*ఈ రోజు ఆలోచన 28-06-2026*
మీకు లాభమైనా నష్టమైనా, మీరు సంతృప్తిని కలిగి ఉండాలి! ఇది చాలా అవసరం. సంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది, పెంచుతుంది. సంతృప్తి చెందిన మనసుకు జీవితం అంతులేని పండుగలా ఉంటుంది, కానీ కోరికతో బాధపడే మనసుకు విశ్రాంతి ఉండదు. కోరిక మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు, ఏకాగ్రత అసాధ్యం. కోరిక మీ శరీరంలోని అగ్ని వంటిది; అది మిమ్మల్ని బూడిదగా మార్చేస్తుంది. సంతృప్తి దాన్ని నాశనం చేయడానికి సమర్థమైన ఔషధం.
ఎండలో అలసిపోయి చెమటలు కక్కుతున్న బాటసారిని చల్లని సెలయేటి నీళ్ళలో స్నానం ఎలా ఉత్తేజపరుస్తుందో, అలాగే దురాశ అనే మండే అగ్నితో బాధపడేవాడు సంతృప్తి అనే స్వచ్ఛమైన జలాలతో ఉత్తేజితుడవుతాడు! సాక్షాత్కార మార్గంపై మాత్రమే కోరిక కలిగి ఉండాలి. ప్రపంచంలోని నీచమైన కోరికల కోసం జీవితాన్ని అంకితం చేయకూడదు. అన్నింటినీ భగవంతునికి అర్పించండి; అదే నిజమైన సంతృప్తి. అది మనశ్శాంతి, సంతోషం, విచారణను పొందడం వల్ల కలిగే ఫలితం. అప్పుడు, భగవంతుని ప్రత్యక్ష దర్శనం (సాక్షాత్కారం) కూడా సాధ్యమే! *(ధ్యాన వాహిని, అధ్యాయం 10)*
*భగవంతుని నామస్మరణ, ధ్యానం మాత్రమే సంతృప్తిని పొందే ఏకైక మార్గాలు.*
*- శ్రీ సత్య సాయి బాబా*
No comments:
Post a Comment