Sunday, April 12, 2026

 కాలంలా కదిలి వెళ్లే 
పాలమబ్బుల గుంపులు 
తేలితేలి హాయిగా 
గమ్యం వైపు పరుగులు..

శూన్యమైన  గగనంలో 
జీవం నింపే జలదాలు 
వేగంగా సాగుతుంటే 
రారమ్మని పిలిచే గిరిశిఖరాలు

నీలం నిండిన నింగిలో 
తెల్లగా మెరిసే మొయిళ్ళు 
వనంలో స్వేచ్ఛగా ఆడే 
అందమైన నెమళ్ళు

వలపు హృదయాల బాధ 
తెలుపు సాధనముగా 
పిలుపు విని వెంటనే 
కబురు తెచ్చు  సఖులు

పరుపు మీద పాకుతున్న 
పసిపిల్లల చందాన 
అల నీలి నింగిలో 
తారాడు వెండి జిలుగులు

తొలగు చీకటి ఛాయల్లో 
వెలుగు పువ్వు రాకకు 
బహుపరాకులు  పలుకుతూ 
స్వాగతించు  మేఘమాలలకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment