ఆత్మ జ్ఞానం ఎందుకు పొందాలి? | పరవస్తు వరదరాజన్ |
Author Name:Bhakthamrutham Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@BhakthamruthamTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=C-5cWITtQ0s
Transcript:
(00:00) నమస్కారం భక్తామృతం తెలుగు ప్రేక్షకులందరికీ మళ్ళీ స్వాగతం. మనం ఇంతకుముందు రెండు వీడియోల్లో నేను ఎవరు అనే ప్రశ్నకు ఆత్మ యొక్క స్వభావాలు ఏమిటి అనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానములను తెలుసుకున్నాం. నేను ఎవరు అంటే నేనొక జీవాత్మను అని మనం తెలుసుకున్నాం. ఆ జీవాత్మ అయినటువంటి నా స్వభావాలు ఏమిటి అంటే అణుత్వము జ్ఞానమయత్వము ఆనందమయత్వము శేషత్వము అంటే దాసత్వము ఇవే ఆత్మ స్వభావాలు అని కూడా తెలుసుకున్నాం మనం ఈ వీడియోలో ఇలా ఆత్మ గురించి తెలుసుకోవటం వల్ల కలిగే ఫలం ఏమిటి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం
(00:57) సాధారణంగా లోకంలో అందరూ తమను తాము దేహముగానే భావిస్తూ ఉంటారు. నేను ఈ దేహమే ఈ దేహం అనేది 70 ఏళ్లో 80 ఏళ్లో 90 ఏళ్లో ఉంటుంది అంతే ఇదే నా కాలము నా జీవిత కాలం ఇంతే అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవటం వల్ల కలిగేది ఏమిటి అంటే ఈ దేహంలో నేను సుఖపడితే చాలు అంటే ఈ 80 ఏళ్లో నేను సుఖంగా ఉంటే చాలు అనేటువంటి భావన కలుగుతుంది.
(01:31) అలా కలగటంలో తప్పేముంది అంటే లోకంలో మనం చూస్తున్నప్పుడు కొందరు ధర్మ మార్గంలో ఉంటూ కష్టపడే వాళ్ళను కూడా చూస్తాము. అధర్మ మార్గంలో ఉంటూ సుఖపడే వాళ్ళను కూడా చూస్తాము. ఇప్పుడు ఒకతను తనను తాను దేహం అనుకుంటున్నాడు అనుకోండి అధర్మాన్ని అనుష్టించే వాళ్ళు కూడా సుఖపడుతున్నారు ధర్మాన్ని అనుష్టించే వాళ్ళు బాధపడటాన్ని కూడా చూస్తున్నాము అలాంటప్పుడు నేను ఎందుకు ధర్మాన్ని మాత్రమే పాటించాలి ప్రశ్న వస్తుంది కదా అప్పుడే శాస్త్రాలు అన్నాయి అయ్యా నువ్వు ఈ దేహం మాత్రం కాదు నువ్వు ఒక ఆత్మవు నువ్వు పరిగ్రహించేటువంటి అనేక దేహాల్లో ఈ దేహము కూడా ఒకటి ఈనాడు నువ్వు చేసేటువంటి
(02:13) పుణ్య పాపములకు ఫలాన్ని ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో ఖచ్చితంగా అనుభవిస్తావు అని శాస్త్రాలు అంటున్నాయి. అప్పుడు ధర్మాచరణ చేయాలనేటువంటి ఆసక్తి కలగాలంటే మొదట ఆత్మ అస్తిత్వ జ్ఞానము ఏర్పడాలి ఆ జ్ఞానం లేకపోతే ఆ ఈ శరీరం 80 ఏళ్ళ ఉంటుందా 70 ఏళ్ళ ఉంటుందా 90 ఏళ్ళ ఉంటుందా అది ఎప్పటిదాకా ఉందో ధర్మాన్ని ఆచరిస్తూనో అధర్మాన్ని ఆచరిస్తూనో ఎలాగో జీవితాన్ని గడిపేస్తే చాలు కదా అని అనిపిస్తుంది అన్నమాట ఆ పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి ఎలాగో అలా తప్పించుకుంటే చాలు మనమేమో తప్పులు చేస్తూ కూడా సుఖపడితే తప్పేముంది అని అనిపిస్తుంది అన్నమాట చివరికి ఈ
(02:58) శరీరంలో సుఖపడితే చాలు అనే కదా వాళ్ళక భావన ఉంటుంది. అందుకని ధర్మ మార్గంలో నడవాలి అంటే కచ్చితంగా ఆత్మజ్ఞానము కావాలి. నేను ఈరోజు చేసేటువంటి ఆ ధర్మము ఈరోజు ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ జన్మలో ఫలితాన్ని ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అనేటువంటి విశ్వాసం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆత్మజ్ఞానం కలిగితేనే ఏర్పడుతుంది. అసలు దేహమే నేనైతే ఈ దేహం నశిస్తున్నప్పుడు నేను నశించిపోతానయితే నేను చేసినటువంటి మంచి కార్యాలకు ఎప్పుడు ఫలితం తక్కుతుంది అంటే దానికి జవాబు ఉండదు అందుకని ఆత్మజ్ఞానం పొందితేనే ధర్మాచరణ ఏర్పడుతుంది కాబట్టి ఆత్మజ్ఞాన ఫలం ఏమిటి
(03:40) అంటే ధర్మాచరణ అని చెప్పవచ్చును ఇది ముఖ్యమైన ఒక విషయం ఇది అందరికీ సమానం అన్నమాట ఏ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళైనా సరే సనాత నాతన ధర్మంలో ఉన్నటువంటి సంప్రదాయాలను పాటించే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు దేహము కన్నా భిన్నమైనటువంటి ఆత్మ ఉన్నది అనేటువంటి జ్ఞానం కలిగితేనే ధర్మాచరణ దృఢంగా ఏర్పడుతుంది ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు.
(04:11) దీని తరువాత మరొక విషయం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రామానుజ సంప్రదాయంలో ఆత్మ స్వభావాల్లో అతి ముఖ్యమైన స్వభావము శేషత్వము అని చెప్పబడుతుంది. మనం ఎందుకోసం ఉన్నాం ఎవరికోసం ఉన్నామ అంటే భగవంతుని కోసం ఉన్నాము మనమందరం కూడా భగవంతునికి దాసులము ఆ స్వభావాన్నే శేషత్వము దాసత్వము అని అంటూ ఉంటారు. అటువంటి ఆ శేషత్వ స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటేనే దాని తరువాత వేయవలసిన అడుగులను మనం వేయవచ్చును.
(04:43) ఎప్పుడూ కూడా మొదటి ప్రశ్న ఏంటి నేను ఎవరు నా స్వభావాలు ఏమిటి? దాన్ని తెలుసుకుంటేనే దానికి తగిన ఒక లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోవచ్చును దానికి తగిన ఉపాయాన్ని మనం అనుష్టించవచ్చును అప్పుడు ఆ ఆత్మ స్వభావాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యము అప్పుడే మనకు పురుషార్థం ఏమిటి ఆ పురుషార్థాన్ని మనం ఎలా పొందగలుగుతాము అనేటువంటి ఆలోచనలు ఏర్పడతాయి అన్నమాట అందుకని శేషత్వాన్ని తెలుసుకుంటే దానికి తగిన లక్ష్య నిర్ణయం చేసుకుంటాం ఆ లక్ష్య నిర్ణయాన్ని చేసుకున్న తరువాత దానికి తగిన ఉపాయానుష్టానం చేస్తాం అప్పుడు ఆ ఆత్మ స్వభావాన్ని తెలుసుకోవటం మోక్షాన్ని
(05:26) పొందటంలో మొదటి అడుగు అందుకని ఆత్మజ్ఞాన ఫలం ఏమిటి అని అడిగితే రెండు అని చెప్పవచ్చును ఇంకఎన్నో ఉన్నాయి కానీ ముఖ్యంగా ఇవి రెండు ఒకటి ఆత్మజ్ఞానం వల్ల ధర్మాచరణ దృఢమం అవుతుంది. రెండోది ఆత్మజ్ఞానము ఆత్మ స్వభావ జ్ఞానము అనేది మోక్ష మార్గంలో ప్రయాణించటానికి మొదటి అడుగు సరే అయితే మనం క్రిందటి రెండు వీడియోలో నేను జీవాత్మను భగవంతునికి దాసుడను అని తెలుసుకున్నాము అలా తెలుసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే ఒకటి ధర్మాచరణ మరొకటి మోక్ష మార్గంలో ప్రవేశించుట అనేది అనేది అలా
(06:13) మనము తెలుసుకున్నాం ఈరోజు మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా శ్రీమతే రామానుజాయ నమః
No comments:
Post a Comment