Monday, April 13, 2026

మీ చుట్టూ ఉన్న ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్లే! ⚠️ | The Dark Triad Psychology Telugu |TML |

మీ చుట్టూ ఉన్న ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్లే! ⚠️ | The Dark Triad Psychology Telugu |TML |

Author Name:Telugu Mindset Lab

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguMindsetLab

Youtube Video URL:https://www.youtube.com/watch?v=C48etb209w4



Transcript:
(00:00) మీరు ప్రతిరోజు అద్దంలో చూసుకునే ఆ వ్యక్తి మీకు తెలుసు అని అనుకుంటున్న మీ స్నేహితుడు లేదా ఎప్పుడు మీ పక్కనే ఉంటున్న మీ పార్ట్నర్ వీళ్ళు నిజంగా మీకు తెలుసా మనం రోజు కలిసే వ్యక్తుల్లో అందరూ పైకి కనిపించేంత మంచోలు కాకపోవచ్చు. కొందరు మనల్ని ప్రేమగా పలకరిస్తూనే మన మనసుతో ఆడుకుంటారు. కొందరు మనల్ని వాడుకొని వదిలేస్తారు.
(00:21) సైకాలజీలో ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన స్వార్ధపూర్తమైన మూడు లక్షణాల కలకనే ద డార్క్ ట్రయార్డ్ అని అంటారు. మీరు మీ ఇంట్లో ఉండొచ్చు మీ ఆఫీస్ లో ఉండొచ్చు లేదా మీ ప్రాణ స్నేహితుడు కూడా అయి ఉండొచ్చు. వీళ్ళని గుర్తుపట్టకపోతే మన లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సైకాలజీ ప్రకారం మన చుట్టూ ఉన్న ప్రతి 10 మందిలో ఒకరు డార్క్ ట్రయాడ్ లక్షణాలు ఉన్నవాళ్లే వాళ్ళు మీతో మంచిగా ఉంటున్నారో లేదా వేటాడడానికి సిద్ధమవుతున్నారో మీకు తెలుసా ఈరోజు వాళ్ళ ముసుగులు తీసేద్దాం.
(00:48) సిద్ధమా నేను చెప్పే ఈ మూడు లక్షణాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఉంటే వాళ్ళు కేవలం మనుషులు మాత్రమే కాదు ఒక రకమైన సైకలాజికల్ ప్రిడేటర్స్ ఈ వీడియోలో మనం మూడు అత్యంత ప్రమాదకరమైన మైండ్ సెట్ల గురించి డీటెయిల్డ్ గా నేర్చుకోబోతున్నాం. ఒకటి నార్సిసిజం వీళ్ళు మీ ప్రేమను అడ్డుపెట్టుకొని మిమ్మల్ని మానసిక బానిసలుగా ఎలా మార్చుకుంటారో చూద్దాం.
(01:06) రెండు మాకియా వెలియానిజం వీళ్ళు మిమ్మల్ని పావులుగా వాడుకొని మీకు తెలియకుండానే వెన్నుపోటు ఎలా పొడుస్తారో అర్థం చేసుకుంది. మూడు సైకోపతీ అసలు జాలి దయా లేని వ్యక్తులు మీ పక్కనే ఉంటే మీ జీవితం ఎంత డేంజర్ లో ఉందో తెలుసుకుందాం. వీటితో పాటు వీడియో చివర్లో ఇలాంటి వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ద గ్రే రాక్ మరియు ద ఇన్నర్ సిటాడల్ వంటి పవర్ఫుల్ సైకలాజికల్ టెక్నిక్స్ గురించి వివరించబోతున్నాను.
(01:31) ఈ ఒక్క వీడియో మీ జీవితంలో మీరు తీసుకునే అతి పెద్ద మానసిక జాగ్రత్త కాబోతుంది. వెల్కమ్ టు తెలుగు మైండ్సెట్ లాబ్ ఇక లేట్ చేయకుండా అసలు ఈ డార్క్ ట్రయాడ్ అంటే ఏంటో లోతుగా పరిశీలిద్దాం. నార్సిసిజం అంటే అతి స్వార్థం. అసలు ఈ పదం ఎలా పుట్టిందో చూద్దాం. నార్సిజం అనే పదం గ్రీకు పురాణాల నుంచి వచ్చింది. నార్సిసస్ అనే ఒక అందమైన యువకుడు ఉండేవాడు.
(01:52) అతను ఎంత అందంగా ఉంటాడు అంటే చూసిన వాళ్ళందరూ అతని ప్రేమలో పడిపోయేవారు. కానీ అతను చాలా అహంకారి ఒకరోజు ఒక నీటి కొలంలో తన రిఫ్లెక్షన్ అంటే తన ప్రతిబింబాన్ని చూసుకొని తన అందానికి తనే ముగ్దుడైపోతాడు. అది తన ప్రతిబింబమే అని మర్చిపోయి ఆ రూపంతో ప్రేమలో పడి అక్కడి నుండి కదలకుండా తనను తాను చూసుకుంటూ అలాగే ఉండిపోయి చివరికి ప్రాణాలు విడిస్తాడు.
(02:16) నార్సిసిజం అంటే కేవలం సెల్ఫ్ లవ్ మాత్రమే కాదు అది ఒక రకమైన మానసిక బంధనం వీళ్ళు ఎలా ఉంటారంటే వీరు ప్రపంచం మొత్తం తమ చుట్టూనే తిరగాలి అని అనుకుంటారు. వీరికి ఎంపతీ అంటే జాలి అనేది అస్సలు ఉండదు. ఎదుటివారు ఏడుస్తున్న కూడా వీరికి అనవసరం వాళ్ళకి కావాల్సింది ఓన్లీ అటెన్షన్ అండ్ వాలిడేషన్ వీళ్ళు తప్పు చేసినా ఎప్పుడు ఒప్పుకోరు.
(02:35) తిరిగి మీ మీదే నెట్టేస్తారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక వ్యక్తిని ప్రాణంగా ప్రేమిస్తున్నారు అనుకుందాం. మీకు ఒక మంచి ఉద్యోగం వచ్చినా లేదా ఏదైనా గొప్ప విజయం మీరు సాధించినా వాళ్ళు మీతో కలిసి సంతోషించరు. పైగా ఆ నువ్వు సాధించింది ఏముందిలే నేనే కదా నీకు ఆరోజు సలహా ఇచ్చాను. నా వల్లే కదా నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అని మీ విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసేసుకుంటారు.
(02:56) అందరి ముందు మిమ్మల్ని చాలా గొప్పగా చూపిస్తూనే ఒక్కసారి తలుపులు పడ్డాక నీకు అసలు తెలివి లేదు నేనే నిన్ను భరిస్తున్నాను అని మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. వీరికి మీరు ఒక మనిషిలా కనిపించరు. కేవలం సమాజంలో వాళ్ళ గొప్పతనాన్ని చాట్ చెప్పే ఒక యక్సెసరీ అంటే ఒక అలంకార వస్తువులా మాత్రమే కనిపిస్తారు. అంతే కాదు ఏదైనా గొడవ జరిగినప్పుడు వాళ్లే తప్పు చేసినా నువ్వు ఇలా అన్నావు కాబట్టి నేను అలా అనాల్సి వచ్చింది అని చెప్పి మీ మీద ఎదురుదాడి చేసి చివరికి మీరే సారీ చెప్పేలా మిమ్మల్ని మనిపులేట్ చేస్తారు.
(03:25) వీళ్ళ ప్రపంచంలో వీళ్ళఎప్పుడు పర్ఫెక్ట్ మిగతా వాళ్ళందరూ వేస్ట్ మాక్యవెలియానిజం అంటే మనిపులేషన్ దీనికి ఆ పేరు 16th సెంచురీ పొలిటికల్ జీనియస్ నికోలో మాకవెల్లి పేరు మీద వచ్చింది. వీరి మొట్టం ఏంటంటే ద ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ అంటే లక్ష్యం నెరవేరడానికి ఏ అబద్ధమైనా ఆడొచ్చు ఎవరినైనా మోసం చేయొచ్చు. వీళ్ళు కోపాన్ని ప్రదర్శించరు కానీ వెనకనుండి గోతులు మాత్రం తీస్తారు.
(03:49) ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ఆఫీస్ లో రవి అనే ఒక టీం్ లీడర్ ఉన్నాడు అనుకుందాం. తన టీంలో ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తుల మధ్య గొడవ పెడతాడు. ఒకరి దగ్గరికి వెళ్లి అతను నీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పి అబద్ధం చెప్తాడు. వాళ్ళద్దరు గొడవ పడుతుంటే రవి బాస్ దగ్గరికి వెళ్లి చూసారా వాళ్ళద్దరు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు నేనే మేనేజ్ చేస్తుంటా అని చెప్పి ఇంప్రెషన్ కొట్టేస్తాడు.
(04:10) వీళ్ళు మనుషుల్ని మనుషుల్లా చూడరు. కేవలం తమ పనులు పూర్తి చేసుకోవడానికి వాడుకునే పావుల్లా మాత్రమే చూస్తారు. సైకోపతి అంటే క్రూరత్వం ఇది అత్యంత డేంజరస్ వీళ్ళకి భయం ఉండదు జాలు ఉండదు ఎమోషన్స్ అనేవి అసలు ఉండనే ఉండదు. వీళ్ళు అబద్ధం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ గుండె చెప్పడు పెరగదు. వీళ్ళు చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వీళ్ళకి అసలు అర్థం కాదు.
(04:31) ఒకవేళ అర్థమైనా కూడా అసలు పట్టించుకోరు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బులు నగలు అన్ని అబద్ధాలు చెప్పి తీసుకుంటాడు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఆమె ఏడుస్తూ బతిమాలుతున్న కనీసం జాలి కూడా చూపించడు. పైగా నువ్వే కదా నాకు ఇచ్చావు అని చెప్పి ఎదురుదాడి చేస్తాడు.
(04:50) వీరికి గిల్ట్ అంటే పశ్చాత్తాపం అనేది అస్సలు ఉండదు. వీళ్ళు ఎమోషన్స్ ని కేవలం నటిస్తారంతే. మనం చెప్పుకున్న ఈ మూడు లక్షణాలు వింటుంటే మీకు భయమేసి ఉండొచ్చు. లేదా మీ లైఫ్ లో ఎదురైనా ఎవరో ఒకళలు మీకు గుర్తొచ్చి ఉండొచ్చు. ఒక చేదు నిజం ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం మంచోళ్ళతోటే నిండిపోయి లేదు. మన చుట్టూ ఉన్న చీకటిని మనం ఆపలేం కానీ ఆ చీకటి మనల్ని మింగేయకుండా మనల్ని మనం కాపాడుకోగలం.
(05:14) మీరు ఇప్పటివరకు ఇలాంటి వారి చేతిలో మోసపోయి ఉండొచ్చు. మానసికంగా గాయపడి ఉండొచ్చు కానీ గుర్తుంచుకోండి ఆ తప్పు మీది కాదు మీ మంచితనాన్ని వాళ్ళు బలహీనతగా వాడుకున్నారంటే ఇప్పుడు ఆ బలహీనతను బలహీనతగా మిగిలిపోనివ్వద్దు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సైకలాజికల్ టూల్స్ కేవలం టిప్స్ మాత్రమే కాదు ఇవి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని పీస్ ఆఫ్ మైండ్ ని కాపాడే వెపన్స్ వీటిని ఎలా వాడాలో జాగ్రత్తగా వినండి.
(05:39) ఇలాంటి వ్యక్తులు మీ మనసుతో ఆడుకోకుండా ఉండాలంటే మీరు ఈ ఐదు టెక్నిక్స్ ని మీ లైఫ్ లో భాగం చేసుకోవాలి. టెక్నిక్ నెంబర్ వన్ నో కాంటాక్ట్ రూల్ ఇది అన్నిటికంటే పవర్ఫుల్ సొల్యూషన్. ఒక పాము కనిపిస్తే దాన్ని మార్చాలని చూడడం. దూరం జరుగుతాం. వీలైతే ఆ వ్యక్తితో అన్ని సంబంధాలు తెంచుకోండి. ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేయండి సోషల్ మీడియాలో అన్ఫాలో అవ్వండి.
(06:00) వాళ్ళు పంపే మెసేజ్లు చదవడం వల్ల మీలో మళ్ళీ ఆందోళన మొదలవుతుంది. గుర్తుంచుకోండి వాళ్ళకు మీరు ఇచ్చే అతి పెద్ద శిక్ష వాళ్ళని మీ జీవితంలో నుంచి తుడిచేయడమే వాళ్ళకి మీ ఉనికి కూడా తెలియకూడదు. టెక్నిక్ ట ద గ్రే రాక్ మెథడ్ ఒకవేళ అలాంటి వ్యక్తుల నుండి మనం తప్పించుకోలేని స్థితిలో ఉంటే ఈ మెథడ్ వాడొచ్చు. ఆ వ్యక్తి మీ ఆఫీస్ లో బాస్ అయినా లేదా మీ ఇంట్లోనే ఉంటేనో వాళ్ళని వదిలేయలేరు కదా అప్పుడు మీరు ఒక గ్రే రాక్ లాగా మారిపోవాలి అంటే ఒక బూడిద రంగు రాయిలాగా మారిపోవాలి.
(06:28) రోడ్డు మీద పడిపోయి ఉన్న ఆ రాయిని ఎవరైనా చూస్తారా దానికి ఎమోషన్స్ ఉంటాయా లేదు కదా వాళ్ళు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా అవమానించినా మీరు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి కేవలం అవును సరే తెలీదు వంటి చిన్న సమాధానాలు మాత్రమే ఇవ్వండి. మీరు రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళకి మీ మీద బోర్ కొడుతుంది. మెల్లగా వాళ్లే వేరే ఎవరినైనా వెతుక్కుంటూ వెళ్ళిపోతారు.
(06:47) టెక్నిక్ నెంబర్ త్రీ ద ఇన్నర్ సెటైడల్ ఈ టెక్నిక్ మన లాస్ట్ స్ట్రాయిసిజం వీడియోలో డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం. ఇది రోమన్ చక్రవర్తి మార్కస్ అరేలియస్ చెప్పిన అద్భుతమైన టెక్నిక్ మీ మనసుని ఒక అజయమైన కోటలా ఉంచుకోండి. బయట ఎవరైనా మిమ్మల్ని తిట్టినా అవమానించినా అది కోట గోడల బయటే ఆగాలి. ఆ మాటల్ని లోపలికి రానివ్వాలా వద్దా అనే అధికారం కేవలం మీ చేతిలో మాత్రమే ఉండాలి.
(07:12) వాళ్ళ అన్న మాటలు వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించినవి నావి కాదు అని మీకు మీరు చెప్పుకోండి. మీ పర్మిషన్ లేకుండా ఏ ఆలోచన కూడా మీ కోర్ట్లోకి రాకూడదు. టెక్నిక్ ఫోర్ ఐడెంటిఫై అండ్ డాక్యుమెంట్ అంటే సాక్ష్యాలను సిద్ధం చేయండి. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉండే మకేవెలియన్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ గురించి ఇది చాలా ముఖ్యం. వీళ్ళు మాట మార్చడంలో దిట్టలు అందుకే వాళ్ళతో జరిగిన ప్రతి ముఖ్యమైన కన్వర్సేషన్ ని ఈమెయిల్స్ లేదా మెసేజెస్ రూపంలో భద్రపరుచుకోండి.
(07:40) రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బలిపం చేయాలని చూస్తే మీ దగ్గరఉన్న ఆధారాలు మిమ్మల్ని రక్షిస్తాయి. మనుషుల్ని నమ్మండి కానీ వాస్తవాల్ని ఇంకా ఎక్కువ నమ్మండి. టెక్నిక్ నెంబర్ ఫైవ్ సెట్ స్ట్రాంగ్ బౌండరీస్ అంటే ఒక గీత గీయండి. మీ కైండ్నెస్ ని అంటే మీ దయని మీ బలహీనతగా మారనివ్వకండి. ఎదుటి వ్యక్తి మీ పర్సనల్ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నాడని మీకు అనిపిస్తే అక్కడే లక్ష్మణ రేఖ గీయండి.
(08:05) నాతో ఇలా మాట్లాడడం నచ్చలేదు అని ముఖం మీదే నెక్కచ్చిగా చెప్పండి. బౌండరీస్ లేని మనిషి గేట్లు లేని ఇల్లు ఒకటే ఎవరైనా వచ్చి దోచుకుంటారు. నో చెప్పడం నేర్చుకోండి. అది మిమ్మల్ని స్వార్ధపరుని చేయదు. మిమ్మల్ని మీరు గౌరవించుకునిలా చేస్తుంది. చివరగా నా నుండి ఒక చిన్న మాట. ఈ డార్క్ ట్రయాడ్ భక్తులు మీ జీవితంలోకి తుఫాన్లా వచ్చి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని విరిచేయాలని చూడొచ్చు.
(08:26) మీలోని వెలుగుని ఆర్పేయాలని ప్రయత్నించొచ్చు. కానీ ఒక్కడు గుర్తుంచుకోండి ఒక వజ్రం ఎంత ఒత్తిడికిలోనైతే అంత ప్రకాశిస్తుంది. ఈ వీడియోని ఇంతవరకు చూసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారంటే ఇక మీదట మీరు విక్టిం కాదు మీరు ఒక సర్వైవర్ మీరు ఎవ్వరికీ దేన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళని మార్చడానికి మీ విలువైన కాలాన్ని వృధా చేయకండి.
(08:49) మీ సక్సెస్ మీ చిరునవ్వు మీ ప్రశాంతతే మీరు వాళ్ళకి ఇచ్చే అతి పెద్ద సమాధానం. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కోట మీ మనసు ఆ కోటకి మీరే రాజు లేదా మీరే రాణి అక్కడ ఎవరిని ఉంచాలి ఎవరిని బయటకి గెంటేయాలి అన్న అధికారం మీ చేతుల్లోనే ఉంది. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు చాలా విలువైన వ్యక్తి మీరు ఇన్విన్సిబుల్ ఇది నమ్మండి ఎందుకంటే ఇదే నిజం.
(09:13) ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ కంటెంట్ లో వాల్యూ ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా తెలుగు మైండ్సెట్ లాబ్ కమ్యూనిటీలో చేరండి. మరో పవర్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్.

No comments:

Post a Comment