Sunday, April 12, 2026

ఈ ఒక్క సత్యం తెలుసుకుంటే మీ జీవితం మారుతుంది | Jiddu Krishnamurti Philosophy Telugu

ఈ ఒక్క సత్యం తెలుసుకుంటే మీ జీవితం మారుతుంది | Jiddu Krishnamurti Philosophy Telugu

Author Name:Naa Spandana

Youtube Channel Url:https://www.youtube.com/@Naaspandana1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E8YsfNSkM64



Transcript:
(00:00) చిడ్డు కృష్ణమూర్తి 20వ శతాబ్దపు అత్యంత ప్రతిభావంతమైనటువంటి తత్వవేత్తలలో ఒకరు కృష్ణమూర్తి గారి బోధనలు మానవ మేదస్సు మరియు మనస్తత్వం [సంగీతం] పై లోతైన విశ్లేషణను అందిస్తాయి. కృష్ణమూర్తి గారి ఫిలాసఫీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల విశ్లేషణ కృష్ణమూర్తి గారి అభిప్రాయం ప్రకారం సత్యాన్ని చేరుకోవడానికి ఏ గురువు ఏ మతం లేదా ఏ సిద్ధాంతం ఒక నిర్దిష్ట మార్గాన్ని చూపలేవని నమ్మారు.
(00:40) సత్యం అనేది స్వయంగా కనుగొనవలసిన అనుభవమే కానీ ఎవరో గీసిన బాటలో నడవటం కాదు ఏ వ్యవస్థలో చేరినా అది మనిషిని బందీని చేస్తుంది తప్ప విముక్తిని ప్రసాదించదు ఇది మంచి ఇది చెడు అని విభజించకుండా మనసును ఒక అర్థంలా గమనించినప్పుడు మనలోని అసలు స్వభావం బయట పడుతుంది అంటారు కృష్ణమూర్తి వారు సాధారణంగా నేను వేరు నా కోపం వేరు అనుకుంటాం. కానీ కృష్ణమూర్తి గారి అభిప్రాయం ప్రకారం కోపం అనే భావమే నేను.
(01:16) పరిశీలకుడు అంటే అబ్జర్వర్ మరియు పరిశీలించబడే వస్తువు అబ్జర్వ్డ్ మధ్య దూరం ఉన్నంతవరకు సంఘర్షణ ఉంటుంది. ఈ రెండూ ఒకటే అని గ్రహించినప్పుడు మార్పు సహజంగా సంభవిస్తుంది అంటారు కృష్ణమూర్తి. మానసిక కట్టుబాట్ల నుండి విముక్తి మనిషి పుట్టినప్పటి నుండి ఈ సమాజం సంస్కృతి మతం మన మెదడులో కొన్ని నమ్మకాలను ఏర్పరుస్తాయి వీటినే కండిషనింగ్ అంటారు.
(01:46) ఈ పాత ఆలోచనా ధోరణల నుండి విముక్తి పొందినప్పుడే మనిషి కొత్తగా ఆలోచించగలడు మరియు సత్యాన్ని దర్శించగలడు అంటారు [సంగీతం] కృష్ణమూర్తి ఆలోచనే సమస్యకు మూలం ఆలోచన అనేది ఎప్పుడూ గతం మీద ఆధారపడి ఉంటుంది. పాత జ్ఞాపకాలతో వర్తమానాన్ని చూడటం వల్ల సమస్యలు వస్తాయి. ఆలోచన పరిమితమైనది కాబట్టి అది సత్యాన్ని లేదా అనంతమైన దైవత్వాన్ని ఎన్నటికీ పట్టుకోలేదని ఆయన విశ్లేషించారు.
(02:20) కృష్ణమూర్తి గారి అభిప్రాయం ప్రకారం నేను రేపు మారతాను లేదా రేపు శాంతిని పొందుతాను అనుకోవడం ఒక భ్రమ. రేపు అనేది మనసు సృష్టించుకున్న ఒక తప్పించుకునే మార్గం మాత్రమే భయం అనేది భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల లేదా గతాన్ని కోల్పోతామని ఆందోళన వల్ల వస్తుంది. భయం యొక్క మూలాన్ని ద స్ట్రక్చర్ ఆఫ్ ఫియర్ లోతుగా విశ్లేషించి దానితో సహజీవనం చేయకుండా దాన్ని గమనించినప్పుడు అది కరిగిపోతుందని ఆయన చెప్పారు.
(02:58) మనం ఇతర వ్యక్తులతో జరిపే సంబంధాలు మన అంతరంగాన్ని ప్రతిబింబించే అర్థాల వంటివి మనలోని స్వార్థం అసూయ ఆశలు ఇతరులతో వ్యవహరించేటప్పుడు స్పష్టంగా [సంగీతం] కనిపిస్తాయి. ఒంటరిగా అడవికి వెళ్ళడం కంటే సమాజంలో ఉంటూ సంబంధాల ద్వారా తనను తాను తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత. సాధారణంగా క్రమశిక్షణ అంటే నియమాలను పాటించడం లేదా మనసును అణచివేయడం కానీ కృష్ణమూర్తి గారి దృష్టిలో డిసిప్లిన్ అంటే నిరంతరం నేర్చుకోవడం ఏదైనా ఒక విషయాన్ని నిశితంగా గమనించి అర్థం చేసుకున్నప్పుడు అక్కడ అణచివేతతో పని లేని ఒక సహజమైన క్రమం ఏర్పడుతుంది.
(03:45) ధ్యానం అంటే మనసు శూన్యం కావడం కళ్ళు మూసుకొని మంత్రాలు జపించడం లేదా బొమ్మలను ధ్యానించడం కృష్ణమూర్తి గారి దృష్టిలో ధ్యానం కాదు మనసులోని పాత జ్ఞాపకాలు కోరికలు ఆలోచనలు వాటంతట అవే తొలగిపోయి మనసు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న స్థితియే నిజమైనటువంటి ధ్యానం. జింటు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ మనిషిని తన సొంత కాంతిలో నడవమని ప్రోత్సహిస్తుంది.
(04:19) నేను చెప్పింది నమ్మకండి మీ అంతట మీరు పరిశీలించి చూసుకోండి అని ఆయన పదే పదే చెప్పేవారు

No comments:

Post a Comment