*Touch to view full image:*
*First Generation:*
పిల్లలు పెరిగే వయస్సులో, తల్లితండ్రులకు,
బ్రతుకు తెరువు కోసం పరిగెత్తడం తో సరిపోయింది.
పిల్లలు ఎప్పుడు పెరిగారో,
ఎలా పెరిగారో, వారికి
తెలియనే లేదు.
ఆకలిని జయించి,
అవసరాలను సాధించి,
వెనక్కు తిరిగి చూసుకుంటే,
పెంచుకోవడానికి పిల్లలు లేరు.
పెరిగి పెద్దవారై ఎగిరిపొయ్యారు
వృద్ధాప్యం కౌగిలి లోకి చేరిన తల్లితండ్రులు, చురుకుగా జీవించలేరు.
రేలంగి గారి మాట ఒకటుంది.
"రాళ్ళు తిని అరిగించుకునే వయస్సులో, బఠాణీలకు డబ్బుల్లేవు. ఇప్పుడు వజ్రాలు కొనగలను. మరమరాలు తింటే అరగటం లేదు".
గ్రామాలు వదిలి, బ్రతకడం కోసం బయటకు వచ్చిన మొదటి తరం బ్రతుకు లన్నీ ఇంతే అనుకుంటా.
ప్రభుత్వం నుంచి,
సమాజం నుంచి,
ఎటువంటి సహాయ సహకారాలు లేకున్నా .....
అవరోధాలు ఎన్ని వచ్చినా .....
ఆకలి సంకెళ్ళు తెంచుకుని,
స్వశక్తి తో శ్రమిస్తూ బ్రతికి,
పిల్లల్ని బ్రతికించుకుని,
వారిని ఎంతో కొంత ఎత్తున,
స్వశక్తి తో నిలబెట్టారు.
జీవితం లో అదే గొప్ప విజయం అనుకోవాలి.
✓ వెనుక బడిన గ్రామాలనుంచి,
✓ పేదరికం నుంచి,
✓ చదువెరుగని కుటుంబం నుంచి, వచ్చి
✓ స్వశక్తి తో, శ్రమశక్తి తో, పెరిగిన, మొదటి తరం పోరాట యోధులకు వినమ్ర వందనం.
✍️ గాంధీ మందడి.
03.05.2026

No comments:
Post a Comment