Monday, August 17, 2026

 రామాయణం'లో మారీచుని జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోదగిన పాఠాలు ఏమిటి?


మహాభాగవతంలో " భయంతో కాని, కోపంతో కాని, ప్రేమతో కాని ఏ విధంగా నన్ను తలుచుకున్నా అనుగ్రహిస్తాను " అన్నారు పరమాత్మ.

రామభూతమిదం సర్వం
అరణ్యం ప్రతిభాతి మే,
రామమేవ హి పశ్యామి
రహితే రాక్షసాధిప "
- 3:39:16

" ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తున్నాడయ్యా.‌ రాముడు తప్ప వేరేమీ కనబడుటలేదు " - ఈ మాటలు అన్నది మారీచుడు అనే రాక్షసుడు, రావణుడితో.

అంతా రామమయం
జగమంతా రామమయం " అంటే ఇదే.

మారీచుడు అంటాడు రావణుడితో " రాముడు కొట్టిన దెబ్బకు నేను మాంసం తినడం మానేసాను. ఇతరులను హింసించడం మానేసాను. ఋషుల వలే ఈ ఆశ్రమం కట్టుకుని " రామజపం " చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు వేరే ఏ జపాలు తెలియవు కనుక. " ర " తో మొదలయ్యే ఏ పదాన్ని విన్నా రెండవ అక్షరం " మ‌ " గానే వినిపిస్తూంది నాకు " అని.

ఏ వృక్షం చూసినా దాని వెనుక కోదండం ఎక్కుపెట్టిన రాముడు కనిపిస్తున్నాడు. పడుకున్నా కలలో కూడా రాముడే కనిపిస్తున్నాడు.

రావణుడు ప్రభువు, అతనికి ఆగ్రహం కలుగుతుంది అని తెలిసినా ఇంత కఠినమైన నిజాలు మారీచుడు ఎలా మాట్లాడగలిగాడు అంటే ఇప్పుడు మారీచుడికి నిజమైన ప్రభువు/గురువు శ్రీరాముడు కనుక. అతను ఆ స్థితికి చేరిపోయాడు.

మారీచుడు భయయోగి. భయం శాపం కాదు, వరం మనిషికి. జాగ్రత్తగా ఉంటాడు, ఆనందంగా గడిపేస్తాడు.

రావణుడి చేతిలో చనిపోవడం కంటే రాముడి చేతిలో చనిపోవడమే మేలని భావించి, అతను జింక రూపంలో వెళ్ళాడు.

అదే నిజమైన ఆత్మ సాక్షాత్కారం మరియు విముక్తి. మారీచుడు ఒక ధన్యమైన ఆత్మ.
శుభమస్తు

No comments:

Post a Comment