Sunday, April 12, 2026

ఎవరితో secret share చేయాలి తెలుసా life save అవ్వొచ్చు Psychology in sharing secrets

ఎవరితో secret share చేయాలి తెలుసా life save అవ్వొచ్చు Psychology in sharing secrets

Author Name:Psychologyintelugu

Youtube Channel Url:https://www.youtube.com/@Psychologyintelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uHf3lFLSczU



Transcript:
(00:01) మీరు షేర్ చేసిన ఒక సీక్రెట్ మళ్ళీ మీ మీదకి ఒక ఆయుధంలా వస్తుంది అని మీకు తెలుసా మీరు నమ్మి షేర్ చేసిన వాళ్లే ఒక స్టేజ్ లో మిమ్మల్ని జడ్జ్ చేసి మీకు దూరంవుతారు. మనకి అందరికీ అన్ని షేర్ చేయాలి అని అనిపించడం కామన్ ఎందుకంటే మన బ్రెయిన్ కి ఎమోషనల్ కనెక్షన్ కావాలి. నా స్టోరీ వేరే వాళ్ళకి చెబితే వాళ్ళు నాకు దగ్గర అవుతారు అని మన బ్రెయిన్ కి అనిపిస్తుంది.
(00:33) దీనికి కారణం లోన్లీనెస్ మనము వేరే వాళ్ళు మనల్ని యక్సెప్ట్ చేయాలి అని కూడా అనుకుంటాం. మన స్టోరీ వేరే వాళ్ళకి చెప్తే మనం బాధ కొంచెం తగ్గుతుంది అని కూడా అనుకుంటాం. మనం నొప్పిలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి దొరికితే మన బాధ అంతా చెప్పేస్తాం. అది మనం చేసే చాలా పెద్ద మిస్టేక్. ప్రతి ఒక్కరూ మన బాధని అర్థం చేసుకోలేరు. మీరు చెప్పే సీక్రెట్ వేరే వాళ్ళకి కేవలం అదిఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే కానీ మీకు అది ఒక అనుభవం ఇదే తేడా మీరు షేర్ చేసిన దాని మీద కొంతమంది సైలెంట్ గా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు ఇంకా కొంతమంది టైం వచ్చినప్పుడు దాన్నే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ని ఒక ఆయుధం లాగా
(01:16) చేసి మీ మీదకే ప్రయోగించి మిమ్మల్ని హర్ట్ చేస్తారు. అప్పుడు మీరు షాక్ అవుతారు బాధపడతారు. మనం వేరే వాళ్ళకి మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతాము అని అనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో ఒక పశ్చాత్తాపమే మిగులుతుంది. అసలు ఆ రోజు వీళ్ళకి నేను ఎందుకు ఇవన్నీ షేర్ చేశానా అని బాధపడతారు.
(01:40) అంటే మనం సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పొద్దా అలా కాదు అన్ని పూర్తిగా చెప్పొద్దా అలా కూడా కాదు మనకి ఒక కనెక్షన్ కావాలి మనమందరం మనుషులం మనకి సపోర్ట్ కావాలి. కానీ ఎవరు పడితే వాళ్ళకి సీక్రెట్ అనేది షేర్ చేయొద్దు. మీరు సీక్రెట్ ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఈ మూడు క్వశ్చన్స్ మీకు మీరు వేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పేదాన్ని అతను జడ్జ్ చేయకుండా పూర్తిగా వింటాడా రెండో క్వశ్చన్ మీరు చెప్పేదాన్ని అతను అర్థం చేసుకొని మీ ఫీలింగ్స్ ని మీ ఒపీనియన్ ని రెస్పెక్ట్ చేస్తాడా మూడో క్వశ్చన్ మీరు లాంగర్ రన్ లో కూడా ఫ్యూచర్ లో కూడా సేఫ్ గా ఫీల్
(02:23) అవుతారా ఈ మూడు క్వశ్చన్స్ మీకు మీరు హానెస్ట్ గా వేసుకోండి. ఒకవేళ మీకు ఆన్సర్ అవును అని వస్తే అప్పుడు కూడా కొంచెం షేర్ చేయండి. మనం అందరం చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే మనక ఎవరైనా పరిచయం అయ్యారు అంటే వెంటనే మొత్తం చెప్పేస్తాం ఎవరైనా మనకి కొత్తగా పరిచయం అయ్యారు వాళ్ళు మనల్తోని బాగా మాట్లాడుతున్నారు మనల్ని అర్థం చేసుకుంటున్నారు అని అనిపిస్తే ఒక్కసారిగా మన లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేస్తాం.
(02:52) ఒక సిచువేషన్ ఇమాజిన్ చేయండి మీకు ఒక ఫ్రెండ్ కొత్తగా పరిచయం అయ్యాడు. ఒక టూ త్రీ డేస్ లోనే మీరు మీ ఫ్యామిలీ ఇష్యూస్ మీ స్ట్రగుల్స్ మీ ఫెయిల్యూర్స్ మీ వీక్నెస్ అన్ని చెప్పారు ఆ టైంలో అతను వింటాడు మీకు జాలి చూపిస్తాడు. కానీ ఒక వన్ మంత్ తర్వాత ఒక చిన్నగా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనిఅంటే నువ్వు ఇలా ఉన్నావనే నీ ఫ్యామిలీ మెంబర్స్ ని లెక్క చేయరు అని అంటాడు.
(03:19) ఇక్కడ ఏం జరిగింది మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ని ఆయుధం లాగా చేసి మీ మీదనే ఉపయోగించి మిమ్మల్ని హర్ట్ అయ్యేలాగా చేశాడు. అప్పుడు మీరు షాక్ అవుతారు బాధపడతారు అసలు నేను ఎందుకు ఆరోజు ఇతనికి ఇవన్నీ చెప్పానురా అని ఫీల్ అవుతారు. అసలు మనకందరికీ ఒక రాంగ్ పర్సెప్షన్ అనేది ఉంటుంది అదిఏంటి అంటే అందరూ మనవాళ్లే అని అనుకోవడం మన బ్రెయిన్ కి ఒక ఇల్యూజన్ ఉంటుంది ఎవరైనా మనతోని బాగా మాట్లాడితే మనల్ని అర్థం చేసుకున్నట్టు అనిపిస్తే ఇతనికి మన పర్సనల్ విషయాలన్నీ చెప్పాలి అని మనం మన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేస్తాం.
(03:57) కానీ కొద్ది రోజుల తర్వాత అవ్వే విషయాలు ఆఫీస్ లో గాసిప్స్ అవుతాయి. మీ రెస్పెక్ట్ స్లోగా తగ్గిపోతుంది. మనమందరం ఇలా ఎందుకు చేస్తాము అసలు అనింటే మనము ఎమోషనల్ గా వీక్ గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఓవర్షేర్ చేస్తుంది. మన బ్రెయిన్ మనం ఎమోషనల్ గా వీక్ గా ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించలేదు. దానివల్ల ఎవరైనా దొరికితే అంతా చెప్పేస్తుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే సింపతీ కోసం మనకి కొన్నిసార్లు సింపతీ కావాలి అనిపిస్తుంది.
(04:28) నన్ను ఎవరైనా పాపం అనాలి అనిపిస్తుంది. నాకు ఎవరైనా కేర్ చూపించాలి అని కూడా అనిపిస్తుంది. అందుకనే మనం మన లైఫ్ లో ఉన్న స్ట్రగుల్స్ ఫెయిల్యూర్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేస్తాం. అట్లా షేర్ చేసినప్పుడు వాళ్ళు వింటారు జాలి చూపిస్తారు కానీ కొద్ది రోజుల తర్వాత అతను ఒక స్ట్రాంగ్ పర్సన్ కాదు అతను ఎప్పుడూ ప్రాబ్లం లోనే ఉంటాడు అని మిమ్మల్ని జడ్జ్ చేస్తారు.
(04:55) మరి ఇట్లాంటి విషయాల్లో మరి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలి అని అనుకున్నప్పుడు రూల్స్ ఏం మీరు ఫాలో అవ్వాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే లేయర్ షేరింగ్ ఆనియన్స్ కి ఎట్లా అయితే లేయర్ ఉంటుందో ఉల్లిపాయలకు లేయర్ ఉన్నట్టే మీ షేరింగ్ కూడా లేయర్ గా ఉండాలి అంటే ఫస్ట్ చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకోండి టైం గడుస్తున్న కొద్దే మీకు ఆ పర్సన్ మీద నమ్మకం వస్తుంది మీ పర్సనల్ చిన్న చిన్న విషయాలు బయటకి వెళ్ళట్లేదు అనింటే మీడియం లెవెల్ పర్సనల్ విషయాలు షేర్ చేయండి.
(05:26) అప్పటికీ కూడా అతను మీతో లాయల్ గా ఉన్నాడు మీరు పడే బాధను అతను అర్థం చేసుకుంటున్నాడు అని అన్నప్పుడే మీ డీప్ సీక్రెట్స్ మీరు టెస్ట్ చేస్తూ షేర్ చేయండి. ఇంకొకటి టైం టెస్టింగ్ ఇంకొక రూల్ అంటే అతను మీతో ఎప్పటి నుంచి ఉన్నాడు కనీసం కొన్ని మంత్స్ నుంచి అయినా అతను మీతో జర్నీ చేయాలి మీ లైఫ్ లో ఇంకొకటి అతను ఫ్యూచర్ లో కూడా మీతో ఉంటాడా అన్నది చెక్ చేసుకోండి.
(05:52) అప్పుడు మీకు అవును అనిపిస్తేనే మీరు అతనికి షేర్ చేయండి. ఇంకొక రూల్ రియాక్షన్ టెస్టింగ్ అంటే మీరు షేర్ చేసేటప్పుడు మీ విషయాలు అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు మీరు నాకు ఇది ఇది ప్రాబ్లం ఉంది అంటే ఆ సర్లే నాకు అర్థమైపోయింది నువ్వు ఇట్లా ఇట్లా చెయ్ అని అనేసి మిమ్మల్ని మధ్యలోనే ఇంటరప్ట్ అయి ఇది ఎప్పుడు అయిపోతుందా అని ఫీల్ అయి మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడా లేదంటే మీరు ఎంత బాధపడుతున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి కాన్సంట్రేటెడ్ గా మీ విషయాలు విని బాధపడుతున్నాడా అన్నది చూడండి అబ్సర్వ్ చేయండి ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ ఇది
(06:26) మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఇతనికి విషయం షేర్ చేస్తున్నప్పుడు అతను మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాడా లేకపోతే వేరే అందరికీ చెప్తున్నాడా ఆ విషయాన్ని లేకపోతే నలుగురు మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అతను షేర్ చేసిన విషయాన్ని నవ్వులాటగా వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాడా అన్నది చెక్ చేయండి. ఒకవేళ మీరు నమ్మిన వ్యక్తి వేరే వాళ్ళ ప్రాబ్లం మీద నవ్వుతున్నాడు అందరి ముందు అంటే మీ ప్రాబ్లం మీద కూడా కచ్చితంగా నవ్వుతాడు.
(06:49) సో ఇట్లాంటి పర్సన్ కి మీ పర్సనల్ విషయాలు కాదు కదా ఏ విషయమే షేర్ చేయకండి. ఇంకొక ఇంపార్టెంట్ రూల్ అన్ని విషయాలు షేర్ చేయాలని లేదు మీ పర్సనల్ విషయాలు కొన్ని మీరు షేర్ చేయకపోయినా ఓకే మీరు అన్ని విషయాలు షేర్ చేయాలి మీ ప్రతి ఒక్క థాట్ షేర్ చేయాలి మీ యొక్క ప్రతి ఒక్క ఫీలింగ్ షేర్ చేయాలి అన్నది కంపల్సరీ కాదు. ఒక సీక్రెట్ మీరు మెయింటైన్ చేస్తేనే మీరు పవర్ఫుల్ ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటి ఫైనల్లీ అనింటే మీరు ఎవరినైతే అర్థం చేసుకుంటారో మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో మీ మీద ఎవరైతే ఎంపతీ చూపిస్తారో ఎవరైతే మీ ఫీలింగ్స్ కి
(07:28) రెస్పెక్ట్ ఇస్తారో అట్లాంటి వారికి మీరు ఏమన్నా షేర్ చేసుకున్నారు అంటే అర్థం ఎవరు పడితే వాళ్ళకి మీరు షేర్ చేసుకోకండి ఎందుకంటే మీ సీక్రెట్స్ తెలుసుకోవడానికి కూడా వేరే వాళ్ళకి ఒక అర్హత అనేది ఉండాలి వాళ్ళు మీతో కనెక్టెడ్ ఉండాలి వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చేలాగా ఉండాలి. మీ మీ లైఫ్ ఏంటి ఒక ఓపెన్ బుక్ కాదు ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి వాళ్ళకి షేర్ చేయడానికి కొందరు మీ లైఫ్ లో గెస్ మాత్రమే మీరు వేరే పీపుల్ ని అంచనా వేయకుండా మీరు షేర్ చేస్తే మీ పర్సనల్ విషయాలు అనేది అది మీ మిస్టేక్ే అవుతుంది.
(08:04) ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రైవసీలోనే పవర్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు వాల్యూబుల్ అని అనిపిస్తే ఒక్క లైక్ చేయండి నేను మిమ్మల్ని అడిగేది ఒక లైక్ మాత్రమే సో దట్ ఇది వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది అండ్ మీకు హై పాయింట్స్ ఆప్షన్ కనిపిస్తే డెఫినెట్ గా హై పాయింట్స్ ఇవ్వండి సో కొత్త వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి కంటెంట్ కోసం మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి ఏ టాపిక్ మీద అనిన్నది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి

No comments:

Post a Comment