Sunday, April 12, 2026

మనసు ప్రశాంతంగా ఉండట్లేదా | The Secret to Master Your Mind & Life | Satyagrahi

మనసు ప్రశాంతంగా ఉండట్లేదా | The Secret to Master Your Mind & Life | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=A_yzeFrPwXk



Transcript:
(00:00) ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ మనసులో ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి బయట ప్రపంచంలో ఎవరో అన్న మాటకో ఆఫీస్ లో జరిగిన చిన్న గొడవకో లేదా ఇంట్లో ఎదురైన సమస్యకో మీరు ఎంతలా కుంగిపోతున్నారు నిజం చెప్పాలంటే మనలో చాలామంది ఒక రిమోట్ కంట్రోల్ లాంటి జీవితాన్ని గడుపుతున్నారు.
(00:22) ఆ రిమోట్ మీ చేతిలో లేదు అది మీ చుట్టూ ఉన్న మనుషుల చేతుల్లో మీ పరిస్థితుల చేతుల్లో ఉంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీరు ఆనంద పడతారు ఎవరైనా ఒక మాట అంటే చాలా రోజుల బాధపడతారు అంటే మీ సంతోషం మీ కంట్రోల్ లో లేదు బయట ప్రపంచం మార్చడం ఎప్పుడూ మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ మన లోపల ప్రపంచం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి.
(00:46) మీ మనసు ఒక అద్భుతమైన పరికరం కావాలి. కానీ దురదృష్టవశాత్తు అది మీకు వ్యతిరేకంగా పనిచేసే ఒక శత్రువులా మారిపోయింది. పరిస్థితులు బాలేవు మనుషులు నచ్చటం లేదు అదృష్టం కలిసి రావట్లేదని మనం ఇతరుల మీద నిందలు వేస్తూ కూర్చుంటే మన జీవితం ఒక విషవా వలయంలో చిక్కుకుపోతుంది. మీ లోపల జరుగుతున్న ఈ అలజడికి కారణం బయట ఉన్న పరిస్థితులు కాదు.
(01:09) ఆ పరిస్థితులను మీరు ఎలా స్వీకరిస్తున్నారు అనేదే అసలైన సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అని లోతుగా ఆలోచిస్తే ఒక చేతు నిజం కనిపించింది. మీ ఆనందం అనేది వేరే ఎవరో ఇచ్చే వస్తువు అని మీరు నమ్ముతున్నారు. మీ మనసులో ఒక భ్రమ ఉంది. అదేంటంటే నాకు నచ్చినట్లు పరిస్థితులు ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని. కానీ ప్రపంచం మీ ఇష్టానుసారం నడవదు కదా.
(01:32) ఎప్పుడైతే మీ ఆనందాన్ని ఇతరుల ప్రవర్తన మీదో బాహ్య విజయాల మీదో ఆధారపడేలా చేసుకుంటారో అప్పుడే మీరు మీ జీవితానికి బానిస అవుతారు. మీ శరీరం మీ మనసు మీకు అనుకూలంగా పని చేయడం లేదు. అది ఎందుకంటే మీ లోపల ఉన్న వ్యవస్థను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఒక కారు నడపడం తెలియకపోతే అది ఎలాగైతే ప్రమాదాలకు దారి తీస్తుందో మీ మనసుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే అది మీకు ఒత్తిడిని ఆందోళనని ఇస్తుంది.
(01:57) మనం బయట ప్రపంచాన్ని బాగు చేయడానికి అలాగే టెక్నాలజీని పెంచడానికి ఎంత సమయం కేటాయిస్తున్నామో మన లోపల ఉన్న ఇన్నర్ మెకానిజం ని అర్థం చేసుకోవడానికి అందులో 1% కూడా సమయం ఇవ్వడం లేదు. ఈ అజ్ఞానమే మనల్ని మనకి బానిసలుగా మారుస్తుంది. మీ ప్రాణం మీ భావోద్వేగాలు మీ కంట్రోల్ లో లేకపోవటమే అసలైన ప్రమాదం. మరి ఈ స్థితి నుండి బయటపడటం ఎలా దీనికి సమాధానమే ఇన్నర్ ఇంజనీరింగ్.
(02:25) ఒక బిల్డింగ్ ని కట్టడానికి ఎలాగైతే ప్లాన్ అవసరమో మీ జీవితాన్ని మీరు నచ్చినట్లు మలుచుకోవడానికి ఒక ఇంజనీరింగ్ అవసరం. మొదట మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆనందం అనేది ఎక్కడో దొరికే వస్తువు కాదు అది మీ లోపల ఉండే ఒక స్థితి మీ శరీరాన్ని మీ ప్రాణాన్ని మీ మనసుని ఒక క్రమ శిక్షణలో ఉంచుకుంటే ఆనందం అనేది ఒక సహజమైన ప్రక్రియగా మారిపోతుంది.
(02:49) దీనికోసం మీరు హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. సంసారాన్ని వదలక్కర్లేదు. కేవలం మీ దృక్పదాన్ని మార్చుకోవాలి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఒక బాధితుడిలా చూస్తున్నారా లేక ఒక క్రియేటర్ లా చూస్తున్నారా? మీ ఆలోచనలు మీకు సేవ చేయాలి తప్ప అవి మిమ్మల్ని శాసించకూడదు. మీ లోపల ఉన్న రసాయన వ్యవస్థ అంటే కెమిస్ట్రీ అంటారు కదా ఆనందమయంగా మార్చుకోవడం మీ బాధ్యత.
(03:13) ఎప్పుడైతే మీరు మీ లోపల ప్రశాంతంగా ఉంటారో అప్పుడు బయట ఉన్న తుఫాను కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు. సమస్యలు రావడం సహజం కానీ ఆ సమస్యల వల్ల బాధపడాలా లేదా వాటికి పరిష్కారం వెతకాలా అనేది మీ రెస్పాన్స్ కాబట్టి మీ రెస్పాన్స్ అనేది చాలా అవసరం. సరే ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే వాటికి కొన్ని మార్పులు చేసుకోవాలి.
(03:36) ఇది కేవలం మాటలతో వచ్చే మార్పు కాదు ఇది ఆచరణతో వచ్చే పరివర్తన మీ ఆహారం మీ నిద్ర మీ వ్యాయామం విషయంలో ఒక ఖచ్చితమైన క్రమ శిక్షణను పాటించండి. మీ శరీరం ఎంత చురుగ్గా ఉంటే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కొంత సమయం నిశశబ్దంగా గడపండి. మీ మనసులోకి వచ్చే ఆలోచనల్ని గమనించండి. వాటితో ఐడెంటిఫై అవ్వకండి. గుర్తుంచుకోండి మీరు మీ ఆలోచనలు కాదు.
(04:04) మీరు మీ భావోద్వేగాలు కాదు. మీరు వీటన్నిటికీ అతీతమైన ఒక చైతన్యం. మీరు మీ జీవితానికి ఒక ఇంజనీర్ లాంటివారు మీ లోపల శాంతిని ప్రేమని నిర్మించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఇతరులు మిమ్మల్ని ఏం చేసినా మీ లోపల మీరు ఎలా ఉండాలో అది కేవలం మీ నిర్ణయం మాత్రమే కావాలి. రేపు కాదు వచ్చే వరం కాదు ఇప్పుడే. ఈ క్షణమే మీ బాధ్యతని మీరు తీసుకోండి.
(04:29) మీరు మారితేనే మీ ప్రపంచం మారుతుంది. మీ జీవితం ఒక అద్భుతమైన కళాకాండం కావాలంటే ఆ శిల్పి మీరే కావాలి. నేటి నుంచి ఆ మార్పు మొదలు పెట్టండి. బాయ్

No comments:

Post a Comment