Monday, April 13, 2026

ఇంకా పసిపిల్లల్లా ఎంతకాలం ఏడుస్తారు | Stop Living Like a Helpless Child | Satyagrahi

ఇంకా పసిపిల్లల్లా ఎంతకాలం ఏడుస్తారు | Stop Living Like a Helpless Child | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ewpVhWd0e1w



Transcript:
(00:00) ఈరోజు మీతో చాలా సూటిగా కాస్త కఠినంగా అనిపించినా సరే నిజాలు మాట్లాడుకుందాం. ఒకసారి మీరు రోజు చేసే పూజలు లేదా మీ ఆలోచనల్ని గమనించండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా లేదా ఒంటరిగా కూర్చొని ఆలోచించినా మన మనసులో ఉండేవి ఏంటి నాకు అప్పులు ఉన్నాయి తీరిపోవాలి నాకు పెళ్లి కావాలి నాకు మంచి ఉద్యోగం రావాలి. నా శత్రువులు అనే వాళ్ళు అందరూ నశించిపోవాలి.
(00:23) చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మనం భక్తి పేరుతోనో లేదా సమస్యల పేరుతోనో దేవుడిని ఒక బిచ్చగా వెళ్లే అడుక్కుంటున్నాం అనిపించట్లేదా వివేకానంద స్వామి గారు ఒక మాట అనేవారు శక్తిహీనతే మరణం అని కానీ మనం రోజువారి బతుకు పోరాటంలో ఆ శక్తిని ఎక్కడో పక్కన పెట్టేసి కేవలం మన వ్యక్తిగత అవసరాల చుట్టూ తిరుగుతున్నాం.
(00:44) మన సమస్య ఏంటో తెలుసా మనకి వయసు పెరుగుతుంది కానీ మన మనస్తత్వం మాత్రం ఇంకా పసిపిల్లల దగ్గరే ఆగిపోయింది. పసిపిల్లవాడు ప్రతి చిన్న విషయానికి ఎలాగైతే ఏడుస్తూ అమ్మ మీద పడతాడో మనం కూడా మన జీవిత బాధ్యతను తీసుకోలేక ప్రతి చిన్న సమస్యకి భయపడుతూ ఎవరో వచ్చి మనల్ని రక్షించాలని కోరుకుంటాం. ఈ భయమే మనల్ని బానిసలుగా మారుస్తుంది. మధ్య తరగతి జీవితాల్లో అప్పులు, కుటుంబ గొడవలు, చిన్నపాటి అసంతృప్తులు సహజం.
(01:11) కానీ వాటినే ప్రపంచం అనుకొని వాటి చుట్టూ ప్రదక్షణలు చేస్తూ మీలో ఉన్న అనంతమైన శక్తిని మీరు చంపేసుకుంటున్నారు. మీరు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరాలు అంటే ఏ మనిషిని భగవంతుడు ఈ భూమి మీదకి కారణం లేకుండా పంపించడు సో అలాంటప్పుడు చిన్న చిన్న కష్టాలకి కుంగిపోతుంటే అది మీలోని ఆ దైవత్వాన్ని అవమానించినట్లే కదా ఈ బలహీనత మనలో ఎందుకు వస్తుంది ఎందుకంటే మనల్ని మనం తక్కువ అంచన వేసుకుంటున్నాం స్వామి వివేకానంద గారు ఎప్పుడు ఒక సింహం కథ చెప్పేవారు గొర్రెల మందలో పెరిగిన సింహం తాను కూడా గొర్రెనే అనుకుంటూ భయపడుతుందంట మనం కూడా అంతే ఈ సమాజం మన చుట్టూ ఉన్న పరి పరిస్థితులోను
(01:48) మనకి ఏం నేర్పయాయి అంటే నువ్వు సామాన్యుడివి నీ పరిధి ఇంతే నువ్వు భయపడాలి అని నిజానికి మన సమస్య అప్పులు కాదండి ఆ అప్పులను చూసి వనికిపోవడమే మన బలహీనమైన మనసు మన సమస్య ఉద్యోగం లేకపోవడం కాదు మన మీద మనకి నమ్మకం లేకపోవడం మనం భక్తిని కేవలం ఒక వ్యాపారంగా మార్చేసాం. నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు అది ఇవ్వు అని చెప్పేసి దేవుడితో మనం బేరం ఆడదాం. మనలో బాధ్యత పెరగడం లేదు.
(02:13) కేవలం స్వార్థం పెరిగిపోతుంది. మనం ఎప్పుడైతే కేవలం మన గురించి మన కడుపు నింపుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తామో అప్పుడే ప్రకృతి మనల్ని చిన్నవిగా చేస్తుంది. మీ ఆలోచనలు ఎంత ఇరుగ్గా ఉంటే మీ జీవితం అంత కష్టంగా మారుతుంది. మీ మనసులో ఎప్పుడు భయం ఉంటే ఆ భయమే మిమ్మల్ని బానిసలుగా వాడుకుంటుంది. మనం చేసే తప్పు ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి బదులు వాటి నుండి పారిపోవడానికి దారులు వెతుక్కుంటాం.
(02:41) అలా వెతుక్కోవడం వల్లే మీరు ఎదగడం లేదు. మనం ఎప్పుడు మేల్కొంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది కనీస వసతులు కూడా లేకుండా వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నది ఎంతో కష్టపడి సాధిస్తుంటే మనం మాత్రం చిన్న పిల్లల్లాగా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఏడుస్తూనే ఉంటున్నాం. మనం కూడా మారాలి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ముందుగా మీ వెన్ను ముఖ నిటారుగా ఉంచండి.
(03:05) భయాన్ని మీ దరి చేరనివ్వకండి. వివేకానంద గారు చెప్పినట్లు లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి. సమస్యలను అధిగమించాలంటే మొదట మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మీరు అడుగుతున్న చిన్న చిన్న కోరికలు మిమ్మల్ని ఎప్పటికీ తృప్తి పరచవు. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే బలాన్ని అడగండి, సామర్థ్యాన్ని అడగండి. సమస్యలు తీరిపోవాలని కాదు, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కావాలని భగవంతుని కోరుకోండి.
(03:33) భక్తి అంటే గంటలు గంటలు పూజ గదిలో కూర్చొని పూజలు చేయడం కాదు బయటకు వచ్చి కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం మీ చేతులు సేవ కోసం చాచినప్పుడు మీ సమస్యలు కూడా మీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఒకసారి ఆలోచించండి మీకంటే ఎంతో దారుణమైన స్థితిలో ఉన్నవారు ఈ ప్రపంచంలో వేల సంఖ్యలో ఉన్నారు. మీరు మీ అప్పుల గురించి ఏడుస్తుంటే కనీసం పూట గడవని వారు ఎందులో ఉన్నారు.
(03:54) ఎప్పుడైతే మీరు నేను నా కోసం మాత్రమే కాదు సమాజం కోసం కూడా బతకాలి అని ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుంటారో అప్పుడు మీ [సంగీతం] వ్యక్తిగత సమస్యలు మంచులా కరిగిపోతాయి. భయం మీ బానిస అవుతుంది. మీరు దానికి యజమాన అవుతారు. నడుము కట్టి సేవలో దోకండి. పని చేయడంలో మీ ఆనందం ఉంటుంది. ఇప్పుడు సేవ చేయడం అంటే నా దగ్గర డబ్బులు లేనప్పుడు అవతల వాడికి ఎలా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మీరు అనుకోవచ్చు.
(04:17) సేవ అంటే డబ్బులు మాత్రమే కాదు ఒక మనిషికి మీరు ఉపయోగపడటం, ఒక మనిషితో మీరు కనెక్ట్ అవ్వటం. అలా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అవతలి వ్యక్తి కూడా మీకోసం ఏమైనా చేస్తాడు. సో నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు అవతలి వాడికి హెల్ప్ చేయడం నేర్చుకోండి. అది కేవలం డబ్బు పరంగా కూడా కాదు ఏదో ఒక విధంగా మీరు హెల్ప్ చేయొచ్చు.
(04:38) ఆ తర్వాత వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. అలా కాకుండా మీరు ఎవరితో కలవకుండా అంటే ఎవరికీ హెల్ప్ చేయకుండా మీకు వచ్చిన కష్టాలు కేవలం దేవుడు మాత్రమే తీరవాలి అనుకుంటే మాత్రం ఆ దేవుడు కూడా హెల్ప్ చేయడు. జీవితం అంటే కేవలం పుట్టడం, తినడం, చనిపోవడం కాదు. ఇది ఒక గొప్ప యజ్ఞం. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఈ క్షణం నుంచి మీ గురించి ఏడవడం మానేయాలి.
(05:00) చిన్న చిన్న సమస్యలు వస్తే దేవుని విసిగించడం ఆపేయాలి. ఆయన ఇచ్చే పనుల్లో భాగస్వాములు అవ్వండి. అంతేగాన ఆయన్ని విసిగించకండి మీరు ఎంత త్యాగం చేస్తే మీకు [సంగీతం] అంత అనంతమైన ఫలితం లభిస్తుంది. ఇక్కడ త్యాగం అంటే ఆస్తులు వదిలేయడం కాదు మీలోని అహంకారాన్ని మీలోని స్వార్థాన్ని మీలోని భయాన్ని వదిలేయండి. నేటి నుంచి నేను ఎక్కువ అవతలవాడు తక్కువ లేకపోతే మీకన్నా ఎక్కువ ఉన్నవాడు వస్తే వాడికన్నా నేను తక్కువ అనే ఫీలింగ్ ని తీసి పక్కన పెట్టేయండి.
(05:26) మీరు కష్టపడతారు, మీరు బాధ్యతలు తీసుకుంటారు, నలుగురికి ఉపయోగపడతారు. ఇవన్నీ మీకు తెలుసు అయినా సరే ఏమి తీలినట్టు ఉండమాకండి. గుర్తుంచుకోండి ఈ ప్రపంచానికి మీ అవసరం ఉంది. మీరు కేవలం ఒక సామాన్య మనిషి కాదు. ఆ దేవుడు ఎంతో ఇష్టంగా మిమ్మల్ని పుట్టించాడు. కాబట్టి మీరు నలుగురికి ఉపయోగపడండి. ఈ ప్రపంచం ఆటోమేటిక్ గా మీకు ఉపయోగపడుతుంది.
(05:47) ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్. ఓం

No comments:

Post a Comment