2004 నుండి విడుదల కాని ప్రసంగం–అజ్ఞానం తెచ్చే బాధ | Unreleased Talk From 2004 The Pain Of Ignorance
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QOIIzTS5Yq8
Transcript:
(00:03) అన్నింటితో మీ పని పూర్తయ్యాక ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుంది. జీవితంలో పెద్ద విషయాలు అనుకునేవి చిన్నవిగా అయినప్పుడు ఇప్పుడు ఆధ్యాత్మికత ఉదయిస్తుంది. [సంగీతం] మీ హృదయం తెలుసుకోవాలని తపించినప్పుడు అజ్ఞానం యొక్క బాధ మీకు నిజంగా తెలిసినప్పుడు అప్పుడు ఒక గురువు ఉదయిస్తాడు. నేను కలిసే వారి కంటే భౌతికంగా ఎప్పుడూ కలవని వారికే ఎక్కువ మందికి దీక్షని ఇచ్చాను.
(00:37) సుందరమూర్తి నయనార్ పెళ్లి గురించి ఆయనకు [సంగీతం] వేరే ఉద్దేశాలు ఉన్నాయి. పెళ్లికి వచ్చిన వారు ఆ కొన్ని గంటల్లోనే తీక్షణమైన ఆధ్యాత్మిక జిజ్ఞాసువులయ్యారు. 3వేల [సంగీతం] మందికి పైగా ప్రజలు సంపూర్ణ జ్ఞానం పొంది పూర్తి స్పృహతో తమ దేహాలను విడిచిపెట్టారు. ఆధ్యాత్మికత మీ జీవితంలోని మిగతా వాటి లాంటిది మీ జీవితంలో ఒక దశ ముగిసాక తర్వాతది మొదలైనట్టు అచ్చం అలానే మీకు అన్నింటితోనూ పని పూర్తయ్యాక ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుంది.
(01:25) ఉదాహరణకు జీవితంలోని మౌలిక విషయాలకు వస్తే ఆధ్యాత్మికత అనేది లైంగికత లాంటిది ఏ అర్థంలో అంటే మీ వయసు 14 మీకు హటాత్తుగా తెలుస్తుంది. [నవ్వు] హటాత్తుగా చిన్నప్పుడు మీకు సర్వస్వంలా అనిపించిన చిన్న చిన్న విషయాలు ఉదాహరణకు టెడ్డీ బేర్లు చెత్తబుట్టలోకి వెళ్తాయి. తెలుసా టెడ్డీ బేర్ చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఇంకా
(02:09) చిన్న పిల్లల ఆటలన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు హటాత్తుగా మీకు తెలుస్తుంది. అచ్చం అలానే మీలో ఒక అవగాహన ఉదయించినప్పుడు మీకు హటాత్తుగా తెలుస్తుంది. అదేమిటంటే చిన్న చిన్న ఆటలు మీకు ఇక సంతృప్తిని ఇవ్వమని మీ వయసు 14 అయినప్పుడు మీరు అప్పటిదాకా చేస్తున్నవన్నీ చిన్న విషయాలను అనుకున్నారు హటాత్తుగా మీకు పెద్ద విషయం తెలుస్తుంది.
(02:52) ఆ పెద్ద విషయం చిన్న విషయంగా మారినప్పుడు ఇప్పుడు మీరు ఆధ్యాత్మికులు. జీవితంలో పెద్ద విషయాలు అనుకునేవి చిన్నవిగా అయినప్పుడు ఇప్పుడు ఆధ్యాత్మికత ఉదయిస్తుంది. అక్కడ పరిణితిని తెచ్చింది హార్మోన్లు ఇక్కడ ఆ పరిణితిని తేయగలిగేది కేవలం ఎరుకే జీవితంలోని రకరకాల కార్యకలాపాలు ఒత్తిళ్లు ఆకాంక్షలు అన్నింటిని గమనిస్తూ మీరు వాటి గుండా వెళ్ళగలిగినప్పుడు ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవని ఒక అంతం లేని తతంగం అని మీకు స్పష్టం
(03:41) అవుతుంది దాంతోనే 50 60 ఏళ్ళ ఉంటారు అయినా అది మిమ్మల్ని అంగుళం కూడా ఎక్కడికి తీసుకెళ్ళదు. అయితే దాన్ని అనుభవించి మీ మరణ సయ్యపై దాన్ని గ్రహిస్తారు లేదా దాన్ని మొదలు పెట్టేటప్పుడు లేదా దానిలో ఉన్నప్పుడు గ్రహిస్తారు. మీ చేతుల్లో ఇంకా సమయం ఉన్నప్పుడే కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. కానీ మీరు జీవిస్తున్న పరిమితులను దాటి వెళ్ళాలనే ఆకాంక్ష ఎప్పుడూ ఉంటుంది.
(04:25) మన జీవితాల్లో ప్రతి చిన్న విషయం మనం దానిలో ఉన్నప్పుడు అదే సర్వస్వంలా అనిపిస్తుంది. అవునా కాదా మన జీవితాల్లో ప్రతి చిన్న విషయం మనకు నచ్చింది తినడం దగ్గర నుంచి నచ్చింది చేయడం సంబంధాలు ఇలా అన్నీ మనం దానిలో ఉన్నప్పుడు అదే జీవితం యొక్క అంతిమ గమ్యంలా అనిపిస్తుంది. దానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. మనం దానికి అతీతంగా చూసినప్పుడు హటాత్తుగా అవన్నీ చాలా చిన్న విషయాలుగా అయిపోతాయి అసలు దీనిలో నేను ఎందుకు ఉన్నానా అని కూడా ఆశ్చర్యపోతారు.
(05:06) కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రశ్న తలెత్తుతుందో నేను ఎందుకు ఈ చిన్న విషయాల్లో ఇలా ఇరుక్కుపోయానని అప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైనట్టు దురదృష్ట వసాత్తు చాలామంది వాళ్ళు తమ ఆధ్యాత్మికతను తెలియకుండానే సహిస్తారు. సహిస్తారని నేను ఎందుకు అంటున్నాను అంటే మీరు అచేతనంగా పరమ సత్యాన్ని వెతికినప్పుడు అది మిమ్మల్ని అన్ని రకాల పిచ్చివాటి గుండా తీసుకెళ్తుంది.
(05:51) దానికి నిజంగా గొప్ప సహనం కావాలి. ఎందుకంటే అది మిమ్మల్ని తెలుసా అన్నిటి గుండా భారీ బ్రేక్ఫాస్ట్ నుండి షాపింగ్ మాల్ పెళ్లి అది ఇది అన్నిటి గుండా తీసుకెళ్తుంది. [నవ్వు] ఎందుకంటే అచేతనంగా ఏదో రకమైన పరిపూర్ణత కోసం వెతుకుతున్నారు. ఏదేమైనా ప్రతి ఒక్కరు పరిపూర్ణత కోసమే వెతుకుతున్నారు అవునా ఎరుకతోనా లేక ఎరుక లేకుండానా అన్నదే తేడా మనం సత్యాన్వేషణ అన్నప్పుడు చూడండి సత్యం అనేది ఒక ముగింపు కాదు సత్యం అనేది మీరు ఎక్కడికో వెళ్లేది కాదు
(06:39) అదిఒక గమ్యం కాదు అదొక సజీవన అనుభవం అంతే మీరు సత్యాన్ని చేరుకోలేరు మీరు సత్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. కానీ మీరు సత్యంగా మారగలరు. మీ పిచ్చినంతా వదిలేస్తే మీరే సత్యం మీ పరిమితులన్నింటిని వదిలేస్తే మీరే అది కానీ మీరు ఎప్పటికీ అక్కడికి చేరలేరు అదిఒక ముగింపు కాదు ప్రయాణం కాదు చేరుకోవలసిన గమ్యం కాదు. కేవలం అదిగా మారడమే ఒకవేళ మీరు జీవితాన్ని మీరు పోగు చేసుకున్న పరిమితులన్నింటిని
(07:29) దాటి చూడడానికి అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉంటే మీరే సత్యం బహుశా ట్రూత్ అనే ఆంగ్ల పదం చాలా అపార్థాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే సత్యం గురించి మాట్లాడితే అసత్యం గురించి కూడా మాట్లాడాలి. కాబట్టి ట్రూత్ అనే ఆంగ్ల పదం ఆ భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించలేదు. దానికి సరైన పదం సంస్కృత భాషలో ఋతంభర అని ఒకటి ఉంది. దాన్ని ఋతుంభర అంటారు లేదా ఆ స్థితిలో ఉన్నవారిని ఋతుంభర ప్రజ్ఞ అంటారు.
(08:17) ఋతుంభర ఎరుకలో ఉన్నవారే ఋతుంభర ప్రజ్ఞులు. ఋత్ అంటే అన్నింటికీ పునాది అయింది. జీవానికి ఉన్న విశ్వవ్యాప్తమైన ఆధారం మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నా సరే ప్రాథమికంగా మీరు జీవం అవునా అందరూ జీవమేనా సరే ప్రాథమికంగా మీరు జీవం మీరు జీవమైతే జీవం యొక్క పునాది తప్పకుండా మీకు ఎక్కడో ఏదో ఒక చోట అందుబాటులో ఉండాలి అది ఇక్కడ పాతుకుని ఉన్నా ఆకాశంలో ఉన్నా
(09:02) ఇంకెక్కడో ఉన్నా ఏదో ఒక చోట దాని మూలంతో అనుసంధానమై ఉండాలి కదా జీవమైంది దాని మూలంతో ఎల్లప్పుడూ సంధానమై ఉండాలి. అంటే మీరెవరో దాని అసలు మూలానికి చేరడమే సత్యం అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది కేవలం మీ శరీరం మనసు రూపంలో మీరు పోగు చేసుకున్న కుప్ప చేత అది కప్పబడి ఉంది. అంతే విషయం ఈ రెండు రాశులు దాన్ని కప్పి వేసాయి. ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా మనం చేస్తున్న
(09:47) ప్రతి ప్రయత్నం అది మీరు ఆసనాలు అని పిలిచే ఉదయాన్నే చేసే చిత్రహింస అయినా [నవ్వు] ఎప్పుడూ తమ శరీరాన్ని వంచని వాళ్ళకు జీవితాంతం సోఫాలోనే గడిపిన వాళ్ళకు ఆసనాలు ఖచ్చితంగా చిత్రహింసల లాగే కనిపిస్తాయి. అవునా లేదా ఊపిరి విగబట్టడానికి ప్రయత్నించే ఈ చావు బతుకుల ఆట అయినా ఎందుకంటే ఊపిరి విగబట్టడమే చావు అవునా
(10:33) కానీ ప్రజలు ప్రాణాయామం ఆయుష్యును పెంచుతుంది అని చెప్తారు ఎవరో ఒకాయన వచ్చి నాకు చెప్పారు ఆ అది చాలా కాలం క్రితం ఈశా ఫౌండేషన్ ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు లేదు అదిఒక చిన్న ప్రారంభ దశలో ఉన్నప్పుడు అయితే భారతదేశంలో ఇది జరగడం ఒక దురదృష్టం ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్న ఆధ్యాత్మిక సంప్రద దాయాలు ఉన్నాయి మేము సమయమా చేసినప్పుడు కొందరు గుంపులుగా వచ్చి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించేవారు పెద్ద గొడవలు పోలీసులను
(11:18) పిలుస్తాం ఇది చేస్తాం మీరు ఇది ఎందుకు చేస్తున్నారు ప్రజలను ఎందుకు మాట్లాడద్దు అని అడుగుతున్నారు అంటారు. [నవ్వు] మీరు నమ్మరు ఇది భారతదేశంలో [నవ్వు] అయితే ఒక ఉడుకు రక్తం గల యువకుడు మాట్లాడడానికి దేవుడు మనకు నోరిచ్చాడు మీరెందుకు దాన్ని మూయిస్తున్నారు అన్నాడు నేను మీ దేవుడు మిమ్మల్ని వాగమని చెప్పాడేమో [నవ్వు] నా దేవుడు నన్ను మూసుకోమన్నాడు తను మాట్లాడుతాడట అన్నాను [నవ్వు] ఈ విషయాలన్నీ వాళ్ళకు అర్థం కావు తెలుసా
(12:06) ఎందుకంటే వాళ్ళు చేయాలనుకునేదంతా మీకు భౌతికంగా హాని తలపెట్టడమే అది మాటలతో మొదలవుతుంది. [నవ్వు] వాళ్ళ ఉద్దేశాలు చాలా భౌతికమైనవి. మాటలతో మొదలవుతాయి అంతే అయితే ఆ పరమార్థాన్ని అన్వేషించే ఈ ప్రక్రియ చాలా సులభం అదే సమయంలో ఈ భూమిమీద చాలామంది మానవులు దాన్ని అత్యంత క్లిష్టమైన అసాధ్యమైన ప్రక్రియగా అనుభూతి చెందుతారు దురదృష్టవసాత్తు
(12:52) ఇది కేవలం ఎందుకంటే మీరు వెతుకుతున్నది మీలోనే దాగి ఉంది. మీలో అన్నప్పుడు నా ఉద్దేశ్యం మీరు ప్రస్తుతం నేను అనుకుంటున్న విషయాల్లో మీ సొంత శరీరంలో మీ సొంత మనసులో మీరు ప్రస్తుతం నేను అని అనుభూతి చెందేదానిలో అయితే మీరు శరీరం రూపంలో లేదా మనసు రూపంలో సేకరించిందంతా ఎప్పుడూ బహిర్ముఖంగానే ఉంటుంది.
(13:23) మీ శరీరం నూటికి నూరు శాతం బహిర్ముఖమైందే ఇది చూడండి. మీ అనుభూతి చెందడానికి సాధనాలైన మీ పంచేంద్రియాలు ఎప్పుడూ బయట వైపే ఉంటాయి అవునా మీరు బయట ఉన్నదాన్ని చూడగలరు లోపల ఉన్నదాన్ని చూడలేరు మీరు బయట ఉన్నదాన్ని వినగలరు లోపల ఉన్నదాన్ని వినలేరు బయట ఉన్నదాన్ని స్పృసిించి అనుభూతి చెందగలరు లోపల ఉన్నదాన్ని స్పృసిించలేరు. కాబట్టి ఇదంతా బయట వైపే ఉంటుంది.
(13:52) మీ మనసు విషయంలోనూ అంతే మీ మనసు బయటకు వెళ్ళడానికే సన్నర్థమై ఉంది. అది లోపలికి వెళ్ళడానికి సన్నద్ధం కాలేదు. ప్రజలు తమ మనసును లోపలికి తిప్పడం గురించి మాట్లాడుతున్నారు అలాంటిది ఏదీ లేదు. మీ మనసును లోపలికి తిప్పలేరు. మీరు మనసును విసుగెత్తించగలరు. దాన్ని లోపలకు తిప్పడానికి ప్రయత్నించి ఆ విసుగుతో అది చచ్చి పడిపోయేలా చేయగలరు.
(14:19) కానీ మనసును లోపలికి తిప్పలేరు ఎందుకంటే మనసు స్వభావమే బయట వైపుకి ఉండటం అది కేవలం బయటికే వెళ్ళగలదు. మీరు దేవుడి గురించి ఆలోచించినా లేదా ఆత్మ గురించి ఆలోచించినా లేదా సత్యం గురించి ఆలోచించినా మీరు ఇంకా బయటికే చూస్తున్నారు అవునా దేవుడంటే పైన అవునా ఎప్పుడు ప్రతి సంస్కృతిలో దేవుడంటే పైన కొన్ని సంస్కృతులు కిందికి చూస్తాయి అది వేరే విషయం అది మీది పిల్లి సంస్కృత లేక కుక్క సంస్కృత అనేదాన్ని బట్టి ఉంటుంది.
(14:54) కుక్కలు ఎప్పుడూ మిమ్మల్ని పైకి చూస్తాయి. పిల్లులు ఎప్పుడూ మిమ్మల్ని చిన్నచూపు చూస్తాయి. [నవ్వు] మీరు కుక్కకు ఆహారం పెడితే అది మీ వైపు తల్లెత్తి చూస్తుంది. కృతజ్ఞతతో పిల్లికి ఆహారం పెడితే అది మిమ్మల్ని ఎంతో చులకనగా చూస్తుంది. నువ్వు తినేది ఇదేనా అని అయితే ప్రజలు పైకి లేదా కిందికి లేదా పక్కకు చూస్తున్నారు ఎందుకంటే వారికి లోపలికి
(15:38) చూసే మార్గం లేదు. ప్రస్తుతం మీలోని అన్ని శక్తులు మీరు నేను అని పిలుచుకునే ప్రతి అంశం బయట వైపే ఉంది. ఎప్పుడైతే మీలో ఆ తపన మొదలైనప్పుడు మీరు తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మీరు నిజంగా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు నాకు తెలుసు ఈ తెలుసుకోవాలనే కోరిక కొన్నిసార్లు ఉబికి వచ్చి మళ్ళీ రోజు వారి హడావిడిలో కలిసిపోతుంది ఇది తెలుసా మనసు శరీరం యొక్క స్వభావం
(16:24) ఎలాంటిది అంటే జీవితంలోని అతి సరళమైన ప్రక్రియలు కూడా చాలా చిక్కుముళ్ళు వేయగలవు చిన్న విషయాలు ఉదయాన్నే లేవడం కర్టెన్లు తీయడం పళ్ళు తోముకోవడం టాయిలెట్ వాడటం టిఫిన్ ఇఫ్ యు వర్క్ వర్క్వాట్ఎవర్ దీస్ లిటిల్ థింగ్స్ మిమ్మల్ని బాగా చిక్కుల్లో పడేయగలవు. లేచిన క్షణం నుండి టిఫిన్ ముగించేసరికి ఫినిషంగ్దర్ బ్రేక్ఫాస్ట్ వచ్ యusజఏ questionన్ట చాలామంది తీవ్రమైన అలజడిలో ఉంటారు.
(17:11) నిజమా కాదా అవునా ఇంకా ఏమీ జరగలేదు ఇంకా ఏ విపత్తులు రాలేదు మీ బాస్ ని ఇంకా కలవలేదు తెలుసా [నవ్వు] ఇంకా ఏమీ జరగలేదు కేవలం మీ భార్యను మీ భర్తను లేదా మీ పిల్లలను చూశారు. మీకు వాళ్ళ ట్రిక్లన్నీ తెలుసు. అవునా వాళ్ళతో కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు వాళ్ళ ట్రిక్లన్నీ మీకు తెలుసు మీకు కొత్తగా అనిపించేది ఏమీ లేదు.
(17:47) అవునా కాదా కొన్ని నెలల్లో లేదా ఏడాదిలో వాళ్ళు వేయగల ట్రిక్లన్నీ మీకు తెలిసిపోవాలి. అయితే టిఫిన్ బల్ల దగ్గరికి చేరకముందే లేదా తినడం ముగించకముందే ప్రజలు తీవ్రమైన అలజల్లో ఉంటారు. ఇది మీ జీవితంలో ఏదో తప్పు జరిగిందని కాదు ఆ రోజులో ఇంకా ఏమి తప్పు జరగలేదు. ఇది కేవలం మనసు యొక్క సహజ స్వభావం అది. మీరు దాన్ని పెత్తనం చలాయించనిస్తే అలాగే అవుతారు ఇంకో దారి లేదు.
(18:27) జీవిత పరిస్థితులు బాగా జరుగుతున్నాయా లేదా బాగా జరగట్లేదా దాంతో సంబంధం లేదు. అయితే ఇదే మీ మనసు స్వభావం అయితే జీవితం ఇలాగే సాగిపోతుంటే ఖచ్చితంగా సమయం వచ్చింది. కచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికీ ఆసన్నమైన తరుణం వాళ్ళు చూడాలి వాళ్ళు తమ జీవిత స్వభావాన్ని చాలా లోతైన దృక్పదంతో చూడాలి. చాలా లోతైన అంతర్దృష్టితో అవునా కాదా సమయం ఆసన్నమైంది అవునా సమయం ఆసన్నమైంది అనే విషయం చాలామందికి తెలియదు వాళ్ళు వచ్చే ఏడాది చేయొచ్చని అనుకుంటారు.
(19:11) వాళ్ళు రెండేళ్ల తర్వాత చేయొచ్చని అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు మీ జీవితానికి విలువనిస్తే సమయం వచ్చింది. మీ జీవితానికి విలువని ఇవ్వకపోతేనే సమయం రాలేదు అవునా కాదా ఈ జీవానికి ఈ సృష్టికి ఏమాత్రం విలువనిచ్చినా సమయం కచ్చితంగా వచ్చింది. జీవితాన్ని దాని పరమావధి దృక్పదంతో చూడాలి. లేదంటే బహుశా సమయం ఉండొచ్చు మీ ముందు అనంత కాలం ఉంది నిజంగా తొందరేమీ లేదు.
(19:43) తపన మొదలైతే మీలో నిజంగా తపన మొదలైతే నిజంగా మీ హృదయం తెలుసుకోవాలని పరితపిస్తే అజ్ఞానం వల్ల కలిగే బాధ మీకు తెలిసినప్పుడు అజ్ఞానం వల్ల కలిగే బాధ మీకు నిజంగా తెలిసినప్పుడు అప్పుడు గురువు ఉదయిస్తాడు మీరు ఆయన కోసం వెతకాల్సిన పని లేదు ఎందుకంటే if you are known to know తెలుసుకోవాలనే మీ తపన నిజంగా మీలో నిర్దిష్ట తీక్షణతను అందుకుంటే అజ్ఞానం వల్ల కలిగే బాధ నిజంగా తెలుసా నిజంగా మీలోకి లోతుగా నాటుకుపోతే
(20:28) ఆయనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. పేపఐన టుసేదిస్ నేను కలిసే వారి కంటే భౌతికంగా ఎప్పుడూ కలవని వారికే ఎక్కువ మందికి దీక్ష ఇచ్చాను. ఎందుకంటే మీరు భౌతికంగా కలిసే ప్రజలతో ఓ ప్రతిబంధకం ఉంది ఓ అడ్డంకి ఉంది. ఆ ప్రతిబంధకం ఏమిటంటే అవతల వ్యక్తి కూడా ఓ వ్యక్తే మీలాగే ఆయనకు మీలాగే శరీరం ఉంది మీలాగే తింటాడు మీలాగే మాట్లాడతాడు ఇది ఒక ప్రతికూలత
(21:14) ఎందుకంటే మీరు ఆయనను అంచనా వేయకుండా ఉండలేరు. మిమ్మల్ని మీరు రక్షించుకోకుండా ఉండలేరు. ఆ విషయాలన్నింటిని ఆపలేరు తెలుసా ఓ వ్యక్తిని కలిసినప్పుడు లేదా మీ చుట్టూ ఉన్న ప్రజలతో ఉండే ఈ మామూలు విషయాలను ఆపలేరు. కాబట్టి ఓ అడ్డంకితో ప్రారంభిస్తున్నారు. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. చాలాసార్లు ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళ పద్ధతులు ప్రక్రియలు బోధనలు ఊపందుకున్నాయి వారు ఉన్నప్పుడు చాలా అరుదుగా ఊపందుకున్నాయి చాలాసార్లు వాళ్ళు వెళ్ళిపోయాకే
(21:58) ఎందుకంటే ఉన్నట్టుండి మీరు ఇంకా వాళ్ళ వ్యక్తిత్వంతో పోరాడాల్సిన పని లేదు తెలుసా చనిపోయిన వాళ్ళు ఎప్పుడూ సౌ సౌకర్యవంతమే [నవ్వు] దాదాపు అన్నిసార్లు ఇలాగే జరిగింది. గురువు భౌతికంగా చనిపోయాకే గొప్ప ఆధ్యాత్మిక తరంగాలు ఉద్భవించాయి. ఎందుకంటే ఆయన భౌతికంగా బతికున్నప్పుడు మీకు సమస్యలు సమస్యలు, సమస్యలు, సమస్యలు ఎంత అనుభవం కలిగినా పట్టింపు లేదు.
(22:34) ఎన్నో క్షణాల్లో మీకు నచ్చని ఒక మాట మీకు నచ్చని ఒక చర్య మీకు సరికాదనిపించే ఒక విషయం చాలు ఓ గోడ లేస్తుంది. అండ్ ఇంకా చాలా తక్కువ మంది గురువులకే వాళ్ళకు నచ్చినట్టు చేసే స్వేచ్ఛ లభించిద్ది. వాళ్ళకు ఏది సరింది అనిపిస్తే అది చేసేలా అదర్వైస్మోస్ట్ అదర్ పీపుల్ హట workర్క్ లేదంటే మిగతా చాలామంది సమాజంలో అప్పటికే ఉన్న విలువలు నైతికతలు వారి చుట్టూ ఉన్న అర్థం లేని విషయాల మధ్యనే దానిలోనే వాళ్ళు పని చేయాల్సి వచ్చింది.
(23:16) దానిలో మీరు చేయగలిగింది చాలా తక్కువ. అవకాశం చాలా తక్కువ. మీ అవగాహన పరిమితుల్లో ఉండి అంతిమాన్ని అన్వేషిస్తే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీరు ఓ ప్రతిబంధకాన్ని మోస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా తెలుసా అది ఇలా ఉంటుంది. ఒకసారి ఇద్దరు మనుషులు అడవిలో వేటాడుతున్నారు. తెలుసా అడవిలో వేటకు వెళ్ళారు. ఒకరు పెద్ద చెక్క పంజరాన్ని మోస్తున్నాడు.
(23:53) ఇంకొకరు కాంక్రీట్ స్తంభాన్ని మోస్తున్నాడు. ప్రయాసపడుతూ వెళ్తున్నారు రెండు బరువైనవే అడవిలో నడుస్తున్నారు. ఇంకా కాంక్రీట్ స్తంభం ఉన్న వ్యక్తి కొంతసేపటి తర్వాత ఇలా అడిగాడు. ఈ చెక్క పంజరాన్ని ఎందుకు మోస్తున్నావ్ అన్నాడు. ఆ వ్యక్తి ఏదైనా క్రూరములుగా దాడి చేస్తే నేను పంజరంలోకి వెళ్ళిపోతాను సురక్షితంగా ఉంటాను అన్నాడు.
(24:25) [నవ్వు] సరే నడుస్తూ వెళ్ళారు. అడవిలో చాలా ప్రయాసపడుతూ వెళ్ళారు. అప్పుడు ఇంకో వ్యక్తి నువ్వెందుకు కాంక్రీట్ స్తంభం మోస్తున్నావ్ అని అడిగాడు. ఈ వ్యక్తి క్రూరమృగం దాడి చేసినప్పుడు నేను కాంక్రీట్ స్తంభాన్ని పడేసి వేగంగా పరిగెత్తగలను అన్నాడు. [నవ్వు] ప్రజలు ఎన్నో కారణాల వల్ల కాళ్ళు ఈడుస్తూ ఉంటారు. కానీ చాలామంది కాళ్ళు ఈడుస్తూ ఉంటారు.
(25:04) ఒకసారి టైం స్క్వేర్ లో ఇలా జరిగింది తెలుసా ఈ విషయాలు అక్కడే జరగగలవు. [నవ్వు] ఒక వ్యక్తి తన కుడికాలు ఈడుస్తూ నడుస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఎదురుగా వచ్చాడు అతను కూడా తన కుడికాలు ఏడుస్తున్నాడు. మొదటి వ్యక్తి అతన్ని చూశాడు. సరే ఇంకో వ్యక్తి కూడా కుడి కాలు ఏడుస్తున్నాడు. ఒకరికొకరు దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని చూసి తన కుడికాలు వైపు చూపిస్తూ 1968 వియత్నాం అన్నాడు.
(25:46) [నవ్వు] ఇంకో వ్యక్తి తన కుడికాలు వైపు చూపిస్తూ కుక్కమలం 20 అడుగుల దూరంలో అన్నాడు. [నవ్వు] [నవ్వు] [నవ్వు] [నవ్వు] కాబట్టి మీరు ఎందుకు కాళ్ళు ఈడుస్తున్నారు అన్నది మారొచ్చు కానీ కాళ్ళు ఈడుస్తున్నప్పుడు మీరు నడవరు చేరాల్సిన చోటుకు చేరరు. ఇందాక ఎవరో చెప్తున్నారు.
(26:35) ఎవరో ఒక నిశ్చితమైన అడుగు వేసి ఆధ్యాత్మిక మార్గంలోకి 100 శాతం దూకాలనుకుంటున్నారు. ఇతను ఓ కానీ ఈ వ్యక్తికి 18 ఏళ్లే మరీ చిన్న వయసు కాదా రెండేళ్ల తర్వాత చేస్తే సరిపోదా ఓ రెండేళ్లలో ఎంత విపత్తు జరగొచ్చో తెలుసా మీకు 18 నుండి 20 ఏళ్ల మధ్య ఎన్ని విపత్తులు జరిగాయి [నవ్వు] రెండేళ్లలో మీరు ఎంతగా దారి తప్పవచ్చు అంటే బహుశా తిరిగి కోలుకోలేనంతగా అవునా రెండేళ్ళు రెండు రోజుల్లో ప్రజలు దారి తప్పిపోవచ్చు రెండు గంటల్లో ప్రజలు దారి తప్పిపోవచ్చు అవునా
(27:21) తపన వచ్చినప్పుడు ఇంకో రెండేళ్ళు లేదా రెండు రోజులు లేదా రెండు గంటలను ఆలోచిస్తే అది పోయినట్టే అది పోయినట్టే మీరు ఎరుకతో అప్రయత్నంగా చిక్కుకోకుండా గా ఉన్నప్పుడు ఇంకా మీ మేధస్సు కొంత స్పష్టతతో పని చేస్తున్నప్పుడు మీరు ఏది ఎంచుకుంటే మీ జీవితంలో దాని వెంటే వెళ్ళాలి. మీరేదో విషయంలో చిక్కుకున్నప్పుడు మీరేదో విషయంలో లీనమై చిక్కుకున్నప్పుడు మీ మనసు మీ శరీరం మీ చుట్టూ ఉన్న ప్రతిదీ వేరేలా చెప్తుంది అది కాదు ముఖ్యం.
(28:04) ఇంకా మీ మనసు స్వభావం ఏమిటంటే ప్రతిరోజు అది వేరు వేరు విషయాలు చెప్తుంది అవునా కాదా ఎందుకంటే మీరు మనసు అని దేన్ని అంటున్నారో దానికి మీతో సంబంధం లేదు. అది మీరు బయట నుండి పోగు చేసుకున్న ఒక సంచితం మీరు దాన్ని ఎన్నో చిన్న చిన్న ముక్కలుగా పోగు చేసుకున్నారు కాబట్టి అది ముక్కలు ముక్కలుగా మాట్లాడుతుంది. దయచేసి చూడండి చాలా మనసులు ప్రపంచంలోని 99.
(28:43) 9% 9 శాతం మనసులు కేవలం ముక్కలు ముక్కలుగా మాత్రమే పొంతనగా మాట్లాడగలవని నేను చెప్తాను. ఎడతెరిపి లేకుండా సాగే సంభాషణ అంతా పూర్తిగా అర్థరహితమే అవునా కదా మీ మనసులో నిరంతరం నడిచేది మీరు దేనితోనో గాఢంగా మమైకమైపోవడం వల్లే అలా జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని క్షణాలు మాత్రమే కాస్త అర్థవంతంగా అనిపిస్తాయి. ఎందుకంటే మీరు పోగు చేసుకున్నదంతా బయట నుండే ఇంకా ఈ పోగు చేసుకునే ప్రక్రియ ఎప్పుడూ ముక్కలు ముక్కలుగానే జరిగింది.
(29:22) వాటన్నింటిని ఏకం చేసి ఒక సంపూర్ణ రూపాన్ని ఇవ్వడానికి మీరు ఎంత ప్రయత్నించినా అది అసాధ్యం. దాన్ని వేరుపడనిస్తే దాన్ని పక్కన పెట్టడం నేర్చుకుంటే అప్పుడు నిరంతరాయంగా ఒక అర్థవంతమైన ప్రవాహం ఉంటుంది. మనసు లోతుల నుంచి మనసుకి ఆవల నుండి కానీ మనసు నుండి నిరంతరాయమైన వివేచన ఎప్పటికీ రాదు అది కేవలం ముక్కలు ముక్కలుగానే రాగలదు మెరుపుల్ల ఈ మెరుపులు స్ఫూర్తి కావచ్చు కానీ ఎప్పటికీ మార్గదర్శకత్వం కాలేవు అక్కడక్కడ వచ్చే మెరుపు కేవలం స్ఫూర్తి కాగలదు కానీ ఎప్పటికీ మార్గదర్శకత్వం కాదు
(30:09) కేవలం వస్తూ పోయే వెలుగును పట్టుకొని అది అక్కడక్కడ మెరుస్తుంటే దాంతో ఎక్కడికైనా నడవలేరు కదా అది వెలుగుతూ ఉంటే అప్పుడు నడవగలరు. ఆగి ఆగి వెలిగే లైట్ కేవలం ఒక స్ఫూర్తి కాగలదు ఓహో వెలుగు అనేది ఒకటి ఉంది అని చెప్పడానికి కానీ ఆ వెలుగు ఉపయోగపడదు మీకు మంచి టార్చ్ లైట్ గా పనికి రాదు. ఇష్టానుసారం ఆగి ఆగి వెలుగుతుంటే అవునా అది కేవలం ఓహో వెలుగు అనేది ఒకటి ఉంది దాన్ని అన్వేషించడం విలువైనదే అని మీకు చెప్తుంది.
(30:44) అంతే అది మార్గదర్శకత్వం కాలేదు కేవలం స్ఫూర్తి మాత్రమే కాగలదు. నమస్కారం సద్గురు మానసికంగా మరింత ఎరుకతో ఎలా ఉండాలి? మనసు ఎరుకతో ఉండలేదు కేవలం మనసు వల్లే మీరు ఎరుక లేకుండా అయ్యారు. మనసు యొక్క కార్యకలాపమే మీలోకి ఎరుకలేమిని తెచ్చింది. కాబట్టి మనసు ఎరుక కలిసి ఉండే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీ జీవితానుభవం మనసు పరిమితులకు అతీతంగా ఉన్నప్పుడు అప్పుడు మీరు నిజంగా ఎరుకతో ఉంటారు.
(31:30) మనసుకు పదునుగా ఉండే సామర్థ్యం ఉంది అది అలా ఉంటేనే మంచిది. [నవ్వు] లేకపోతే చాలా జోకులు మీ గురించే ఉంటాయి. [నవ్వు] మీరు జోకును మిస్ అయితే మీరే జోక్ అవుతారు అవునా [నవ్వు] అలా జరగనివ్వకండి కాబట్టి మనసు పదునుగా ఉండాలి కానీ మీతో సమస్య ఏమిటంటే మీ మేధస్సు పదునుగా ఉన్నప్పుడు మీరు దాంతో తీవ్రంగా మమేకమైపోతారు చూడండి
(32:14) మీకు సరిగ్గా లేని శరీరం ఉంటే మీరు దేహరహితం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మీకు మంచి శరీరం ఉంది. లేదా కనీసం నలుగురు దృష్టిని ఆకర్షించే శరీరం ఉంది. ఇప్పుడు మీరు దేహరహితం గురించి ఆలోచించడం లేదు కేవలం దేహం గురించే ఆలోచిస్తున్నారు అవునా మొత్తం సంస్కృతుల ప్రజలకు అదే జరిగింది. ప్రజలు దేహానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ వెళ్లే కొద్దీ వారికి సంబంధించిన ప్రతిదీ దేహం గురించే అవుతుంది.
(32:55) ఇప్పుడు చాలా వరకు పూర్తిగా కాదు కానీ చాలా వరకు ఇది పాశ్చాస్య సమాజాలకు జరిగింది. దేహం అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. ఇప్పుడు కేవలం ప్రకటనల తీరును గమనించండి చూడండి మీరు ఒక సమాజంలోని ప్రకటనల సంస్కృతిని గమనిస్తే adడ్వటైజంగ్ cల్చure ఇన్ aసocైటీ ప్రజలను ఏది ఆకర్షిస్తుందో మీకు అర్థమవుతుంది. ప్రజల మనసుల్లో ప్రధానమైన విషయం ఏమిటో తెలిసిపోతుంది.
(33:32) ఎందుకంటే ప్రకటనల ఉద్దేశ్యం అమ్మడే ఏదైనా అమ్ముడు పోవాలంటే అది మిమ్మల్ని ఆకట్టుకోవాలి అవునా యు టేక్ ఎనీథింగ్ సువాసన వంటి సూక్ష్మమైన దాన్ని తీసుకోండి సువాసన ఒక సూక్ష్మమైన విషయం కానీ ఈ సువాసన అంతా శృంగారం గురించే అవునా అవునా కాదా మనం మాట్లాడుకుంటున్న పరిమళాల రకాలు సువాసనల రకాలు అన్ని లైంగికతను ప్రేరేపించడం లేదా లైంగిక వాంఛను ఉత్తేజపరచడం గురించే అవునా కాదా నేను మాట్లాడేది ప్రకటనల గురించి [నవ్వు]
(34:20) [నవ్వు] కాబట్టి సువాసన శారీరక సుఖాలు పొందడానికి ఒక పెద్ద ఉపకరణంగా మారింది. అవునా అదే విషయం మీరు తూర్పు సంస్కృతులను చూస్తే సువాసన ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన భాగం ఏ దేవాలయం ఏ ప్రార్థన మందిరం ఏ పూజ గది ఏ ఏ చిన్న దైవ సన్నిధి అయినా అక్కడ ఒక రకమైన సువాసన ఉంటుంది. అది ఏమాత్రం దేహానికి సంబంధించింది కాదు. కేవలం సువాసనలను ఉపయోగించే ఈ సరళమైన అంశాన్ని సాంస్కృతికంగా గమనిస్తే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు దేహం వైపా లేదా దేహానికి ఆవలా అన్నది అక్కడే స్పష్టంగా తెలుస్తుంది ఇది ప్రతి విషయంలోనూ ఇంతే
(35:06) సంగీతం తీసుకోండి నేటి ఆధునిక సంగీతం అంటే ఆ వేదిక మీద వాళ్ళు ఒక పురుషుడు స్త్రీ చేయగలవన్నీ నిలువు భంగిమల్లో చేస్తున్నారు బట్టలతోనే అనుకోండి అవునా కాదా ఇక అందులో అసలు సారమే లేదు ఇదంతా భౌతిక శరీరం గురించే అవునా ఇకపై బాగా పాడగలిగినంత మాత్రాన మీరు సంగీతకారులు కారు మీరు శరీరాన్ని మెలికలు తిప్పగలగాలి. అవునా కాదా కాబట్టి ఈ రకమైన పోకడ నేను ప్రతిదాన్ని అనట్లేదు కానీ ప్రధాన పోకడ గురించి చెప్తున్నా కేవలం ఉదాహరణలుగా చెప్తున్నాను
(35:51) నేను ఎవరిపై ఏ ముద్ర వేయడం లేదు. అదే శాస్త్రీయ సంగీతం ఎప్పుడూ భౌతిక పరిమితులను అధిగమించడం గురించే ఉండేది. క్రైస్తవ జీవన విధానంలో దేవుని సైతానున్ని రెండు పరస్పర విరుద్ధమైనవిగా చెప్తారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు దేవుని సైతాన్ని పరస్పర విరోధులుగా నిలబెట్టినప్పుడు వాళ్ళు సమానులు అవుతారు వారి వారి అధికారాల్లో వారి వారి పరిధుల్లో అవునా కాదా కదా మీకు అది నచ్చదు ఎందుకంటే ఎక్కడో ఆ అవగాహన లోపించింది మీరు సైతాను దేవుడికి వ్యతిరేకం అన్న క్షణంలోనే దాని అర్థం వాళ్ళద్దరూ సమానులని ఇంకా అందుకే చాలాసార్లు వాడే గెలుస్తాడు
(36:40) [నవ్వు] కాబట్టి దేవుడు సైతాను అని చెప్పబడుతున్నది కేవలం ఇదే భౌతికమైంది సైతానుగా భావించబడుతున్నది భౌతికానికి అతీతమైనది దేవుడిగా భావించబడుతున్నది. ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా చూడటం మొదలు పెట్టగానే మీ ఆకాంక్ష లేదా మానసిక అవగాహన ఎల్లప్పుడూ సరే భౌతికమైన దాన్ని ఎలా అంతం చేయాలి అనే ఎందుకంటే సైతాన్ని చంపాలనుకుంటున్నాం.
(37:13) భౌతికతను నాశనం చేయలేరు. భౌతికతను నాశనం చేస్తే లేదా నాశనం చేయడానికి ప్రయత్నించిన అప్పుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని మీరే రూపుమాపుకుంటారు. మీరు వికలాంగులు అవుతారు. మీరు దెబ్బ తింటారు వికృతంగా మారుతారు మీరు స్వేచ్ఛ పొందరు మీరు విముక్తి చెందరు. కాబట్టి ఒకటి మరొక దానికి వ్యతిరేకం అనే ఈ ప్రాథమిక అవగాహనే మనసులో ఒక పెద్ద సమస్యను సృష్టిస్తుంది.
(37:47) ఇది దానికి విరుద్ధం అది దేనికి విరుద్ధం అని మీరు అర్థం చేసుకున్న తర్వాత వాటిలో దేని వైపు మొగ్గు చూపినా రెండో దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు అస్తిత్వంలోని ఒక సగాన్ని అంగీకరించకపోతే ఇక మీకు అతీతమైన దాని గురించి తెలుసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీ మనసులోని వలను గమనించండి ఈ విషయంలో మీరు ఎలా చిక్కుకుపోతున్నారు ఇదంతా వక్రమైన బోధనల వల్ల వక్రమైన అవగాహనల వల్ల ఇదంతా పరిపక్వత లేని ప్రజలు అన్ని రకాల అహంకారులు దేవుని దూతలుగా నిలబడటం అన్ని రకాల
(38:33) అహంకారులు తామే దేవుని సొంత మనుషులమని చెప్పుకోవడం ఒకదానికి ఒకటి వ్యతిరేకతను సృష్టించడం వల్లనే కాబట్టి ఆ విధంగా నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు ఋతుంభర అంటే ఈ విశ్వానికే మూలమైంది. ఋత్ అంటే విశ్వానికి పునాది కాబట్టి విశ్వానికి పునాది అయింది మంచి చెడు రెండు కలిగి ఉంటుంది. లేదా దానికి ఏది మంచి ఏది చెడు అనే భేదం లేదు అది కేవలం సృష్టిని సృష్టిగా చూస్తుంది.
(39:14) అది దేన్ని అందమైనదిగా అందవికారంగా చూడదు అది దేన్ని మంచి చెడులుగా చూడదు అది దేన్ని దేవుడు దయ్యంగా చూడదు. అది ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తుంది. అదే ఎరుక. మనసు విచక్షణతో మాత్రమే పని చేయగలదు లేకపోతే మనసు నిరుపయోగం. ఒక సాధనంగా మనసు మీకు ఉపయోగపడేది కేవలం అది ఏది మంచి ఏది చెడు ఏది ఒప్పు ఏది తప్పు అని విచక్షణ చూపగలదు కాబట్టే అవునా లేకపోతే మనసు వల్ల ఉపయోగం ఏమిటి మీ మనసు వల్ల ఏ ఉపయోగం లేదు కాబట్టి మనసు ఒక కత్తి లాంటిది మీ దగ్గర కత్తి ఉంటే అది పదునైన కత్తి అయితే మంచిది.
(40:00) ఎవరో పదునైన కత్తి ప్రమాదకరం అన్నారని మీరు మొద్దు కత్తి పట్టుకుని తిరుగుతారు. అప్పుడు ఇది నిరుపయోగం అవును పదునైన కత్తి ప్రమాదకరమే మీరు అజాగ్రత్తగా ఎవరికైనా తగిలిస్తే వారిని చంపొచ్చు లేదా మీకు ఏదైనా చేసుకోవచ్చు సాధ్యమే కానీ మీ దగ్గర కత్తి ఉంటే అది పదునైన కత్తి అయి ఉండాలి నిజంగా పదునైన కత్తి అవునా ఎందుకంటే దాన్ని కత్తిలా వాడాలనుకున్నప్పుడు అది పదునుగా ఉండాలి లేకపోతే అది చేయాల్సిన పనులను చేయాల్సిన విధంగా చేయదు.
(40:32) కానీ పదునైన కత్తి కేవలం కోయగలదు. వస్తువులను అతికించలేదు. అవునా పదునైన కత్తి కేవలం విభజించగలదు పదునైన కత్తులు ఏకం చేయలేవు. కాబట్టి అది యోగాకు సాధనం కాదు యోగా అంటే కలయక యోగా అంటే ప్రతిదాన్ని ఒకటిగా చేయడం ప్రతిదాన్ని అలా ముక్కలు కోసి దాన్ని ఒకటిగా చేయలేరు కదామో అండ్ మోర్ యు యూస్ఇట్దమోర్ అండ్ మోర్ పీసస్ you have in yourు lifeఫ ప్రపంచంలోని మేధావులకు జరిగింది అది వాళ్ళు అందరికంటే ఎక్కువ గందరగోళంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
(41:13) మొద్దు కత్తులు ఉన్నవాళ్ళు జీవితాన్ని ఒకింత ఎక్కువ శాంతిగా ఆనందంగా జీవిస్తున్నారు. అవునా పదునైన కత్తులు ఉన్నవాళ్ళు ఈ లోకంలో పూర్తిగా దిక్కు తోచకుండా ఉన్నారు. కేవలం దాన్ని ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో తెలియదు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రతిదాని మీద వాడతారు. ఎందుకంటే వాళ్ళు తమ కత్తి పదునుతో ఎంతగా గుర్తింపు ఏర్పరచుకున్నారంటే వాళ్ళకు ఏది దొరికినా దాన్ని వాడతారు ప్రజలు దాన్ని తమ గురువుల మీద కూడా వాడుతున్నారు అవునా అది పని చేయదు కానీ వాళ్ళు వాడతారు.
(41:46) [నవ్వు] ఆయన్ని కూడా శల్య పరీక్ష చేసి ఏది ఒప్పో ఏది తప్పో తేల్చాలనుకుంటారు. అది నిరుపయోగం. కానీ ప్రజలు చేస్తారు వాళ్ళు ఎంత ఎక్కువ వాడితే అంతగా తాము దిక్కుతోచకుండా పోతున్నట్లుగా భావిస్తారు. ఎందుకంటే మీరు మీ కత్తిని ఎంత ఎక్కువ వాడితే ప్రపంచం అంత చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. ఇక అకస్మాతుగా నిలబడడానికి చోటు ఉండదు. ఎందుకంటే ప్రతిది అంత చిన్న రేణువుగా మారింది.
(42:15) కాబట్టి ఎరుక మీరు మీ ఎరుకలోకి వెళితే అస్తిత్వపు ఏకత్వం అనే అనుభూతి మీలో ఉప్పొంగుతుంది. మీరు మనసులోకి వెళితే ప్రపంచాన్ని ముక్కలుగా చేసే విచక్షణలోకి వెళ్తారు. కాబట్టి ఈ రెండు పూర్తిగా భిన్నమైనవి. అజ్ఞానులు ఎప్పుడూ మనసు యొక్క ఎరుక గురించి మాట్లాడుతుంటారు. అలాంటిది లేదు ఎందుకంటే యుగాలుగా అజ్ఞానం ఈ గ్రహాన్ని పరిపాలించింది. ఇంకా పరిపాలిస్తూనే ఉంది.
(42:49) ఎప్పుడుదమఫోర్సస్ఇన్ దప్ానెట్హల్స్ beీన్ఆగ్నరన్స్ ఈ గ్రహం మీద ఎప్పుడు అజ్ఞానమే ఆధిపత్యం వహించింది ఎరుక కాదు దురదృష్ట వశాత్తు ఇంకిత జ్ఞానం కూడా కాదు చాలా సులభంగా మనం ఈ ప్రపంచంలో కాస్త ఇంగిత జ్ఞానాన్ని తీసుకురావచ్చు ఎందుకంటే అది మనసుతో చేయగలం. ప్రపంచాన్ని ఎరుకగలదిగా మార్చడం అది పూర్తిగా వేరే పని దానికి కావలసింది సామూహిక జ్ఞానోదయం సామూహిక జ్ఞానోదయం ఎలా నేను మీకు ఒక విషయం చెప్పగలను కానీ మీలో
(43:37) కొందరు భయపడి ఇప్పుడే వెళ్ళిపోవాలి అనుకుంటారు. నేను హామీ ఇస్తున్నాను నాకు సామూహిక జ్ఞానోదయం కలిగించే ఉద్దేశాలు ఏవి లేవు సరేనా కానీ చెప్తాను ఇది చాలా అందమైన అందమైన ఉదాహరణ. మీరు దీన్ని విశాలతో చూడగలిగితే ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ లో మీకు ఈ దిశలో కొన్ని చాలా ప్రతికూల అనుభవాలు ఉన్నాయి. నేను ఇది పలకగానే మీలో కొందరు కలవర పడతారు.
(44:06) ఇది జరిగింది ఏ శతాబ్దమో నాకు గుర్తులేదు సుందరమూర్తి నయనార్ ఎవరైనా తమిళ ప్రజలు ఉన్నారా ఎక్కడో ఏడు ఎనిమిది శతాబ్దాల క్రితం ఆయన ఒక జ్ఞాని ఆయన ఒక బాలయోగి ఆరేళ్ల వయసులో తెలుసా తన ఆధ్యాత్మిక పార్శ్వాన్ని చాలా అందమైన రీతిలో వ్యక్తపరిచారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బోధించలేరు కాబట్టి ఆయన పాడుతున్నారు. ఆయన తన జ్ఞానోదయాన్ని పాడుతున్నారు. చాలా అందమైన
(44:53) రీతుల్లో దానిలో చాలా భాగం నమోదు కాకుండా పోయింది. నమోదైన కొద్ది భాగమైన అపారమైన సౌందర్యంతో ఉంది. ఆయన యువకుడైనప్పుడు ఏడు శతాబ్దాల క్రితం భారతదేశంలో ఉన్న సంస్కృతి ప్రకారం ఆయన కొంచెం రాజవంశానికి చెందినవారు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవాలి. కాబట్టి కుటుంబం రాజ్యం ప్రతిదీ ఆయన్ని పెళ్లి వైపు నిడుతున్నాయి. కానీ ఆయనకు అలాంటి ఉద్దేశాలు లేవు.
(45:31) 14 ఏళ్ళు 14 కంటే ఎక్కువ ఉన్న ఆయనకు ఇంకా అలాంటి ఉద్దేశాలు లేవు. ఆ దిశలో ఆయనకు ఎలాంటి కోరిక లేదు. కానీ సామాజిక బలవంతాలు కుటుంబ బలవంతాలు ఆయన్ని ఆ దిశగా నడిపిస్తున్నాయి. అప్పుడు ఆయన ఒక నిర్దిష్ట అమ్మాయిని గుర్తించారు. ఇంకా ఈ అమ్మాయి అయితే చేసుకుంటానేమో అన్నారు. లేదు ఆయనకు వేరే ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన ఈ అమ్మాయి అంటున్నది ఆమె అందరికంటే అందంగా ఉందనో లేదా ఆమె ఏదో అనో కాదు ఆయనకు వేరే ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమెను
(46:15) ఒక సాధనంగా చూస్తున్నారు ఇంకేదో చేయడానికి ఆ అమ్మాయి ఆమె కూడా ఒక రాజవంశం నుండి వచ్చింది కానీ అది చాలా దూరం ఇంకా ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి పడదు తెలుసుగా మామూలే ఎప్పుడూ అలానే ఉంటాయి ఇంకా అవన్నీ జరుగుతాయి ఇంకా ఆ అమ్మాయి ఆమెకు కేవలం ఐదో ఆరేళ్ల వయసులో ఎంత ఆధ్యాత్మికంగా మారింది ంటే వాళ్ళు ఆమెను ఇంట్లో ఉంచలేకపోతున్నారు కాబట్టి ఎనిమిదేళ్ల వయసులో ఆ సమయంలో ఇలా చేయడం భారతదేశంలో అసాధ్యమైన విషయం ఇప్పుడు కూడా కష్టం ఎలాగో ఎనిమిదేళ్ల వయసులో తన తల్లిదండ్రులను వారణాసికి పంపమని
(46:59) ఒప్పించింది. వారణాసి వారణాసికి భారతదేశం ఉత్తరభాగంలో ఉంది ఆధ్యాత్మికతను అభ్యసించడానికి ఎనిమిదేళ్ల అమ్మాయికి ఆ రోజుల్లో అది సాధించడం అసాధ్యం అది ఓ రాజ కుటుంబంలో కాబట్టి ఆమె అక్కడికి వెళ్లి తన సమయాన్ని అక్కడ గడిపింది. తర్వాత ఆమెకు 13 లేదా 14 ఏళ్ల వయసులో ఆమె గురువు అక్కడ ఆమెకు బోధించేవారు. ఆమెతో ఏమైనా విధి ఈ దిశలో కదులుతోంది అన్నారు.
(47:36) ఎందుకంటే 13, 14 అంటే తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి కోసం చూస్తున్నారు. గురువు ఈయన ఉన్నారు సుందరమూర్తి నయనారు ఉన్నారు నువ్వు ఆ దిశగా వెళ్లడం మంచిది విషయాలు వేరే విధంగా జరుగుతాయి చింతించకు అన్నాడు. గురువు సాధారణంగా ఆయన అలా చేయకూడదు. ఆయన ఈ పెళ్లి రహస్యాన్ని ఆమెకు వెల్లడించారు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఒప్పుకుంది.
(48:04) ఆమె కూడా తన జీవితంలో పెళ్లి గురించి ఆలోచించట్లేదు కానీ ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని ఆమెకు ఇప్పుడు తెలిసింది. అలాగే పెళ్లి గురించి ఆయనకు వేరే ఆలోచనలు ఉన్నాయని తెలిసింది. ఆమె వచ్చేసింది. ఎలాగోలా కుటుంబాలు రాజీ పడ్డాయి ఎందుకంటే వాళ్ళద్దరు ఎంత అసాధారణమైన వాళ్ళఅంటే అందరూ చూడగలరు వారికి అప్పటికే పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు వాళ్ళు ఇంకా పిల్లలుగా ఉన్నప్పుడే కాబట్టి పెళ్లి ఖాయమైంది.
(48:34) పెళ్లికి దక్షిణ భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించారు. 3వేల మందికి పైగా ప్రజలు సమావేశం అయ్యారు. ఆ వివాహం కోసం ఆ పెళ్లి కోసం సుందరమూర్తి నయనార్ ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఈ విషయం తెలుసో లేదో కనీసం భారతీయ మూలాలు ఉన్న ప్రజలైనా సరే మీకు ఇది తెలుసో లేదో. పెళ్లి జరుగుతున్నప్పుడు భారతదేశంలో పెళ్లి వేడుక ఎలా ఉంటుందంటే పూజారి అన్ని రకాల విషయాలను గొణగుతూ ఉంటారు.
(49:10) వాటిని మీరు ఎప్పుడూ పట్టించుకోరు. [నవ్వు] ఆయన గొనుగుతున్నది ఏమిటంటే ఈలెస్ ఏదో మిమ్మల్ని కలిపింది బహుశా మీ హార్మోన్లు కావచ్చు ఏది మిమ్మల్ని కలిపింది అన్నది ముఖ్యం కాదు ఏదో మిమ్మల్ని కలిపింది ఈ కలయక అంతిమ కలయకకు దారి తీయాలి. మొత్తం వేడుక అది స్త్రీ పురుషుల మధ్య ఉండే ఈ సాధారణ ఆకర్షణ మీరు అత్యున్నత ఐక్యాన్ని చేరుకోవడానికి ఒక తపనగా ఒక మార్గంగా ఒక పద్ధతిగా మారుగాక అని ఆ ఐక్యమే యోగ లేదా జ్ఞానోదయం లేదా మీరు ఏ పేరుతో పిలిచినా సరే మొత్తం పెళ్లి వేడుక అదే హిందూ జీవన విధానంలో అలాగే
(49:55) ఉంటుంది. చాలామంది ప్రజలు హార్మోన్లను దాటి వెళ్లరు అది వేరే విషయం. బహుశా భావోద్వేగాలు వాళ్ళు భావోద్వేగాలను దాటి వెళ్లరు. వాళ్ళకు సహేతుకంగా ఆహ్లాదకరమైన భావోద్వేగాలు ఉంటే అది విజయవంతమైన వివాహంగా భావిస్తారు అవునా ఇద్దరు వ్యక్తుల మధ్య సహేతుకంగా ఆహ్లాదకరమైన భావోద్వేగాలు ఉంటే అది విజయవంతమైన వివాహంగా భావిస్తారు.
(50:22) కానీ అసలైన వివాహ ప్రక్రియ అంతిమ కలయకను లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం భావోద్వేగ కలయక లేదా హార్మోన్ల సంతృప్తి కోసం కాదు అంతిమ కలయక కోసం చూస్తోంది. కాబట్టి సుందరమూర్తి నయనార్ పెళ్లి గురించి ఆయనకు వేరే ఉద్దేశాలు ఉన్నాయి. ఇది ఒక అంతిమ కలయగ్గా మారాలని ఆయన కోరుకున్నారు. కేవలం తనకు తన వధువుకే కాదు వచ్చిన అతిథులందరి కోసం ఉదారమైన వ్యక్తి [నవ్వు] ఏం జరిగిందంటే ఆ తరుణం వచ్చినప్పుడు ఆయన ఒక వాతావరణాన్ని సృష్టించారు.
(51:06) అక్కడ అందరూ పెళ్లి అతిథులు ఇక అతిథులుగా లేరు. వాళ్ళందరూ అక్కడ ఉన్న ఆ కొన్ని గంటల్లోనే తీక్షణమైన ఆధ్యాత్మిక సాధకులుగా మారారు. ఇక ఒక తరుణం వచ్చింది. వాళ్ళందరూ తమ అంతిమత్వాన్ని కనుగొన్నప్పుడు వాళ్ళు తమ శరీరాలను అక్కడే విడిచిపెట్టారు. ఇప్పుడు 3000 పైచిలుకు దేహాలకు మీదే బాధ్యత. ఆయన కూడా ఆయన ఆయన వధువు కూడా వెళ్ళిపోయారు. కూల్ ఎయిడ్ లాంటిది కాదు.
(51:34) [నవ్వు] ఇక్కడ జరిగింది ఏమిటంటే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను ఆ పార్శవంలోకి తీసుకెళ్ళారు. పెళ్లికి హాజరైన కొద్ది గంటల సమయంలోనేషాపరిఫస్ beఫ అక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది. 3వేల మందికి పైగా ప్రజలు పూర్తిగా జ్ఞానోదయం పొందారు. వాళ్ళు పూర్తి స్పృహతో తమ శరీరాలను విడిచిపెట్టారు. మూడు శతాబ్దాల తర్వాత మరో కవియోగి వచ్చారు.
(52:10) ఆయన వల్లే సుందరమూర్తి నయనార్ గురించి మరింతగా వింటున్నాం. వల్లారు వల్లారు గురించి విన్నారా కనీసం తమిళ ప్రజలైన వల్లారు వాపోయారు ఓ ఆ పెళ్లిలో ఉండే అవకాశం నాకెందుకు దొరకలేదు నేనెందుకు ఆహ్వానితుడిని కాలేదు? నేను నా ఆధ్యాత్మికత కోసం ఇలా కష్టపడాల్సి వస్తుంది. నన్నెందుకు ఆ పెళ్లికి ఆహ్వానించలేదు అని చాలా అందంగా చాలా కవితాత్మకంగా వాపోయారు అనేక శతాబ్దాల తర్వాత చింతించకండి మాకు అలాంటి ఉద్దేశాలు లేవు ఎందుకంటే మీలో కొందరు చిన్నవాటికే చాలా ఆందోళన పడతారని నాకు తెలుసు మాకు అలాంటి ఉద్దేశాలు లేవు నేను చెప్తున్నది ఏమిటంటే అర్థం
(52:55) చేసుకోండి. మీరేం వెతుకుతున్నారో మీకు స్పష్టత ఉండాలి. మీరేం వెతుకుతున్నారో మీకు స్పష్టత లేనప్పుడు మీరు ఎప్పుడూ ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేసేవాళ్ళు స్పష్టంగా ఎక్కడికి వెళ్లరు. మీరు ముందుకు నడిస్తే అది అందంగా ఉంటుంది. మీరు వెనక్కి నడిస్తే కనీసం మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుస్తుంది.
(53:26) కానీ మీరు ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేస్తుంటే జీవితాంతం ఒక గందరగోళంలోనే మిగిలిపోతారు. మీ జీవితం ఒక నిరాశగా మిగిలిపోతుంది. అవునా కాబట్టి ఒకవేళ మీరు వెనక్కి నడవాలని ప్లాన్ చేస్తుంటే మీరు తప్పుడు ప్రదేశంలో ఉన్నారు. మీ ప్లాన్ ఇదైతే ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి అయితే మీరు ఇక్కడ ఉండటం విషాదకరం ఒకవేళ మీరు ముందుకు నడవాలని ప్లాన్ చేస్తుంటే స్పష్టంగా ఉండాలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరేం వెతుకుతున్నారు ఈ స్పష్టత రాకపోతే నేను ఈ అంశంపై ఎందుకు పదే పదే నొక్కి
(54:10) చెప్పాలంటే నేను దీని గురించి ఎక్కడ మాట్లాడినా ఎంత మాట్లాడినా అది సరిపోదు. ఎందుకంటే ప్రపంచంలోని మతం అని పిలవబడేవి గ్రంథాలు అని పిలవబడేవి ఇంకా స్వీయ పరివర్తన పరిశ్రమ దీన్ని పూర్తిగా గందరగోళం చేసేసాయి. మీలో ప్రతి ఒక్కరు ఏదో సమయంలో ఈ మూలాల నుండి కొన్ని ముక్కలను తీసుకున్నారు. అవునా అవి ఇప్పటికీ మీలో ఆటలు ఆడుతూనే ఉన్నాయి అవునా కాదా ఒకసారి ఇలా జరిగింది.
(54:57) ఇద్దరు మతాధికారులు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఓ సైన్ బోర్డు ఉంది. అంతం సమీపంలో ఉంది. ఆలస్యం కాకముందే మీ దారిని మార్చుకోండి అని రాసిఉంది. ఒక వేగంగా వెళ్తున్న కారు వచ్చింది. అతను ఇది చూసి కిటికీలోనుంచి తల బయట పెట్టి మత చాందస్సులారా మమ్మల్ని వదిలేయండి. అని వేగంగా వెళ్ళిపోయాడు. ఆ మూల దాటి వెళ్ళాడు.
(55:32) ఆపై కీచుమని టైర్ల శబ్దం ఒక పెద్ద క్రాష్ వినిపించింది. మతాధికారుల్లో ఒకరు ఇంకొకరితో బహుశా బోర్డు మీద ముందు బ్రిడ్జ్ కూలిపోయింది అని రాయాలేమో అన్నాడు. [నవ్వు] [సంగీతం]
No comments:
Post a Comment