కామాఖ్య అంబుబాచి - నిజాలూ అబధ్ధాలూ - అసలు రహస్యాలు | Ambubachi Myths vs Reality | Nanduri Srinivas
Author Name:Nanduri Srinivas - Spiritual Talks
Youtube Channel Url:https://www.youtube.com/@NanduriSrinivasSpiritualTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c7mT-SNZwtk
Transcript:
(00:03) [సంగీతం] శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ కామాక్ష క్షేత్రంలో అంబుబాచి జరిగింది అంటే అది అక్కడే కాదు దేశం అంతటికీ పండుగే అమ్మవారి భక్తులందరూ పులకించిపోయే పండుగ ఎందుకండి అక్కడ అలా జరుగుతుంది అంటే స్త్రీ యొక్క రజస్వలా కాలం కూడా గౌరవనీయమే అని అమ్మవారు మనందరికీ తెలిపేదే అంబుబాచి పండుగ సామాన్యంగా అంబుబాచి అనగానే జనాలు ఇంట ఇంటర్నెట్ లో నోటికివచ్చిన పుకార్లు అన్నీ చెప్పేస్తున్నారు ఏది దొరికితే వాళ్ళకే చెప్పేస్తున్నారు అంతే అమ్మవారి పీఠం నుంచి ఎర్రటి నీళ్ళ వస్తాయి బ్రహ్మపుత్ర నదిలో నీళ్లు ఎర్రగా మారిపోతాయి ఇలా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా YouTube
(00:43) యూనివర్సిటీ నుంచి వచ్చినవి మనం మీకు తెలుసు కదా ప్రతి క్షేత్రానికి వెళ్లి అక్కడ రీసెర్చ్ చేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తూ ఉంటాం పురాణంలో ఉన్నది చరిత్రలో ఉన్నది అక్కడ ఏం జరుగుతోంది అని అలాగనే ఇక్కడ కూడా అంబుబాచి గురించి ఇప్పుడు మీకు అన్ని నిజాలు చెప్తాను అంబుబాచి మీద మీరు ఇప్పటిదాకా ఇలాంటి వీడియో విని ఉండరు అందుకని ఓపిక్గా వినండి.
(01:05) ఇంతకే అది ఎప్పుడు జరుగుతుంది అంటే తొందరలో వస్తుంది కదా ఎప్పుడు అంటే అస్సాం క్యాలెండర్ ప్రకారం వాళ్ళ ఆషాడ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు జరుగుతుంది ఆ వేడుక అప్పుడు ఆర్ద్రా నక్షత్ర యుక్తమై ఉండాలన్నమాట ఆ సమయం సామాన్యంగా ఎప్పుడు జూన్ జూలై నెలల్లో వస్తూ ఉంటుంది అదేమిటి అంటే అమ్మవారి రజస్వలా కాలం అమ్మవారు భూస్వరూపం కదా మీకు మొట్టమొదటి చరిత్రలో కూడా చెప్పా అందుకని అప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాంతాల్లో ఎవ్వరు పొలం పనులు తవ్వకాలు అవి చేయడం మానేస్తారు అసలు ఆ ప్రాంతంలోనే కాదు భారతదేశంలోనే ఎవ్వరు చేయొద్దు అని పరమేశ్వరుడు చెప్పింది కూడా ఉంది ఆ సమయంలో చేయకూడదు అంతే కదా అసలు కామాఖ్య ప్రాంతంలో
(01:43) ఉన్న సాధకులుయితే వాళ్ళందరికీ అమ్మవారు అంటే ప్రాణం అంతే వాళ్ళు ఏం చేస్తారు ఆ నాలుగు రోజులు వండిన పదార్థాలు ఏమి తినరు తల దువ్వుకోరు భూమిపైన బరువైనవి పెట్టరు అలాగేనే పాపం భూమికి ఎక్కడ తగులుతుందో అని మునివేళ్ళ మీద ఇలా తేలిగ్గా నడుస్తారు. ఈ అంబుబాచి అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి విత్తనాలని ధరించడానికి సిద్ధం అవుతుంది అప్పుడు మళ్ళీ వ్యవసాయం అవన్నీ మొదలు పెడతారున్నమాట ఈ అంబువాచి అంటే ఇందుకే ఆ పేరు ఎలా వచ్చిందండి ఇదేదో మీకు ఆ లోకల్ నేమ్ అనిపిస్తుంది కదా కాదు పురాణంలో కూడా ఆ పేరు ఉంది పరమేశ్వరులే రెండు మూడు సార్లు చెప్పిన ప్రామాణికమైన శ్లోకాలు
(02:19) కూడా ఉన్నాయి దేవీ భాగవతంలో అంబువాచి త్యాగదినే గృహారంభే ప్రవేశనే పాపి తటాకారంభేచ గృహేచ కృషికర్మణి అని పరమేశ్వరుడు చాలా చాలా శ్లోకాలు అందించిన ఉన్నాయి అంటే అంబుబాచి సమయంలో ఎవ్వరు కూడా గృహారంభం గృహ ప్రవేశాలు అలాగేనే బావులు తవ్వడాలు అలాంటివి ఏవి చేయకండి వ్యవసాయం అవేమి చేయకండి అని పరమేశ్వరుడు చెప్పింది అక్కడ అంబువాచి అని ఉంది మనకి ఆ ఈశాన్య రాష్ట్రాల్లో వాని బా కింద పలుకుతారు కదా బెంగాల్ వాళ్ళు వీళ్ళందరూ మీకు తెలుసు అందుకే అంబువాచి కాస్త అంబు బాచి అయింది కానీ పేరు మాత్రం దేవీ భాగవతంలో చాలా సరే ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ ఏం జరుగుతుంది
(02:56) ఆ మూడు నాలుగు రోజులు అంటే ఆ మూడు రోజులు ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు. మూసేందుకు ముందురోజు రాత్రి పూజారులు ఏం చేస్తారు అంటే ఒక ఎర్ర బట్టని తీసుకువెళ్లి ఆ యోని పీఠం మీద కప్పుతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి YouTube యూనివర్సిటీలో అందరూ తెల్ల బట్టని కప్పితే అది ఎర్ర రంగులోకి మారిపోతుంది ఇది పచ్చి అబద్ధం అక్కడ వాళ్ళు ఎర్ర బట్టనే తీసుకువెళ్లి కప్పుతారు.
(03:21) కప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆ బట్ట కొంచెం పెద్దది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు గుర్తుగా తీసుకోవడానికి ఆ బట్ట మీద అక్కడఉన్న పాండాలు ఉంటారు కదా వాళ్ళు కొంతమంది వాళ్ళ పేర్లు రాసి అలాగే దానికి అంటించి ఉంచుతారు. ఉంచి అక్కడ కప్పి ఉంచుతారు ఆ తర్వాత బయటికి వచ్చేస్తారు ఆలయం మూసేస్తారు ఆ మూడు రోజులు మాత్రం పూజలు గాని బలులు గాని ఇంకా ఏమి జరగవు అలాగే మామూలు భక్తులు కూడా వెళ్లరు వెళ్ళకూడదు కూడా ఆ మూడు రోజులు సాధకులకి మాత్రమే అని తంత్రశాస్త్రంలో కచ్చితంగా చెప్పారు అది సాధనకి మంత్ర సాధనకి అనువైన రోజులు అది మామూలు భక్తులు వెళ్లి అక్కడ కోరికలు వాటి కోసం వెళ్ళకూడదు ఎందుకంటే
(03:56) అమ్మవారే రజస్వల కాలంలో ఉన్నారు ఉన్నప్పుడు అమ్మవారిని అమ్మ నాకు ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అంటే ఎవరు ఎరికైనా ఏ స్త్రీకైనా కోపం వస్తుంది కదా అది అసలు మామూలుగా కోరికల కోసం వెళ్ళే సమయం కాదు అంబుబాచి సమయం కేవలం కేవలం మళ్ళీ చెప్తున్నా సాధకుల కోసం మాత్రమే అందుకనే ఆ మూడు రోజులు పోటఎత్తిపోకండి అక్కడికి సాధకులని వెళ్ళనివ్వండి వాళ్ళు హాయిగా మతసాధన చేసుకుంటారు.
(04:18) అప్పుడు నాలుగో రోజు ఏం చేస్తారంటే ఆలయాన్ని తెరిచాక మొట్టమొదట పూజారులు వెళ్లరు. ఎందుకంటే అప్పుడే అమ్మవారు రజస్వల సమయం నుంచి బయటిక వచ్చారు కదా వాళ్ళ భార్యలు వెళ్తారు వెళ్లి ఆలయం అంతా శుభ్రం చేశక పూజారుల కళ్ళకి గంతలు కట్టి వాళ్ళని చెయి పట్టుకు తీసుకువెళ్తే వాళ్ళు ఇందాక కప్పిన బట్టని చూడకుండా వెళ్లి ఆ బట్ట తెచ్చుకుంటారు. భార్యలు వాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళడానికి సహాయం చేశాక ఆ తర్వాత భార్యలే యోని పీఠం మొత్తాన్ని శుద్ధి చేసి ఎంత అదృష్టం ఆ తల్లులది వాళ్ళకి అమ్మవారు ఇచ్చారు హక్కు అదంతా అయిపోయాక అప్పుడు ఆలయం తెరుస్తారు ఇంక అంతే యావత్ భారతదేశం నుంచి భారతదేశం
(04:53) ఏంటి అన్ని దేశాల నుంచి లక్షల్లో జనాలు పోటెత్తిపోతారు అమ్మవారిని చూడాలి చూడాలి చూడాలి అంటే ఎందుకండీ అంత ఆతృత సంవత్సరం అంతా చూడొచ్చు కదా రజస్వలు అయ్యాక పక్క తెరిస్తే ఏమిటి అంత ఆతృత అంటే ఆలోచించండి ఒకసారి రజస్వల ధర్మాన్ని పాటి పాటించే ఇళ్లు ఉంటాయి సదాచారాన్ని పాటించే ఇళ్ళు ఆ ఇళ్లల్లో చూడండి పిల్లలు కొంచెం రెండు మూడు ఏళ్ళు వచ్చాక ఒరేయ్ మీ అమ్మని ముట్టుకోకూడదురా వాళ్ళ అమ్మ రజస్వల అయింది అనుకోండి పక్కన ఒక గదిలో కూర్చోబెట్టి మీ అమ్మని ముట్టుకోకూడదు అని చెప్పి ఆ మూడు రోజులు వాళ్ళ నాన్నే చూసుకుంటాడు పంపించారు పిల్లల్ని ఆ పిల్లలు అమ్మ కోసం
(05:24) వెర్రెత్తిపోతే నాలుగో రోజు అమ్మ స్నానం చేసి ఇంటికి రాగా అని పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టేసుకొని అమ్మ అమ్మ అమ్మ అని ఆ రోజంతా అమ్మ చుట్టూ తిరుగుతారా అలాగనే ఆ పిల్లాడికి ఆవిడ అమ్మ అయితే ఇవి జగజ్జనని మరి అమ్మ మూడు రోజులు కనిపించలేదుంటే మనందరం పిల్లలం మనకు ఆతృత ఉంటుంది కదా గట్టి గా వెళ్లి అమ్మని పట్టేసుకొని అమ్మ ఇంకెప్పుడు ఇలా దూరం పెట్టకమ్మ అమ్మో మూడు రోజులు నీ దర్శనం లేదమ్మ అన్నట్టుగా ఉంటుంది అమ్మ బాచి చూస్తే అసలు అక్కడ జనమందరూ కూడా అమ్మవారి మీద ప్రేమతో అలా ఊగిపోతారు అంతే ఆ రోజు తెరిచిన రోజు అమ్మవారు ఏ వరం అడిగితే అది ఇస్తుంది అని
(05:59) నమ్మకం అందుకని భక్తులు అక్కడికి పోటెత్తిపోతారు. పాండాలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు తెచ్చుకున్న బట్ట ఉంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళకి బాగా పరిచయమైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాయత్తుల్లో పెట్టుకొని కట్టుకుంటారు అది దగ్గర ఉంటే ఎటువంటి దుష్టశక్తులు దరిదాపుల్లోకి రావు అని అందరికీ నమ్మకం ఇది అంబు బాధ్య అంటే ఇప్పుడు అర్థమైంది కదా ఇక నిజా నిజాలు ఏమిటి ఇందులో YouTube యూనివర్సిటీలో చెప్పేవి అసలు నిజాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
(06:27) మొట్టమొదటిది ఏమిటంటే అమ్మవారి పీఠం నుంచి ఈ మూడు రోజులు రక్తం వస్తుంది అని కొన్ని వీడియోల్లోనూ ఎర్రటి జలం వస్తుంది అని కొన్ని వీడియోల్లో చెప్పారు ఈ రెండు కూడా పూర్తిగా అబద్ధమే ఆ పీఠం నుంచి ఎప్పుడు జలం వస్తూ ఉంటుంది అది మీకు చెప్పాను కదా బ్రహ్మగారు సృష్టించినప్పటి నుంచి వస్తూనే ఉంటుంది ఇప్పటికీ వస్తుంది. ఆ జలం ఏదైతే వస్తుందో అదే జలం వస్తుంది.
(06:50) అది ఎప్పుడు కూడా కొంచెం పింక్ కలర్ లో ఉంటుంది. ముందుగా ఇక్కడ చూడండి మేము ఒక సీసాలో తెచ్చుకున్నాం మీరు గమనిస్తే ఫోటోలో లైట్ పింక్ కలర్ లో ఉంటుంది. అలాగే వస్తుంది తప్ప ఈ మూడు రోజులు ఎర్రగా మారిపోవడం ఇదంతా కూడా YouTube లో సృష్టించిన పుకారం. ఇంకా రెండవది తెల్ల బట్ట కప్పుతారు తీసుకువెళ్ళండి కప్పితే ఆ రక్తానికి అదంతా ఎర్ర బట్టగా మారిపోతుంది ఇది కూడా ఏమిటంటే చూడండి అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు అలాగా ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తున్నారు ఎర్రబట్టనే కప్పుతారు వాళ్ళు ఆ ఎర్రబట్ట అలాగే బయటికి తడిసిపోయి ఉంటుంది తీసుకొస్తారు అంతే తప్ప ఇంకేమీ
(07:22) జరగదు. ఇంక మూడవది ఇంకా పెద్ద అబద్ధం ఏమిటి అంటే బ్రహ్మపుత్ర నదిలో నీరు ఈ మూడు రోజులు ఎర్ర రంగులోకి మారిపోతుంది అని అయ్యో బాబోయ్ ఇక్కడైతే YouTube వీడియోలు చూస్తే మీరు సైంటిస్టులే కళ్ళు తాలేసే అద్భుతమైన మహిమ సైంటిస్టులు అది ఏమిటో కనిపెట్టలేక చేతులుఎత్తి తీసారని నోటికి వచ్చినవన్నీ చెప్పారు ఇదంతా శుద్ధ అబద్ధం ఆ నీరు ఏమి అలా అవ్వదు ఒక్క ఘాట్లో మాత్రం వీళ్ళు తీసుకెళ్లి ఏదో పూజ చేశక కుంకుమ కలుపుతారు ఆ కుంకుమ కలిపిన కాసేపు అలా కనిపిస్తుంది తప్ప బ్రహ్మపుత్రాన్ని నీళ్ళు ఎర్రగా మారడం ఇదంతా అబద్ధం కావాలంటే అక్కడికి వెళ్లి చూసుకోండి
(07:56) చూపిస్తున్న బొమ్మలన్నీ కూడా ఏ ఇమేజెస్ అంబుబాచి సమయంలో ఏ ఆలయంలోన కూడా అలా జలం ఎర్రగా అవ్వదు ఎప్పుడూ వచ్చే విధంగానే వస్తుంది. అంటే ఏవండీ YouTube లో అంత వందల మంది చెప్పారండి అదంతా మేము నమ్మడం మానేసి నడ్డూరి గారు చెప్పింది ఒక్కటి ఎలా నమ్మాలిని గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తే తప్ప ఆలయాల గురించి చెప్పను అక్కడికి వెళ్లి ఎంతో మంది సాధకులతోను ఎంతో మంది పాండాల్ని వాళ్ళని తరచి తరచి అడిగాక అప్పుడు నిజాలు తెలిసేయి దానికి మీకు ఒక ప్రూఫ్ కూడా చూపిస్తా ఇదిగో ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్ చూడండి ఇది రాజీవ్ శర్మ గారు అని వారు అక్కడ
(08:32) ఆలయంలో ప్రధానమైన పూజారుల్లో ఒకరు అలాగే చండి ఉపాసకు రోజు అక్కడ చెడ్డీ పాఠం చదువుతారు వాళ్ళు అలాగేనే వారికి రీసెర్చ్ ఓరియెంటెడ్ ఈ టచ్ కూడా ఉందన్నమాట అందుకే వెబ్సైట్ పెట్టి కామాఖ్య మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎంతో సహకరిస్తూ ఉంటారు వాళ్ళు ఆ వారు ఆ వెబ్సైట్ లో క్లియర్ గా పెట్టారు చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ అబద్ధాలేనని వారు కూడా పెట్టారు అలాగే నేను అక్కడికి వెళ్లి కచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నా అందుకని ఎవ్వరు చెప్పినా వినకండి అవన్నీ ఇంకా మీకు ఇంకొకటి చూపిస్తాను నాకు చాలా సంతోషించేది అంబుబాచి అనగానే గుర్తొచ్చా ఏమిటంటే సామాన్యంగా కామా కామాఖ్య అమ్మవారిని ఎలా
(09:06) భావించాలి సాధకులు అంటే ఇదిగో యోనిపీఠం కాకుండా ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపం మీకు తర్వాత వీడియోలో చెప్తాను అది ఏమిటి అనేది ఇదిగో ఇక్కడ చూపించే స్వరూపం మరి అంబుబాచి సమయంలో అమ్మవారు రజస్వలు అయినప్పుడు ఎలా భావించాలండి అంటే నాకు తెలుసు ఒక యువ సాధకుడు ఉన్నాడు అతను చాలా బాగా సాధన చేస్తాడు నాకు బాగా పరిచయమే కుర్రవాడు అతను నాకు ఒక అద్భుతమైన ఫోటో చూపించాడు చూడండి ఎంత బాగుందో మామూలుగా అమ్మవారు ఎప్పుడు తిపురు సుందరే కానీ ఇప్పుడు మాత్రం ఇలాగ ఒక గోడ వెనకాల కూర్చుని అలా చూస్తూ ఉంటుంది రజస్వల్లాగా అమ్మవారు ఇదిగో ఆ సాధకుడు చూపించిన పటమే ఇది
(09:40) అపూర్వమైనద దర్శనం అంబుబాచి అంటే ఇదిగో ఈ స్వరూపం కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పాడు. అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి. సరే ఆఖరిగా రెండు ముఖ్యమైన విషయాలు మొట్టమొదటిది ఏమిటంటే ఆడిని అమ్మవారే [గొంతు సవరించుకోవడం] రజస్వలు అవుతుంది అది ఒక పెద్ద వేడుక అక్కడ ఇంక మన ఇళ్లల్లో ఆడవాళ్ళని దూరంగా కూర్చోబెట్టేసి అంటరాని వాళ్ళల్లా చూస్తున్నారండి ఇది ఘోరం కదా అని చెప్పి ఇంక ఈ వీడియో వినగానే ఇంట్లో కలిపేయడం మొదలెట్టారు అనుకోండి సదాచారం ఉన్నవాళ్ళు కూడాను అది చాలా పొరపాటు చేయకండి అమ్మవారినే మూడు రోజులు వేరుగా ఉంచుతున్నారు అది అమ్మవారి సంకల్పం అలాగా
(10:12) రజస్వల అనేది స్త్రీ యొక్క శరీర ధర్మాన్ని గౌరవించే పద్ధతి అంతేకాన కానీ అంటరానితనం కాదు ఒకవేళ ఎవరైనా అంటరాని వాళ్ళల్లా వాళ్ళని ఆ సమయంలో చూస్తుంటే వాళ్ళు వాళ్ళ బుద్ధిని సరి చేసుకోవాలి తప్ప స్త్రీని అలాగ చక్కగా విశ్రాంతి తీసుకొని ఇవ్వడమే సరైన పద్ధతి అమ్మవారే చేసి చూపించారు అక్కడే ఒకటి నేర్చుకోండి ఏమిటంటే ఇప్పుడు నాకు ఎంతో మంది స్త్రీలు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు ఏమిటంటే మా ఇంట్లో సత్యనారాయణ పూజ జరుగుతోందండి ఆరోజు ఉదయమే రజస్వలన అయ్యాను చెప్తే మా అత్తగారు మా ఆయన నానా తిట్లు తిడతారు అందరూ చుట్టాలు అందరూ బయట వాళ్ళు వస్తారని దాంతో
(10:45) చెప్పకుండా అలాగే పూజ చేస్ అది మహా అపరాధం కదా ఇప్పుడు ఎలా చేయాలి అది అయిన దగ్గర నుంచి ఇంక మా ఇల్లుంతా పతనం అయిపోతుంది ఇలాంటివి ఎన్ని మెయిల్స్ వస్తుంటాయి కనీసం నెలకి నాలుగుైదు మెయిల్స్ అయినా వస్తాయి ఇలాంటివి మా ఛానల్ కి ఎందుకు అలా భయపడుతున్నారు వాళ్ళు చెప్పాలి అని అంటే మీరు అలా తిడుతున్నారు కాబట్టి అంటే రజస్వల అనే నియమాన్ని మీరు గౌరవించట్లేదు ఒరేయ్ అరే గౌరవించండిరా మార్చుకోండిరా అని అమ్మవారు చెప్పడానికే అంబు బాచి అనేది ఒక పాఠం కింద మనందరికీ ఏర్పాటు చేసారు ఇంకా రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే అంబు బాచి సమయంలో లక్షల్లో వచ్చేస్తున్నారు జనం
(11:17) అక్కడ మాత్రం పిల్లల్ని వృద్ధుల్ని స్త్రీలని అలాంటి వాళ్ళని తీసుకువెళ్ళకండి ఎందుకంటే అంత తొక్కిసలాట అంత పెద్ద దాంట్లో ఏ చిన్నది జరిగినా సరే జీవితం అంతా ఇదయపోతుంది కదా అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అంతేగన అలా లక్షల్లో వెళ్ళిపోకూడదు మరి అయితే ఎలాగండి ఆ అవకాశాన్ని మిక్ చేసుకోవడం అంటే పురాణంలో ఒక మాట ఉంది అది ఇప్పటిదాకా మీకు ఎవ్వరు చెప్పలేదు ఒక పెద్ద రహస్యం నేను చెప్తా వినండి ఏమిటంటే అమ్మవారు రజస్వల అయ్యేది సంవత్సరానికి ఒకసారి కాదు నెలక ఒకసారి ప్రతిమాసం భవేద్దేవి యత్ర సాక్షాత్ రజస్వల అని పరమేశ్వరుడు తన నోటితో చెప్పిన మాట దేవీ భాగవతంలో
(11:55) పరమేశ్వరుడు చెప్పాడు ప్రతి నెల ఆద్రా నక్షత్రం రోజు అక్కడ అమ్మవారు రజస్వలు అవుతారు కానీ సంవత్సరానికి ఒకసారి వేడుకలా చేస్తారు అందుకని ఆద్రా నక్షత్రం నుంచి మీరు లెక్క పెట్టుకొని నాలుగో రోజు అక్కడికి వెళ్ళారు అంటే అంబుచి తర్వాత ఆలయానికి వెళ్తే ఎంత ఫలితమో అప్పుడు కూడా అదే ఫలితం దొరుకుతుంది. అందుకని అలా చేయండి తప్ప రద్ది ఉన్న చోట్లకి విపరీతంగా వెళ్ళిపోకండి.
(12:18) ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మేము ఈ వీడియోలు అన్నీ చేసి నేను ఏ క్షేత్రంలో అయినా ఉన్న ప్రదేశాలన్నీ విస్తారంగా చెప్తాను కదా నేను వెళ్లి రీసెర్చ్ చేసి చెప్తాను. ఎందుకో తెలుసా మొట్టమొదట నేనేమ అనుకుంటున్నానో చెప్తా వినండి నాకు వృద్ధాప్యం వచ్చాక నా పిల్లల్ని ఒరేయ్ నన్ను కామాక్షి తీసుకెళ్ళండిరా ఒరేయ్ పూరికి తీసుకువెళ్ళండిరా ఒరేయ్ తిరుమలకి తీసుకెళ్ళండిరా విజయవాడ కనకదుర్గకి తీసుకువెళ్ళండిరా అని వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు ఆ వీధి చేల్లో పెట్టుకొని తీసుకెళ్ళే అదంతా తలనెప్పి ఇప్పుడు అంతా రీసెర్చ్ చేసాం అన్నీ చూసి వచ్చాం వీడియోలు చేశం కదా చేసాక ఆ
(12:47) వీడియోలు చూసుకుని మాంసం మీద పడుకొని కళ్ళు మూసుకుని ఆ క్షేత్రం అంతటిని అలా భావించుకుంటా అందుకే నేను నాకోసం చేసుకుంటున్న వీడియోలు అలాగే మీరు కూడా అది నేర్చుకోండి ఇప్పుడు అంబుబాచి సమయంలో కామాక్ష వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మీకు తొందరలో ఆ రహస్యాలన్నీ చెప్తాను అవన్నీ చూస్తూ ఒకసారి క్షేత్రాన్ని అలాగా తిరిగి వచ్చినట్టుగా భావిస్తే దేవతలు భావనా మాత్ర సంతుష్టులు అమ్మవారు మీకు యాత్ర చేసిన మానసిక యాత్ర చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తారు.
(13:13) అందుకని ఆ విశేషాలన్నీ తొందరలో చెప్పుకుందాం శ్రీమాత్రేయం అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్ గా [సంగీతం] విభజించాం. మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
No comments:
Post a Comment