతకాలో ఏం చేయాలి అని ఆలోచించుకుంటే మనకి కంప్లీట్ క్లారిటీ వస్తుంది.
(12:02) ఇప్పుడు ఫోర్త్ ఐడియా చూద్దాం. ప్రీమెడిటేటివ్ మెలోరం లాటిన్ లో దీని అర్థం ఏంటంటే చెడు విషయాలని ముందుగానే ఊహించడం. సెనక తన లెటర్స్ లో తన ఫ్రెండ్స్ కి ఇలా రాశడు. ప్రతిరోజు మొదలు పెట్టే ముందు ఈరోజు ఏం తప్పు జరగొచ్చు అని ఊహించు నీ ఇల్లు తగలబడొచ్చు నీ ఆస్తి పోవచ్చు నీ స్నేహితులు నిన్ను మోసం చేయొచ్చు నీ శరీరం అనారోగ్యం పాలవచ్చు. ఇది వింటే మీకు ఏమనిపిస్తుంది ఇతను పెసిమిస్ట అని అనుకోవచ్చు కాదు ఇది ఒక సైకలాజికల్ ఆర్మర్ సినకా ఇంకా ఏం చెప్పాడంటే చెడు జరగకముందే దాన్ని ఊహించుకోవడం వల్ల అది జరిగినప్పుడు మీరు షాక్ అవ్వరు.
(12:36) మీరు ఆల్రెడీ దానికి ప్రిపేర్డ్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. చాలా మంది ఎదురుగా ఉన్నారు మీకు చాలా భయం ఇప్పుడు ప్రీమెడిటేటివ్ మలరం ప్రాక్టీస్ చేయండి కూర్చోండి ఒక పేపర్ తీసుకోండి రాసుకోండి ఈ ప్రెజెంటేషన్ లో ఏమేమ తప్పు జరగొచ్చు స్లైడ్స్ వర్క్ చేయకపోవచ్చు క్వశ్చన్స్ కి మనకు ఆన్సర్ తెలియకపోవచ్చు కంటెంట్ మర్చిపోవచ్చు ఇప్పుడు ఒక్కోదానికి సొల్యూషన్ ఆలోచిద్దాం స్లైడ్స్ వర్క్ చేయకపోతే నేను వెర్బల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే దట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ నేను చెక్ చేసి చెప్తాను అని అంటారు. కంటెంట్
(13:05) మర్చిపోతే నోట్స్ తీసుకెళ్తాం. ఇలా ప్రిపేర్ అయ్యాక ఏం జరిగినా మనం రెడీ షాక్ ఉండదు భయం ఉండదు. మన డైలీ లైఫ్ లో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ముందు ఏమే మిస్టేక్స్ జరగొచ్చు అని పేపర్ మీద రాసుకొని దానికి సొల్యూషన్స్ కూడా మనం రాసుకుంటే ప్రిపేర్డ్ గా ఉంటాం. ఆ ఈవెంట్ ని మనం ఇంకా బాగా హ్యాండిల్ చేయొచ్చు.
(13:24) ఐడియా నెంబర్ ఫైవ్ ఇన్నర్ సిటాడల్ అంతరంగ కోట. ఇది స్టాయసిజం లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మార్కస్ అరేలియస్ తన డైరీలో ఏం రాసుకున్నాడంటే బయట జరిగేది నన్ను తాకదు. నా మనసుని తాకదు నేను మాత్రమే నా మనసుని డిస్టర్బ్ చేసుకోగలను అని రాసుకున్నాడు. అతను ఇంకా ఏం రాశడంటే నీ మనసుని ఒక కోటలా నిర్మించుకో ఆ కోటకు ఒక గేట్ ఉండాలి ఆ గేట్ దగ్గర నువ్వు కాపలా ఉండాలి.
(13:52) బయట సంఘటనలు ఎవరు లోపలికి రావాలి ఎవరు రాకూడదు అనేది నువ్వే డిసైడ్ చేయాలి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉన్నారు. మీ బంధువు ఒకరు మిమ్మల్ని చులకనగా మాట్లాడారు. మీరు బాధపడతారు మీరు రాత్రంతా ఆలోచిస్తారు నేను ఏం తప్పు చేశానా అని ఇప్పుడు ఇన్నర్ సిటాడిల్ ప్రాక్టీస్ చేయండి. మీ మనసు ఒక కోట ఆ కోటకు ఒక గేట్ ఉంది.
(14:11) మీ బంధువు మాట అది బయట సంఘటన. అది మీ కోట గేట్ దగ్గరికి వచ్చింది. మీరు దాన్ని లోపలికి అనుమతించాలా దాని గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ నిద్రపోకుండా ఉండాలా? లేదంటే గేటు దగ్గరే ఆపేయాలా? ఇది నా మనసులోకి రావడానికి అర్హైంది కాదు అని చెప్పి తిప్పి పంపించాలా మార్కస్ చెప్పినట్టు బయట జరిగేది నన్ను తాకదు నా మనసుని తాకదు నేను మాత్రమే నా మనసుని డిస్టర్బ్ చేసుకోగలను.
(14:33) ఎవరో ఏదో అన్నారు అది వాళ్ళ ప్రాబ్లం మీరు దాన్ని మీ ప్రాబ్లం చేసుకోవాలా అది మీ చేతిలోనే ఉంది. ఇక్కడి నుండి ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు ఒక్కసారి అలా అనుకోండి ఇది బయట జరిగింది. నాకు సంబంధం లేదు. దీన్ని నేను లోపలికి అలో చేయాలా అని ఒక్క క్వశ్చన్ అడగండి. 90% ఇష్యూ క్లియర్ అయిపోతుంది. ఇంకా మూడు ఐడియాస్ ఉన్నాయి చాలా పవర్ఫుల్ వీటి గురించి చాలా బ్రీఫ్ గా చెప్తాను.
(14:57) ఐడియాసిక్స్ ద వ్యూ ఫ్రమ ఎబవ్ మార్కస్ తన పుస్తకంలో ఇలా రాశడు ఆకాశంలో ఎగురుతున్న పక్షిలా చూడు కింద మనుషులందరినీ చూడు వాళ్ళ గొడవలు వాళ్ళ భయాలు ఇవన్నీ ఎంత చిన్నవి ప్రాక్టికల్ గా మనం చూస్తే ఎవరితోనైనా గొడవ పడ్డారా ఒక్కసారి ఊహించుకోండి మీరు ఆకాశంలో ఎగురుతున్నారు. కింద ఇద్దరు చిన్న చీమల్లా మీరు గొడవ పడుతున్నారు.
(15:18) 100 ఏళ్ల తర్వాత ఈ గొడవ ఎవ్వరికీ గుర్తుండదు. ఈ పర్స్పెక్టివ్ మీ కోపాన్ని తగ్గించేస్తుంది. ఐడియా సెవెన్ సింఫేయా గ్రీక్ భాష. [సంగీతం] దీని అర్థం ఏంటంటే పరస్పర అనుసంధానం మనందరం ఒకే విశ్వంలో భాగం మార్కస్ ఏం రాసాడంటే మనందరం ఒకరికొకరు అనుసంధానించబడి ఉన్నాం. ఒక చెట్టు కొమ్మల్లా ఒకే మూలం నుంచి వచ్చాం. బజార్లో ఎవరో పొరపాటుని తగిలి మీ ఫోన్ పగిలిపోయింది. కోపం వస్తుంది.
(15:41) కానీ ఆ వ్యక్తి కూడా నాలాంటి మనిషే అతను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. నేను కోపపడితే ఆ కోపం నాకే హాని అని అనుకోవడమే ఈ కాన్సెప్ట్. ఐడియా ఎయిట్ డిసిప్లిన్ ఆఫ్ ఎసెంట్. దీని గురించి ఎపిక్టస్ ఏం చెప్తాడంటే ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దాన్ని నమ్మకు ఆపు పరిశీలించు అది నిజమా నీకు సహాయం చేస్తుందా అని ప్రశ్నించు తర్వాత మాత్రమే అంగీకరించు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఎవరో నచ్చని కామెంట్ చేశారు వెంటనే రిప్లై ఇచ్చేయాలనిపిస్తుంది ఆపండి ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుంది అని పరిశీలించండి.
(16:11) ఈ రిప్లై ఇవ్వడం వల్ల నాకు శాంతి దొరుకుతుందా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ లేదు అయితే వదిలేయండి. అక్కడే మీకు అసలైన ఫ్రీడం దొరుకుతుంది. ఇవి స్ట్రాయసిజం లోని మోస్ట్ పవర్ఫుల్ ఎయిట్ ఐడియాస్ మనం ప్రతి ఐడియాని ఒక చిన్న స్టోరీ అండ్ ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేశం చాలా డీటెయిల్డ్ గా ఇప్పుడు ఇవన్నీ విని వదిలేయడం కాకుండా మనం వీటిని ప్రాక్టీస్ చేయాలి.
(16:32) ఒకేసారి కాదు నెమ్మదిగా ఒక్కొక కాన్సెప్ట్ తీసుకోండి ఒక వీక్ ఒక కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వీక్ డైకాటిమీ ఆఫ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేద్దాం. సెకండ్ వీక్ అమోర్ పార్టీ థర్డ్ వీక్ మొమెంటో మోరి గుర్తుంచుకోండి స్టాయిక్ అంటే ఫీల్ అవ్వని వ్యక్తి కాదు స్టాయిక్ అంటే ప్రతి ఫీలింగ్ ని ఫీల్ అయ్యి దేని మీద రియాక్ట్ అవ్వాలో ఎంచుకునే వ్యక్తి స్టాయిసిజం అంటే రాయిలా మారిపోవడం కాదు అది ఒక కవచంలా ధరించడం ఈ లోకం నిన్ను గాయపరచాలని చూస్తుంది.
(16:58) పరిస్థితులు నిన్ను కిందకి లాగాలని చూస్తాయి. కానీ నువ్వు స్టాయిక్ గా మారినప్పుడు నీ ప్రశాంతత అనిఅనేది ఇతరుల దయా దాక్షిణ్యాల మీద డిపెండ్ అయి ఉండదు. ఈ రోజు నుంచి ఆ రిమోట్ కంట్రోల్ మీ చేతిలోకి తీసుకోండి ఎవ్వరికీ మిమ్మల్ని ఏడిపించే అవకాశం ఇవ్వద్దు. మీ మనసు మీ కోట దానికి మీరే రాజు లేదా మీరే రాణి బయట నుండి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఎన్నో సంఘటనలు మీ కోట గేట్ దగ్గరికి వస్తాయి.
(17:22) వాటిని లోపలికి అనుమతించాలా వద్దా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. ఈ కంటెంట్ లో వాల్యూ ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన తెలుగు మైండ్ సెట్ ల్యాబ్ కమ్యూనిటీలో చేరండి. మన తెలుగు మైండ్సెట్ ల్యాబ్ లో మనం చేసే ప్రతి వీడియోస్ మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ కోసం మాత్రమే చేస్తాం. కేవలం ప్లేన్ టాక్ఏ కాదు ఇంప్లిమెంటేషన్ టెక్నిక్స్ తో సహా కాంప్లికేటెడ్ ఐడియాస్ ని చాలా ఈజీగా అర్థమయ్యేలా స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్ తో మీ ముందు ప్రెసెంట్ చేస్తాం.
(17:49) ఇక్కడ మేము మోటివేషన్ చేయం ఎందుకంటే మాకు కావాల్సింది మీ మోటివేషన్ కాదు మీ ట్రాన్స్ఫర్మేషన్ థాంక్యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్.

No comments:

Post a Comment