ఈ నాలుగు అంశాలను మీరు ఎలా నిర్వహిస్తారు? | How do you handle these 4 things? | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n3Ua2vxmxjs
Transcript:
(00:00) ఆహారం, కామం, నిద్ర, మరణం ఈ నాలుగిటిని ఎరుకతో నిర్వహిస్తేనే మీరు మనిషి, మరణాన్ని కూడా కలిపే చెబుతున్నాను. అప్పుడే మీరు నిజమైన మనిషి, లేకపోతే అది పరిణామ లోపం. మీరు కోతిగా ఉన్నప్పుడు మనిషి అవ్వాలని మీరు నిర్ణయించుకోలేదు. కానీ మనిషి అయ్యాక ఎలాంటి మనిషిగా ఉండాలనేది మీరే నిర్ణయించుకోవాలి. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నా చేతిలో ఏమీ లేదు అని మీరు అనుకోవచ్చు.
(00:30) అది నిజం కాదు మీకు ఛాయిస్ ఉంది ఆ ఛాయిస్ ను ఎలా వాడుకోవాలో మీరు నేర్చుకోలేదు. అది చేయండి పర్వాలేదు మీరేమి అపరాధ భావంతో ఉండక్కర్లేదు. అయ్యయ్యో నాకు కామవాంచ ఉంది అందుకే నేను ఆధ్యాత్మికవాదిని కాదు అని గిల్టీగా ఫీల్ అవ్వద్దు ఆ వాంఛ ఉంటే దాన్నే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా మార్చుకోవచ్చు. ఏదో ఒకటి మిమ్మల్ని లాక్కెళ్ళాలా? లేక మీరు డ్రైవర్ గా ఉండాలా మీరు డ్రైవర్ గా ఉంటే అదే ఆధ్యాత్మికత
No comments:
Post a Comment