Sunday, April 12, 2026

AURA = రావణబ్రహ్మ 💀

AURA = రావణబ్రహ్మ 💀

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p5AkcFnKRa4



Transcript:
(00:00) మన హిందూ గ్రంథాల్లో ఎంతోమంది వీరులు ఉన్నప్పటికీ నన్ ఆఫ్ దెమ హావ్ ద ఓరా ఆఫ్ రావణ్ బ్రహ్మ మనకి రావణుడి గురించి ఇంట్రడక్షన్ అరణ్యకాండలో ఇస్తారు మహర్షి అంతకుముందే రావణుడి ప్రస్తావన వచ్చినప్పటికీ అసలు ఆయన క్యాలిబర్ ఎంత ఆయన వీరత్వం గురించి ఏం చేసి ఈ స్థాయికి ఎది ఎదిగాడు అని తెలియజేస్తారు. కాబట్టి సూర్పనక తనకి జరిగిన అవమానం గురించి చెప్పడానికి రావణ అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనే సందర్భాన్ని మహర్షి
(00:47) వర్ణిస్తారు. సాదదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్టం సచివై మరుద్బీయువ వాసవం ఆయన పుష్పక విమానం పైన కూర్చును ఉన్నాడు. చుట్టూ తన మంత్రులు పరివేష్టించి ఉన్నారు. ఇంద్రుడు చుట్టూ దేవతలు కూర్చుని ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో ఆ పుష్పక విమానంపై కూర్చున్న రావణుడి స్థితి అలా ఉందట. ఆయన అంతటి తేజోమూర్తియై ఉన్నాడు. దేవగంధర్వ భూతానాం ఋషినాంచ మహాత్మనం అజయం సమరం సూరం వ్యాక్తాననం యువంతకం
(01:31) ఆయన దేవతలు గాని గంధర్వులు గాని ఋషులు గాని ఏ దివ్య ప్రాణి చేత సంహరింపబడడు నోరు తెరుచుకొని కూర్చునున్నాడు. అలా నోరు తెరుచుకొని కూర్చున్నటువంటి రావణుడి స్థితి నోరు తెరుచుకుని మీదకు వస్తున్నటువంటి యమధర్మరాజులా ఉందట దేవాసుర విమర్దేశు వజ్రాస నికృత వ్రణం ఐరావత విశానాగ్రై ఉత్కృష్ట కినవక్షసం దేవాసురులతో ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాల్లో దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టినటువంటి దెబ్బలు రావణుడి [గురకలు]
(02:16) గుండెల మీద వాతలలాగా పడిన్నాయి. ఐరావతం తన రెండు దంతములతో కుమ్మితే ఆ దెబ్బలు ఆయన గుండెల మీద ఉన్నాయి. వింశత్భుజం దశగ్రీవం ధర్మనీయ పరిచ్చదం విశాలం వక్షం వీరం రాజలక్షణ శోభితం 20 చేతులతో ఉన్నాడు మళ్ళీ రాత్రి నిద్రపోతే ఉండవు దశగ్రీవం 10 తలకాయలతో ఉన్నాడు తెల్లటి పట్టు వస్త్రం కట్టుకున్నాడు విశాలం వక్షం వీరం విశాలమైన చాతి కలిగినవాడు మహావీరుడు రాజలక్షణ శోభితం రాజులకి
(03:02) ఎటువంటి లక్షణాలు ఉండాలో అటువంటి లక్షణాలతో ఆయన శోభిస్తున్నాడు. స్నిగ్ద వైడూర్య సంకాశం తప్తకాంచన కుండలం సుభుజం శుక్ల దశనం మహాస్యం పర్వతోపమం ఆయన కూర్చునుంటే వైడూర్యం ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోతున్నాడంట కాల్చి తీసినటువంటి బంగారంతో తయారు చేసిన కుండలములు పెట్టుకున్నాడు. ఆ కుండలాల కాంతి ఆయన చెక్కెళ్ల మీద పడుతుంది.
(03:41) విశాలమైన భుజాలు తెల్లటి పళ్ళు పర్వతం లాంటి శరీరంతో ఉన్నాడు. విష్ణు చక్ర నిపాతైస్ శతసో దేవ సంయుగే అన్యే శస్త్ర ప్రహారైస్ మహాయుద్ధేసు తాడితం శ్రీమహావిష్ణువు చక్రం పెట్టి కొడితే ఆయన ఒంటిమీద గీతలు పడ్డాయి. అంటే విష్ణువు చక్రమునకు తెగటారుడు సినిమాల్లో చూపించినట్టు ఆయన శరీరం ఏమి ముక్కలు కాదు విష్ణువు చక్రంతో కొన్ని వందల సార్లు కొట్టిన ఆయనకి ఏదో కొద్దిగా తెగుతుంది అంతే అహతాంగం సమస్తైస్చ ప్రహరణైస్తదా
(04:27) అక్షోభ్యానాం సముద్రానాం క్షోభనం క్షిప్రకారినం ఇంత ఇంతమంది దేవతల యొక్క ఆయుధాల దెబ్బలు తన ఒంటి మీద ఉన్న ఆయనకి చీమ కుట్టినట్టుగా కూడా లేదట అప్పుడప్పుడు సరదాకి చిన్న పిల్లలు నీళ్ల బకెట్లో చేతులు పెట్టి ఆడుకున్నట్టు తన 20 చేతులతో సముద్రాన్ని కూడా క్షోభింపజేస్తాడు తన చేష్టలతో సముద్రాన్ని కూడా అల్లాడిస్తాడు అంతటి శక్తిమంతుడు క్షేప్తారం పర్వతానాం సురానాంచ ప్రమర్థనం ఉచ్చేత్తారం ధర్మానాం పరదారాభిమర్శనం
(05:13) ఆయనకి ఇష్టమైన పనులు ఏంటంటే ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే పొద్దున్నే లేచి సంధ్యావందనం అయిపోయాక బయలుదేరి పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడున్నాయో చూసుకుంటాడు చూసుకుని ఆ పర్వత శిఖరాల్ని తన 20 చేతులతో కుదిపేసి ఆ పర్వతాల్ని గాలిలోకి విసురుతాడు. అంతటి బలం ఉన్నవాడు అందులో సందేహమే లేదు. ఎందుకంటే యుద్ధకాండలో రావణ బలం అంటే ఏంటో చెప్తారు మహర్షి వాయుపుత్రుడైన హనుమ విపరీతమైన కోపంతో రావణుడి గుండెల మీద గుద్దితే ఆ దెబ్బ
(06:00) నుండి వితిన్ సెకండ్స్ లో తేరుకోవడమే కాకుండా తిరిగి ఒక్క దెబ్బతో హనుమాంతటి వాడిని నేల మీద పడుకోబెడతాడు. సురానాంచ ప్రమర్ధనం తన మంత్రులని అడుగుతాడు దేవతలు గాని రాక్షసులు గాని ఎవరైనా మిగిలారా నా చేతుల్లో తన్నులు తినకుండా ఫలానా వాడు ఉన్నాడు రాజన్ వాడిని కూడా బలవంతుడనే అంటారు అని మంత్రులు చెప్తే వాడి మీదకి వెళ్తాడు.
(06:37) ఓ గంటసేపు వాడి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తాలు కారేలాగా చావగొడతాడు. ఉచ్చేత్తారం ధర్మాణం ఎవరైనా ఎక్కడైనా యజ్ఞాలు చేస్తున్నా లేదా యాగాలు చేస్తున్నా అవి పూర్తయ్యి ఫలితాన్ని ఇస్తాయి అనే సమయానికి ఆ చేసేవాడి తలకాయ అయినా తీసేస్తాడు లేదా వాడి ధర్మాన్నైనా పాడు చేస్తాడు. సర్వ దివ్యాస్త్ర యోక్తారం యజ్ఞ విజ్ఞకరం సదా పురీం భోగవతీం గాత్వ పరాజిత్య వాసుకీం సకల అస్త్రాలను ప్రయోగించడం రావణుడికి తెలుసు అస్త్రములను ఉపసంహారం
(07:25) చేయడం కూడా ఆయనకి తెలుసు అంతటి అస్త్రజ్ఞానం కలిగినటువంటి యుద్ధ విశారదుడు ఒకసారి పాతాళ లోకానికి వెళ్ళాడు అక్కడ పరిపాలిస్తున్నటువంటి వాసుకి అనబడే ఒక మహానాగం ఆ వాసుకిని ఓడించాడు అలాగే ఒకసారి కుబేరుడు నివసిస్తున్నటువంటి కైలాస పర్వతానికి వెళ్ళాడు. కుబేరుడు సొంత అన్నగారు ఆయన దగ్గర పుష్పక విమానం ఉంది అని తెలిసింది. నాకు కావాలి ఇస్తావా ఇవ్వ ఇవ్వను అన్నాడు కుబేరుడు అన్నగారి తల పగలగొట్టి పుష్పక విమానాన్ని తనదిగా తెచ్చుకున్నాడు.
(08:14) వనం చైత్రరథం దివ్యం నలినీం నందనం వనం వినాశయతి యహక్రోదాత్ దేవోద్యానాని వీర్యవాన్ చంద్ర సూర్యో మహాభాగే ఉత్తిష్టంతే పరంతపౌ ఒకసారి ఎవరో చెప్పుకుంటుంటే విన్నాడు స్వర్గలోకంలో నందనవనం ఎంత బాగుంటుందో అని స్వర్గలోకంలోంచి నందనవనా తీసుకురావడం కుదరదు ఒకవేళ అది పోర్టబుల్ వస్తువైతే పుష్పక విమానంలో పెట్టుకుని లంకా పట్టణానికి తెచ్చుకుంటాడు.
(08:55) అలా కుదరలేదు కాబట్టి ఒకసారి అలా వెళ్ళాడు ఆ నందన వనాన్ని మొత్తం పాడు చేసి తిరిగి వచ్చాడు. ఒక్కొక్కసారి తెల్లవారు జామున అంతఃపురం మేడ మీదకి వెళ్తాడంట. అలా వెళ్లేటప్పటికీ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు. అలా చూస్తాడు ఈయన ఉదయించడం ఏంటి ఆయన అస్తమించడం ఏంటి? అంతా వీళ్ళష్టమేనా ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి ఈయన్నో చేతితో నొక్కుతాడు ఆయన్న ఒక చేత్తో నొక్కుతాడు.
(09:37) ఈ చేతులు దాటి వాళ్ళు బయటకి వెళ్ళలేరు. అలా సూర్యచంద్రుల గమనాన్ని కాసేపు ఆయన సరదాకి అడ్డగిస్తాడు. అటువంటి భుజబలం కలిగినటువంటి వాడు అదేంట్రా అని సూర్యుడు గాని చంద్రుడు గాని రావణుడి మీదకి ఎదురు తిరగడానికి లేదు. ఎందుకంటే ఆయన దిక్పాలకుల్ని కూడా శాసిస్తాడు. అలా రెండు చేతులతో సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపుతాడు అంటే అసలు రావణుడి యొక్క శక్తి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు.
(10:17) అటువంటి రావణాసురుడు అని రావణుడి క్యారెక్టర్ ని ప్రవేశపెట్టే ముందు మహర్షి రావణుడి గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు. అన్నిటికీ మించి ఎంత గొప్ప తపస్సు చేసినవాడంటే దశవర్ష సహస్రాని తపః తప్తవాయః మహావనే పురా స్వయంభువే ధీర సిరాంసి ఉపజహారయః ఒకసారి ఈ రాక్షసుడు బ్రహ్మగారి కోసంపవేల సంవత్సరాలు తపస్సు చేశాడు.వెయి సంవత్సరాలకి ఒక తలకాయ చొప్పున తన 10 తలకాయలు అగ్నికి ఆహుతి ఇచ్చాడు.
(11:01) ఈయన చేసిన ఉగ్ర తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మగారు ప్రత్యక్షమై ఆశ్చర్యపోయారు. ఒరేయ్ ఏమి తపస్సురా ఇది ఎవరైనా తపస్సు అంటే గొప్పగా అద్భుతంగా చేస్తారు. నువ్వేంట్రా నీ తలకాయలు కొట్టేసుకుని అగ్నిహోత్రంలో పడేసావు అని అడిగారు. దానికి రావణుడు అన్నాడు దేవదానవ గంధర్వ పిశాచ పతగోరైహి అభయం యస్య సంగ్రాామే మృత్యుతో మానుషాదృతే ఆయన దేవతల చేత నాగముల చేత గంధర్వుల చేత యక్షుల చేత పక్షుల చేత నాకు మరణం ఉండకూడదు మనుషుల్ని మాత్రం వదిలేశాడు అని చెప్తారు
(11:51) మహర్షి రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం రాక్షసి బ్రాతరం సూరం సాదర్శ మహాబలం ఆయన ఎటువంటివాడు అంటే ఒక్క మాటలో చెప్తున్నారు మహర్షి రావణాసురుడు సర్వ ప్రాణులకు సర్వ లోకాలకు భయంకరుడు వాళ్ళకి వీళ్ళకి అని ఏమీ లేదు ఆయన తనవారికి కూడా భయంకరుడే కాబట్టి అటువంటి అన్నగారినిచ చూసిందట రాక్షసి అయిన సూర్పనక అంటే ఆవిడ పుష్పక విమానం దగ్గరికి వచ్చింది.
(12:32) ఆవిడ కూడా భయం భయంగానే వచ్చింది. ఎందుకంటే కరుడితో మాట్లాడినట్టు కాదు రావణుడితో మాట్లాడడం అంటే ఏమో ఆయన కోపం ఈవిడ మీదకి రావచ్చు. అందుకనే వెళ్లి ఆ రావణుడి ముందు పడింది. ఇదంతా కూడా మహర్షి రావణ పాత్రని ప్రవేశపెట్టే ముందు ఆయన గురించి ఇస్తున్నటువంటి ఇంట్రడక్షన్ మాత్రమే ముందుకెళ్లే కొద్దీ ఈ క్యారెక్టర్ గ్రాఫ్ ని అలా పెంచుకుంటూ వెళ్తారు మహర్షి తదాసాధ్య దశగ్రీవః క్షిప్రమాంతరం ఆస్తితః అభిచక్రం వైదేహిం పరివ్రాజక రూపదృక్
(13:17) లక్ష్మణుడు రాముడి కోసమని సీతాదేవిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళగానే దశగ్రీవుడు ఒక సన్యాసిగా ఒంటరిగా ఉన్న సీతాదేవి దగ్గరికి నడుస్తున్నాడు. అయితే మారువేషంలో వచ్చినవాడు రావణాసురుడు అని జనస్థానంలోని చెట్లు కనిపెట్టాయి. కనిపెట్టి వనికిపోయి చెట్లన్నీ కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. ఒక పక్క గాలి అలా వీస్తుంది.
(13:54) రావణాసురుని చూసి వీయడం ఆగిపోయి చాలా మందంగా వీస్తుంది. శీఘ్ర శ్రోతాస్చతం దృష్ట్వా వీక్షంతం రక్తలోచనం స్థిమితం గంతు మారేబే బయాత్ గోదావరి నది ఆ వస్తున్నటువంటి రావణాసురుడి ఉగ్ర తేజస్సు చూసి సూర్యుడు తన కాంతిని తగ్గించుకుని మేఘాల చాటున దాక్కున్నాడు. భయాత్ గోదావరి నది ఉరకలతో పరుగులతో వెళ్ళిపోతుంది గోదావరి నది వీక్షంతం రక్తలోచనం ఒక్కసారి ఆ ఎర్రటి కళ్ళతో లోపలికి వెళ్తూ ఇలా చూశడంతే గోదావరి నది వంక అంతే పరుగులు
(14:41) పెడుతున్న గోదావరి నిశశబ్దంగా అమ్మ బాబోయ్ వచ్చేసాడురా వీడు అని అసలు ఉందా లేదా అన్నట్టు చప్పుడు చేయకుండా డ ప్రవహించడం మొదలు పెట్టింది. ఎందుకంటే ఆయన అటువంటి ఉగ్గ తేజస్సుతో ఉన్నాడు అంటాడు మహర్షి అసలు చూడడం కూడా సాధ్యం కాదు ఆయన తన రూపాన్ని మార్చుకుంటే తప్ప రావణుడి యొక్క ఓర ఆయన చుట్టూ ఏ రేంజ్లో ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యేకించి సుందరకాండలో చెప్తారు మహర్షి వాయుపుత్రుడైన హనుమ ఒక పిల్లి ఏ సైజులో ఉంటుందో అంత చిన్న కోతి పిల్లగా గా మారి రావణాసురుడి బెడ్రూమ్లోకి
(15:27) వెళ్ళినప్పుడు ఆయన మద్యం సేవించిన వాడై తన భార్యలతో రమించి ఆ మత్తులో నిద్రపోతున్నాడు. ఆ స్థితిలో ఉన్న రావణాసురుని అసలు వీడు ఎలా ఉంటాడా అని నిస్వస్వంతం యదానాగం రావణం వానరోత్తమః ఆసాద్య పరమోద్విజ్ఞః సోపాసర్పత్ సుబీతవత్ ఆ పడుకున్నటువంటి రావణాసురుడి తల్పం దగ్గరికి వెళ్తే ఆయన యొక్క రోమాల్లోనుంచి కొడుతుందట బ్రహ్మ తేజస్సు అంతటి తపస్సు శక్తి కలిగినవాడు ఒక పెద్ద పాము మన మీదకి బుసకుడితే ఎలా వెనక్కి తుయ్యబడతామో
(16:15) ఆయన శరీరంలోంచి కొడుతున్న తేజస్సు చేత వెనక్కి విసిరేసినట్టుగా పక్కకెళ్ళిపోయాడు హనుమ ఎందుకంటే రావణాసురుడిది మామూలు తపస్సు కాదు అని చెప్తారు మహర్షి మళ్ళీ ఆ తెల్లవారు జామున సీతాదేవిని చూడడానికి కి రావణాసురుడు కనీసం స్నానం గాని ముఖం కూడా కడుక్కోకుండా సంధ్యావందనం చేయకుండా ఆ తెల్లవారు జామున సీత మీద కామ ప్రచోదనతో వస్తున్నాడు.
(16:52) అయితే సీత కూర్చున్న చెట్టుపైనే హనుమ కూడా ఉన్నాడు. రాత్రి చూసింది వీడి కదా చీకట్లో సరిగ్గా కనపడలేదు ఏమి కాంతిరా వీడిది అని సీతతో మాట్లాడుతున్న రావణుని ఒకసారి పరీక్ష పెట్టి చూద్దామని కైకొమ్మల్లోంచి కింది కొమ్మకు దిగి చూశాడు. ఆ రావణుడి యొక్క ఓర ఎలా కొట్టిందంటే దెబ్బకి కళ్ళు బైర్లు గమ్మి ఆ కొమ్మలకున్న ఆకుల్ని దగ్గరగా చేసుకుని ఆకుల మధ్య కాళీల్లోంచి చూశాడట రావణాసురుడు రాత్రంతా ప్లెజర్ ని అనుభవించి తెల్లవారు
(17:38) జామున నిద్రమత్తులో కనీసం స్నానం కూడా చేయకుండా వస్తున్నా సరే ఆయన యొక్క తేజస్సు అలా కొట్టిందట హనుమని అందులోనూ రావణుడు బ్రహ్మగారికి మునిమనవడు బ్రహ్మగారి మానస పుత్రులైన ఏడుగురు ప్రజాపతుల్లో ఒకడు పౌలస్త్య బ్రహ్మ ఈ పౌలస్త్య బ్రహ్మ కుమారుడే విశ్రవస బ్రహ్మ ఈ విశ్రవస బ్రహ్మ కుమారుడు రావణ బ్రహ్మ అటువంటి బ్రహ్మ వంశంలో పుట్టాడు ఆ తరువాత ఇంద్రజిత్ చేత బంధించబడి రావణుడి ముందు నిలబెట్టినప్పుడు హనుమ చూస్తాడు రావణాసురుడిని
(18:24) చూసి మనసులో అనుకుంటాడు అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహో దృతిహి అహో రాక్షస రాజస్య సర్వలక్షణ యుక్తత ఏమి రూపం ఏమి ధైర్యం ఏమి కాంతి ఏమి టీవీ నిజంగా ఈ రాక్షస రాజు యందు పక్కనోడి భార్యని ఎత్తుకొచ్చే అలవాటు లేకపోతే ఈయన మూడు లోకములను పరిపాలించడానికి అర్హుడు అటువంటి లక్షణములు కలిగినవాడు శత్రువు చేత కూడా పొగిడించుకునేంత తేజోమూర్తియై రావణుడు ఆ బంగారు సింహాసనం మీద కూర్చుని మెరిసిపోతున్నాడు.
(19:09) అందుకనే హనుమాంతటి వాడు కూడా ఆయన కాంతిని చూసి పైకి అనకపోయినా మనసులో ఇలా అనుకున్నాడు అని చెప్తారు మహర్షి అయితే చివరిగా యుద్ధకాండలో రావణుడి యొక్క ఓరాని రాముడు మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉందో చెప్తారు మహర్షి అసౌకిరీటి చెలకుండలాసియో నాగేంద్ర వింద్యో పమం భీమకాయః మహేంద్ర వైవస్వత దర్పహంత రక్షోదిపః సూర్య యువబాతి విభీషణుడు రాముడితో చెప్తున్నాడు రామ అదిగో ఆ రాక్షసుల మధ్యలో వస్తున్నాడే
(19:56) 10 తలకాయలు 20 చేతులు దాంతో పాటు అసౌ కిరీటి ఆ 10 తలకాయల మీద 10 కిరీటాలు చెలకుండలాస్యో కదులుతున్నటువంటి కుండలాలు నాగేంద్ర వింద్యోపమ భీమకాయః వింద్య పర్వతం లాంటి శరీరం ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు కాకిలో దూరి పారిపోయాడో ఎవరి పరాక్రమాన్ని చూసి ఇంద్రుడు నెమల్లో దూరి పారిపోయాడో తక్షకుడు దేవతలు మహేంద్రుడు యముడు యుద్ధరంగంలో పరిగెత్తించగలిగినవాడు వెంటబడి తరమగలిగినవాడు
(20:41) అందరినీ శాసించగలిగినవాడు దేవదానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష దానవ సమూహాలను ఓడించినవాడు ఎవడు పేరు చెప్తే లోకాలు ఏడుస్తాయో అదిగో అటువంటి తేజోమూర్తి అయిన రావణాసురుడు వస్తున్నాడు ప్రత్యువాచ తతో రామో విభీషణ మారిందమం అహో దీప్తో మహా తేజ రావణో రాక్షసీస్వరః ఆదిత్య యువ దుష్ప్రేక్షో రస్మి బిర్బాతి రావణః సువ్యక్తం లక్షయేహ్యస్య రూపం తేజః సమావృతం దేవదానవ వీరానాం వపూర్ణయేవం విదం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య
(21:29) వపుర్యేతత్ ప్రకాశతే కాబట్టి మొట్టమొదటిసారి రావణుని చూసినటువంటి ంటి రాముడు అంటున్నాడు అసలు ఏంటి ఈ రావణాసురుడి తేజస్సు అసలు ఏంటి ఈ రావణాసురుడి వైభవం అసలు ఇటువంటి శరీరాన్ని నేను ఇంతకుముందు ఎప్పుడూ దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ చూడలేదు. సూర్యభగవానుడు దిగవచ్చాడా అన్నట్టుగా ఉంది ఈ రావణాసురుడి తేజస్సు అసలు ఈయన వైపు కళ్ళు నిలపడం కూడా నాకు సాధ్యం కావట్లేదు.
(22:11) ఎందుకంటే ఆయన శరీరంలోనుంచి వచ్చే కిరణాలు అటువంటి కాంతులు ఇనుతున్నాయి.

No comments:

Post a Comment