రామాయణ కాలంలో అత్యంత బలశాలి ఎవరు ?
గరికిపాటి వారు ధైర్యం అంటూ ఏమీ ఉండదు, ఎదుటివాడి పిరికితనమే వీడి ధైర్యం అన్నారు. అలాగ బలం అంటూ ఏమీ ఉండదు, ఎదుటి వాడి బలహీనతే ఇతని బలం.
ఎవరి బలాలు, బలహీనతలు వారివి. ఏ బలం అని చూడాలి. దేహబలమా, బుద్ధిబలమా?.
రామాయణంలో ఉన్న ఓ చిన్న విషయం చూద్దాం:
ఇంద్రజిత్ ఓ రాత్రి యుద్ధంలో రామలక్ష్మణులతో సహా వానరసైన్యాన్ని చితక్కొట్టేసి " యుద్ధం అయిపోయింది, అందరూ చనిపోయారు " అని వెళ్ళి చెబుతాడు రావణుడితో. విభీషణుడికి మతిపోతుంది. ఓ దీపాన్ని పట్టుకుని అసలు ఎవరైనా మిగిలి ఉన్నారా అని చూడడానికి బయలుదేరతాడు. ఒకచోట హనుమ కనిపిస్తాడు. అమ్మయ్య అనుకుని ఇద్దరూ కలిసి కొంచెం ముందుకు వెడతారు. జాంబవంతుడు మూలుగుతూ పడుకుని ఉంటాడు. " తాతా కుశలమా " అని విభీషణుడు అడిగితే ఆయన " హనుమ కుశలమా " అని అడుగుతాడు.
విభీషణుడు ఆశ్చర్యపోయి " అదేమిటి తాతా రామలక్ష్మణుల గురించి అడుగుతావనుకుంటే హనుమ గురించి అడిగావు " అని. ఆయన అంటారు " హనుమ కుశలంగా ఉంటే మనకు అంతా క్షేమమే, నష్టమే లేదు, అతను కుశలంగా లేకపోతే మనకు ఒరిగే ఏ ప్రయోజనమూ లేదు " అని. హనుమ ఒక్కడుంటే చాలని. హనుమ కన్నీళ్ళతో " నేను కుశలమే తాతా " అని జాంబవంతుడి కాళ్ళకు నమస్కారం పెడతాడు. అవీ హనుమ శక్తిసామర్ధ్యాలు.
కాని హనుమకు ఆయన శక్తిసామర్థ్యాలు ఎవరో ఒకరు జ్ఞాపకం చేస్తూ ఉండాలి.
రావణుడి సలహాదారు అకంపనుడు ఖరదూషణాదుల వధ గురించి చెబుతూ " రాముడి బలమంతా అతని భార్య సీతమ్మే. వీలయితే ఆమెను అపహరించు, రాముడు డీలా పడిపోతాడు" అంటాడు రావణుడితో.
భగవంతుని అనుగ్రహం కొండంత బలం.
శుభమస్తు
No comments:
Post a Comment