Motivation Is a Lie | Why Discipline Beats Motivation Every Time (Telugu Mindset Lab)
Author Name:Telugu Mindset Lab
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguMindsetLab
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WubDO-DwM4Y
Transcript:
(00:05) రాత్రి 12 గంటలకి ఫోన్ లో ఒక పవర్ఫుల్ మోటివేషన్ వీడియో చూశారు. లోపల రక్తం ఉడికిపోతుంది. రేపటి నుండి నా లైఫ్ మారిపోవాలి ఐదు గంటలకే లేవాలి గంటలు గంటలు చదవాలి అని ఫిక్స్ అయ్యారు. కానీ ఉదయం ఐదు గంటలకు అల్లారం మోగ్గానే ఆ రక్తం గడ్డగడ్డకుపోతుంది. ఇంకో ఐదు నిమిషాలు పడుకుందాంలే అని అలారం తీసేసి పడుకుంటారు. మై డియర్ ఛాంపియన్ ఇది నీ ఒక్కడి సమస్య కాదు మనందరం పడే ట్రాప్ే ఇది ఎందుకు ఆ రాత్రి ఉన్న మోటివేషన్ ఉదయం ఉండదు ఎందుకు మోటివేషన్ే నమ్మి బరిలోకి దిగితే దెబ్బ తింటాం.
(00:38) నమస్కారం ఇది తెలుగు మైండ్సెట్ లాబ్ ఈరోజు వీడియోలో మోటివేషన్ వెనకుఉన్న అసలు మాయ ఏంటి? అసలైన సక్సెస్ కి కావలసిన డిసిప్లిన్ ని మనం ఎలా బిల్డ్ అప్ చేసుకోవాలి అని డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నిజానికి మోటివేషన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది దాన్ని గీస్తే వెలుగుతుంది వేడినిస్తుంది కానీ కేవలం కొద్ది సెకండ్లు మాత్రమే మీరు ఒక మోటివేషన్ వీడియో చూసినప్పుడు మీ మెథడ్ లోని డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది.
(01:02) అది మీకు ఒక హై ఇచ్చేస్తుంది ఇన్స్టెంట్ గా మీరు ఆ పని చేసేసినంత సుఖాన్ని ఇస్తుంది. కానీ ఆ డోపమైన్ తగ్గిపోగానే మీ మోటివేషన్ ఆవిరైపోతుంది. మీరు మోటివేషన్ మీద ఆధారపడితే ఆ వీడియో చూసినప్పుడు మాత్రమే పని చేస్తారు. లేదంటే మిగతా టైం అంతా ఖాళీగా కూర్చుంటారు. మరి సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మూడ్ తో సంబంధం లేకుండా పని చేస్తారు. దాన్నే డిసిప్లిన్ అంటారు.
(01:25) ఫ్రెండ్స్ మోటివేషన్ కి డిసిప్లిన్ కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలంటే మీరు పాబ్లో అండ్ బ్రూనో అనే ఇద్దరు స్నేహితుల కథ వినాలి. ఒక ఊర్లో వీళ్ళద్దరూ కొండ మీద నుంచి నీళ్లు తెచ్చి ఊర్లో అమ్ముతుంటారు. బ్రూనో అనే వ్యక్తి చాలా మోటివేటెడ్ పర్సన్ ప్రతిరోజు పెద్ద పెద్ద బకెట్లు పట్టుకొని ఎక్కువసార్లు కొండెక్కి దిగుతూ చాలా డబ్బులు సంపాదించేవాడు.
(01:46) అతనికి ఆ రోజు వచ్చే ఆదాయమే మోటివేషన్ కానీ పాబ్లో ఆలోచన వేరు అతను కొన్ని గంటలు మాత్రమే బకెట్లతో నీళ్లు మోసి మిగిలిన టైం అంతా ఒక పైప్లైన్ తవ్వడం కోసం కేటాయించాడు. ఊరిజనం అంతా అతన్ని చూసి నవ్వుకున్నారు బ్రూనో చూడు ఎన్ని బకెట్లు నీళ్లు తెచ్చి మోసి డబ్బులు సంపాదిస్తున్నాడో నువ్వేంటి పిచ్చివాడిలాగా తవ్వుకుంటూ కూర్చుంటున్నావ అని చెప్పేసి తన్ని వెక్కరించారు.
(02:07) ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా బ్రూనో కి ఆ రోజు డబ్బు రావాలంటే ఆ రోజు బకెట్ మోయాలి. అతని ఒంట్లో బాగోకపోయినా మూడు లేకపోయినా బకెట్ మోస్తేనే అతనికి ఆరోజు డబ్బు వస్తుంది. మనం కూడా వీడియో చూసినప్పుడు మనకు ఊపు వస్తుంది. వీడియో చూడకపోతే నీరసం వచ్చేస్తుంది. అదే పాబ్లో ఇతను డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే తక్షణం లాభం ఆశించకపోవడం అన్న ఒక కాన్సెప్ట్ ని నమ్మాడు.
(02:34) అంటే ఈరోజు కష్టపడితే ఈరోజే రిజల్ట్ రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఒక సిస్టం తయారవుతుంది. రెండేళ్ల తర్వాత ప్యాబ్ లో పైప్లైన్ పూర్తయింది. ఇప్పుడు ప్యాబ్ లో పడుకున్న తిన్న స్నానం చేసిన ఆ కొండ మీద నుంచి నీళ్లు పైప్లైన్ ద్వారా ఊర్లోకి వస్తూనే ఉన్నాయి అతనికి డబ్బులు రావడం ఆగలేదు. సో డిసిప్లిన్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మీ జీవితంలో బకెట్లు మోయడం ఆపేసి ఆ పైప్లైన్ నిర్మించడం మీరు వర్కవుట్ చేసినా చదివిన బిజినెస్ చేసినా మొదట్లో రిజల్ట్ రాదు ఆ టైంలో మీ చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతారు కానీ మీరు ఆ పైప్లైన్ తవ్వడం ఆపకూడదు ఎందుకంటే ఒక్కసారి మీ డిసిప్లిన్ పైప్లైన్
(03:09) పూర్తయితే రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వాటంతట అవే వస్తాయి. ఈరోజు వేసిన విత్తనం ఈరోజే పండువ్వదు మై డియర్ ఛాంపియన్ దానికి టైం పడుతుంది ఆ టైం ఇచ్చే ఓపికే డిసిప్లిన్ మీరు మోటివేషన్ అనే బకెట్లు మోసే బ్రూనోలా ఉంటారా లేదంటే డిసిప్లిన్ నిర్మించే పాబ్లో అవుతారా ఆ నిర్ణయం మీదే మై డియర్ ఛాంపియన్స్ మన కళ్ళ ముందున్న అతి పెద్ద డిసిప్లిన్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా మన రైతు ఒక రైతు పొలంలో విత్తనం వేసిన తర్వాత అది మొలకెత్తడానికి కొన్ని రోజులు పడుతుంది.
(03:41) ఆ విత్తనం లోపల ఏం జరుగుతుందో మనకు కనబడదు కానీ రైతుకి తెలుసు ఆ విత్తనం లోపల ప్రాణం ఉందని ఆ విత్తనం మొలకెత్తకపోయినా ఎండలు మండిపోతున్న వానలు లేకపోయినా రైతు ప్రతిరోజు పొలానికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు ఆ రోజు అతనికి పంట రాదని అతనికి తెలుసు కానీ ప్రతిరోజు నీళ్లు పెట్టడం కలుపు తీయడం అనే డిసిప్లిన్ అతను పాటిస్తేనే ఒకరోజు ఆ ఫలం పచ్చగా మారుతుందని అతని నమ్మకం.
(04:03) ఇక్కడే మనం పొరపాటు చేస్తాం మనం ఒకటి రెండు రోజులు చదివి మూడో రోజు ఫలితం కనబడకపోతే నా వల్ల కావట్లేదు నాకు మోటివేషన్ లేదు అని వదిలేస్తాం కానీ రైతు అలా అంటాడా ఈరోజు నాకు మూడు లేదు ఈరోజు నేను పొలానికి నీళ్లు పెట్టను అని రైతు అనుకుంటే ఆ పంట ఎండిపోతుంది రైతుకి మోటివేషన్ అక్కర్లేదు అతనికి ఉన్నది డిసిప్లిన్ తన మూడ్తో సంబంధం లేకుండా తన కష్టానికి వెంటనే ఫలితం రాదని తెలిసినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు డిసిప్లిన్ అంటే ఇదే ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మనక ఏమ అక్కర్లేదు రేపు రాబోయే ఫలితం కోసం ఈరోజు నిశశబ్దంగా కష్టపడడమే అసలైన క్రమశిక్షణ. ఇక పైప్లైన్
(04:39) విషయానికి వస్తే చాలా మంది రైతులు మొదట్లో కష్టపడి కాలవలు తవ్వుతారు లేదా పైపులు వేస్తారు. ఆ పైపులు వేసినప్పుడు వాళ్ళకి ఒక్క చుక్క నీరు కూడా రాదు. కానీ ఆ నెట్వర్క్ మొత్తం పూర్తయిన రోజున జస్ట్ ఒక స్విచ్ చేస్తే చాలు ఎకరాల పొలం తడుస్తుంది. మీరు నేర్చుకునే స్కిల్స్ మీరు పడుతున్న కష్టం ఇవన్నీ ఇప్పుడు ఆ పైపులు వేయడం లాంటిదే కనెక్షన్ పూర్తఅయినంత వరకు కాస్త ఓపిక పట్టండి ఆ రోజు వచ్చినప్పుడు మీ సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది ఎవరు ఆపలేరు అయితే మరి ఈ డిసిప్లిన్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం సిద్ధాంతాలు మాట్లాడుకున్నాం.
(05:06) కానీ రేపు ఉదయం 5ు గంటలకి ఆ యుద్ధం మొదలైనప్పుడు మనకు కావాల్సినవి సిద్ధాంతాలు కాదు ప్రాక్టికల్ వెపన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే మూడు టిఎంఎల్ హాక్స్ అంటే మీ జీవితాన్ని మార్చే మూడు సులభమైన సూత్రాలు వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ది ఫైవ్ సెకండ్ రూల్ మెల్ రాబిన్స్ అనే రచిత్రి ఒక అద్భుతమైన విషయం చెప్పారు.
(05:28) మన మెదడికి ఏదైనా కొత్త పని చేయాలంటే భయం మీరు బెడ్ మీద నుంచి లేవాలి అని అనుకుంటున్నప్పుడు మీ మెదడు వెంటనే వద్దు చలిగా ఉంది ఇంకో ఐదు నిమిషాలు పడుకో అని 100 కారణాలు వెతుకుతుంది. ఇక్కడే మీరు దఫైవ్ సెకండ్ రూల్ ని పాటించాలి అంటే 5 4త 2వ అని రివర్స్ కౌంటింగ్ చేయాలి. ఎందుకు రివర్స్ ఎందుకంటే 1 2త 4ఫ అంటే మన మెదర్ కి అలవాటు అది ఆపదు కానీ 5ఫతటవ అన్నప్పుడు మీ మెదర్ లోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే నిర్ణయాలు తీసుకునే భాగం యాక్టివేట్ అవుతుంది ఆ వన్ అనగానే మీరు రాకెట్ లాగా బెడ్ మీద నుంచి ఆటోమేటిక్ గా దోకాలి చాలామంది నేను బరువు తగ్గాలి లేదా నేను చదవాలి అని గోల్స్ పెట్టుకుంటారు ఇది
(06:08) మోటివేషన్ కానీ డిసిప్లిన్ రావాలంటే మీరు మీ ఐడెంటిటీని మార్చుకోవాలి నేను వర్కవుట్ చేయాలి అని అనుకోవద్దు నేను ఒక ఎత్లెట్ ని అని అనుకో ఎవరైనా నీకు సమోసా ఆఫర్ చేసినప్పుడు నేను డైట్ లో ఉన్నాను అది తినకూడదు అని నీ మనసుని ఆపుకోవద్దు. అలా అంటే నీ మెదరికి అది ఒక శిక్ష అని ఫీల్ అవుతుంది. దానికి బదులుగా నేను నా ఆరోగ్యాన్ని ప్రేమించే వ్యక్తిని జంక్ ఫుడ్ నా బాడీకి సెట్ అవ్వదు అని గర్వంగా చెప్పు నీ ఐడెంటిటీ మారితే ఆ సమోసా నీకు ఒక శత్రువులా కనిపిస్తుంది.
(06:36) మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచించుకునే విధానాన్ని మార్చుకుంటారో అప్పుడు డిసిప్లిన్ అనేది కష్టం కాదు. అది మీ నాచురల్ క్యారెక్టర్ అది మీ సహజ స్వభావం అయిపోతుంది. మనందరం మన విల్ పవర్ మీద చాలా ఎక్కువ ఆధారపడతాం. కానీ నిజానికి విల్ పవర్ అంటే ఒక ఫోన్ బ్యాటరీ లాంటిది అది సాయంత్రాని కల కంప్లీట్ గా డిస్చార్జ్ అయిపోతుంది.
(06:56) అందుకే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి. ఉదయం జిమ్ కి వెళ్ళాలంటే మీ షూస్ అండ్ మీ డ్రెస్ రాత్రే మీ పక్కన పెట్టుకోండి. చదువుకోవాలంటే మీ ఫోన్ ని పక్క గదిలో పెట్టి తాళం వేసి వచ్చి అప్ప కూర్చొని చదువుకోండి. కష్టమైన పనిని సులభం చేయండి. సులభమైన చెడ్డ పనిని ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చూడడం లాంటిది కష్టం చేయండి.
(07:14) డిసిప్లిన్ అంటే మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం కాదు. ఫ్రెండ్స్ అసలు డిసిప్లిన్ అనది మన మెథడ్ లో ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం. మన మెథడ్లో బాసల్ గాంగ్లియా అనే ఒక చిన్న విభాగం ఉంటుంది. అది ఆటో పైలట్ లాగా పనిచేస్తుంది. మీరు మొదటిసారి కారు నడపడం నేర్చుకున్నప్పుడు క్లచ్ ఎక్కడఉంది బ్రేక్ ఎక్కడఉంది అని కంగారుపడుతూ కాన్షియస్ గా డ్రైవ్ చేస్తారు.
(07:36) అప్పుడు మీ మెదడులోని పై భాగంలో ఉన్న ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పనిచేస్తుంది. అదే చాలా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మీకు బాగా అలవాట అయిన తర్వాత అది మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ సరదాగా ఇవన్నీ కాన్షియస్ గా కాకుండానే డ్రైవ్ చేస్తూఉంటారు. అప్పుడు మన బాసల్ గాంగ్ టేక్వర్ చేస్తుంది డిసిప్లిన్ అంటే ఇదే మీరు ఒక పనిని 21 డేస్ నుంచి 60 డేస్ వరకు కన్సిస్టెంట్ గా చేస్తే అది మీ బాసల్ గాంగ్లీ లో స్టోర్ అయిపోతుంది అంటే ఆ పని చేయడానికి ఇంకా మీకు మోటివేషన్ అవసరం లేదు అంటే అది మీరు బ్రష్ చేసినంత ఈజీ అయిపోతుంది బ్రష్ చేయడానికి మనక ఏ మోటివేషన్ అవసరం లేదు
(08:10) ఆటోమేటిక్ గా చేసేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మన మెథడ్ కి మనం ఒక సిస్టం అలవాటు చేస్తున్నాం. సో డియర్ ఛాంపియన్స్ మనం మోటివేషన్ ని నమ్మొద్దు మోటివేషన్ మీద ఆధారపడొద్దు అది మనల్ని నడి రోడ్డు మీద వదిలేస్తుంది. మనం డిసిప్లిన్ ని నమ్ముదాం అది కాస్త కష్టమైనా మనని శిఖరాన్ని చేరుస్తుంది. మై డియర్ ఛాంపియన్ చివరిగా ఒక్క మాట ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నా లేకపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నా లేదా నీ మీద నీకే నమ్మకం లేకున్నా పరిస్థితి ఎలాంటిది ఉన్నా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక్కటి మాత్రం
(08:43) గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో నీ తలరాతిని మార్చే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది. ఆ శక్తి పేరు డిసిప్లిన్ మోటివేషన్ కాదు మోటివేషన్ అనేది ఒక అతిథి లాంటిది వస్తుంది వెళ్ళిపోతుంది కానీ డిసిప్లిన్ అనేది నీ నీడ లాంటిది అది ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నువ్వు నడిచినా పడినా లేచినా అది నీతోనే ఉంటుంది. నువ్వు నీ మీద పెట్టుకున్న నమ్మకానికి గుర్తుగా ఈరోజు ఒక చిన్న పని మొదలు పెట్టు అది నీ పైప్లైన్ కి ఆరంభం కావాలి.
(09:13) ఎందుకంటే ఒక రైతు తన విత్తనం మీద పెట్టుకున్న నమ్మకమే రేపటి పచ్చని పొలం. అలాగే నీ భవిష్యత్తు మీద నువ్వు పెట్టుకున్న నమ్మకమే డిసిప్లిన్ రేపు పొద్దున నీకు వచ్చే గ్రాండ్ సక్సెస్ నీ ప్రయాణంలో తోడగా ఈ తెలుగు మైండ్సెట్ ల్యాబ్ నీతో ఎప్పటికీ ఉంటుంది. మై డియర్ ఛాంపియన్ మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఒకే విధంగా ఆలోచించేలా చేస్తుంది.
(09:32) కానీ మన తెలుగు మైండ్సెట్ ల్యాబ్ లో మనం మన మెదడుని గెలిచే రహస్యాలను డీకోడ్ చేస్తాం. ఇప్పటివరకు నువ్వు చూసింది కేవలం ఆరంభం మాత్రమే. నీ ఆలోచనా విధానాన్ని మార్చి నిన్ను ఒక సూపర్ హ్యూమన్ లాగా మార్చే అద్భుతమైన నాలెడ్జ్ ఇంకా ముందుంది. మై డియర్ ఛాంపియన్ నీ లైఫ్ లో ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉంటే మన తెలుగు మైండ్సెట్ లాబ్ టిఎంఎల్ కమ్యూనిటీలో చేరిపో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో ఈ కంటెంట్ నిజంగా నీకు నచ్చినట్టయితే వాల్యూ ఉంది అని నీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ చేసి నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చే ఎందుకంటే మనం మారదాం మారుద్దాం. నమస్కారం
(10:08) జై హింద్ జై భారత్ [సంగీతం]
No comments:
Post a Comment