సగం వదిలేసిన పనులు మీ మెదడుని వేధిస్తాయి! 3 Steps to Finish What You Start | Zeigarnik Effect Telugu
Author Name:Telugu Mindset Lab
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguMindsetLab
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XtFEFQBtXdY
Transcript:
(00:00) ఈ వీడియో కేవలం కొన్ని నిమిషాలే ఉంటుంది కానీ నాదొక ప్రామిస్ ఈ కొన్ని నిమిషాల తర్వాత మనం లైఫ్ లో ఏ పనైనా మధ్యలో వదిలేసే బలహీనతని మనం అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు రాత్రి నిద్రపోదామని కళ్ళు మూసుకోగానే ఎప్పుడో వారం కిందట సగం వదిలేసిన పని లేదా పొద్దున చదవడం ఆపేసిన ఆ బుక్ పేజీ మీ మెథడ్లో ఎందుకు రిపీట్ అవుతూనే ఉంటుంది మీ మెదడు మిమ్మల్ని ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వదు మన బ్రెయిన్ కి ఓపెన్ లూప్స్ అంటే పడదు.
(00:29) అంటే మీరు ఒక బుక్ సగం చదివి వదిలేసిన ఒక కోర్సు మధ్యలో ఆపేసిన మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఒక ఓపెన్ ఫైల్ లాగా ఉంచుతుంది. దీనివల్ల మీ మెంటల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. అందుకే మీరు అలసిపోయినట్టు ఎప్పుడూ గందరగోళంగా ఫీల్ అవుతుంటారు. దీనికి కారణం మీ బద్ధకం కాదు దీన్నే సైకాలజీలో జైగార్నిక్ ఎఫెక్ట్ అంటారు.
(00:51) మీరు ఒక పనిని సగం వదిలేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఒక ఓపెన్ ఫైల్ లాగా ఉంచుతుంది. అందుకే మీరు పడుకున్నా టీవీ చూస్తున్నా ఆ పని చేయలేదు ఆ బుక్ సగమే ఉంది అని బ్యాక్గ్రౌండ్ లో ఒక వింతైన ఆందోళన మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. దీనివల్ల మీ ఫోకస్ మొత్తం ముక్కలైపోతుంది. మీరు ఒక పనిని మొదలెట్టి మధ్యలోనే వదిలేశరంటే మీ మెదడుకి మీరు ఒక పచ్చి గాయం అంటే ఒక ఓపెన్ బోండ్ ని ఇచ్చినట్టు అన్నమాట.
(01:16) అది ఆ పని ముగిసే వరకు మిమ్మల్ని హింసిస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో ఆ హింస ఆపి మనల్ని కాన్స్టెంట్ ఫినిషర్స్ గా మార్చే మూడు ప్రాక్టికల్ సొల్యూషన్స్ నేర్చుకుందాం. వెల్కమ్ టు తెలుగు మైండ్సెట్ లాబ్ ఈ ఇన్సిడెంట్ 1920 లో వియన్నాలో జరిగింది. బ్లూమా జిగర్నిక్ అనే ఒక సైకాలజిస్ట్ తన ప్రొఫెసర్లతో కలిసి ఒక హోటల్ కి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక వింతని గమనించింది.
(01:39) అక్కడన్న ఒక వెయిటర్ ఏ నోట్బుక్ లేకుండా పెన్ లేకుండా పదుల సంఖ్యలో ఉన్న కస్టమర్ల ఆర్డర్ ని గుర్తుపెట్టుకుంటున్నాడు. ఎవరికి ఏ సూప్ కావాలి ఎవరికి ఏ డ్రింక్ కావాలి ఎవరికి స్పైసీగా ఉండాలి ప్రతిది మైండ్లోనే అన్ని యక్యూరేట్ గా గుర్తున్నాయి. ఆమె ఆశ్చర్యపోయింది అతను వెళ్తుంటే ఆప అడిగింది అబ్బాయ్ నీ జ్ఞాపక శక్తి అద్భుతం ఇంత క్లిష్టమైన ఆర్డర్లు ఎలా గుర్తుపెట్టుకుంటున్నావ్ అని కానీ అసలైన షాక్ అప్పుడే తగిలింది.
(02:05) అతను బిల్లు ఇచ్చి బయటికి వెళ్తుంటే ఆమె మళ్ళీ ఆపి ఒక్క నిమిషం ఆ మూడో టేబుల్ వాళ్ళు ఏం ఆర్డర్ చేశరో మళ్ళీ చెప్తావా అని అడిగింది. ఆ వెయిటర్ ముఖం ఖాళీగా పెట్టి సారీ మేడం బిల్లు కట్టేయగానే ఆ డేటా నా మైండ్ లో నుంచి డిలీట్ అయిపోయింది అన్నాడు. అప్పుడు బ్లూమాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడే అసలైన సైకాలజీ ఉంది. మన మెదడుకి ఇన్కంప్లీట్ గా ఉన్న పనులంటే ఒక రకమైన ఆకలి ఆ పని పూర్తయ్యే వరకు మెదడు దాన్ని వదలదు.
(02:32) ఒకసారి బిల్లు కట్టేసాక అంటే ఆ పని ముగిసాక మెదడు దాన్ని చెత్తబుట్టలా పడేస్తుంది. అందుకే మనకి సగం చదివేసిన పుస్తకాలు సగం చూసిన సినిమాలు సగంలో వదిలేసిన ప్రాజెక్టులే గుర్తుంటాయి. కానీ పూర్తి చేసినవి కాదు. ఈ ఎఫెక్ట్ ని వాడుకొని కార్పొరేట్ కంపెనీలు మనల్ని ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చి ఆపేస్తారు.
(02:53) ఆ కథ సగం వదిలేశారు కాబట్టి నీ మెదడు ఆ ఓపెన్ లూప్ ని భరించలేదు. అందుకే పని మానుకొని మరి నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తాం. మీరు ఎప్పుడైనా గమనించారా YouTube లో తంబ్నెయిల్స్ ఎలా ఉంటాయో ఇతను ఈ ఒక్క పని చేసి కోటీశ్వరుడు అయ్యాడు. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు. అని సగం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నీ మెదడికి ఆ సగం అస్సలు నచ్చదు. ఆ మిగతా సగం ఏంటో తెలుసుకోవాలని ఆ మెంటల్ ఇచ్ అనది ఏదైతే ఉందో నిన్ను ఆ వీడియో మీదకి క్లిక్ చేసేలా చేస్తుంది.
(03:21) అదేవిధంగా ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ చూడండి మీకోసం ఒక సర్ప్రైజ్ వేచి ఉంది అని ఆపేస్తారు. ఆ లూప్ ని క్లోజ్ చేయడం కోసం నువ్వు ఆ మెయిల్ ఓపెన్ చేస్తాం. మన క్యూరియోసిటీని వాడుకొని మన అటెన్షన్ ని వాళ్ళు దొంగలిస్తున్నారు. జైగార్నిక్ ఎఫెక్ట్ ని వాడుకొని మనల్ని బానిసల్లాగా మారుస్తున్నారు. ఈ ట్రాప్ ని కనిపెట్టకపోతే మన టైం మొత్తం ఇతరుల లూప్స్ ని క్లోజ్ చేయడానికే సరిపోతుంది.
(03:40) కానీ ఆగండి గుర్తుండడం మంచిదే కదా అని అనుకుంటున్నారా అక్కడే మనం పొరపాటు పడుతున్నాం. ప్రతి సగం వదిలేసిన పని మీ మెథడ్ లో ఒక ఓపెన్ లూప్ లాగా మిగిలిపోతుంది. మీ ఫోన్ బ్యాక్గ్రౌండ్ లో 100 యాప్స్ ఓపెన్ చేసి ఉంచితే బ్యాటరీ ఎలా అయిపోతుందో మీ మెదడు బ్యాక్గ్రౌండ్ లో ఈ పెండింగ్ పనులు మీ ఎనర్జీని మీ ఫోకస్ ని పీల్చేస్తున్నాయి.
(04:02) మనం అలిసిపోవడానికి కారణం కష్టపడడం కాదు ఈ సగం వదిలేసిన పనుల భారం మోయడం మరి ఈ లూప్ ని బ్రేక్ చేసి ఆ వెయిటర్ లాగా బిల్లు కట్టేసి ప్రశాంతంగా ఉండడం ఎలా ఆ హింసను ఆపి మిమ్మల్ని ఒక ఫినిషర్ లాగా మార్చే ఆ మూడు ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ వన్ ద బ్రెయిన్ డంప్ మెథడ్ ని ఖాళీ చెయ్ నీ మెథడు ఒక స్టోరేజ్ డివైస్ కాదు అది ఒక ప్రాసెసింగ్ మెషిన్ నీ మైండ్ లో తిరుగుతున్న పెండింగ్ పనులు అన్నింటిని ఇప్పుడే ఒక పేపర్ మీద పెట్టు ఎప్పుడైతే నువ్వు పేపర్ మీద రాస్తావో నీ మెథడు దాన్ని ఒక టాస్క్ లా కాకుండా ఒక డేటా లాగా ఫీల్ అవుతుంది. మెదడుకి అది ఒక పెద్ద
(04:37) రిలీఫ్ అక్కడే సగం ప్రశాంతత దొరుకుతుంది. స్టెప్ టు ద ఫైవ్ మినిట్ రూల్ మెదడుని మోసం చెయ్. ఏదైనా పని మొదలు పెట్టడానికి బద్ధకంగా ఉంటే నేను పని మొత్తం చేయను జస్ట్ ఐదు నిమిషాలే చేస్తాను అని మీ బ్రెయిన్ కి అబద్ధం చెప్పండి. ఒక్కసారి ఆ ఐదు నిమిషాల లూప్ ఓపెన్ అయితే ఇక ఆ పని ముగించేదాకా జైగానిక్ ఎఫెక్ట్ మిమ్మల్ని వదలదు.
(05:02) పని సగంలో ఉంది కాబట్టి దాన్ని ముగించే వరకు నీ మెదడు నిన్ను వదలదు. అందుకే కేవలం ఐదు నిమిషాలు మాత్రమే చేస్తానని మీ మెథడ్ ని నమ్మించి పని మొదలు పెట్టండి. ఆ తర్వాత పని పూర్తి చేసేదాకా మీ బ్రెయిన్ మిమ్మల్ని నిద్రపోనివ్వదు. క్లోజ్ ద లూప్స్ నిర్దాక్షణంగా ముగించు చిన్న పనో పెద్ద పనో దాన్ని మధ్యలో వదలద్దు అది మీ గదిని సద్దడం కావచ్చు లేదా ఒక మెయిల్ పంపడం కావచ్చు దాన్ని ముగించి మీ మైండ్లో డన్ అని టిక్ కొట్టండి.
(05:27) ఆ ఒక్క టిక్ మార్క్ మీ మెదరికి ఇచ్చే డాప్మన్ కిక్ మిమ్మల్ని ఒక కాన్స్టెంట్ ఫినిషర్ గా మారుస్తుంది. దీన్నే టూ మినిట్ రూల్ అంటారు. ఒక పని పూర్తి చేయడానికి రెండు నిమిషాల కంటే తక్కువ టైం పడితే దాన్ని అస్సలు వాయిదా వేయకండి ఇప్పుడే చేసేయండి. చిన్న చిన్న లూప్స్ క్లోజ్ అయితే పెద్ద పనుల మీద ఫోకస్ పెరుగుతుంది. అండ్ మీ మెదడు బిల్ సెటిల్ అయిన వెయిటర్ లాగా ప్రశాంతంగా మారుతుంది.
(05:50) సగం వదిలేయడం బద్ధకం కాదు అది మన మెదరికి మనం ఇస్తున్న స్లో పాయిజన్ ఆ పాయిజన్ ఆపితే పనులన్నీ వాటంతట అవే క్లోజ్ అయిపోతాయి. వెంటనే ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. ఒకసారి ఆలోచిద్దాం మనం మధ్యలో వదిలేసిన ప్రతి పని మన భవిష్యత్తుకి మనం వేసుకుంటున్న సంకెల్ అది మన ఎనర్జీని పీల్ చేసే ఒక జలగ మనం మొదలుపెట్టి ఆపేసిన ఆ కోర్సు సగం చదివి వదిలేసిన పుస్తకం సగం రాసి వదిలేసిన ప్లాన్ ఇవన్నీ మన మెథడ్లో చెత్తగా పేరిగిపోయి మనల్ని అసలు ముందుకు సాగనివ్వట్లేదు.
(06:18) ఆ ఓపెన్ లూప్స్ అన్ని అలాగే వదిలేస్తే మన జీవితం కూడా సగం చదివిన కథలాగే మిగిలిపోతుంది. గుర్తుంచుకో ఈ ప్రపంచం మొదలెట్టిన వాళ్ళు కాదు పంతంతో పోరాడి ఆ పనిని ముగించిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాం. రన్నింగ్ రేస్ లో ఎవరు స్టార్టింగ్ లైన్ చూడరు. ఫినిషింగ్ లైన్ టచ్ చేసేవాడే విజేత. అర్ధాంతరంగా ఆపేయడం అలవాటు చేసుకోకూడదు. మనం పని మొదలు పెట్టామా దాన్ని ముగించి తీరాల్సిందే మన ఎనర్జీని కాపాడుకుందాం మన సంకల్పాన్ని నిరూపించుకుందాం.
(06:45) ఈ క్షణమే మన మెథడ్ లోని ఆ చెత్తని క్లియర్ చేద్దాం. ఈ వీడియో చూశాక మీరు చానాలుగా వాయిదా వేస్తూ ఆ పని చేయాలని అనుకుంటూ చేయలేకపోతూ ఈరోజే ఆ పనిని కచ్చితంగా ముగించాలి అనుకుంటున్న ఆ పనిఏంటో కామెంట్స్ లో టైప్ చేయండి. మన సంకల్పం ఏంటో లోకానికి తెలియాలి మనందరం కలిసి ఎదుగుదాం. ఈ కంటెంట్ లో వాల్యూ ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే మన తెలుగు మైండ్సెట్ లాబ్ కమ్యూనిటీలో చేరండి.
(07:08) థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్.
No comments:
Post a Comment