Sunday, April 12, 2026

నువ్వు చూసేదంతా నిజమేనా? | Nagna Satyam Telugu Podcast

నువ్వు చూసేదంతా నిజమేనా? | Nagna Satyam Telugu Podcast

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=52YW0j2KV_E



Transcript:
(00:00) నువ్వు ఒక అగాధమైన చీకటి గదిలో ఉన్నావు. నీ చేతిలో ఒక చిన్న దీపం ఉంది. ఆ దీపం వెలుగులో నీకు కనిపించే వస్తువులే నిజమని నువ్వు నమ్ముతావు. కానీ ఒకవేళ ఆ దీపం ఆరిపోతే అప్పుడు నీ కళ్ళకు కనిపించన నిజం ఏమైపోతుంది? షేక్స్పియర్ ఇక్కడే సరిగ్గా అదే పాయింట్ పట్టుకున్నాడు. మనిషి జ్ఞానం అనేది ఆ చిన్న దీపం లాంటిది.
(00:27) మనం దేన్నైతే నిరూపితమైన సత్యం అని గర్వంగా చెప్పుకుంటామో [సంగీతం] అది కేవలం మన పరిమితులకు లోబడిన నిజం మాత్రమే. ఉదాహరణకు ఈ విశ్వంలో అత్యంత స్థిరమైనది ఏది అని అడిగితే మనం నక్షత్రాలు అంటాం. అవి కోట్లాది ఏళ్లుగా అక్కడే ఉన్నాయి మండుతున్నాయి గనుక చెప్తున్నాం. కానీ సైన్స్ ఏం చెబుతుందో తెలుసా? మనం ఇప్పుడు చూస్తున్న నక్షత్రం అసలు అక్కడ లేకపోవచ్చు.
(00:52) అది ఎప్పుడో కోట్లాది ఏళ్ల క్రితం పేలిపోయి ఉండవచ్చు. కానీ దాని కాంతి మనల్ని చేరడానికి ఇన్నేళ్ళు పట్టింది కాబట్టి మనక అది అక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ మహా నిజం కూడా ఒక భ్రమే ఇక్కడ నీ కళ్ళే నిన్ను మోసం చేస్తున్నాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పడమరణ అస్తమిస్తున్నాడని మనం రోజు చూస్తాం.
(01:16) అది నీ కళ్ళకు కనిపించే పచ్చి నిజం కానీ వాస్తవానికి సూర్యుడు [సంగీతం] ఎక్కడికి కదలడు కదిలేది భూమి మాత్రమే సో ఇక్కడ కూడా నీ ఇంద్రియాలు నిన్ను మోసం చేశాయి. ఇక మూడవది నిజం అబద్ధం కావడం ఇది వినడానికి పిచ్చిగా అనిపించవచ్చు కానీ మానవ చరిత్ర అంతా ఇదే ఒకప్పుడు భూమి ఫ్లాట్ గా ఉందని నమ్మడమే పరమ సత్యం. అలా కాదన్న వాడిని చంపేసేవారు లేదా గుంపులో వాగితే పిచ్చినా కొడక అని ఉమ్మేసేవారు.
(01:42) కానీ కాలం గడిచాక ఆ నిజం అబద్ధమైపోయింది. అంటే మనం నమ్మే నిజం అనేది కూడా కాలానికి బానిసే మరి ఏది శాశ్వతం ఏది ప్రశ్నకు అతీతం ఇక్కడే షేక్స్పియర్ ఒక మనిషిలోని ప్రేమను లేదా ఒక గాఢమైన భావోద్వేగాన్ని తీసుకొచ్చి ఈ విశ్వం కంటే పైన పెట్టాడు. ఎందుకంటే బయట ఉన్న ప్రపంచం మనకు కళ్ళ ద్వారా చెవుల ద్వారా అర్థమవుతుంది. ఆ కళ్ళు చెవులు మనల్ని మోసం చేయగలవు.
(02:10) కానీ లోపల ఉండే అనుభూతికి ఇంద్రియాలతో సంబంధం లేదు. అది మన సోల్ కి సంబంధించిన విషయం. మీరు చూస్తే ఒక తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. రేపు పొద్దున సైన్స్ వచ్చి అసలు ఈ విశ్వమంతా ఒక సిములేషన్ నీ బిడ్డ కేవలం కొన్ని ఆటమ్స్ కలయక మాత్రమే నీ ప్రేమ కేవలం నీ మెదడులో విడుదలయ్యే కొన్ని కెమికల్ రియాక్షన్ మాత్రమే అని నిరూపించినా ఆ తల్లి తన ప్రేమను అనుమానిస్తుందా? లోకమంతా అది అబద్ధమని అరిచినా ఆ తల్లికి తన బిడ్డ మీద ఉన్న ప్రేమ మాత్రమే పరమ సత్యం. అక్కడ లాజిక్ చచ్చిపోతుంది.
(02:41) సైన్స్ ఓడిపోతుంది. సత్యం తల వంచుకుంటుంది. షేక్స్పియర్ చెప్పాలనుకున్నది కూడా అదే హామ్లెట్ కథలో హీరో తన ప్రేయసి ఒఫీలియాతో ఇలా అంటాడు ఒఫీలియా రేపు పొద్దున ఈ నక్షత్రాలు ఆరిపోవచ్చు సూర్యుడు తన దారి మార్చుకోవచ్చు. మనం నమ్మే సిద్ధాంతాలన్నీ తలకిందులు కావచ్చు. చివరకు నిజం అనే పదానికే అర్థం మారిపోవచ్చు. కానీ నాలో నీ పట్ల ఉన్న ఈ తపన ఈ ఆర్తి ఈ ప్రేమ ఉన్నాయి చూడు అవి ఈ విశ్వం పుట్టక ముందు ఉన్నాయి.
(03:10) ఈ విశ్వం అంతమైనా ఉంటాయి. ఎందుకంటే అవి కంటికి కనిపించనివి కావు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. మనం ప్రేమించే మనుషులు మారిపోతారు. మన నమ్మకాలు మారిపోతాయి. మనం ఈ సమాజం మారిపోతుంది. ఈ అన్సర్టన్ వరల్డ్ లో మనిషికి ఏదో ఒక స్థిరమైన ఆధారం కావాలి. ఆ ఆధారమే ప్రేమ. నువ్వు ఒక మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నావో లాజిక్ గా వివరించగలిగితే అది వ్యాపారం అవుతుంది కానీ ప్రేమ అవ్వదు.
(03:39) ప్రేమ అనేది వివరణకు అందని ఒకానొక స్థితి. రేపు పొద్దున ఈ కనిపించే దీపం ఆరిపోవచ్చు నీ కళ్ళ ముందున్న ప్రపంచం మాయం కావచ్చు కానీ ఆ చీకటి అగాధంలో కూడా నిన్ను నడిపించేది నీలో మిగిలిన ఆ అనుభూతి మాత్రమే. అందుకే షేక్స్పియర్ దృష్టిలో సత్యం కోసం వెతికితే వాస్తవాలు దొరుకుతాయి. కానీ ప్రేమిస్తేనే జీవితం దొరుకుతుంది. లోకం నిన్ను మోసం చేసినా పర్లేదు కానీ నీ అంతరాత్మని మాత్రం అనుమానించకు ఎందుకంటే మారే ఈ ప్రపంచంలో మారని ఏకైక నగ్న సత్యం అదే

No comments:

Post a Comment