దశ మహావిద్యలు అంటే ఏమిటి? 🔥 10 మహావిద్యల రహస్యం | Dasha Mahavidya series Ep1
Author Name:సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BmbEOWpCf7Y
Transcript:
(00:03) మంత్రశాస్త్రం ఎంతో విశాలమైంది. అనేక కోట్ల మంత్రాలు అందులో చెప్పబడిన ఎప్పటికీ ఎప్పటికీ మరుగున పడనటువంటి మహామంత్రసారం ఒకటి ఉంది. అదే దశమహావిద్యలు. శ్రీ గురుభ్యో నమః సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం అహం కమలానందనాథ. తంత్రశాస్త్రంలో ఎన్నో దేవీ దేవతల యొక్క శక్తి వర్ణన గురించి స్పష్టంగా తెలియజేయబడింది. ఒక బీజం దానికో లక్షణం ఉంటుంది.
(00:39) మరో బీజం దానికి తగ్గట్టు ఒక లక్షణం ఉంటుంది. ఈ బీజాల యొక్క సమన్వయం చేత ఒక కొత్త శక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది. [సంగీతం] అలా ఆవిర్భవించినటువంటి శక్తిని ఏమంటారంటే మంత్రము అని సంబోధిస్తారు. ఈ మంత్రాన్ని పునః పునః అనేక పర్యాయాలు జపం చేస్తూ ఉంటే ఆ బీజాల యొక్క సంపుటికరణ చేత కలయక చేత ఏదైతే ఉద్భవించినటువంటి శక్తి ఉందో అది ప్రేరణకు గురవుతుంది.
(01:06) అలా ప్రతి రోజు సాధకుడు ఆ మంత్రాన్ని తీవ్రంగా సాధన చేస్తూ ఉంటే ఆ మంత్రానికి సంబంధించినటువంటి పటుత్వం చైతన్యం సాధకుడికి ఆపాదించబడతాయి. ఇలా మంత్ర ప్రేరణ చేయడం వల్ల ఆ దేవీ దేవతలు సంతృప్తులై సాధకుడికి ఇంద్రియ అతీంద్రియ శక్తులని ప్రకటిస్తూ ఉంటారు అంటే ప్రాప్తింప చేస్తూ ఉంటారు ఆ శక్తులు ఉపయోగించుకుని ఇహపర సౌఖ్యాలు అనుభవించడానికి సాధకుడికి అవకాశం ఉంటుంది అయితే ఆ సాధకుడు ఎంచుకున్నటువంటిది ధార్మికమైన మార్గం అయితే ఇహానికి సంబంధించినటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆనందాలన్నీ కూడా ఆస్వాదించి చివరికి మోక్షానికి చేరుతారు ఎవరైతే కేవలం కామ్యానికే తన ప్రయోజనాలకే ప్రాధాన్యత
(01:50) ఇస్తూ ఉంటారో వాళ్ళు కేవలం ఇహానికి సంబంధించినటువంటి భోగాలు మాత్రమే పొందగలుగుతారు. గతంలో ఎందరో ఉపాసకులు దశమహావిద్యల్లో ఏదో ఒక విద్యారాజాన్ని ఎంచుకొని దీర్ఘకాలం పాటు తపస్సుతో సమానమైనటువంటి అనుష్టానాన్ని చేసి జీవితానికి సంబంధించిన సిద్ధులన్నీ పొందారు. ఈ మహా విద్యలన్నీ కూడా అతి ప్రాచీనమైన కొన్ని గ్రంథాల నుంచి గ్రహించడం జరిగింది.
(02:17) అంటే ఆయా గ్రంథాలలో వీటి యొక్క స్థితి గురించి వీటి యొక్క లక్షణాల గురించి ప్రభావాల గురించి స్పష్టంగా తెలియజేయబడ్డాయి. ఆ గ్రంథాలు ఏంటంటే బృహన్నీల తంత్రం మంత్ర మహార్ణవం శారదా తిలకం మేరుతంత్రం యామల తంత్రం ఇవన్నీ ప్రామాణిక గ్రంధ రాజాలు వీటిల్లో మహావిద్యల యొక్క వర్ణన చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో మనం చదువుకునేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇవి కాకుండా అదనంగా కొత్తగా తయారైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో రచయిత తన స్వానుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జోడించారు.
(02:51) కానీ ఇప్పుడు నేను చెప్పిన గ్రంధరాజాలు అతి ప్రాచీనమైనటువంటివి, ప్రామాణికమైనవి వీటిలో చెప్పబడిన సూత్రం తోటే దశమహావిద్యల యొక్క ప్రేరణ సాధన కొనసాగించమని శాస్త్రం తెలియజేస్తోంది. దశమహావిద్యలు అంటే లలితాదేవి, పరాంబ పరదేవత నుంచి ఉద్భవించినటువంటి పది దివ్యమైనటువంటి శక్తుల్ని దశమహావిద్యలుగా చెప్తారు. ఈ దశమహావిద్యల్లో ఒక్కోదానికి ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది.
(03:18) అంటే ఒక్కో శక్తికి ఒక్కో చైతన్యం ఉంటుంది ఎవరు ఏ కామ్యంతో అయితే సాధన చేయాలనుకున్నారో వారి కామ్యానికి తగినటువంటి మంత్ర రాజాన్ని ఎంచుకొని ప్రేరణ చేయడం వల్ల కామ్య సిద్ధి కూడా కలుగుతుంది ఎవరైతే దశమహావిద్యల్ని స్పష్టంగా సూచించని విధంగా ధార్మికంగా ఉపయోగిస్తారో వాళ్ళు ఇహంలో సమస్తమైనటువంటి యోగాలు కూడా ప్రాప్తింప చేసుకుని తర్వాత తరాలకు కూడా ఆ యోగాన్ని ప్రాప్తింప చేయగలిగిన వారు అవుతారు ఈ దశమహావిద్యలని కేవ కేవలం మంత్రాలు అని సంబోధించకూడదు.
(03:50) ఇవి పటలాలు పటలం అంటే వాటిల్లో అనేకమైనటువంటి మంత్రాలు ఉంటాయి. కాళీ పటలం అని తీసుకుంటే కాళీలో కొన్ని వందల మంత్రాలు ఉంటాయి. ఇలా దశమహావిద్యలని కేవలం మంత్రాలుగా భావించకూడదు అవి పూర్తి పటలాలు వాటికి సంబంధించినటువంటి సాంగోపాంగ వివరం తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక మహావిద్యను మాత్రమే ప్రేరణ చేయగలడు. ఇక అది అతను యోగాఆధారితం తన జీవితం పూర్తఅయ్యే లోపులో ఒక పటణలం పూర్తి చేయగలగడం అనేది యోగం చేత మాత్రమే సాధ్యం అంటే ఒక పటం అంత పెద్దగా ఉంటుందని అర్థం అలా దశమహావిద్యలకి కూడా 10 పటాలు చెప్పబడ్డాయి కాళి తార షోడసి భువనేశ్వరి
(04:32) త్రిపుర భైరవి చిన్నమస్త ధూమావతి బగళాముఖి మాతంగి కమలాత్మిక ఈ పదిటిని దశమహావిద్యలో అని చెప్తారు దశమహావిద్యల్లో మొట్టమొదట కాళీకి సంబంధించినటువంటి అభివర్ణన ఉంటుంది. అమ్మవారి యొక్క ఆవిర్భావం ఆవిడ శక్తి ఆవిడని ఎలా ప్రేరణ చేయాలి ఆవిడ ఉనికి ఇవన్నీ కూడా పటణంలో కాళీ పటణంలో స్పష్టంగా చెప్తారు. ఇక సింహీ అపరాజిత మహామంత్రాలయం తరపున ఈ యొక్క దశమహావిద్యలకు సంబంధించిన సిరీస్ కార్యక్రమం ప్రారంభమయింది.
(05:06) అంటే ఇది ప్రారంభం అయిన తర్వాత ఈ 10 మహావిద్యలకు సంబంధించినటువంటి లోతైన అంశాలు స్పష్టంగా తెలియజేయబడతాయి. అయితే ఇందులో నిగూడమైనటువంటి విషయ సారాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరైతే ఆసక్తులై మెంబర్ షిప్ లో ఉన్నారో వాళ్ళ కొరకు పూర్తి స్థాయిలో మెంబర్స్ ఓన్లీ అనేటువంటి విభాగంలో విడుదల చేయబడతాయి. కాళి కాల స్వరూపిని కాలాన్ని శాసించేటువంటి శక్తి కలిగింది.
(05:32) క్రియాశక్తి స్వరూపంగా కాళీని అభివర్ణిస్తారు. ఈ శక్తి విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. భూత పచన్ని అని పిలుస్తారు వీడిని అంటే భూతగణాలను సైతం పచనం అంటే నమిలేసేటువంటి లక్షణం కలిగింది. రక్తాన్ని చాలా ప్రీతిపాత్రంగా స్వీకరిస్తూ ఉంటుంది. యుద్ధ విద్యల్లో వెను తిరిగి చూడకుండా శత్రువుని పూర్తిగా సంహరించేటువంటి లక్షణం కలిగినటువంటి మహావిద్యగా కాళీని అభివర్ణిస్తారు.
(05:58) కాళీ అమ్మవారి సాధన చేసే వారి యొక్క లక్షణాలు కూడా క్రమక్రమంగా అలాగే ఉంటాయి అంటే అలా మారుతూ ఉంటాయి ఎందుకంటే వారిలోకి ప్రవేశించినటువంటి తత్వం ఏదైతే ఉందో తత్వం క్రమక్రమంగా వ్యక్తి యొక్క సాధకుడు యొక్క లక్షణాలని మారుస్తూ ఉంటుంది కాళి మనోవేగం కలిగినటువంటి తీవ్రశక్తి విద్యుత్ సమానమైనది ఆమె శరీరం అంతా కూడా విద్యుత్ ప్రసరిస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది అంటే అంత తేజోమయంగా కనిపిస్తుంది ఉంటుంది ఉండడానికి కాళవర్ణంలో ఉన్నప్పటికీ కూడాను శరీరానికి సంబంధించినటువంటి తత్వంలో విద్యుత్ సమానమైనటువంటి లక్షణాలు ఉంటాయి అని స్పష్టంగా తెలియజేయబడింది.
(06:39) సాధకుడి మీద శత్రుత్వం పెట్టుకున్నటువంటి వాళ్ళు సాధకుడు ఎవరి మీద అయితే శత్రుత్వం పెట్టుకుంటారో వాళ్ళని హరించి ఆ తత్వం అంటే [సంగీతం] శత్రు భావంతో తనని గాని తన సాధకుడిని గాని బలహీనపరచడానికి ప్రయత్నం చేసినటువంటి వారి యొక్క ముండాలను మెడలో వేసుకునే లక్షణం కలిగినది కాలి అందుచేతనే ఎన్నో యుద్ధాలలో అసుర సంహారం చేసిన తర్వాత వాళ్ళ శిరస్సు శిరోభాగంలో ఉండేటువంటి ముండ దానిని మాలగా ధరిస్తుంది అందుకే కాళిని ముండమాలాధరి అని పిలుస్తారు.
(07:15) కాళి కేవలం సంహార క్రియే కాదు సృష్టి క్రియను కూడా చేయగలుగుతుంది. సృష్టి క్రియ అంటే సాధకుడిలో జ్ఞానాన్ని పుట్టించగలుగుతుంది. అలాగే సాధకుడిలో ఉండేటువంటి బాహ్యమైన మోహాలు ఏవైతే ఉంటాయో వాటిని సంహరించగలుగుతుంది. అందుకే కాళీ సాధకుడు కాళీని పోలి ఉంటాడు అని చెప్తాడు సాధకుడిలో ఆత్మశక్తి ప్రాణశక్తి చైతన్య శక్తులను వృద్ధి పరచగలుగుతుంది.
(07:45) కాళి క్రీమ్ బీజ స్వరూపిని అయితే క్రీమ్ అనేటువంటి ఆ ఒక్క బీజం ఏదైతే ఉందో దానితో కూడా కాళీ మంత్రం ఉంటుంది ఏకాక్షర మంత్రం కాళీ ప్రేరణ చేయడానికి చెప్పబడినటువంటి ఏకాక్షర మంత్రం క్రీమ్ అనేటువంటి బీజం ఏదైతే ఉందో గురుముఖంగా ఉపదేశం గ్రహించినటువంటి వారు మహాకాళీ ప్రేరణ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితాలను కాళీ ప్రసాదిస్తుందో కేవలం క్రీమ్ అనేటువంటి బీజాన్ని ప్రేరణ చేయడం వల్ల కూడా అదే రకమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది.
(08:17) సాధకుడు క్రీమ్ అనేటువంటి ఒకే ఒక బీజంతో ఏ రకమైనటువంటి క్రియనైనా చేయగలడు ఉదాహరణకి షట్కర్మలు చేయగలడు. ఇతర మంత్రాలు ప్రథమ కర్మ అంటే మారణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు కానీ కాళీ ప్రోక్తాలలో ఏకబీజమైనటువంటి క్రీమ్ ఒకవేళ సాధకుడు ప్రథమ కర్మ చేయాలనుకున్న దానికి కూడా సహకరిస్తుంది. సాధకుడు ఎంచుకున్నది సరైన మార్గం కాకపోయినప్పటికీ కూడా కాళీ సాధకుడు ప్రార్థించాడు కాబట్టి కోరుకున్నాడు కాబట్టి దానిని కూడా సఫలం చేస్తుంది కాళీ ఏకబీజంతో సాధకుడు తీవ్రమైన అసురి సాధన చేయాలనుకుంటే క్రీం బీజంతో ప్రాణాయామంలో పూరకము కుంభకము రేచకము [గురకలు] వీటిల్లో ఏ రకమైనటువంటి జపమాల
(09:02) ఉపయోగించన అవసరం లేకుండా కేవలం ప్రాణాయామంలో అనుసంధానం చేసి జపం చేసేటువంటి లక్షణాన్ని పెంపొందించుకుంటే షట్కర్మలు చేసేటువంటి అధికారాన్ని సాధకుడు పొందుతాడు రాత్రికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కాళీ సాధన ఉదయ భాగంలో కూడా శ్రౌత ధర్మంలో కూడా చెప్పబడింది అలా చెప్పబడినటువంటి కాళీ నీలవర్ణంలో ఉంటుంది రాత్రి భాగంలో వామాచారంలో చేసేటువంటి కాళీ ప్రోక్తాలు కాళీ సాధనలు వాటికి సంబంధించిన ప్రయోగాలలో కాళీని కాళ వర్ణం నలుపు వర్ణంలో ఉన్నటువంటి అమ్మవారిగా భావించి ప్రేరణ చేస్తారు ఖాళీ సాధకుడు మనో వాక్ దృష్టి ఈ మూడు సంధానాలు చేయగలుగుతాడు. తన
(09:47) ఆలోచన చేస్తున్నటువంటి పనిని ఆ ఆలోచనలో ఉండగానే కార్యాచరణ చేయగలిగేటువంటి శక్తి దృష్టి తాను చూస్తూ ఉండగా తాను ఏది కోరుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా మార్చగలిగేటువంటి శక్తి వాక్ తాను ఏదైతే కోరుకుంటాడో అది అనేక పర్యాయాగాలు చెప్పడం చేత గాని ఉచ్చరించడం చేత గాని యజ్ఞ ఫలాన్ని పొందేటువంటి లక్షణం ఈ మూడిటిని కూడా పొందగలుగుతాడు కాళీ సాధనని రసజ్ఞ విద్య సంవర్గ విద్య ప్రాణ విద్య ప్రాణోద్గీత విద్య అని కూడా పిలుస్తారు.
(10:22) సాధకుడికి తీవ్రమైన శక్తిని దీర్ఘాయువుని రోగ బాధల నుంచి ఉపసమనాన్ని శత్రువు అనేటువంటి పదాన్ని కూడా తన జీవితంలో విననవసరం లేనటువంటి స్థాయిని ఖాళీ కలగజేస్తుంది. ఏ విద్యకు లేనటువంటి గొప్ప లక్షణం కర్మని దగ్ధం చేయడం ఇతర విద్యలు జపాల వల్ల దానాల వల్ల కలిగేటువంటి కర్మ దహనం ఏదైతే ఉందో దానికి పదింతలు త్వరితంగా ఖాళీ సాధకులు పూర్వం నుంచి గ్రహించి వారు ఏదైతే కర్మను అనుభవిస్తున్నారో దాని నుంచి త్వరితంగా బయటకు రాగలరు.
(10:57) అందుకే ఈవిని కర్మదగ్ధి అని కూడా పిలుస్తారు. అమ్మవారికి ఆస్వయోజ బహుళ అష్టమి చాలా ప్రీతిపాత్రమైన తిధి చాలామంది దశమహావిద్యలు ఉద్భవించింది ఆయా తిధుల్లో అనుకుంటారు. ఉద్భవించింది కాదు ప్రీతిపాత్రమైనటువంటి తిధి ఇక ఆస్వీజ మాసంలో శరణ నవరాత్రులు పూర్తయ్యాక పున్నమి తర్వాత ఎనిమిదవ రోజు ఈ తిధి వస్తుంది. ఈ తిధి రోజున ఇది సూర్యాస్తమనానికి ఉన్నటువంటి రోజు ప్రామాణికంగా తీసుకోవాలి.
(11:23) సూర్యాస్తమన సమయానికే స్నానాదులు పూర్తి చేసుకుని కాళీ అమ్మవారికి నమస్కారం చేసి ఆ రోజున భోగ నివేదనలు చేయాలి. విశేషమైనటువంటి నివేదనలు చేయాలి. వామాచారణలో చేసేటువంటి వారు సూర్యాస్తమనం తర్వాత తిధి ఉన్నటువంటి రోజున ఎంచుకుంటారు. ఇక దక్షిణాచారణలో శ్రౌత ధర్మంలో కాళీని ప్రేరణ చేసేవాళ్ళు కూడా ఉంటారు.
(11:44) వాళ్ళు ఆ తిధి సూర్యోదయానికి ఎప్పుడు ఉందో చూసుకొని ఆ రోజున ప్రేరణ చేస్తారు. చాలా సందర్భాలలో రాత్రి భాగంలో అంటే నవరాత్రిలోనే సూర్యాస్తమనానికి ప్రాశస్త్యమైనవి కదా అందుచేతను అష్టమి తిధి ఒకవేళ సాయంత్రంనాలుగు గంటలకు వస్తే కనుక ఆ రోజు రాత్రికి కలిగినటువంటి తిధి కలిగిన రోజు కాబట్టి ఆ రోజు ఉదయం నైవేద్యం పెట్టాలేమో అనుకుంటారు. మరుసటి రోజు సూర్యోదయానికి అదే తిధి ఉంటుంది కాబట్టి దక్షిణాచారణంలో చేసేటువంటి వారు మరుసటి రోజు ఉదయం మాత్రమే నివేదనలు చేయాల్సి ఉంటుంది.
(12:15) సాక్తే సంప్రదాయంలో అత్యంత తీవ్రతరమైన విద్యల గురించి మాట్లాడుకోవడం ప్రారంభం చేస్తే మొట్టమొదట చెప్పుకోదగినటువంటి విద్యారాజం కాళీ ఖాళీలో అనేక రూపాలు ఉన్నాయి ఇక కాళీ సాధన చేసినటువంటి వ్యక్తికి వాక్పటిమే కలుగుతుంది. తాను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కొన్ని మాత్రమే తాను గతంలో విన్నవి అయి ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఆ సమయానికి తనకు సంబంధం లేకుండానే వ్యక్తపరచగలిగేటువంటి కవిత్వ పటుత్వాన్ని కూడా కార్య సాధన కలగజేయగలుగుతుంది.
(12:47) సమస్తమైన రోగ బాధలు తొలగిస్తుంది. దీర్ఘాయును కలగజేస్తుంది సరైన సమయంలో వైరాగ్యాన్ని ఇస్తుంది అది మోక్ష కారకత్వానికి దారి తీస్తుంది. కొన్ని పురాణాల్లో అమ్మవారిని ప్రథమ స్త్రీ అని అభివర్ణించారు. అంటే ఇది జననానికి సంబంధించిన అంశం కాదు పుట్టుకకు సంబంధించింది కాదు యుద్ధ ధర్మంలో యుద్ధకాండంలో ఒకచోట యుద్ధం జరుగుతున్నప్పుడు అందులో ముందు నించునేటువంటి వరసలో ప్రథమంగా యుద్ధం చేసేటువంటి స్త్రీగా ప్రథమ స్త్రీ అని అభివర్ణించారు ఇది యుద్ధానికి మాత్రమే వర్తిస్తుంది జననానికి కాదు పార్వతీదేవి పరమేశ్వరుడి మీద అలిగి కైలాసగిరి మీద చీకట్లో కూర్చున్నప్పుడు పరమేశ్వరుడు
(13:27) బ్రతిమాలడానికి పార్వతీదేవి దగ్గరికి వెళ్లి చీకట్లో ఉన్నటువంటి అమ్మవారిని అమ్మవారు శ్వేతవర్ణంలో ఉంటుంది పార్వతీ అమ్మవారు కానీ చీకట్లో కూర్చుని ఉంటుంది కాబట్టి ఆవిడ శరీర వర్ణం ఆ సమయంలో నల్లగా ఉంటుంది కాబట్టి కాళి అని సంబోధిస్తాడు అంటే అమ్మవారిని సరదాగా ఆట పట్టించడానికి అన్నమాట అమ్మవారు అలకతో చూస్తూ ఉంటుంది అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు కోపావేశంలో ఉన్నటువంటి నువ్వు నల్లని శరీర వర్ణాన్ని ధరించి కాళికగా ప్రఖ్యాతి చెందుతావు అని అది లగాయి తూ పార్వతీ స్వరూపమే ఆమె యొక్క నేడే నల్ల వర్ణంలో ఉంటుంది కాబట్టి కాళిక అని సంబోధించారు. అన్ని గ్రంథాలు కాళి
(14:08) అమ్మవారి యొక్క శరీర వర్ణాన్ని గురించి అభివర్ణించినప్పుడు నల్లగా ఉంటుంది నీలి వర్ణంలో ఉంటుంది అని తెలియజేశాయి [సంగీతం] కానీ ఒకే ఒక్క గ్రంథరాజం బృహన్నీలతంత్రం అమ్మవారు నలుపు నీలం కాదయ్యా ఎర్ర వర్ణంలో ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే కాళి యుద్ధ నీతి కలిగింది. యుద్ధం చేయగలిగింది యుద్ధం చేసిన తర్వాత యుద్ధకాండ లో జరిగేటటువంటి ఆ మృత్యు ఘోష ఉంటుంది కదా తీవ్రంగా చేసేటువంటి యుద్ధంలో శత్రువుల యొక్క శరీర ఖండాలు వాటి నుంచి ఉద్భవించేటువంటి రక్తం అమ్మవారి మీద పడి అమ్మవారు రక్తవర్ణంలో ఉందయ్యా అందుచేతను కొన్ని సందర్భాలలో అమ్మవారి ప్రేరణ
(14:49) చేసినప్పుడు ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి కాళీకి నమస్కరించి సమానమైనటువంటి ధ్యాన శ్లోకాన్ని చెప్పిన తర్వాతే కాళీ సాధన చేయమని బృహన్నీల తంత్రంలో చెప్పబడింది. అమ్మవారు సమస్తమైన ప్రాణికోటికి కూడా ఆయు ప్రమాణాన్ని నిర్దేశించగలుగుతుంది. పరదేవత కాళీ అమ్మవారి యొక్క శుభాశిష్యులు మీ అందరి మీద వర్షించాలని ప్రార్థిస్తూ ఉన్నాను.
(15:12) దశమహావిద్యల్లో మొట్టమొదటిదైనటువంటి కాళీ లక్షణాలు తెలుసుకున్నారు కదా ఇక వచ్చే కార్యక్రమంలో కాళీ ఆవిర్భావం గురించి స్పష్టంగా తెలియజేస్తాను. సర్వేజనా సుఖినో భవంతు సింహి అపరాజత మహామంత్రాలయం అహం కమలానందనాథ
No comments:
Post a Comment