Monday, April 13, 2026

అరుణాచలం: మృత్యువు లేని సిద్ధులు.. కొండ లోపల దాగి ఉన్న రహస్య నగరం!

అరుణాచలం: మృత్యువు లేని సిద్ధులు.. కొండ లోపల దాగి ఉన్న రహస్య నగరం!

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5e7qLb0cBtU



Transcript:
(00:00) నమస్కారం మిత్రులారా మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచానికి సమాంతరంగా కాలం స్తంభించిపోయిన ఒక లోకం ఉందంటే మీరు నిజంగా నమ్ముతారా సైన్స్ విశ్లేషించలేని శక్తులు మరణాన్ని గెలిచిన మహనీయులు ఇప్పటికీ మన మధ్య తిరుగుతున్నారంటే [సంగీతం] అది నిజంగా నమ్మశక్యంగా ఉందా? నాసా శాస్త్రవేత్తల ప్రకారం ఇది కేవలం ఒక కొండ కాదు భూమి మీద ఉన్న అత్యంత పురాతనమైన ఎనర్జీ సెంటర్వెయ ఏళ్ల క్రితం కనిపించిన సిద్ధులు నిన్న కాకము మొన్న వెళ్ళిపోయిన అవధూతలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఆ రహస్యాల గని పేరే
(00:47) అరుణాచలం అసలు ఈ కొండ ఎందుకు ఇంత [సంగీతం] శక్తివంతమైనది బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అణచడానికి శివుడు ఆర్భవించిన అగ్ని స్తంభమే ఈ కొండ ఇక్కడ అణువు అణువు ఆ పరమ శివుడే అరుణాచలం ఇక్కడ రాయి రాయి ఒక లింగమే ఇక్కడ వీచే గాలి ఒక మంత్రము వేల ఏళ్లుగా ఎందరో సిద్ధులు ఈ కొండను తమ నివాసంగా మార్చుకున్నారు. ఇప్పటికీ మనం గిరి ప్రదక్షణ చేసేటప్పుడు మన పక్కనే సూక్ష్మ రూపంలో వారు నడుస్తూ ఉంటారని ప్రతీతి ఇక్కడ చాలా మంది మహా సిద్ధులు ఉన్నారు.
(01:31) వారిలో ప్రముఖులైన 15 మంది సిద్ధుల గురించి వారు ఇక్కడికి ఎలా వచ్చారు? వారి చరిత్ర ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటి వారు గౌతమ మహర్షి సప్తఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి అరుణాచల క్షేత్రానికి ఆది గురువు అని చెప్తారు. పార్వతీదేవి తన తపస్సు కోసం మార్గదర్శనం కోరినప్పుడు ఆమెకు అరుణాచల వైభవాన్ని వివరించి గిరి ప్రదక్షణ చేయించి సూచించింది వీరే అని చెప్తారు.
(02:07) నేటికీ గిరి ప్రదక్షిణ మార్గంలో రమణాశ్రమం [సంగీతం] దాటాక గౌతమ మహర్షి ఆశ్రమం చూడవచ్చు రెండవది ఉమాదేవి ఒకసారి సరదాగా శివుణ్ణి కళ్ళు మూయడం [సంగీతం] వల్ల కలిగిన లోకాంధకార పాప పరిహార్థం పార్వతీ దేవి అరుణాచలానికి వచ్చిందట. ఇక్కడ ఆమె గిరి ప్రదక్షణ చేసి శివునిలో సగభాగమై అర్ధనారీశ్వరిగా మారింది. అందుకే ఈ నేలపై స్త్రీ శక్తి సిద్ధ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది.
(02:38) ఇక మూడవది భగవాన్ శ్రీ రమణ మహర్షి 1896 లో ఒక చిన్న బాలుడిగా వచ్చి జీవితాంతం అరుణాచలాన్ని వదలకుండా ఉన్న ఆధునిక సిద్ధుడు ఈ అరుణాచలం ఒక అయస్కాంతం అది తన బిడ్డలను తానే లాక్కుంటుంది [సంగీతం] అని ఆయన నిరూపించారు. ఆయన మౌనం కోట్లాది మందికి మోక్ష మార్గాన్ని చూపించింది. ఇక నాలుగవ వారు శేషాద్రి [సంగీతం] స్వామి ఈయన భగవాన్ రమణ మహర్షికి సమకాలికులు ఈయనకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు అక్కడ ఉన్న అంగళ్ళలోకి వెళ్లి వస్తువులను చిందర వందర చేసేవారు కానీ ఆయన అడుగు పెట్టిన చోట ఐశ్వర్యం తాండవించేదట
(03:25) రమణ మహర్షిని పాతాళ లింగం నుండి రక్షించి లోకానికి పరిచయం చేసింది వీరే ఇక ఐదవ వారు యోగిరాం సూరత్ కుమార్ ఈయనను విసినకర్ర స్వామి అను అని కూడా అంటారు. కాశీలో పుట్టి రమణుల దర్శనం తర్వాత అరుణాచలమే లోకంగా బతికారు. ఆయన విసినికర్ర ఊపితే భక్తుల కష్టాలు గాలిలో కలిసిపోతాయని అరుణాచలంలో ఉండే వారి నమ్మకం నేను ఒక భిక్షగాడిని అంతా నా తండ్రి ఇష్టం అంటూ ఉండేవారట ఆయన ఇక ఆరోవారు రాధామాయి ఈమె ఒక అద్భుతమైన యోగిని అహంకారం ఉన్నవారిని ఈమె భయంకరంగా తిట్టేవారట కానీ ఆ తిట్లే భక్తులకు దీవెనలై వారి కర్మలను
(04:14) కాల్చేసేవారట కుక్కల మధ్యనే నివసించేవారట ఆ కుక్కలను శివ స్వరూపాలుగా చూసేవారట ఇక ఏడవ వారు అరుణగిరినాథర్ ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపి ఆ జీవితం మీద విరక్తితో గోపురం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయారట సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై రక్షి ంచి తిరుపు గజ్జ అనే అద్భుత కావ్యాన్ని పలికించారు.
(04:42) ఈయన [సంగీతం] చిలక రూపంలో మారి వేదాంతాన్ని బోధించారని చెప్తారు. ఇక ఎనిమిదవది మాణిక్య వాచకర్ ఈయన రాసిన తిరువెంబావై [సంగీతం] మంత్రముగ్దులను చేస్తుంది. ఈయన భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఈయన చెప్పిన పాటలను గ్రంథస్తం చేశారట. కన్నీటితో శివుడిని కరిగించిన మహాభక్తుడట ఈయన ఇక తొమ్మిదవ వారు విరూపాక్ష దేవర్ 13వ శతాబ్దానికి చెందిన సిద్ధుడు కొండపై ఓం మాకారపు గుహలో తపస్సు చేశారట ఆయన సమాధి కావాలని నిశ్చయించుకున్నప్పుడు లోపలికి వెళ్లి తలుపులు మూసుకున్నారు తర్వాత చూస్తే ఆయన దేహం అందులో లేదట కేవలం
(05:29) కూర్చున్న ఆకారంలో ఒక విభూది కుప్ప మాత్రమే ఉందట ఇక 10వ వారు గుహై నమఃశివాయ వాయ కర్ణాటక నుండి వచ్చిన ఈయన అరుణాచల కొండను పరమశివుని దేహంగా భావించి దానిపై అడుగు పెట్టడానికే భయపడేవారట శివుని ఆజ్ఞతో కొండపై గుహలో నివసిస్తూ అరుణాగిరి అంతా అది వంటి రచనలు చేశారట ఇక 11వ వారు ఈశాన్య దేశికర్ కొండకు ఈశాన్య భాగంలో తపస్సు చేసిన సిద్ధుడు ఈయన ఈయన ఎంతటి అహింసామూర్తి అంటే అడవిలోని పుల్లలను పాములను ఈయన పక్క పక్కనే పిల్లల్లాగా పడుకునేవాట.
(06:11) నేటికి ఈశాన్య మటం అత్యంత ప్రశాంతమైన ప్రదేశంగా చెప్తారు. ఇక 12వ వారు ముక్కుపొడి సిద్ధర్ ఈయన ఆధునిక కాలపు అవధూత ముక్కుపొడిని ప్రసాదంగా ఇచ్చేవారట. ఈయన ఎవరితోనూ మాట్లాడేవారు కాదు కానీ ఆయన చూపు పడితే చాలు జబ్బులు నయమైపోతాయని భక్తులు నమ్మేవారు. ఈయన జీవ సమాధి వాయులింగం ఎదురుగా ఉంది. ఇక 13వ వారు పూండి స్వామి పూండి అనే గ్రామంలో అరుగుపై ఏళ్ల తరబడి కదలకుండా కూర్చున్న మహనీయుడు ఈయన వర్షం కురిసిన ఎండ కాసిన గాలి వీచిన ఆయన స్థితి మారేది కాదు.
(06:54) శేషాద్రి స్వామి ఈయనను చూసి అక్కడ చూడండి సాక్షాత్తు శివుడు నడుస్తున్నాడు అని చెప్పేవారట. ఇంక 14వ వారు [సంగీతం] సిద్ధగురువయ్య ఈయన జీవిత చరిత్ర ఒక మిస్టరీ అని చెప్తారు. అరుణాచల కొండ లోపల ఒక మణిద్వీపం ఉందని అక్కడ సిద్ధులందరూ రహస్యంగా సమావేశం అవుతారని దానికి ఈయనే నాయకుడని పురాణాలు చెబుతున్నాయి. అతి [సంగీతం] కొద్దిమందికి మాత్రమే ఈయన దర్శనం లభించిందట ఇక 15వ వారు నాన్నగారు ఆంధ్రప్రదేశ్లోని జిన్నూరుకు చెందిన వీరు రమణ మహర్షి గారి బోధనలను తెలుగువారికి చేరువయ్యేలా చేశారట.
(07:35) గృహస్తులుగా ఉంటూనే ఆధ్యాత్మిక శిఖరాలను ఎలా అధిరోహించాలో నేర్పారు. లక్షలాది మంది భక్తులను అరుణాచలం వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి వీరు ఇలా ఈ 15 మంది సిద్ధులు మాత్రమే కాదు అరుణాచలంలో ఇంకా వేలాది మంది సిద్ధులు అజ్ఞాతంగా ఉన్నారట. మీరు గిరి ప్రదక్షణ చేసేటప్పుడు భక్తితో ఏకాగ్రతతో ఉంటే వారి ఉనికిని మీరు కూడా అనుభవించవచ్చు.
(08:07) అరుణాచలం అంటే అది ఏదో ఒక తీర్థయాత్రక వెళ్లే ప్రదేశం మాత్రమే కాదు అది మనల్ని మన మనసునే మార్చే మార్గం ఉన్న ఒక దివ్యమైన కొండ మీరు గనుక కష్టాల్లో ఉన్నారా సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతం అవుతున్నారా? ఒక్కసారి అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షణ చేసి కొండ వైపు చూసి ఆ పరమశివునికి మొక్కుకోండి ఆ సిద్ధులను స్మరించండి. ఇంకా మీరు జవాబులు వెతకాల్సిన అవసరం లేదు.
(08:41) ఆ పిలుపే మిమ్మల్ని అక్కడికి చేరుస్తుంది. ఓం అరుణాచల శివ అరుణాచల శివ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక [సంగీతం] వీడియోల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ హర హర మహాదేవ శంభో శంకర ధన్యవాదములు శుభదినము

No comments:

Post a Comment