Sunday, April 12, 2026

 నీవొచ్చే  దారిలో 
నలిగే పువ్వును కానా 
నీవిచ్చే  కాంతిలో 
వెలిగే దివ్వెను కానా 

నిను చూసే కన్నుల 
కలలన్నీ తీరగా 
నీ రాకతో మదిలో 
ఆనందాల ఎరువాక రాదా..!

నీ కళలకు దిష్టి చెరపాలని
ఎరుపంతా పరచి వేచి 
నీ కనక కాంతులకై 
తూరుపు వేచి నిలిచె కాదా!

నీ చూపుల తడిసే భువికి 
నిలువెల్లా జీవము రాగా!
పుత్తడి కాంతులు నిండి 
కొత్తగ వెలిగిపోదా!

నీ అడుగుల సవ్వడికోసం 
నిలువెల్లా  కనులు చేసి 
నీ రూపు  చూడనెంచి 
నిఖిల జగతి నిలిచె కాదా!

నీ కిరణపు కలముతో 
నులివెచ్చగా వ్రాసే లేఖ 
మనసారగ చదివే కోరిక 
వసుధకు నిజముగా కలిగె కదా!

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment