Monday, April 13, 2026

నీ జీవితం ఉడికిపోతోంది! | Boiling Frog Syndrome Psychology Explained in Telugu

నీ జీవితం ఉడికిపోతోంది! | Boiling Frog Syndrome Psychology Explained in Telugu

Author Name:Telugu Mindset Lab

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguMindsetLab

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LenuR58w3rU



Transcript:
(00:00) మన జీవితంలో మనకు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన మత్తులో మునిగిపోతున్నామా ఒక్కసారి ఆలోచించండి ఏదైనా పెద్ద సమస్య మనక వస్తే వెంటనే అలర్ట్ అయిపోతాం. కానీ అదే సమస్య చాలా మెల్లగా చాలా నిశబ్దంగా మనల్ని చుట్టేస్తుంటే మనం గమనించలేం. మనం కంఫర్ట్ జోన్ అనే ఆ మాయా ప్రపంచంలో కూర్చుని మన చుట్టూ జరుగుతున్న ఆ వైఫల్యపు సెగని గుర్తించకుండా మనల్ని మనం నిదానంగా కోల్పోతున్నాం.
(00:26) వినడానికి కొంచెం కఠినంగా ఉన్న ఇదే మనలో చాలా మంది జీవితాల్లో జరుగుతున్న ఒక చేదు నిజం. దీన్ని సైకాలజీలో బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ముగిసేసరికి మనం ఆ కంఫర్ట్ జోన్ అనే గిన్నెలోనుంచి బయటపడి విజయ తీరాల వైపు ఎలా వెళ్ళాలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు తెలుగు మైండ్సెట్ లాబ్ ఒక చిన్న సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఒక కప్పును తీసుకొని మరుగుతున్న వేడి నీళ్ళలో వేయండి.
(00:52) అది ఏం చేస్తుంది? వెంటనే ఆ వేడిని భరించలేక ఒక్క గెంతు వేసి బయట పడిపోతుంది. ఎందుకు? దానికి ప్రమాదం వెంటనే తెలిసింది. కానీ అదే కప్పను ఒక గిన్నెలో ఉన్న చల్లటి నీళ్ళలో వేస్తే అది హాయిగా ఈదుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి చాలా అంటే చాలా మెల్లగా సెగ పెంచండి. నీళ్లు ఒక డిగ్రీ ఒక డిగ్రీ వేడెక్కుతుంటాయి. ఆ కప్పు ఏం చేస్తుందో తెలుసా? నీళ్ళు కొంచెం వెచ్చగా ఉన్నాయి కదా బాగున్నాయి అనుకుంటూ తన బాడీ టెంపరేచర్ ని ఆ నీళ్ళకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటుంది.
(01:25) సెగ పెరుగుతున్న కొద్దీ కప్ప అడ్జస్ట్ అవుతూనే ఉంటుంది. కానీ నీళ్లు మరిగే స్థితికి వచ్చినప్పుడు కప్పకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను చనిపోతాను ఇక్కడి నుంచి గెంతాలి అని కానీ అప్పటికే ఒక ఘోరం జరిగిపోతుంది. తన బాడీని అడ్జస్ట్ చేసుకోవడానికి అది తన శక్తిని మొత్తం ఖర్చు చేసేసింది ఆల్రెడీ. గెంతానికి దాని దగ్గర ఒక్క చుక్క బలం కూడా మిగలదు.
(01:48) చివరికి ఆ గిన్నెలోనే ఉడికి చనిపోతుంది. ఇక్కడ ఆ కప్పను చంపింది వేడినీళ్లు కాదు సరైన సమయంలో గెంత లేకపోయినా దాని నిర్ణయం మన లైఫ్ లో కూడా ఆ వేడినీళ్లు మెల్లగా మరిగిపోతున్నాయి గమనిస్తున్నావా ఉదయం ఒక ఐదు నిమిషాలు అనుకొని ఫోన్ తీస్తావ్ మెల్లగా ఐదు నిమిషాలు గంట అవుతుంది. నీకు తెలియకుండానే విలువైన సమయం నీ ఫోకస్ ఉడికిపోతున్నాయి. ఈ ఒక్క రోజే కదా అని పనిని రేపటికి నెట్టేస్తావ్.
(02:13) ఆ వాయిదా అనే సెగ మెల్లగా పెరిగి ఒకరోజు నీ చేతిలో ఏమి లేనప్పుడు నీకు భయమేస్తుంది. అప్పుడు గెంతడానికి నీ దగ్గర స్కిల్స్ ఉండవు ఎనర్జీ ఉండదు. నెగిటివ్ సర్కిల్ నిన్ను కిందకు లాగే ఫ్రెండ్స్ మధ్యలో నువ్వు ఉంటే మొదట్లో అది చదువుకపోవడం లాగే ఉంటుంది. కానీ మెల్లగా నీ స్టాండర్డ్స్ పడిపోతాయి. నువ్వు ఒక యవరేజ్ మనిషిలా ఆ గిన్నెలో మిగిలిపోతావ్. ఇదే మెంటాలిటీతో మనం చాలా విషయాల్లో బాధపడుతున్నాం.
(02:36) ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే ప్రేమ పేరుతో బానిసత్వం అది భార్యా భర్తల బంధం కావచ్చు ప్రేమికులది కావచ్చు మొదట్లో చిన్న చిన్న కంట్రోలింగ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళకు వీళ్ళతో మాట్లాడకు అంటారు నువ్వు సర్దుకుపోతావ్ మెల్లగా ఆ వేడి పెరుగుతుంది. నిన్ను అందరి ముందు తక్కువ చేయడం నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం మొదలవుతుంది.
(02:56) మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే మన ఎదుగుదలని ఆపేస్తున్న పరిస్థితులని కూడా ప్రేమ అనే పేరుతో సమర్ధించుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఆ గిన్నెలోనే ఆగిపోతాం. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం ఉడికిపోయి నువ్వు ఒక ప్రాణం లేని బొమ్మలా మిగిలిపోయేదాకా నీకు అర్థం కాదు. నువ్వు ఒక టాక్సిక్ రిలేషన్ అనే మరిగే నీళ్లలో ఉన్నావని ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఫ్రెండ్లీ సబటేజ్ అంటే స్నేహం ముసుగులో ఉన్న శత్రువులు నీ ఫ్రెండ్స్ నీతోనే కలిసి తిరుగుతారు కానీ నువ్వు ఏదైనా కొత్తగా చేస్తుంటే మెల్లగా సెటైర్లు వేస్తారు.
(03:24) నీకు అవసరం రా ఇవన్నీ మనకు రాదులే మనకంత సీన్ లేదులే అని నీ కలలో ఉన్న వెలుగుని మెల్లమెల్లగా ఆరిపేస్తారు. ఆ నెగిటివిటీ అనే సెగ నీకు వెంటనే తెలీదు. కానీ కాలం గడిచాక నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకంటూ ఏ గోల్స్ మిగలవు. నువ్వు కూడా ఆ యవరేజ్ ఫ్రెండ్స్ లాగే గిన్నెలోనే ఉడికిపోయి ఉంటావు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం కెరీర్ డెడ్ ఎండ్ కంఫర్ట్ జోన్ అనే ఉచ్చు ఒక జాబ్ లో జాయిన్ అవుతావ్ జీతం వస్తుంది కదా అని అక్కడ గ్రోత్ లేకపోయినా నిన్ను వాడుకుంటున్నా సరే బయట మార్కెట్ బాలేదు కదా అని నీకు నువ్వు చెప్పుకొని అడ్జస్ట్ చేసుకుంటావ్.
(03:55) ఆ గిన్నెలో నీ స్కిల్స్ అన్నీ తుప్పు పట్టిపోతుంటాయి. ఒకరోజు కంపెనీ నిన్ను తీసేసినప్పుడు కొత్తగా ఏదైనా చేద్దాం అన్న ఎనర్జీ ఉండదు. మార్కెట్లో నిలబడే సత్త ఉండదు. అప్పటికే నీ కెరీర్ ఉడికిపోయి ఉంటుంది. మనందరం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాం అంటే మన బ్రెయిన్ కి మెల్లగా జరిగే అన్యాయం కంటే ఒక్కసారిగా జరిగే అన్యాయం మీద కోపం వస్తుంది.
(04:15) అందుకే మనం టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఏళ్ల తెరబడి ఉండిపోతాం. దీన్నే నార్మలైజేషన్ ఆఫ్ డివైన్స్ అంటారు. అంటే తప్పును కూడా అలవాటుగా మార్చుకోవడం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సైన్స్ పరంగా చూస్తే కప్పలు వేడెక్కగానే గెంతేస్తాయి. అవంత పిచ్చివి కాదు కానీ మనుషులు మాత్రం కప్పల కంటే దారుణం. కప్పలకున్న ఆ ఇన్స్టింట్ మనకు లేదు.
(04:36) మనం ఆ టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఆ బద్ధకంలో ఆ అప్పుల ఊబిలో అన్ని తెలిసి కూడా అలాగే ఉండిపోతాం. అందుకే ఈ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ ని సైకాలజీలో ఒక హెచ్చరికగా వాడతారు. ఈరోజు నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు నీ చుట్టూ ఉన్న వేడి పెరుగుతుందా నీ కంఫర్ట్ జోన్ నిన్ను మెల్లగా చంపేస్తుందా? అడ్జస్ట్ అవ్వడం ఆపేయ్ నీ దగ్గర ఇంకా కొంచెం బలం మిగిలి ఉండగానే ఆ గిన్నెలోనుంచి ఇప్పుడే బయటకి గెలుపు.
(05:02) గెంతే సత్తా ఉన్నప్పుడే గెంతాలి లేదంటే అక్కడే ఉండి ఉడికిపోవడం కాయం. ఈ వీడియో మీలో ఆ స్పార్క్ ని రగిలిస్తే కామెంట్ సెక్షన్ లో ఐ జంప్డ్ అవుట్ అని టైప్ చేయండి. ఎందుకంటే మన జీవితాల్ని మనమే కాపాడుకోవాలి. ఈ కంటెంట్ లో వాల్యూ ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే మన తెలుగు మైండ్సెట్ లాబ్ కమ్యూనిటీలో చేరండి. థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్.

No comments:

Post a Comment